breaking news
Chevireddy Bhaskar Reddy
-
రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
-
అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
YSRCP Leaders: మీ ఆటలు ఇంకా ఎన్ని రోజులో కాదు.. చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్..
-
చెవిరెడ్డి గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తరలింపు
-
చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా.. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని తెలిపారు. -
మీ అక్రమ అరెస్టులకు భయపడం.. చెవిరెడ్డికి మద్దతుగా భారీ నిరసన ర్యాలీ
-
ప్రజలకు సేవ చేయడమే మేం చేసిన తప్పా
-
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి...చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. -
చెవిరెడ్డి అరెస్ట్ ను ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి
-
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్ జగన్ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చెవిరెడ్డి అరెస్ట్ పై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్న చెవిరెడ్డి
-
‘చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం కోసమే పోలీసులు తనపైన, తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ఆయన చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. ఆ లేఖ పూర్తి సారాంశం ఇదీ.‘ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు వస్తానని చెప్పా’‘మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ సిట్ కార్యాలయానికి వస్తాను అని నేను చాలా స్పష్టంగా చెప్పా. మీరు కేవలం నా సెల్‌ఫోన్‌కు ఒక చిన్న మెసేజ్ పెట్టి ఉన్నా మీ సిట్ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు.. రాత్రివేళ కూడా ఏ రోజూ నా సెల్‌ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా. మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తోంది.బతుకుతెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం తప్పేంటి?. మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా!. సిట్ విచారణ ప్రారంభించి 365 రోజులవుతుంది. ఏ రోజయినా, ఏ ఒక్కరైనా, చివరకు ఏ పేపర్, ఏ చానల్ అయినా నిన్నటివరకు నా పేరు ప్రస్తావించిందా? లేదుకదా. కనీసం నిన్నటి వరకు మీ సిట్ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా?. ఒక చిన్న నోటీస్ అయినా ఇచ్చారా?. ఎప్పుడైనా పిలిచారా?. లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!.’‘చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది’గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎలా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది.. మా పాత గన్మెన్లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్ అధికారులు కొట్టినట్టు మీ చేత మళ్లీ నన్ను కూడా కొట్టిస్తారేమో!. అది కూడా కానిచ్చేయండి. చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది. ఈసారి నా ఒక్కడినే కాదు.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల నా కొడుకు మోహిత్‌రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు. ఒక్క మోహిత్‌నే ఎందుకు. ఇంట్లో ఇంకా నా భార్య, నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి చంద్రబాబును, చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింపచేయండి. మాకేం పర్లేదు. మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వరస్వామి మాలో ఉన్నాడు. జీవితం అంతా పోరాటాలే ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది. ఎదుర్కొంటాం. సగౌరవంగా తిరిగి వస్తాం. ఆలస్యమైనా సత్యమే జయిస్తుంది అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్ చేయండిమాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్రెడ్డివిజయవాడ స్పోర్ట్స్: ‘లేని మద్యం కేసును తెరపైకి తెచ్చి అందులో నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదంతా సీఎం చంద్రబాబు కుట్ర. అక్రమ అరెస్టులతో మా కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు దిగారు. ఈ కేసుతో మా నాన్నను, అన్నను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మా కుటుంబంలో నేను, నా తల్లి మాత్రమే మిగిలి ఉన్నాం. ఇంకెందుకు మా ఇద్దర్నీ కూడా అరెస్ట్ చేయండి’ అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి వాపోయారు. న్యాయవాది ఎం.వాణితో కలిసి హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి బుధవారం వచ్చారు. అనంతరం మీడియాతో హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అత్యాచారానికి గురైన బాలికను, అన్యాయమైపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తన తండ్రి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారన్నారు. ఈ ఘటనతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధం లేదని సాక్షాత్తు బాలిక తండ్రే బహిరంగంగా వెల్లడించారని గుర్తు చేశారు ఆయన తమను పరామర్శించేందుకు వచ్చారే తప్ప ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించిన తరువాత ఈ కేసును తీసేశారని చెప్పారు. మేమెప్పుడూ మద్యాన్ని పంచలేదు కూడా..‘మద్యం అంటేనే మా కుటుంబానికి పడదు. మద్యం మహమ్మారి మా తాతయ్యను పొట్టన పెట్టుకుంది’ అని హర్షిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా ఏనాడూ తాము మద్యం పంపకం చేయలేదని వెల్లడించారు. అలాంటిది తమ కుటుంబ సభ్యులపై మద్యం కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. తన తండ్రి, అన్నను మద్యం కేసుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అక్రమ కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. -
ప్రభుత్వ కుట్ర.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్రతో సిట్ సాగిస్తున్న అక్రమ కేసు పన్నాగం మరోసారి బట్టబయలైంది. పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికే ఆ కుట్రను మరోసారి బయటపెట్టింది. ఓ కానిస్టేబుల్‌ను ప్రలోభాలకు గురిచేసి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి.. తాము చెప్పినట్టు వినని మరో కానిస్టేబుల్‌పై థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు.. కేసే లేకుండా అక్రమంగా లుక్ అవుట్ నోటీసులు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. ఈసీ పరిధిలోని కేసు వక్రీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ అక్రమాలు, కుట్రలు అంతేలేకుండా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్నాయుడును సిట్ అధికారులు బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్ర, దర్యాప్తు ముసుగులో సిట్ అధికారుల కుతంత్రాన్ని చెవిరెడ్డి్డ, ఆయన తరఫు న్యాయవాదులు దుష్యంత్‌రెడ్డి, వాణి తదితరులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇది పక్కా రాజకీయ కుట్రతో పెట్టిన అక్రమ కేసేనని స్పష్టం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తూ..వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి జైలులో పరుపు, దిండు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అనంతరం వారిద్దరిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వెళుతూ చెవిరెడ్డి ‘సత్యమేవ జయతే.. న్యాయపోరాటం చేస్తాం.. అక్రమ కేసును ఎదుర్కొంటాం.. దేవుడి ఆశీస్సులు, పార్టీ అధినేత మద్దతు మాకు ఉంది’ అని నినదించారు. గన్‌మెన్‌కు ప్రమోషన్ ప్రలోభం.. అబద్ధపు వాంగ్మూలంచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌ను బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం కుట్ర తీవ్రతను బయటపెడుతోంది. అందుకోసమే కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆయన ప్రస్తావనే లేదు. కానీ.. హఠాత్తుగా తెరపైకి తెచ్చి ఆయనే కీలక సాక్షి అంటూ నమ్మించేందుకు సిట్ యత్నించింది. ఈ విధంగా ప్రతీసారి ఓ కొత్త పాత్రను ప్రవేశపెట్టి తమ కుట్రకు మరింత పదును పెట్టడం సిట్‌కు అలవాటుగా మారింది. అందుకోసం సిట్ అధికారులు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. కానిస్టేబుల్ గిరిని వారం రోజులపాటు సిట్ అధికారులు తమ అదుపులో ఉంచుకుని బెదిరించారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేరుస్తామని.. సస్పెండ్ చేయిస్తామని.. జైలుకు పంపుతామని బెదిరించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే జీతం పెంపుదలతోపాటు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. దాంతో గిరి సమ్మతించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పడంతో హైదరాబాద్ నుంచి నగదును వాహనంలో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారు. తాము చెప్పినట్టు చేసిన గిరికి వెంటనే 60శాతం జీతం పెంపుదలతో ఆయన కోరుకున్న ఆక్టోపస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అంటే గిరి బెదిరింపులు, ప్రలోభాలకు గురయ్యే ఆ వాంగ్మూలం ఇచ్చినట్టు స్పష్టమైంది. కానిస్టేబుల్ గిరి చెప్పింది నిజమేనని భావిస్తే.. నగదు అక్రమంగా తరలింపునకు సహకరించిన ఆయన ఈ కేసులో నిందితుడు కావాలి. కానీ ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగా ఎలా పేర్కొంటారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. అక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిని సాక్షిగా పేర్కొనడం సరికాదని.. నిందితుడిగానే పేర్కొనాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆధారాలు లేవు.. సేకరించాల్సి ఉందన్న విచారణ అధికారిఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసు నమోదు చేసినట్టు సిట్ విచారణ అధికారే పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. నగదు అక్రమంగా తరలించారని సిట్ చెబుతున్న రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కానిస్టేబుల్ గిరితో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డు ఉందా అని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు విచారణ అధికారిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ డేటా ఇంకా లేదని.. సేకరించాల్సి ఉందని విచారణ అధికారి చెప్పారు. అంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ ఇప్పటివరకు కనీస ఆధారాలు కూడా సేకరించలేదని స్పష్టమైంది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం అక్రమమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తుడా వాహనంపై కట్టుకథలుగత ఏడాది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ‘తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)’ వాహనంలో నగదును అక్రమంగా తరలించారని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత తుడా వాహనం చైర్మన్ ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ వాహనాలను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించడం నిషేధం. తుడా వాహనం ఆ సంస్థ వైస్ చైర్మన్‌గా ఉన్న ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉంది. కానీ ఆ వాహనంలో నగదును తరలించారని అభియోగం మోపడం పూర్తిగా కుట్ర పూరితమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి కట్టబెడతామన్నారుఈ అక్రమ కేసులో సిట్ అరెస్టు చేసిన వెంకటేశ్నాయుడు న్యాయస్థానంలో అసలు కుట్రను వెల్లడించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తనను, తన భార్యను సిట్ అధికారులు తీవ్రంగా బెదిరించి, వేధించారని తెలిపారు. ఆయన చెబితే నగదును అక్రమంగా తరలించినట్టు అంగీకరించాలని వేధించారన్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే రూ.2 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రలోభపెట్టారని వెంకటేశ్నాయుడు వెల్లడించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి తాము సమ్మతించనందునే తనను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారని ఆయనన్యాయస్థానానికి నివేదించారు. ఈసీ కేసు వక్రీకరణ.. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టు కోసం సిట్ ఏకంగా హైకోర్టు ఆదేశాలనే సిట్ ఉల్లంఘించింది. ఈసీ పరిధిలో ఉన్న కేసును వక్రీకరిస్తూ ఆయనపై నిరాధార అభియోగాలు నమోదు చేసింది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) జప్తు చేసిన రూ.8.37 కోట్ల నగదు కేసును సిట్ అధికారులు వక్రీకరిస్తూ రిమాండ్ నివేదికలో పేర్కొనడమే అందుకు తార్కాణం. 2024 ఎన్నికల ముందు ఓ ప్రైవేటు సంస్థ హైదరాబాద్ నుంచి తీసుకు వస్తున్న రూ.8.37 కోట్ల నగదును పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ కేసును పర్యవేక్షిస్తోంది. కాగా.. ఆ నగదు తమ సంస్థకు చెందినదని అప్పట్లోనే తిరుపతిలోని ఈశా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసీకి తెలిపింది. ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి ఆ నగదుకు సంబంధించిన పూర్తి రికార్డులు, బ్యాంకు వోచర్లు, ఇతర ఆధారాలు సమర్పించారు. అంటే ఆ నగదు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తరలిస్తోంది కాదని.. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం అధికారికంగా తరలిస్తున్న పూర్తి వైట్‌మనీ అని నిర్ధారణ అయ్యింది. అందుకే ఆ సంస్థ ఎండీ ప్రద్యుమ్న చంద్రపాటి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పేరిట వేధింపులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కేసు విచారణ పేరిట ఆ సంస్థ ఎండీని గానీ, ఇతరులు ఎవర్నీగానీ పోలీస్ స్టేషన్‌కు పిలవవద్దని హైకోర్టు 2024 మే 31నే పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆ కేసు విషయాన్ని ఇతర కేసుల్లో కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి. అయినా సరే హైకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించడం విభ్రాంతి కలిగిస్తోంది. సిట్ అధికారులు మాత్రం ఎన్నికల ముందు జప్తు చేసిన ఆ నగదు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బు అంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించారు. అదే వక్రీకరణతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ ఈసీ కేసు వివరాలను ప్రస్తుత అక్రమ కేసుకు ముడిపెడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం సిట్ బరితెగింపునకు నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి నివేదించారు.కట్ అండ్ పేస్ట్ కుట్రేముందస్తు కుట్రతోనే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నట్టు సిట్ మరోసారి తన రిమాండ్ నివేదిక సాక్షిగా వెల్లడించింది. ప్రైవేటు వ్యాపారి అయిన వెంకటేశ్‌నాయుడును రిమాండ్ నివేదికలో ఐఏఎస్ అధికారి అని పేర్కొంది. గతంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డిని అరెస్టు చేసినప్పటి రిమాండ్ నివేదికనే కాపీ పేస్టుచేసినట్టు బయటపడింది. ఆయనను ఐఏఎస్ అధికారిగా పేర్కొన్న సిట్ అధికారులు అదే నివేదికను కాపీ పేస్ట్ చేయడంతోనే వెంకటేశ్నాయుడు కూడా ఐఏఎస్ అధికారి అని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో వచ్చింది. ఈ కేసులో సిట్ కాపీ అండ్ పేస్ట్ కుట్ర బయటపడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి విచారణవిజయవాడ స్పోర్ట్స్/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మద్యం విధానం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్నాయుడును సిట్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారణ జరిపారు. ఈ స్కాం ద్వారా వచ్చిన నగదును 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఒంగోలుకు ఎలా తరలించారు?, ఎంత తరలించారు, ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటనే విషయాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన బాలాజీకుమార్ యాదవ్, నవీన్, హరీష్, మోహిత్‌రెడ్డి పాత్రపైనా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూటమి అక్రమ కేసులు పెడుతోందికూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకు రాగా.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘నాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. విచారణలో వారు చెప్పినట్టు సంతకం పెట్టమంటున్నారు. వారు చెప్పినట్టు నేనెందుకు సంతకం పెడతాను. నన్ను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అందుబాటులో ఉంటా. నామీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అన్యాయమైన, అధర్మమైన కేసులు పెడుతున్నారు’ అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించాలని చూస్తున్నారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని చెవిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు -
అరెస్టుకు ముందు నాన్న రాసిన లెటర్.. ఈ లెటర్ లో ఏముందంటే
-
నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: పోలీసులు తీరుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిస్ ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. నిన్న(మంగళవారం) ఆయన రాసిన లేఖ వైరల్‌గా మారింది.‘‘నిన్నటి వరకు నాపై ఎఫ్ఐఆర్ కూడా లేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పా. లుకౌట్ నోటీసులు ఎందుకిచ్చారో తెలియదు. విచారణలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదు. తప్పుడు కేసులను ఎదుర్కొంటా’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం...మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.కాగా.. నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా ప్రశ్నించారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?. అది నిజం కాదు కనకే కదా? అంటూ ఆయన ప్రశ్నించారు. -
FIR కూడా లేకుండా అరెస్టు.. పోలీసుల తీరుపై చెవిరెడ్డి ఫైర్
-
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం: చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి పేర్కొన్నారు.లిక్కర్ వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మేము లిక్కర్ ఎప్పుడూ పంచ లేదు, విక్రయించలేదు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మా గన్ మ్యాన్, పీఏ, మా సిబ్బందినీ కూడా బెదిరిస్తున్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు. -
చెవిరెడ్డి అక్రమ అరెస్ట్.. తిరుపతిలో నిరసనలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై పార్టీ కార్కకర్తలు కదం తొక్కారు. కూటమి అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని, అక్రమ అరెస్టులు నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు పార్టీ కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. కూటమికి అంతిమ ఘడియలు ప్రారంభమైనట్టు హెచ్చరించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై తిరుపతిలో ఆగ్రహజ్వాలు వ్యక్తమవుతున్నాయి. భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి.. తామంతా వారి వెంటే ఉంటామని నియోజకవర్గపు కార్యకర్తలు భరోసా ఇచ్చారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభం అయ్యాయని కార్యకర్తలు హెచ్చరించారు. చెవిరెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.మరోవైపు.. చెవిరెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి స్పందించారు. ఈ క్రమంలో గురుమూర్తి ట్విట్టర్ వేదికగా..‘వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అతి త్వరలో ప్రజాగ్రహానికి ఆహుతి కాక తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. @YSRCParty సీనియర్ నాయకులు Dr చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది గారి అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు… pic.twitter.com/PgqNTGA8ND— Maddila Gurumoorthy (@GuruMYSRCP) June 18, 2025 -
కూటమి కొత్త ఎత్తుగడ.. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ, వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు.ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించవద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. -
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్
-
చెవిరెడ్డి పేరు చెప్పాలని ‘సిట్’ చిత్ర హింసలు
సాక్షి అమరావతి: మద్యం అక్రమ కేసులో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పాలని ఆయనతో పాటు తిరిగిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం–ఎస్ఐటి) అధికారులు టార్గెట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. పోలీసులని కూడా చూడకుండా గతంలో గన్మెన్లుగా పని చేసిన వారిపై కూడా చేయి చేసుకుంటున్నారు.జరగని లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి భాగమున్నట్లు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని తనకు నరకం చూపారని గతంలో చెవిరెడ్డికి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ఖాకీ యూనిఫాం ఉన్నప్పటికీ తనను కొట్టారని, అనరాని మాటలతో మానసిక వేదనకు గురిచేశారని వివరిస్తూ డీజీపీకి లేఖ రాశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. చెప్పినట్లు చేయడానికి నీకేంటి రోగం?⇒ ‘నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్లు రమ్మంటే వెళ్లాను. మొదటి రోజు వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. నేను సాక్షిగా వచ్చాను.. వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్లు నన్ను అసభ్యంగా తిట్టారు. నీ కన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడని చెప్పారు. వీడియో రికార్డింగ్‌లోనూ అదే చెప్పాడు. మరి నీకేంటి రోగం.. అంటూ తిట్టారు.⇒ మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. అనరాని మాటలు అంటుంటే, నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదన్నాను. ఇక్కడ నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని చెప్పడంతో ఆ రోజుకు పంపించేశారు. రేపు రా.. అది కూడా యూనిఫాం తీసేసి రా అని చెప్పారు. నా కన్నా ముందు సిట్ విచారణకు యూనిఫాం తీసేసి వచ్చిన కానిస్టేబుల్ గిరిని కొట్టారని తెలిసి రెండో రోజు కూడా యూనిఫాం వేసుకుని విచారణకు వెళ్లాను. అలా వచ్చినందుకు నన్ను బూతులు తిట్టారు. ⇒ నువ్వు కూడా రాసిచ్చి మీ ఊరికి వెళ్లిపో అని చెప్పారు. నేను చెవిరెడ్డి దగ్గర పదేళ్లు గన్‌మెన్‌గా పనిచేశాను. లిక్కర్ వల్ల ఆయన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా మద్యం పంపిణీ చేయలేదు. అతనికి సెంటిమెంట్ కూడా. అలాంటిది ఒక చిన్న కానిస్టేబుల్ అయిన నా చేత అంత పెద్ద మాటలు చెప్పించడం, రాయించడం ఏంటి సార్.. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని చెప్పాను. దీంతో సిట్ వాళ్లు చాలా కోపంతో నీ ఉద్యోగం ఊడబెరికి జైలుకు పంపుతామని బెదిరించారు. ఏమైనా సరే అంతగా అబద్ధాలు చెప్పలేనన్నాను. దీంతో అక్కడున్న పది మంది సిబ్బంది యూనిఫాంలో ఉన్న నాపై విరుచుకుపడ్డారు.⇒ తల, ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు. నా చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు విరిచారు. ఆ నొప్పి భరించలేక నేను గట్టిగా అరిచాను. నీళ్లు తాగించి మళ్లీ అలాగే చేశారు. కొంత సేపటి తర్వాత.. యూనిఫాం తీసేసి రావాలంటూ పంపించారు. నేను రూముకు వచ్చాక కళ్లు తిరిగి కిందపడ్డాను. తర్వాత మణిపాల్ ఆసుపత్రికి వెళ్లాను. తీవ్ర ఆందోళనలో ఉన్న నాకు కార్డియాలజీ, న్యూరాలజీ పరీక్షలు చేయాలని అడ్మిట్ చేసుకున్నారు. ⇒ సార్.. ఈ పరిస్థితిలో నేను సిట్ దగ్గరకు ఒంటరిగా వెళ్లలేను. ఆ దెబ్బలు తట్టుకొనే శక్తి, ఆరోగ్యం నాకు లేవు. నాకు ఉద్యోగం లేకపోయినా కూలి పనులు చేసుకుని, పశువులు మేపుకుని బతుకుతాను. అక్కడ నాకు ఏమైనా జరిగితే నా కుటుంబం అన్యాయమైపోతుంది.. దయచేసి పెద్ద మనస్సుతో నా విన్నపాన్ని మన్నించి, నన్ను కొట్టకుండా విచారించేలా సిట్ వాళ్లకు ఆదేశాలివ్వండి’ అని విన్నవించారు. గిరి.. మదన్.. వెంకటేష్.. బాలాజీ..చెవిరెడ్డికి అంగరక్షకులుగా.. అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిని బలవంతంగా అరెస్టు చేసిన సిట్ అధికారులు రోజుల తరబడి వారి అదుపులో పెట్టుకుని చిత్రవధ చేశారని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు మీడియా ద్వారా వెల్లడించారు. మొదటగా గన్‌మెన్ గిరిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారని, ఆ తర్వాత మరో గన్‌మెన్ మదన్‌ను విచారణకు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేశారని చెవిరెడ్డి తెలిపారు.తన సన్నిహితుడైన వెంకటేష్‌నాయుడు, అతని కుటుంబీకులను వేధింపులకు గురి చేసి టార్చర్ పెట్టారన్నారు. బాలాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపారన్నారు. చెవిరెడ్డికి ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని చెప్పాలని వీరందరిపై ఒత్తిడి చేశారని చెప్పారు. సిట్ అధికారుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడమే సిట్ బరితెగింపుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు.సిట్ వేధిస్తోంది..జోక్యం చేసుకోండిమద్యం విధానానికి సంబంధించిన కేసులో సాక్షిగా విచారణకు హాజరైన తనను సిట్ అధికారులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ ఎన్.మదన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారణ జరిపారు. మదన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మద్యం విధానం కేసులో సాక్షిగా తమ ముందు హాజరు కావాలంటూ పిటిషనర్‌కు సిట్ అధికారులు నోటీసులిచ్చారన్నారు. ఈ నోటీసులను గౌరవిస్తూ పిటిషనర్ ఈ నెల 10న విచారణకు హాజరయ్యారని తెలిపారు.విచారణ పేరుతో సిట్ అధికారులు మదన్‌రెడ్డిని తీవ్రంగా బెదిరించారన్నారు. చెవిరెడ్డికి గత పదేళ్లలో రూ.200 కోట్లు అందినట్లు చెప్పాలని, తాము చెప్పినట్లు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని వివరించారు. సిట్ అధికారుల తీరు వల్ల పిటిషనర్ తీవ్రంగా ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరారని, వైద్యులు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారన్నారు.మదన్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. సిట్ అధికారుల తరఫున వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అందుబాటులో లేకపోవడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ చేసిన ఆరోపణలను సిట్ అధికారులు ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విచారించామే తప్ప తామెవరినీ కొట్టలేదన్నారు. బెదిరింపులు.. వేధింపులు.. చిత్రహింసలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ ఆరచకాలకు మొదటి నుంచీ అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ రాజ్యాంగేతర శక్తిగా బరితెగిస్తోంది. అందుకోసం ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలువురు డిస్టిలరీల ప్రతినిధులను సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి బలవంతంగా విజయవాడ తీసుకువచ్చి వేధించారు.60 ఏళ్లు పైబడిన వారిని కూడా భౌతికంగా హింసించడం సిట్ అరాచకానికి తార్కాణం. ఆ డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ వేధింపులకు అడ్డుకట్ట పడింది. వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే అదీ సాయంత్రంలోపే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకు ముందు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిని దర్యాప్తు పేరుతో వేధించింది. సిట్ వేధింపులకు వ్యతిరేకంగా ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ సిట్ పట్టు వీడకుండా ఆయన్ను వెంటాడి వెంటాడి వేధించింది.సిట్ వేధింపులతో బెంబేలెత్తిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతోనే ఆయన్ను రాష్ట్ర సర్విసు నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బేవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా సిట్ అధికారులు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక ఈ కేసులో అరెస్టు చేసిన పలువురు ప్రైవేటు వ్యక్తులను బెదిరించి లోబరచుకుని వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. -
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్‌ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్‌ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్‌రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్‌నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్‌ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్‌రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్‌రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్‌రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్‌లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్‌కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్‌కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్‌లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
సిట్ అధికారులకు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ
తాడేపల్లి : నిబద్ధత, నిజాయితీ, పారదర్వకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి. ఈ మేరకు సిట్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది కాలంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు.. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రాజ్ కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని కానీ ప్రజలకు పంచారని కానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటి?, అది నిజం కాదు కనకే కదా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఇంకో 20 సంవత్సరాలు సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి.. పోలీస్ అధికారులపై అబద్ధాలు చెప్పగలరా?, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లు గన్‌మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డిని సిట్ కార్యాలయంకు పిలిపించి విచారణ సమయంలో అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ అధికారులు చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని హింసించడం వల్లనే కదా.. అతను చనిపోతాను అన్నది’ అని మోహిత్ రెడ్డి నిలదీశారు.ఒక హెడ్‌కానిస్టేబుల్ తనకంటే పై స్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లు రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి వుంటే అంత మాట అనగలడు. అందరూ ఆలోచించాలి’ అని అన్నారు.తప్పుడు స్టేట్మెంట్లు కోసం కుట్రలు పన్నుతుంది మీరే కదా?, అంతా పారదర్శకంగానే జరుగుతుందని దేవుడు ముందు ప్రమాణం చేయగలరా?,నిజంగానే సిట్ అధికారులకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని కోరే దమ్ముందా?, తప్పకుండా ఏదో ఒక రోజు సత్యమేవ జయతే అవుతుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ దేవుడు, న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి’ అని మోహిత్‌రెడ్డి లేఖ ద్వారా స్పష్టం చేశారు. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మెన్‌ను వేధించిన సిట్ బృందం
-
చెవిరెడ్డిని ఇరికించేందుకే మదన్‌ను హింసించారు
సాక్షి, గుంటూరు: లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతోంది ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారాయన. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్‌ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. .. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ చిత్రహింసల గురించి మదన్ సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నాం’’ అని మనోహర్‌రెడ్డి మీడియాకు వివరించారు.నేడు హైకోర్టులో విచారణఏఆర్ కానిస్టేబుల్ మదన్ తరపున వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో సిట్ అధికారులు బలవంతపు వాంగ్మూల సేకరణ జరుపుతున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని, విచాచరణ పారదర్శకంగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని మదన్ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకాలో దారుణం -
ఇక్కడే ధర్నా చేస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేసుకో.. సీఐకి చెవిరెడ్డి వార్నింగ్
-
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీస్ జులుం
ప్రకాశం జిల్లా: పొదిలి పోలీస్ స్టేషన్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను చూడటానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీస్ జులుం ప్రదర్శించారు. స్టేషన్ లోపలికి వెళ్లడానికి లేదంటూ చెవిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దాంతో సీఐ వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే తనపై సీఐ అసభ్యంగా మాట్లాడరంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ముందే బైఠాయించి పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మీరు అక్రమ అరెస్ట్‌లు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. -
Chevireddy Bhaskar: వైఎస్ జగన్ కు రైతులు, అభిమానులు భారీ స్వాగతం
-
మేం భయపడం.. ఎలాంటి విచారణకైనా సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోందని.. ఇందుకోసం తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీ అక్రమ నిర్బంధం, అబద్దపు వాంగ్మూల సేకరణకు జరుగుతున్న ప్రయత్నాలు, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించారు. బాలాజీని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. అయినా మేం భయపడం. ఎందుకంటే తప్పుడు కేసులు నిలవబడవు కాబట్టి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ బాలాజీతో సహా ముగ్గురుని పోలీసులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్యప్రదేశంలో వాళ్లను హింసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తమ వాళ్లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తుండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసుల దుశ్చర్యను ప్రశ్నిస్తూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నట్లు సమాచారం. -
ఏమైనా ఉంటే నాతో తేల్చుకోండి.. నా సన్నిహితుల జోలికి వస్తే ..
