
చాలీచాలని జీతాలతో పనిచేసేవారి సంఖ్య ఎక్కువే ఉంది. జీతాలు సరిపోక పోవడంతో లోన్స్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియక కొందరు సతమతమవుతారు. చేసిన అప్పును సులభంగా ఎలా తీర్చాలి?, అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఇక్కడ చూసేద్దాం.
స్నోబాల్ విధానం: మీరు చేసిన మొత్తం అప్పుల్లో చిన్న అప్పులను ముందుగా తీర్చేయాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇది మీకు కొంతవరకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
అవలాంచీ విధానం: అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న అప్పులను ముందుగా తీర్చేయాలి. వడ్డీ ఎక్కువ కడుతున్న అప్పులు తీర్చేయడం వల్ల.. ఆర్ధిక భారం కొంత తగ్గుతుంది. ఎక్కువ వడ్డీ చెల్లించే అవసరం కూడా ఉండదు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్: చిన్న మొత్తంలో అప్పు ఉంటే.. దానిని క్రెడిట్ కార్డుకు బదిలీ చేయడం ఉత్తమం. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా అప్పు చెల్లించడం ద్వారా ఆర్ధిక ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ రేటు కూడా కొంత తగ్గుతుంది.
ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించండి: అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం వంటివి చేయాలి. పొదుపు చేయడం పెంచాలి. మీ డబ్బు ఎక్కడ.. ఎక్కువ ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవడానికి మీ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోండి. ఇలా చేసినప్పుడు ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది.
ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
అప్పుల ఏకీకరణ: బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే.. వాటన్నింటినీ ఒకటే లోన్ కిందికి వచ్చేలా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ్డీ తగ్గుతుంది. ఈఎంఐ విధానం ద్వారా అప్పు చెల్లిస్తారు కాబట్టి.. అప్పు చెల్లించడం సులభతరం అవుతుంది.