-
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్‌లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి. దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్‌ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్మెంట్లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ‘ వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు. అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి’ అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్‌ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు. -
‘రక్షించాల్సిన వ్యవస్థలు నైతికతను కోల్పోతున్నాయి’
తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన వ్యవస్థలే నైతికతను కోల్పోతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. యలమంద మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై బాధితురాలికి అండగా ఉంటే తనపై ఫోక్సో కేసును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు. తమతో తప్పుడు కేసులు పెట్టించారని బాధితులే చెప్పారని, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. గన్‌మెన్‌తో బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, తనను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వ పెద్దల కళ్లు చల్లబడతాయనుకుంటే అందుకు తాను సిద్ధమేనన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. తప్పుడు స్టేట్మెంట్ రిట్ పిటిషన్ వేస్తానన్నారు చెవిరెడ్డి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు.. తన కింద సిబ్బందిని ఎందుకు వేధిస్తున్నారన్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. -
కూటమి కుట్ర.. ఐదు కేసుల్లో చెవిరెడ్డికి నోటీసులు
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఐదు కేసుల్లో వైఎస్సార్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో చెవిరెడ్డి స్పందిస్తూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కౌంటరిచ్చారు.ఏపీలో కూటమి పాలనలో పోలీసులు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమాలని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దరవీడు పోలీసులు చెవిరెడ్డికి నోటీసులిచ్చారు. ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారవీడులో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులపై చెవిరెడ్డి స్పందించారు.అనంతరం, చెవిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వైఎస్సార్సీపీ ఉద్యమాల నుంచి పుట్టినపార్టీ. మా నాయకుడు వైఎస్ జగన్ పోరాటాలతో ఎదిగిన వ్యక్తి. ప్రజల మద్దతుతోనే మేము ముందుకు సాగుతాం’ అని అన్నారు. -
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అదంతా అబద్ధం.. ఓర్వలేకే ఎల్లో మీడియా దుష్ప్రచారం: చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్ ఆఫీస్‌పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్‌కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్ జగన్‌ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డిఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్‌కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్‌కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్‌లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు. -
వైఎస్ జగన్ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. -
ఇది ప్రజా ప్రభుత్వం కాదు..‘ఈవీఎం’ల ప్రభుత్వం: చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని,ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్ 9) ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని,జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఇంటికి యాభై వేలు వచ్చేవి: మాజీ మంత్రి కారుమూరిరాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుంది... ఎమ్మెల్యే లు ప్రజలలోకి రావడానికి భయపడుతున్నారుఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలనను మరచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారుఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబువైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ ఆరునెలల్లో ఇంటికి యాబైవేల రూపాయలు వచ్చేవినేను ఎప్పుడూ వైఎస్ జగన్ వెంబడే: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిఎంపిటిసి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాడిని కార్యకర్తల కష్టాలు తెలుసునాకు రాజకియ బిక్ష పెట్టింది దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డినేను నా కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ వెంబడేప్రజలను వంచించి అక్రమ కేసులు పెడుతున్న పార్టీ పై పోరాటం చేద్దాంఅతి తక్కువ మెజారిటితో గిద్దలూరు సీటును కోల్పోయాంవైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది -
ప్రభుత్వ కుతంత్రం బట్టబయలు
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందలాదిగా నమోదు చేస్తున్న అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు పన్నాగం ఏమిటన్నది కూడా స్పష్టమైంది. అక్రమ కేసులతో వేధింపులు.. అక్రమ నిర్బంధాలతో రోజుల తరబడి థర్డ్ డిగ్రీతో సృష్టిస్తున్న అరాచకం.. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదాష్టీకం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందని నిగ్గు తేలుతోంది.సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులను పాత్రధారులుగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా సాగిస్తున్న అరాచక పర్వం గుట్టు ఆధారాలతో సహా రట్టు అయింది. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా అక్రమంగా పోక్సో కేసు పెట్టేంతగా బరితెగించిన పోలీసు వ్యవస్థ బండారం బయట పడింది. తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని పోలీసులే తప్పుడు ఫిర్యాదు రాసి అక్రమ కేసు నమోదు చేసేంతగా దిగజారారన్న నిజం విభ్రాంతి కలిగించింది. ఓ మాజీ శాసనసభ్యుడిపై అక్రమ కేసు నమోదు చేసేందుకే అంతటి కుతంత్రం పన్నిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు వత్తాసు పలికిన పోలీసు వ్యవస్థ తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ప్రకాశం జిల్లాలో మరో నిర్వాకం విశాఖపట్నానికి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు నవంబరు 4న అక్రమంగా అదపులోకి తీసుకుని, దర్శి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నవంబరు 5న ఆయన సెల్ ఫోన్‌ను అన్‌లాక్ చేయించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారు. ఆయనపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఓ అసభ్యకర పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టు ఎందుకు పెట్టావని ఆయన్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ బాధితుడు ఎదురు తిరిగాడు. తన మొబైల్ ఫోన్ నవంబరు 5 నుంచి పోలీసుల జప్తులోనే ఉంటే.. తాను నవంబరు 11న ఎలా పోస్టు పెట్టగలనని ప్రశ్నించారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.చివరికి ఏదో పాత అంశాన్ని సాకుగా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసిన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు సూత్రధారులుగా.. రాష్ట్రంలోని పోలీసు అధికారులు పాత్రధారులుగా ఈ అక్రమ కేసుల కుతంత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నది స్పష్టమైంది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెల్ల కాగితాలపై సంతకాలతో కుట్రరెడ్బుక్ రాజకీయ కుట్రలను అమలు చేయడంలో తాము నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అందుకోసమే గతంలో చంద్రబాబు వద్ద భద్రతా అధికారిగా పని చేసిన పోలీసు అధికారిని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై తెప్పించుకుని తిరుపతిలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసు వ్యవస్థ ప్రతిష్టనే పణంగా పెట్టేశారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికను కొందరు దుండగులు అపహరించుకుపోయి వేధించారు. దాంతో ఆ బాలిక తండ్రి ఆవేదనతో తమకు న్యాయం చేయాలని బోరుమన్నాడు. విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బాలిక తండ్రికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ఉదాసీనతపై సర్వత్రా నిరసనటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. పోలీసు వ్యవస్థ చేతగానితనం, ప్రభుత్వ పెద్దల ఉదాసనీతపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో బాలికపై జరిగిన దాడిని వక్రీకరించి ఏకంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధించాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను తిరుపతి జిల్లా పోలీసులు భుజానికెత్తుకున్నారు. బాధిత బాలికకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, ఆమె తండ్రితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత తమ కుట్రను అమలు చేశారు. బాధిత బాలిక తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఆ తెల్లకాగితాలపై పోలీసులు రాసేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులపై అక్రమ కేసు పెట్టి ఏకంగా పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, కేంద్ర ఐటీ చట్టంలతోపాటు ఏకంగా 11 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాస్త ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన బాధిత బాలిక తండ్రి పోలీసుల కుట్రను ఆదివారం బట్టబయలు చేశారు. తాను చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైగానీ, ఇతరులపైనా గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఇదంతా చేశారని కుండబద్దలు కొట్టారు. దాంతో తిరుపతి జిల్లా పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
శ్రీపద్మావతి అమ్మవారికి కాలినడకన సారె సమర్పించిన చెవిరెడ్డి దంపతులు
-
నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధిత బాలికను పరామర్శించేందుకు వెళ్లి, న్యాయం కోసం నిలబడిన వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసు వెనుక ‘అసలు నిజం’ బయటపడింది. బాలిక తల్లిదండ్రులు రమణ, అరుణ ఆదివారం మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించారు. తాను ఎవ్వరిపైనా కేసు పెట్టలేదని బాలిక తండ్రి రమణ స్పష్టం చేశాడు.తాను చదువుకోలేదని.. మీడియా వాళ్లు తమ వద్దకు రాకుండా చూస్తామంటూ పోలీసులు తనతో సంతకం చేయించుకున్నారని వెల్లడించాడు. తీరా చూస్తే తమ కుటుంబానికి అండగా నిలిచి.. సాయం చేసిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైనే తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారని తెలుసుకొని షాక్‌కు గురయ్యానని చెప్పాడు. తాను పిలిస్తేనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వచ్చారని.. అటువంటి వ్యక్తిపై తానెలా కేసు పెడతాను? అని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు.. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం యలమందకు చెందిన ఓ బాలికపై ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాలిక తండ్రి అభ్యర్థన మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యలమందకు వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కానీ చెవిరెడ్డితో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నేత నాగార్జునరెడ్డి, తదితరులపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి.. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఆశ్రయించారు. అసలు వాస్తవమేంటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నామని చెప్పడంతో.. బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు ఆదివారం తిరుపతిలో వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాలిక తండ్రి రమణ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.. మీడియా పేరు చెప్పి.. కాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారు‘‘మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు పెట్టాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చెవిరెడ్డి ఒక్కరి మీదే కాదు.. అక్కడకు వచ్చిన వారెవ్వరి మీదా నేను ఫిర్యాదు చేయలేదు. నా బిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు ఆ కేసును తారుమారు చేస్తారన్న భయంతో.. నేనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నాను. నేను పిలిస్తేనే ఆయన వచ్చారు. అలాంటి వ్యక్తి మీద నేను ఎందుకు కేసు పెడతా? నా బిడ్డకు ఏదో అన్యాయం జరిగిందని వచ్చిన వ్యక్తి మీద నేను కేసు పెట్టాననడం పాపం కదా! నేను ఎవ్వరి మీదా కేసు పెట్టలేదు. నాకేమో చదువురాదు.పోలీసులు నా దగ్గరకు వచ్చి.. ‘మీడియా వాళ్లు మీ పాప గురించి పదేపదే అడుగుతున్నారు.. వాళ్లు పోస్టులు పెట్టకుండా ఉండాలంటే ఈ కాగితంలో సంతకం పెట్టు’ అని నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని తెలిసి బాధపడ్డాం..బాలిక తల్లి అరుణ మాట్లాడుతూ.. ‘మా బిడ్డకు ధైర్యం చెప్పి మాకు అండగా నిలిచేందుకు వచ్చిన చెవిరెడ్డి మీద తప్పుడు కేసు పెట్టడం దారుణం. పోలీసులు ఇలా చేస్తారని మాకు తెలియదు. ఒక కాగితం మీద సంతకం పెట్టమని పోలీసులు అడిగితే.. నా భర్త సంతకం పెట్టారు. దానిని ఉపయోగించుకొని ఇదంతా చేశారని తెలిసి బాధపడ్డాం’ అని చెప్పారు.అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు..నా బిడ్డ విషయం చెప్పగానే చెవిరెడ్డి.. యల్లమందలోని ఆస్పత్రికి వచ్చారు. ఏం జరిగిందని నన్ను అడిగితే.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నా బిడ్డపై అఘాయిత్యం చేశారని చెప్పా. ఆయన ఆస్పత్రి లోపలకు వెళ్లి.. అక్కడ పోలీసులు పాపను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ‘లేడీ పోలీసు రావాలి కదా.. మీరెలా విచారిస్తారు’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత చెవిరెడ్డి బయటకు వచ్చేశారు. నేను అక్కడ మీడియా వాళ్లతో పాపకు జరిగిన అన్యాయం గురించి చెబుతా ఉంటే.. చెవిరెడ్డి నన్ను పిలిచి.. ‘పాప విషయం కదా.. భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించుకో’ అని నాతో అన్నారు.ఏం కాదులే అన్నా.. ఇంతకన్నా ఏమవుతుందన్నాను. నా బిడ్డ శరీరం మీద రక్తగాయాలు చూసి నా మనస్సుకు బాధ కలిగి నేనే మీడియా వాళ్ల ముందుకు వెళ్లా. నా బిడ్డను ఇలా చేసిన వారిని ఉరితీయాలని, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని చెప్పా. మా బిడ్డ గురించి చెవిరెడ్డి ఎక్కడ కూడా అత్యాచారం జరిగిందని చెప్పలేదు. మమ్మల్ని ఎక్కడా కించపరచలేదు. మా పరువుకు నష్టం కలిగించేలా ఏమీ చేయలేదు. పాపకు మెరుగైన వైద్యం కావాలంటే.. ఎక్కడకు తీసుకెళ్లినా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయనపై నేను కేసు పెట్టాననడం దారుణం’’ అని బాలిక తండ్రి రమణ వాపోయాడు.ప్రభుత్వం కుట్ర బయటపడింది: భూమనప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ఉపయోగిస్తూ.. వ్యక్తులి్న, వ్యవస్థలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చెవిరెడ్డిపై పెట్టిన ‘పోక్సో’.. తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వం కుట్ర పూర్తిగా బయటపడిందన్నారు. అసలు బాధిత కుటుంబానికే తెలియకుండా కేసులు పెట్టారంటే.. ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి పోలీసులు ఇదంతా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సభ్యసమాజంలో ఎవరైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా? అని భూమన నిలదీశారు. ఎవరికైనా ఏదైనా జరిగితే పరామర్శకు వెళ్లకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారా? అని ప్రశి్నంచారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేసే పెట్టలేదు.. పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారు: బాధితురాలి తండ్రి
సాక్షి, తిరుపతి జిల్లా: యలమంద ఘటన బాలిక తండ్రి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎవరి మీద కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తెపై దాడి జరిగిందని మేమే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పిలిచామని.. ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు తాను చెప్పలేదంటూ బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. నా బిడ్డకు సాయం చేయడానికి వచ్చినవారిపై ఎలా కేసు పెడతాను.? చిన్నారిపై దాడి చేసిన వారికి శిక్ష పడాలి కోరాను. నేను చదువుకోలేదు.. పోలీసులు చెప్పిన చోట సంతకం మాత్రమే చేశా’ అని బాలిక తండ్రి తెలిపారు. మా బిడ్డపై అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను ఎలా కేసు పెడుతానంటూ బాలిక తండ్రి ప్రశ్నించారు.ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: భూమనరాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో యలమంద ఘటన నిదర్శనం. ప్రతి పక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేస్తున్నారు బాధిత కుటుంబానికి రక్షణగా వెళ్లిన వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనేది స్పష్టమైంది. బాధిత కుటుంబం పిలిస్తే వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారుటీడీపీ అనుకూల కిరణ్ పత్రికలో లైంగికదాడి జరిగిందని ప్రచురించారు, వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోక్సో, అట్రాసిటీ మరో 11 కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు తప్పు చేసిన వారిని విడిచి పెట్టి.. తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో రాష్ట్రానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు’’ అంటూ చంద్రబాబును భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే ఆదుకున్నారు: బాధితురాలి తండ్రి మేము చెవిరెడ్డిపై ఎలాంటి పోక్సో, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టలేదని.. తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి తెలిపారు.ఆపదలో ఉంటే చెవిరెడ్డే మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఆదుకున్నవారిపై మేము కేసు పెడితే మహాపాపం అని బాధితురాలి తండ్రి అన్నారు. -
ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి? ఈనాడు మీద కేసు పెట్టరా?: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. .. 21 రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో ఓ బాలికపై అగతంకులు దాడి చేశారు. ఆ ఘటనలో ఏం జరిగిందో బాలిక తండ్రి మాట్లాడిన వీడియోల్ని మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అనంతరం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం తనపై పోక్సోకేసు ఎందుకు నమోదు చేసింది. ఎర్రావారిపాలెం మండలంలో ఇద్దరు అగంతకుల దాడిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో ఉందని ఓ తండ్రి స్థానిక వైఎస్సార్సీపీ నేత నాగార్జున రెడ్డి సాయంతో నాకు ఫోన్ చేస్తే వాళ్ల ఇంటికి వెళ్లా. ఆపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించా. ఆ ఘటన గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. ఎవరికి చెప్పలేదు... ఈ ఘటన జరిగి.. 22 రెండ్రోజుల తర్వాత సదరు బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ పోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని ఈనాడు సహా టీడీపీ అనుకూల మీడియా వాళ్లు కథనాలు ఇచ్చారు. మరి వాటి మీద ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి?. బాలిక తండ్రిని స్టేషన్లకు పిలిపించి పోలీసులు విచారించారు. ఆయనతో బలవంతంగా నాపై అక్రమ కేసులు పెట్టించారు. .. కూటమి ప్రభుత్వం ఎన్నిక అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వ పెద్దల నేతల కళ్లల్లో ఆనందం కోసం అధికారులు మాపై పెట్టిన కేసులు తాత్కాలికంగా ఇబ్బందులు గురిచేస్తాయి. వాటిపై న్యాయ స్థానంలో పోరాటం చేస్తాం. కానీ అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు రిటైరైన అదే న్యాయ స్థానం ద్వారా తగిన చర్యలు తీసుకుంటాము’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. Also Read in English: Watch Video: Chevireddy Bhaskar Reddy: I Will Continue Fighting Even If I'm Jailed -
నన్ను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తా: చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం : తనని జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసులకు భయపడి పారిపోను. 2014 నుండి 2019 వరకు 88 కేసులు పెట్టారు. ఏం చేశారు?. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను.. నేను ఎక్కడికి పారిపోను. నన్ను జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తా. నాపైకి పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను. బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించా. బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా? అని ప్రశ్నించారు. నాపై కేసులు పెడితే.. కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారు అని అనుకుంటున్నారు. కానీ అలాంటివేవి జరగవు’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్
-
పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు
సాక్షి, టాస్క్‌ఫోర్స్, సాక్షి, అమరావతి: ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు! కానీ పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!! తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అధికార దుర్వినియోగం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవచనాలు వల్లించిన సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనే లక్ష్యంగా సాగుతున్నట్లు ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.బాధిత కుటుంబానికి బాసటగా ఉండడం నేరమా?చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు. కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘అన్న వచ్చాడు.. న్యాయం జరుగుతుంది’ అంటూ అందరి ముందు బాలిక తండ్రి కూడా చెప్పాడు.కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడం.. పోలీసు అధికారులు రంగంలోకి దిగడంతో బాలిక తండ్రి మాట మార్చారు. ఆయనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మరికొందరిపై దాదాపు 20 రోజుల తర్వాత పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా జరిగినట్లు ప్రచారం చేశారని, వైద్యం అందకుండా ఆస్పత్రి వద్ద గందరగోళం సృష్టించారని అందులో పేర్కొన్నాడు. దీనిపై భాస్కర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి మరికొందరిపై పోక్సో, అట్రాసిటీ చట్టాలు, మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మిగతా మీడియాలోనూ అదే వార్త..మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ, ఛానళ్లలోనూ ఈ ఘటన వార్తలు వచ్చాయి. అయితే కూటమి నేతలు బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులు, సాక్షి, సోషల్ మీడియాపై ఫిర్యాదు చేయించారు. తనకు అండగా నిలిచి సాయం చేసిన వారిపైనే ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, అయినా రోజూ స్టేషన్‌కు పిలిచి వత్తిడి చేస్తుండడంతో తప్పలేదంటూ బాలిక తండ్రి మనోవేదనకు గురవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.పరామర్శిస్తే ఇన్ని కేసులా..? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల పరంపరకు చెవిరెడ్డిపై మోపిన ఈ కేసును పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రజల అశాంతికి భంగం కలిగించారని.. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఇలా.. ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం... బీఎన్ఎస్ సెక్షన్లు 352, 352(1), 196(1), 62(2), 353(1), 72(2) రెడ్ విత్ ఐటీ చట్టం 67ఏ, పోక్సో చట్టం 23(1), ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 3(1), జెడ్, జెడ్ సీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.రాష్ట్రంలో మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా ప్రేక్షకపాత్రే...రెడ్‌బుక్ పాలనతో ఒకవైపు అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి సర్కారు మరోవైపు మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న లైంగిక దాడులు, హత్యాచారాలపై ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అపహరించి హత్యాచారానికి పాల్పడి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయింది. పుంగనూరులో ఓ బాలికను అపహరిస్తే నాలుగురోజుల పాటు చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఓ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడితే కేసును కప్పిపుచ్చేందుకు యత్నించారు.పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తే మూడు రోజుల పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన 115 అత్యాచారాలు, లైంగిక దాడుల కేసుల్లో ప్రభుత్వం తక్షణం స్పందించలేదు. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అరెస్టుకైనా.. పోరాటానికైనా సిద్ధమే ⇒ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ⇒ దేవుడు, న్యాయం మా వైపే ఉన్నాయి ⇒ పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? ⇒ తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్లి పరామర్శించా ⇒ మెరుగైన వైద్యం అందేలా సహకరించా.. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదుసాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచినందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని, దాడికి గురైన ఆడబిడ్డను పరామర్శిస్తే తనపై పోక్సో కేసు పెట్టడం ఏమిటని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తాను దేనికీ భయపడనని, అరెస్టుకు, పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దేవుడు, న్యాయం తమ వైపే ఉన్నాయని చెప్పారు. బాధితులకు అండగా నిలిచిన తన మీద పోక్సో, ఎస్సీ, ఎస్టీతోపాటు 11 సెక్షన్లతో కేసు పెట్టారని, ఇంత దారుణం ఎక్కడా ఉండదని అన్నారు. జగన్ వెంట నడుస్తున్న వారిని భయాందోళనలు గురి చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.చెవిరెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తెపై దారుణం జరిగిందని పాప తండ్రి ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచానని చెప్పారు. బాలికపై దాడి చేసిన దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశాడన్నారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే తాను వెళ్లానని తెలిపారు. ఆ బాలికను తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించానన్నారు. 72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఉండటాన్ని తప్పుగా సృష్టిస్తారా అని మండిపడ్డారు.ఆ బిడ్డ గురించి తాను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదని, అయినా తనపై తీవ్రవాదుల మీద పెట్టినట్టు కేసు పెట్టారని చెప్పారు. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా అని నిలదీశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎక్కడికీ వెళ్లనని, పారిపోనని, తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయనని, ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పారు. పాప తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోతే తమ పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లి కూతురి దగ్గరకు చేర్చాడని తెలిపారు. అతని మీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారన్నారు.తాను ఎలాంటి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయనని, అరెస్టు చేసి శిక్షించాలంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. తాను ఎక్కడైనా ఆ పాప గురించి మాట్లాడినట్లు ఆధారాలు, రికార్డు ఉంటే చూపించాలని, ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలను ఎవరు పరామర్శించినా పోక్సో కేసు పెడతామని ఈ చర్య ద్వారా బెదిరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన మీద కేసు పెట్టి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరినీ భయపెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో భాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి కూడా ఉన్నారు. -
తప్పుడు కేసులకు బెదరను: చెవిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని.. ఒక బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు పెట్టో, బెదిరించో పరిపాలన చేయాలంటే సాధ్యం కాదన్నారు.‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’’ అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘నామీద 11 సెక్షన్లతో కేసు పెట్టారు. ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వారికి భయాందోళన కల్పించాలని కుట్ర పన్నారు. బాలిక మీద దారుణం జరిగిందని ఆమె తండ్రే నాతో చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచా. ఆమెని తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించా....72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం నేను చేసిన తప్పా?. బాధ్యతగా ఉండటం తప్పుగా సృష్టిస్తారా?. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా?. బాధితురాలి తండ్రి అన్యాయం జరిగిందని చెప్తేనే నేను వెళ్లాను. నేను ఎక్కడకూ వెళ్లను, పారిపోను. నా ఫోన్ స్విచ్చాప్ చేయను. నేను అందుబాటులోనే ఉన్నా. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే నేను వెళ్లాను..ఆ బిడ్డ గురించి నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. తీవ్రవాదుల మీద పెట్టినట్టు నామీద కేసు పెట్టారు. ఆ తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లారు. నాగార్జున రెడ్డి వ్యక్తి ఆ తండ్రిని తీసుకుని తిరుపతి వెళ్లాడు. కూతురి దగ్గరకు తండ్రిని చేర్చాడు. అతనిమీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారు. పరామర్శకు వెళ్తే పోక్సో కేసులు పెట్టవచ్చని చూపిస్తున్నారు. ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
Chevireddy Reddy: పవన్ పిఠాపురం ఎందుకెళ్లాడు ?
-
వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను ఓసారి గుర్తు తెచ్చుకోండి: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదంటూ చెవిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలిరెడ్డి దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. .. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైఎస్సార్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు... వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను బాలినేని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్‌లో విదేశాలకు ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లి కు వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు జగన్‌ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుంది’’ అని చెవిరెడ్డి అన్నారు. -
రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్ కొనుగోలుకు ఒప్పందంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్‌పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్మెంట్ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
బాబు నిజస్వరూపం బయటపెట్టిన చెవిరెడ్డి
-
పోలీసులకు సవాల్..
-
విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మోహిత్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్‌ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్‌ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు. ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కిలారు రాజేష్ పేరుతో ఎమ్మెల్యే నాని దందాలు
తిరుపతి రూరల్ : చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్‌ఫాదర్ లాంటి కిలారు రాజేష్ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆయన, రాజేష్ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్‌కు చెందిన రైస్ మిల్లును మూయించాడని, వైఎస్సార్సీపీ సర్పంచ్‌కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు. అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.రోజూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు. -
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో 133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. -
పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే
-
‘పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే’
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని అన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 50 రోజుల కాలంలో 34 మంది వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేసినట్టు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్‌గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాలిజపులివర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇన్ని డ్రామాలు చేస్తుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోంది. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి నాని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్‌తోనే ఉంటాను’ అని చెప్పారు. -
ఎంతవరకైనా సిద్ధం..
-
కార్యకర్తలకు అండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
చంద్రగిరిలో చిత్తూరు రౌడీయిజం
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్‌తో విధ్వంసాలు సృష్టించారు.అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు. రిగ్గింగ్‌ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్‌ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్‌కు యతి్నంచారు. వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్‌పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కి అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజశేఖర్‌ని, రిలీవ్ ఏజెంట్‌గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్‌రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.అక్కడే ఎందుకు తిష్ట? పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్సీపీ స్టిక్కర్‌తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు. -
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలింగ్ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని ఎస్పీకి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ గొడవలకు ప్లాన్ చేస్తోంది. మాకు ఉన్న సమాచారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. టీడీపీ ‘‘వుయ్’’ యాప్‌లో ఓటర్ల డేటా తీసుకొని మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ‘వుయ్’ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని
సాక్షి, ప్రకాశం : జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజా బలంతో పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందం సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి -
కాలినడకన వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
ఆరోగ్య చంద్రగిరే చెవిరెడ్డి అభిమతం!
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభిమతమని, అందులో భాగంగానే ఉచిత మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, రూ.3 వేల ఖరీదైన 43 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించారని తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి కొనియాడారు. ఆరు నెలల క్రితం చంద్రగిరిలో చేపట్టిన ఉచిత మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమం స్ఫూర్తితోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్రంలో పురుడుపోసుకుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఉచిత మెగా వైద్యశిబిరాలు విజయవంతం కావడంతో సోమవారం తిరుపతి రూరల్ మండల పరిధిలోని రామానాయుడు కల్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించారు. మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగస్వామ్యులైన 9,700 మంది అధికారులు, సిబ్బందికి రైస్ కుక్కర్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ పనిచేసినా పట్టువదలకుండా విజయవంతంగా పూర్తిచేస్తారన్నారు. ఆరు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఉచిత మెగావైద్య శిబిరాలను ప్రభుత్వం నిశితంగా గమనించిందన్నారు. ఆ వైద్య శిబిరాలకు ప్రజల నుంచి వచ్చే స్పందన, ఆరోగ్యం పట్ల జనం చూపిన శ్రద్ధ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేసిందన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అధికారుల వద్ద ప్రస్తావించారని గుర్తుచేశారు. అంతకుముందు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండడం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. తుడా వీసీ హరిక్రిష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుడా కార్యదర్శి లక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌నాయుడు, ప్రివియా హెల్త్ సంస్థ నిర్వాహకులు ఫణీతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరు మండలాలు.. ఆరు నెలలు.. 1.22 లక్షల మందికి పరీక్షలు ఆరు మండలాలు.. 109 గ్రామ సచివాలయాలు.. ఆరు నెలలు.. 500పైగా ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 1.22 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తిచేయించారు. ప్రతి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలతో పాటు గుండె పరీక్షలు చేయించారు. గుండె పరీక్షల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు కలిగిన వారిని గుర్తించి పెద్ద ఆస్పత్రిలకు పంపి సకాలంలో వైద్య సేవలు అందించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందిని ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి రక్షించారు. అసాధ్యాలను సుసాధ్యం చేశారు చంద్రగిరిలో ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రమంతా చెప్పుకుంటారని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఉంటుందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాల వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించామన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మందికిపైగా ఈసీజీ తీస్తే అందులో సుమారు 3వేల మందికి హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు గుర్తించగలిగామన్నారు. తొండవాడ పంచాయతీ కార్యదర్శి నజిరీన్ బేగం భర్తకు ఈసీజీ తీసిన వెంటనే అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించి స్విమ్స్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడి వైద్యులు ఆగమేఘాలపై యాంజియో తీసి స్టంటు వేసి ప్రాణం నిలబెట్టారంటూ కన్నీరు పెట్టుకున్నారు. 9,700 మందికి రైస్ కుక్కర్లు పంపిణీ ఉచిత వైద్య శిబిరాలు విజయవంతం కావడానికి కష్టపడిన ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు, 104 సిబ్బందితో పాటు ప్రివియా హెల్త్ సంస్థ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అందరినీ విజయోత్సవ సభకు ఆహ్వానించి పది రకాల వంటకాలతో శాఖాహార భోజనం ఏర్పాటు చేశారు. సభకు హాజరైన 9,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 7.5 లీటర్ల మల్టీ పర్పస్ రైస్ కుక్కర్లను బహుమతిగా అందించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారికి సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలే నా కుటుంబం.. వారి కోసం ఏదైనా చేస్తా.. ‘చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించాను.. వారి క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను.. కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలైనా అందరికీ మంచి చేయాలన్న తపనతో వారి వెంట నిలబడుతున్నాను. నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదని బలంగా నమ్మిన వ్యక్తిని కనుకనే నా బిడ్డ మోహిత్‌రెడ్డికి కూడా ఈ వేదికపై నుంచి సూచిస్తున్నా.. రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబం వేరు, ప్రజలు వేరు అనుకుంటే రాజకీయనాయకుడే అవుతావు.. కుటుంబం, ప్రజలు ఇద్దరూ ఒక్కటే అనుకుంటే నాయకుడు అవుతావు’ అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అత్యధిక సమయం విజయవాడలో గడపాల్సి వస్తున్నందున తన బిడ్డ మోహిత్‌రెడ్డిని తనలాగా ఆదరించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞిప్తి చేశారు. -
ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!
మంచు విష్ణు, వర్సిటైల్ యాక్టర్ మంచు మోహన్‌బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు సినిమా రంగంలోని పేద కళాకారులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే అయన్ను వారు 'మా అధ్యక్షుడి'గా కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భక్త కన్నప్ప' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏపీలో పవన్ రాజకీయాలపై పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనే ఏమైనా బ్రహ్మంగారినా..? అంటూ మంచు విష్ణు ఇలా చెప్పుకొచ్చా రు. 'పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. సందేహమే లేదు. పవన్‌కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయిన మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను.' అని అన్నారు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్‌గా ఉన్నారని మంచు విష్ణు అన్నారు. సినిమా వస్తే చూస్తారు. కానీ ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఒక్కోసారి పాలిటిక్స్‌లో పేరుపొందిన లెజండరీ పర్సన్స్‌ను కూడా ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్ ఏమిటనేది చెబుతానని విష్ణు అన్నారు. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) ప్రస్తుతం తన ఏకాగ్రత సినిమాలపై ఉందని పేర్కొన్నారు. భారీ బడ్జెతో 'భక్త కన్నప్ప' సినిమా తీస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో భారీగా ఆగ్ర నటులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం తన మార్కెట్‌కు మించి బడ్జెట్ పెడుతున్నామని, అందుకోసం రూ.150 కోట్లకు పైగానే ఖర్చుచేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. అతను నా తమ్ముడు.. ఏపీ రాజకీయాలపై తాను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు ప్రకటించారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాల్లబ్బాయి మోహిత్‌నే చంద్రగిరిలో నిలబడబోతున్నాడని తెలుస్తోంది. మోహిత్ నా తమ్ముడు. అతన్ని నేను చాలా అభిమానిస్తాను. అవసరమైతే అతనికి సపోర్ట్ చేస్తానని కూడా ఆ ఇంటర్వ్యూలో విష్ణు పేర్కొన్నారు. ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోన్ రెడ్డిగారే అని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలో పేరుపొందిన ఎన్నికల సర్వేలన్నీ తెలుపుతున్నాయని ఆయన గుర్తుచేశారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్‌రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది. ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్‌లెట్‌ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న పాలనలో రామరాజ్యం ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్‌రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
అట్టహాసంగా చంద్రగిరి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం (ఫొటోలు)
-
మహాపాదయాత్రలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రతి ఒక్కరికీ కూడు, గూడు కల్పించడమే సీఎం జగనన్న అజెండా అని వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. గడపగడపకు మహాపాదయాత్రలో భాగంగా సోమవారం జంగావాండ్లపల్లి పంచాయతీ పరిధి నుంచి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆత్మీయంగా సత్కరించారు. ప్రతిగడపలో సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందించి వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని కోరారు. మహా పాదయాత్ర కురవపల్లి, చినిగేపల్లి, జంగామాండ్లపల్లి, కూనివాండ్లపల్లి, అప్పేపల్లి, బొడేరెడ్డి గారి పల్లి వరకు కొనసాగింది. చిన్నగొట్టిగల్లు మండలం పరిధిలో పది గ్రామాలు కలయికతో జంగావాండ్లపల్లి పంచాయతీ ఏర్పాటైంది. ఇక్కడ 561 నివాసాలు 1,561 మంది జనాభా ఉన్నారు. పంచాయతీ అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తం రూ.6 కోట్ల, 55 లక్షల, 76వేల, 530 రూపాయలు మంజూరు చేసినట్టు మోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం రూ.1.5 లక్షకు పైగా లబ్ధి పొందిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యుగంధర్‌రెడ్డి, డీసీఎంఎస్ సహదేవ్‌రెడ్డి, జెడ్పీటీసీ స్వరూపా, సర్పంచ్ విమల, ఉపసర్పంచ్ రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, పార్టీ డివిజనల్ అధ్యక్షులు అక్బర్, మహేంద్రరెడ్డి, పంచాయతీ కన్వీనర్లు జైపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ దేవేంద్రబాబు, తహసీల్దార్ లోకేశ్వరీ, ట్రాన్స్‌కో ఏడీ శివయ్య, పశుసంవర్థక శాఖ ఏడీ అవులప్రసాద్, సీఐ తులసీరామ్, ఎస్ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కార్యక్రమాల నిర్వాహకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిలో ఈ వివరాలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఉన్నాయన్నారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొంటారని తెలిపారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాల ప్రకారమే ఈ ఉగాది సంబరాలు ఉంటాయన్నారు. ఇక్కడ పూర్తిగా పల్లె వాతావరణం కన్పిస్తుందన్నారు. ప్రారంభంలో గ్రామ ముఖద్వారం ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ దంపతులు విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందనిలయం నమూనా ప్రాంగణంలోకి చేరుకుంటారని చెప్పారు. అక్కడ స్వామికి సీఎం వైఎస్ జగన్ దంపతులు.. శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలుకలగాలని, సకల వృత్తులవారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతీసంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారని వివరించారు. అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమవుతుందన్నారు. చిరుధాన్యాలతో నవరత్నాల పథకాలు ప్రతిబింబించేలా నేలపై ఒక బొమ్మను ఏర్పాటు చేశామన్నారు. నవరత్నాల మధ్యలో రంగులతో వేసిన సీఎం జగన్ ఫొటో ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలు దేనికైనా తిరుమల పంచాంగాన్ని ఫాలో అవుతారని, ఆ ప్రకారమే కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. స్వామి దశావతారాల బొమ్మలు, భూదేవి, శ్రీదేవి బొమ్మలను కూడా మండపంలోని గోడలపై చిత్రీకరించినట్లు తెలిపారు. తిరుమలలో ఉన్నట్లు బంగారు తాపడంతో ఉన్న గంటలు, ధ్వజస్తంభం, కోనేరు కూడా ఇక్కడ చూడవచ్చన్నారు. కొన్ని సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు, ఉగాది పాటలకు నృత్యాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను టీటీడీ వేదపండితులు, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వేదపండితులు ఆశీర్వదిస్తారని తెలిపారు. సీఎం జగన్ ప్రధాన లక్ష్యం సామాన్యుడు బాగుండాలనేదేనని చెప్పారు. పేదల బాగుకోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం తన పాలనాకాలంలో ఇప్పటికి బటన్ నొక్కి రూ.2 లక్షల కోట్లను నేరుగా పేదల అకౌంట్లలోకి వెళ్లేలా చేశారని చెప్పారు. సీఎం ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా, నాడు–నేడు పాఠశాల భవనాల సెట్టింగ్‌లు భారీగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
చంద్రగిరిలో రూ.430 కోట్ల అభివృద్ధి పనులు చేశాం : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
'కుటుంబం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించడం చెవిరెడ్డికే సాధ్యం'
సాక్షి, చంద్రగిరి (తిరుపతి): తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, తిరుపతి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకను అందించారు. నియోజకవర్గంలో మొత్తం 1.60 లక్షల కుటుంబాలకు సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం దుస్తులు పంపిణీ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో ఇంటింటికీ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిలో కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా కానుకలు పంపిస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారు చేస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే చెవిరెడ్డికి భగవంతుని ఆశీస్సులు నిత్యం కలగాలని ఆకాంక్షించారు. ఆపద వచ్చినా, ఆనందం కలిగినా తన నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం చంద్రగిరి ప్రజల అదృష్టమని సుబ్బారెడ్డి ప్రశంసించారు. తన కుటుంబ సభ్యుల కంటే గొప్పగా నియోజకవర్గ ప్రజలను ప్రేమించడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగ జరుపుకోలేని పేదలకు అన్నీ తానై సంతోషాన్ని పంచే చెవిరెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో శానిటైజర్లు, మాస్‌్కలు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, విటమిన్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ సిరప్లు, హోమియో మందులు, ఆయుర్వేద మందులు, ఆనందయ్య మందు, యోగా, ప్రాణాయామం పుస్తకాలు, ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు. అదే ఆత్మసంతృప్తి: చెవిరెడ్డి నా సంపాదనలో 70 శాతం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాను.. అదే నాకు ఆత్మ సంతృప్తి కలిగిస్తోంది అని చెవిరెడ్డి పేర్కొన్నారు. కష్టాలు వచ్చినపుడు మాత్రమే కాదు ఆనందంలో కూడా భాగస్వామిని కావాలని కానుకలు పంపుతున్నానని వెల్లడించారు. కులమతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేయాలన్న ముఖ్యమంత్రి జగనన్న స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికీ కానుకలు అందిస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి(76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న ఆయన.. సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి అవస్థపడటంతో కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం జగన్ పరామర్శ
-
తల్లిని ఓదార్చుతూ.. తండ్రి పాదాలను ముద్దాడుతూ.. (ఫొటోలు)
-
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం
సాక్షి, తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి (మణిరెడ్డి–76) సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందారు. శ్వాస సంబంధ సమస్యతో గత కొంతకాలంగా ఆయన ఇబ్బందిపడుతున్నారు. సోమవారం రాత్రి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్రమణ్యంరెడ్డికి ముగ్గురు కుమారులు. వారిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రథమ సంతానం. సుబ్రమణ్యంరెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చైర్మన్‌గా పనిచేశారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పరామర్శించారు. చదవండి: (క్షయ రోగులకు ‘అరబిందో’ సహాయం) -
మోహిత్ పాదయాత్ర చరిత్రాత్మకం
తిరుపతి రూరల్: ఏడు నెలల పాటు 2,005 పల్లెలు, 115 సచివాలయాల పరిధిలో 1.46 లక్షల ఇళ్లకు తిరుపతి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన 1,600 కిలోమీటర్ల మహా పాదయాత్ర చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడైన మోహిత్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు మహాపాదయాత్ర శనివారం పదో రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఏ పనినైనా చిత్తశుద్ధితో విజయవంతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మోహిత్‌రెడ్డి మంచి నాయకుడుగా ఎదుగుతారని చెప్పారు. జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా మహాపాదయాత్ర చేస్తున్నట్లు మోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీటీడీ ఆస్తులపై ఏటా శ్వేతపత్రం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అన్నారు. ఇకపై ఇలా ప్రతియేటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే.. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, సనత్‌కుమార్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. సమావేశ నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాలకు ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ► శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20వేల వరకు టోకెన్లు జారీచేస్తాం. ► శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉ.10 గంటలకు మార్చాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. ► తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెడతాం. ► తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశాం. ► భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఏపీ మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలుకు అంగీకరించాం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించాం. ► తిరుమలలోని గోవర్థన సత్రాల వెనుక భాగంలో పీఏసీ–5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదించాం. తద్వారా మరింత మంది భక్తుల వసతికి అవకాశం కలుగుతుంది. ► వకుళమాత ఆలయం నుంచి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ► తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటు నిమిత్తం రూ.2.45 కోట్లు మంజూరు. ► తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్ల ఏర్పాటు. వీటి కోసం అదనపు లోడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం. ► నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టీటీడీ కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ► టీటీడీలోని క్లాస్–4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫాం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు నిర్ణయించాం. -
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్‌లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
పర్యావరణ హితమే లక్ష్యంగా....
తిరుపతి రూరల్: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్‌లెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. -
శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి తనవంతు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ విప్ హోదాలో చెవిరెడ్డి వారం రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. సమావేశాల నిర్వహణలో తనకున్న అనుభవం దృష్ట్యా అన్నీతానై వ్యవహరించారు. రెండో రోజు శనివారం ప్లీనరీ ప్రాంగణం చేరుకున్న సీఎంను మంత్రి పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ‘శభాష్.. భాస్కర్’ అంటూ చెవిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు) -
కిక్కిరిసిన ఫుడ్ కోర్టులు
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరైన వారితో అక్కడ ఏర్పాటు చేసిన 250 ఫుడ్‌కోర్టులు కిటకిటలాడాయి. రెండోరోజు ఉ.7 గంటల నుంచి అల్పాహారం అందించారు. సా.4 గంటలకే ప్లీనరీ ముగిసినా రాత్రి 7 గంటల వరకు ఫుడ్‌కోర్టులలో రద్దీ కొనసాగింది. దూర ప్రయాణాలు చేసేవారు డిన్నర్ కూడా చేసి బయల్దేరారు. రెండ్రోజులూ ఏ చిన్న అవాంతరమూ లేకుండా పసందైన వంటకాలు అందించడంపై సీఎం వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు తమ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారని ఫుడ్ కమిటీ కన్వీనర్ డా. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. చెవిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ విజయసాయిరెడ్డి ప్లీనరీకి ముందురోజు నుంచి ముగిసేవరకు 3,400 మంది కేటరింగ్ వర్కర్లు రేయింబవళ్లు పనిచేశారని చెవిరెడ్డి వివరించారు. చివరిరోజైన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల పాటు ఆహారాన్ని అందించామన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరికీ ఒకే మెనూను అమలుచేశామని.. మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించామని ఆయన తెలిపారు. మొదటిరోజు 2 లక్షల మంది వరకు భోజనం అందించామని, రెండోరోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భోజనం చేశారని చెవిరెడ్డి తెలిపారు. -
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు చెవిరెడ్డి, జక్కంపూడి
తిరుపతి రూరల్: ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు నేటికీ వదలిపెట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేసింది. ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి మంగళవారం అమరావతిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన ఉద్యమాల్లో ప్రజల తరఫున గళమెత్తిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి, కార్యకర్తలు కలిపి మొత్తం 26 మందిపై 2015లో అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అప్పట్లో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆనాటి ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంగళవారం వాయిదా ఉండటంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి విచారణ నిమిత్తం హాజరయ్యారు. -
తిరుపతిలో ఘనంగా జిల్లా ప్లీనరీ
తిరుపతి రూరల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పాదల చెంత వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ మంగళవారం ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 80 వేలకు పైగా మెజార్టీని అందిస్తాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సంజీవయ్య, వరప్రసాదరావు, బియ్యపు మధుసూదనరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అనంత, సత్యసాయి జిల్లా ప్లీనరీలు అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైఎస్సార్సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. మంగళవారం అనంతపురం జిల్లాస్థాయి ప్లీనరీ అనంతపురంలోని శిల్పారామం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీ పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రాంలో నిర్వహించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలకు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు. మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ప్లీనరీల ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పీవీ సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
15 వేల మందితో నేడే వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ
తిరుపతి తుడా: వైఎస్సార్సీపీ తిరుపతి ప్లీనరీ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్లీనరీకి 15 వేల మంది వస్తున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు జర్మన్ షెడ్లను నిర్మించామన్నారు. తిరుపతి నగరం ఎస్వీయూ స్టేడియంలో మంగళవారం జరగనున్న ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో తొలి జిల్లా సమావేశం తిరుపతిలోనే నిర్వహిస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘుమఘుమలాడే వంటకాలను సభా వేదిక వద్ద సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు స్వాగతం పలికేందుకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, అరటి గెలలు, పూల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెవిరెడ్డి వివరించారు. -
గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు. తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడంటే? -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
తిరుపతిని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం..
చంద్రగిరి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తిరుపతి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ముందుకెళ్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. పార్టీ నేతలతో తిరుపతిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీలు భరత్, కల్యాణ్‌చక్రవర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిషత్‌ల చైర్పర్సన్లు శ్రీనివాసులు, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. (క్లిక్: చంద్రబాబుకు ఇన్ని రోజులు తెలివితేటలు లేవా..) -
సీఎం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు
పాకాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలంటీర్లు అత్యంత ప్రీతిపాత్రులని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముకలా పని చేస్తోందన్నారు. శనివారం చిత్తూరు జిల్లా పాకాలలో వలంటీర్లను చెవిరెడ్డి సత్కరించి దుస్తులు అందజేశారు. క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. స్థానిక అధికారులు, నాయకులతో వలంటీర్లను సమన్వయపరచి భోజనం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న వలంటీర్ల సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు
సాక్షి, విజయవాడ: తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) -
తిరుపతి నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు
-
జన్మదినం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై ప్రత్యేక గీతం
-
గోశాలను సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం సందర్శించారు. ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులు.. కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్ పార్కర్, సాయివాలా ఉన్నాయి. గోశాలను వెదురు, రాయి మాత్రమే వాడి పర్యావరణహితంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు) -
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్‌ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
హమాలీగా మారి.. బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: రాయల చెరువు సమీపంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు. వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు. -
రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. హెలికాఫ్టర్ సాయంతో
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు. స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. చదవండి: (ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు సహాయక, పునరావాస సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు వరద ముంపు తగ్గించే పనులు వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. టీటీడీ అందించిన ఖాళీ గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్ సంచుల్లో ఇసుక మిశ్రమం నింపి మూట కట్టి అడ్డుకట్ట వేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ('మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా') -
ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి
Rayala Cheruvu Present Situation: నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కట్ట పటిష్టతకు కృషి చేస్తోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు చెరువును ఆదివారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాయలచెరువులో 0.9 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు హెలికాప్టర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. చదవండి: (తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం) చెరువులో పరిస్థితిని గమనిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అలాగే రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొండలు, గుట్టల్లో తలదాచుకుని ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలచెరువు వద్దకు చేరుకున్న ఆయన కట్టను పటిష్టం చేసే చర్యలను పర్యవేక్షించారు. అధి కారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రంతా చెరువు వద్దనే గడిపారు. -
తుమ్మలకుంటలో నరకాసుర వధ నిర్వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. వారు ప్రజల మన్ననలను పొందారని అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు సీఎంలుగా పనిచేశారు.. ఒకరు మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే, మరొక సీఎం(కిరణ్ కుమార్ రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చదవండి: పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని -
నేడు గోపవరంలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ
-
‘దిశ’ డౌన్‌లోడ్స్‌లో మెరిసిన చంద్రగిరి
తిరుపతి రూరల్: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ యాప్’ డౌన్లోడ్స్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ రికార్డు స్థాయిలో 1,73,363 మంది తమ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి మహిళా భద్రత కోసం దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి సందేశాన్ని అతి తక్కువ సమయంలో ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవ తీసుకుని మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లను దీన్లో భాగం చేశారు. తొలుత వారికి అవగాహన కల్పించి... తరువాతి దశలో వలంటీర్లు, వార్డు సభ్యుల్ని కూడా కలుపుకున్నారు. వీరందరి ద్వారా నియోజకవర్గంలోని మహిళలందరి చేతా డౌన్లోడ్లు చేయించారు. ఈ నియోజకవర్గం విషయం సీఎం దృష్టికి వెళ్లటంతో అక్కడ తీసుకున్న చర్యలను అనుసరిస్తూ... అన్ని చోట్లా యాప్ డౌన్లోడ్లు చేయించి, మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు. అక్కడ ఏ ప్రక్రియను అనుసరించారనేది చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలంటూ... కలెక్టర్లందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు పంపించారు. కాగా అత్యధిక డౌన్లోడ్లు చేయించిన సంఘమిత్రలు, వలంటీర్లకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించటం విశేషం. -
పల్లె.. పల్లెకు.. జగనన్న పచ్చతోరణం
తిరుపతి రూరల్: జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద 10 లక్షల పూలు, పండ్ల చెట్ల ఉచిత పంపిణీకి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి, బత్తాయి, దబ్బ, సీతాఫలం, సపోటా వంటి పండ్ల చెట్లతో పాటు, మందారం, నందివర్ధనం, గన్నేరు, టెకోమో, పారిజాతాల్లో వారికి నచ్చిన నాలుగు మొక్కలను అందజేశారు. పలువురికి మొక్కలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంకల్పించినట్లుగా ప్రతి పల్లె, వీధి, ఇల్లు.. పూలు, పండ్ల చెట్లతో కళకళలాడాలన్నారు. ఉచితంగా ఇస్తున్న ఈ పూలు, పండ్ల చెట్లను పెంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 20 కోట్ల మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, రాష్ట్రంలో పచ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు పచ్చతోరణం కార్యక్రమంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలియజేశారు. నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని చెప్పారు. -
దిశ యాప్ డౌన్లోడ్లలో చంద్రగిరి రికార్డ్
తిరుపతి రూరల్: అక్కచెల్లెమ్మల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ డౌన్లోడ్లలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రికార్డు సృష్టించింది. ఆ నియోజకవర్గంలో 1.6 లక్షల కుటుంబాలు ఉండగా శనివారం నాటికి 1,77,363 మంది మహిళలు దిశ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. తద్వారా దిశ యాప్ డౌన్లోడ్లలో రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘దిశ’ యాప్ అమలుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడితే.. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళలంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందుకు కదిలారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లకు ‘దిశ ’ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. ఇందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారీ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరితో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. అనంతరం మండలాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి యాప్ పట్ల అవగాహన కల్పించాలని వలంటీర్లు, వార్డు సభ్యులు, మహిళా పోలీస్‌లకు దిశానిర్దేశం చేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టేనని వివరించాలన్నారు. ఆపద ఎదురైతే ‘దిశ‘ యాప్ ద్వారా నిమిషాల్లో పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పాలన్నారు. ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత ఉంటుందని వివరించాలని సూచించారు. ఇలా నిత్యం వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల వరకు ప్రతి ఒక్కరితో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రోత్సహించారు. సంబంధిత అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి దిశ లక్ష్యాన్ని అధిగమించారు. -
మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ యాప్
తిరుపతి (యూనివర్సిటీ క్యాంపస్): విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి. ఎవరికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏమిటి. ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘దిశ’ యాప్. దీనిని ఎక్కడి నుంచి.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆపత్కాలంలో ఎలా వినియోగించాలనే విషయాలపై శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఆపద వేళ యువతులు, మహిళలు, విద్యార్థినులను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం మేరకు రూపొందించిన ఈ యాప్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు యువతులు, మహిళలకు సదా ఓ అన్నయ్య తోడు ఉన్నట్టేననే విషయాన్ని వివరించారు. డౌన్ లోడ్.. ఉపయోగించడం ఇలా ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► యాప్‌లోఎస్‌వోఎస్ బటన్ ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి, అందులో ఉన్న ఎస్‌వోఎస్ బటన్ నొక్కాలి. ఆ వెంటనే వారి ఫోన్ నంబర్, చిరునామా, వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. ► ఆ వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమవుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ► విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్ వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మహిళా రక్షణ గురించి సీఎం వైఎస్ జగనన్నకు బాగా తెలుసని, దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టానికి ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు యాప్‌ను ఎక్కువ మందితో డౌన్లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి డౌన్లోడ్ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ యాప్ ఆవశ్యకతను వివరించారు. సదస్సుకు హాజరైన చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ మహిళా పోలీసులంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
అమరావతి: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! -
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముక్కోటి ఆలయం పక్కన గల నారాయణి గార్డెన్లో మందు పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా దాదాపు 10 వేల కుటుంబాలకు మందు అందిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 1.6 లక్షల కుటుంబాలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ మందు అందిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కరోనా సమయంలో ప్రజలకు మాసు్కలు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకుంటున్నారు. -
చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గంలోని 142 పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాల్లో ఈ మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఉపయుక్తమైన సంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మందు తయారీలో ఆనందయ్య కుమారుడితోపాటు శిష్యులు చంద్రకుమార్, సురేష్, వంశీకృష్ణ పాల్గొంటున్నారు. -
తిరుపతి నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీ
సాక్షి,చిత్తూరు: తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు తయారీ జరగనుంది. కాగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆనందయ్య మందును సిద్ధం చేయిస్తున్నట్లు చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఆధ్వర్యంలో మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ -
ఆనందయ్య మందుపై ప్రజలకు విశ్వాసం
ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతులివ్వడంతో సోమవారం ఆయ న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి వచ్చి ఆనందయ్యను అభినందించారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెవిరెడ్డి చెప్పారు. -
ఆనందయ్య మందుపై స్టడీ చేస్తున్నాం: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
-
‘కంటిలో డ్రాప్స్.. ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ’
సాక్షి, తిరుపతి: ఆయుష్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని టీటీడీ ఆయుర్వేద నిపుణుల కమిటీ సభ్యురాలు రేణు దీక్షిత్ తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారి నుంచి రిపోర్ట్ తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆనందయ్య మందు తీసుకున్నవారి సహకారం అవసరమని.. యుద్ధ ప్రాతిపదికన నివేదిక తయారు చేస్తున్నామని పేర్కొన్నారు ‘‘కంటి నుంచి డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ. కంటి ద్వారా వేసిన మందు త్వరగా శరీరంలో చేరుతుంది. త్వరగా పూర్తిస్థాయిలో స్టడీ చేసి వివరాలు అందిస్తాం. ఐసీఎంఆర్‌కు, ఆయుర్వేదానికి సంబంధం లేదు. కేంద్రంలో సీసీఎంఏఆర్ ఉంటుంది, వారి అనుమతి తీసుకోవాలని’’ రేణు దీక్షిత్ వివరించారు. కంటిలో జిల్లేడిపాలు వేసుకుంటే తగ్గుతుందనేది అవాస్తవం: ఎమ్మెల్యే చెవిరెడ్డి కంటిలో జిల్లేడిపాలు వేసుకుంటే తగ్గుతుందనేది అవాస్తవమని, ప్రజలు సంయమనం పాటించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలో పూర్తిస్థాయిలో మందు తయారీకి టీటీడీ సిద్ధంగా ఉందని, అనుమతి లభించగానే కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదని.. ఇప్పటికే ప్రాథమికంగా ఆయుష్ అనుమతి లభించిందని భాస్కర్‌రెడ్డి తెలిపారు. చదవండి: కరోనా చికిత్సలో అందరి చూపు ఏపీ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ముందడుగు -
ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు
చంద్రగిరి: కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నరసింగాపురం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బదిరి నారాయణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబు, టెక్నికల్ సూపర్వైజర్ నారప రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ మందు తయారీకి అవసరమైన పరికరాలు, స్థల పరిశీలన, వన మూలికల నిల్వల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందుకు ఆయుష్, ఐసీఎంఆర్‌తో పాటు ఇతర పరిశోధన సంస్థల నుంచి ఆమోద ముద్ర లభిస్తే ఆ మందు తయారీ విధానంలో టీటీడీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆనందయ్య మందులో సైడ్ ఎఫెక్టŠస్ లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ మందును స్వయంగా 60 రోజుల్లో తయారు చేసి యావత్తు రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు. అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందన్నారు. ఈ మందు తయారీకి వినియోగించే వన మూలికలు శేషాచలం అడవిలో సమృద్ధిగా ఉన్నాయని, ఈ మందుపై నాలుగు దశల్లో లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనాకు శాశ్వత విరుగుడు కాదని, ఇమ్యూనిటీని అధికం చేయగల సత్తా ఉందని తెలిసినా.. ఇమ్యూనిటీ బూస్టర్ కింద తయారీ చేపడతామన్నారు. మందు తయారీ, పంపిణీ సీఎం సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి మూలికా ఉపయోగపడేదే ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీలో వాడిన 18 రకాల వన మూలికల వినియోగం శతాబ్దాల కాలంగా సాగుతోందని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ అన్నారు. ఇందులోని ప్రతి మూలిక ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేదేనని చెప్పారు. ఆనందయ్య మందుపై ఆధ్యయనంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాలను భాగస్వామ్యం చేశారని తెలిపారు. ముళ్ల వంకాయ గుజ్జు, జీలకర్ర, తేనెతో కలగిలిపిన మిశ్రమంతో ఆనందయ్య తయారు చేసిన డ్రాప్స్ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదని ఆయన చెప్పారు. -
ఎమ్మెల్యే ఔదార్యం: బాధితులకు 34 వస్తువులతో కోవిడ్ కేర్ కిట్లు
తిరుపతి: కరోనా బాధితులకు ఉపయుక్తమైన కోవిడ్ కేర్ కిట్లు, హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణీ పక్కాగా ఉండాలని అధికారులను ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తన సొంత నిధులతో కిట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. కరోనా వచ్చినప్పటి నుంచి నయమయ్యే వరకు ఉపయోగపడే ఈ సామాగ్రిని బాధితులకు అందించాలని సంకల్పించారు. మంగళవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఎమ్మెల్యే దీనిపై సమీక్షించారు. చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 250 కిట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 5 వేల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం కోవిడ్ కేర్ కిట్‌లో 34 వస్తువులు ఉండేలా చూడాలన్నారు. వివిధ రకాల స్నాక్స్‌తో పాటు ఆహారం తీసుకునేందుకు ప్లేటు, గ్లాస్, స్పూన్, వాటర్ బాటిల్, సోపు, షాంపు, డెట్టాల్, పేస్ట్, బ్రష్.. కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు అవసరమైన పసుపు, రాళ్ల ఉప్పు, మాస్క్, శానిటైజర్, మల్టీవిటమిన్ టాబ్లెట్లు తప్పక ఉండేలా చూడాలన్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్లలో నాసల్ డ్రాప్స్, కషాయం, మల్టీ విటమిన్ టాబ్లెట్, డెట్టాల్, మెడికల్ కిట్ తదితరాలు తప్పనిసరిగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. హోమ్ ఐసులేషన్‌లో ఉన్న పేషంట్లను నిరంతరంగా పర్యవేక్షించాలని వైద్యులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. చదవండి: 17,269 కుటుంబాలకు పునరావాసం -
అత్యాధునిక వసతులతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బాధితులకు మెరుగైన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించారు. అత్యవసర వైద్యం కోసం 10 ఆక్సిజన్ బెడ్లు అందించారు. అక్కడ పనిచేస్తున్న 101 మంది సిబ్బందికి ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలకు తోడు ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా అదనంగా రూ. 2,500ను అందిస్తామని ప్రకటించారు. అంటే ప్రతి నెలా రూ. 2.52 లక్షలను చెల్లించనున్నారు. రోగులకు పౌష్టికాహారం కోసం బుధవారం చేపలు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం కూడా అందించనున్నారు. అలాగే వారికి పేస్ట్, బ్రెష్, దుప్పటి, మెడికల్ కిట్ తదితర 34 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఇస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్‌తో కూడిన రిక్రియేషన్ సెంటర్, ఆధ్యాత్మిక, సామాజిక గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు. ప్రతి గదిలో టీవీలు ఏర్పాటుచేసి రోజుకు రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఫ్లోర్లో వేడి నీరు, చల్లని నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు షిప్ట్‌కు ఇద్దరు చొప్పన వైద్యులు అందుబాటులో ఉంటారు. కోవిడ్ కేర్ సెంటర్లోని ప్రతి ఫ్లోర్‌కు ఇన్చార్జిలను నియమించారు. ఆ ఫ్లోర్లో ఉండే బాధితులతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయించారు. తమ సమస్యలను బాధితులు వాట్సాప్ ద్వారా తెలిపితే వాటిని సత్వరమే పరిష్కరిస్తారు. గతంలో తిరుచానూరు వద్ద ఏర్పాటు చేసిన పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో చెవిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన వసతులు, నాణ్యమైన భోజనం వల్ల దేశవ్యాప్తంగా సెంటర్‌కు మంచి పేరు వచ్చింది. -
సత్వర కరోనా సేవలే లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందడుగు
-
సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు
తిరుపతి తుడా: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు నడుం బిగించారు. రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నారావారి పల్లె పీహెచ్‌సీని, చంద్రగిరి ఏరియా ఆస్పత్రిని అధికారులతో కలిసి సందర్శించిన ఆయన తుడా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్ సెంటర్లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో వెయ్యి మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. చంద్రగిరికి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ కొనుగోలుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరించనున్నటేకట ప్రకటించారు. చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, హోమ్ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామని చెవిరెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్ మెడికల్ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వం: చంద్రబాబు గ్రామంలోనూ..
తిరుపతి : మహమ్మారి కరోనా వైరస్ బాధితుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో ఏకంగా 150 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు సిద్దం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రగిరిలో 100 బెడ్లు, 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రజలకు సత్వర కరోనా సేవలే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వంపై నియోజకవర్గ ప్రజలతో పాటు చాలామంది అభినందిస్తున్నారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి: చెవిరెడ్డి
-
రోజాకు ప్రముఖుల పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై అడయార్‌లోని ఫో ర్టీస్ మలర్ ఆస్పత్రిలో ఇటీవల సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను బుధవారం ప్రముఖులు పరామర్శించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం చెన్నైలోని ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పునరంకితం కావాలని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. చదవండి: ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు మేజర్ శస్త్రచికిత్సలు -
పదేళ్ల కష్టానికి ఫలితమిది
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదేళ్లపాటు పడిన కష్టాలను కళ్లారా చూశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల అభినందన సభ శుక్రవారం జరిగింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం చెవిరెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని, ఆ పదేళ్ల కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రజలు కట్టబెట్టారని వివరించారు. ఎంతటి విపత్కర పరిస్థితులున్నా ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. గడచిన 21 నెలల కాలంలో రూ.79 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నో కష్టనష్టాలకు గురి చేసిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓర్చుకుని ప్రజల కోసం అవిశ్రాంత పోరాటం చేపట్టిన వైఎస్ జగన్ యూపీఏ చైర్‌పర్సన్‌ను ఢీకొట్టారన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మాట్లాడారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
‘చంద్రగిరి’లో 84% ఓట్లు వైఎస్సార్సీపీ అభిమానికే
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభిమాని రికార్డుస్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం చెల్లిన ఓట్లలో దాదాపు 84 శాతం ఆమెకే వచ్చాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా వైఎస్సార్సీపీ అభిమాని ముద్దికుప్పం రూప.. టీడీపీ మద్దతుదారుగా పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బాపనపట్టు అమ్ములుపై 5,751 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంచాయతీలో మొత్తం 8,987 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లలేదు. 116 ఓట్లు నోటాకు పడ్డాయి. మిగిలిన 8,673 ఓట్లలో రూపకు 7,212 ఓట్లు (దాదాపు 84 శాతం) వచ్చాయి. మొత్తం 18 వార్డుల్లోను వైఎస్సార్సీపీ అభిమానులే గెలిచారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి అభివృద్ధికి చేపట్టిన పనులతో వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతుగా నిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట విషాదం..
సాక్షి, తిరుపతి: చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవి రెడ్డి హనుమంత రెడ్డి(45)మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డి గురువారం ఉదయం మరణించారు. రేపు తుమ్మలగుంటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం లో అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మీరావు, తెలంగాణ ఐఎఎస్ శ్రీనివాసు రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. గోవు అంతరించిపోకముందే వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి కృపతో అపోలో ద్వారా మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు. -
కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, చంద్రగిరి: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనం విధేయులం..మనమంతా కుటుంబ సభ్యులుగా మెలుగుదాం. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత.’ అంటూ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం మండలాల కార్యకర్తల ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని ముక్కోటి సమీపంలోని నారాయణి కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కళాశాల స్థాయిలోనే వైఎస్సార్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి సంక్షేమం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. తన సంపాదనలో 75శాతం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని, 25శాతం మాత్రమే తన కుటుంబానికి వెచ్చిస్తానని వెల్లడించారు. పార్టీలో కొనసాగే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీకి విధేయతగా ఉండే కార్యకర్తలు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. అప్పుడే పార్టీకి తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: (గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు) అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. పార్టీ విధేయతకు, క్రమశిక్షణకు మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. ఇంటింటికి మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ సిరప్లు, టాబ్లెట్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఎమ్మెల్యే కార్యాలయాల్లో ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. చదవండి: (‘ఉపాధి’లో వ్యవసాయానికే పెద్దపీట) -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన
సాక్షి, తిరుపతి రూరల్/ రేణిగుంట: నివర్ తుపానుతో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన రాగుళ్లవాగు వరదలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా మరొకరు మృతిచెందారు. రైతుల్ని కాపాడేందుకు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చూపించిన చొరవ, సహాయక సిబ్బందిని సమన్వయ పరిచిన తీరు సీఎం వైఎస్ జగన్ సహా పలువురి ప్రశంసలందుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పొలంలో మోటార్లు తీసుకువస్తూ.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుమ్మరిపాలెంకు చెందిన ముగ్గురు రైతులు వెంకటేష్, ప్రసాద్, లోకేష్‌లు గురువారం వర్షాలకు దెబ్బతింటాయని పొలం వద్ద ఉన్న మోటార్లను తీసుకువచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ రాగుళ్ల వాగు ఉధృతికి వరదలో చిక్కుకుని దాదాపు అర కిలోమీటరు కొట్టుకుపోయారు. వారిలో వెంకటేష్, లోకేష్‌లు చెట్టును పట్టుకుని కాపాడాలని కేకలు వేయగా.. ప్రసాద్ మృతిచెందాడు. విషయం సీఎం కార్యాలయం ద్వారా తుడా చైర్మన్ చెవిరెడ్డికి తెలిసింది. ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి హెలికాప్టర్ తెప్పించారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో రైతుల్ని కాపాడటం వీలుకాలేదు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి స్పీడ్ బోటును తెప్పించారు. దానిలో వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రైతులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైతుల్ని కాపాడటానికి చొరవ చూపించిన చెవిరెడ్డిని సీఎం జగన్ అభినందించారు. పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు కూడా ఆయన్ను ప్రశంసించారు. కాగా హెలికాప్టర్ పంపిన సీఎం జగన్‌కు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (‘నివర్’ బీభత్సం) రెస్క్యూ బృందానికి ఎమ్మెల్యే రూ.లక్ష నజరానా రైతులు వాగులో చిక్కుకున్న సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. తాను దూరంగా ఉండటంతో తొలుత పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అక్కడికి పంపారు. జిల్లా కలెక్టర్‌తో, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత ఘటనా స్థలానికి చేరుకుని రైతుల్ని పరామర్శించారు. వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని అభినందించి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందజేశారు. -
మన సంప్రదాయాలకు వాల్మీకీ రామాయణం ఆదర్శం
సింగపూర్ : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ‘వాల్మీకి రామాయణ సందేశం‘ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఉపన్యాసకులుగా ఇండోనేషియా నుంచి రామాయణ హరినాథ్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా అంతర్జాల సదస్సును అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని స్పష్టం చేశారు. భగవంతుడు స్వయంగా మానవునిగా అవతరించారని, ఎలా జీవించాలనే చూపారని తెలిపారు. త్రేతాయుగం నాటి శ్రీ రామ చంద్రుడు కుటుంబ ధర్మం, పితృ వాక్ పరిపాలన, రాజ్య పాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు. నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముని గుణగణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ అన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి నాడు ఆయన రాసిన రామాయణం వినడం పుణ్యఫలం అన్నారు. వాల్మీకి రామాయణ సందేశం ఉపన్యాసకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మప్రవర్తనా పరుడైన శ్రీ రాముని చరిత్ర వింటేనే జన్మ తరిస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ విశిష్టతను తెలియజేసేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు దాదాపు 25 దేశాల నుంచి ప్రతినిధులు వెబినార్ కు హాజరయ్యారు. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పిలిప్పైన్, ఇండోనేషియా, యుఎస్ఎ తదితర దేశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రతినిధులకు టీటీడీ ఈ సర్టిఫికెట్ ను అందజేయనుంది. -
గంటలో 44 రేషన్ కార్డులు మంజూరు
సాక్షి, తిరుపతి రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తూ రికార్డు సృష్టిస్తోంది. రేషన్ కార్డుల నెలల కోసం తరబడి అందరి చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చేసింది. దరఖాస్తుదారులకు అర్హత ఉంటే నిమిషాల్లోనే కార్డు మంజూరవుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండల తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది సోమవారం గంట వ్యవధిలో 44 రేషన్ కార్డులు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 51 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వీఆర్వో, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ స్థాయిల్లో మొత్తం ఆరు దశల్లో వీటిని పరిశీలించి 44 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. దీంతో కార్డులు మంజూరు చేశారు. దుర్గసముద్రం పంచాయతీలో దరఖాస్తు చేసుకున్న సంధ్యకు 20 నిమిషాల్లో, తుమ్మలగుంటలో అపర్ణకు 21 నిమిషాల్లో.. ఇలా 20 నిమిషాల నుంచి గంటలోపు మొత్తం 44 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా దరఖాస్తు చేసుకున్న గంటలోనే 44 రేషన్ కార్డులను మంజూరు చేసిన తహసీల్దారును, సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. (చదవండి: అరగంటలోనే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు) -
బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు
సాక్షి, తిరుపతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడే కాక.. వెంకన్నకు ప్రధాన భక్తుడని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనియాడారు. ఆయన జంద్యం వేసుకోని సద్బ్రాహ్మణుడన్నారు. వైవీ సుబ్బారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై చెవిరెడ్డి మండిపడ్డారు. ఆ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ►నిష్ట, నియమాలతో 36 సార్లు, 41 రోజుల పాటు అయ్యప్ప మాల వేసి, శబరిమలైకి వెళ్లిన భక్తుడు సుబ్బారెడ్డి. ప్రతిరోజు గోపూజ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి రారు. ►ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు భగవంతునికి పూజ చేయకుండా ఏ పనికీ వెళ్లారు. నిత్యం మెడలో రుద్రాక్షతో ఉండే వ్యక్తి. ఇప్పటికే 12 జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ పీఠాలను దర్శించారు. అమరనాథ్, మానస సరోవరం సైతం అనేక సార్లు దర్శించిన మహా భక్తుడు. ►ప్రతిరోజు ఇంట్లో మనుసూక్తం, నమకం, ఛమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తాలతో పాటు అభిషేకాలు చేస్తున్న కుటుంబం ఆయనది. ఇప్పటికే ఆయన తన ఇంట్లో కోటిసార్లు లలిత సహస్రనామం, కోటిసార్లు విష్ణుసహస్రనామ పారాయణం చేయించారు. లోకకల్యాణం కోసం సహస్ర చండీయాగం, శత చండీయాగం సైతం చేసిన కుటుంబం వైవీ సుబ్బారెడ్డిది. (చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు) ►40 సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రతి పుష్కారాలకు, కుంభమేళాలకు వెళ్లి స్నానమాచరించారు. 37 సంవత్సరాలకు ముందు తన పెళ్లి శ్రీవారి చెంతనే చేసుకున్నారు. తన ఏకైక కుమారుడి వివాహం హైదరాబాద్‌లో చేసినా నూతన దంపతులిద్దరినీ పెళ్లి దుస్తులతో అక్కడి నుంచి తిరుమలకు తీసుకువచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. ►ఆయన కొడుకు, కోడలు ఇప్పటికీ తిరుమలకు పాదయాత్రగానే చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆయన తన మనువడికి సైతం ఊహ తెలిసిన నాటి నుంచి ప్రతి రోజు గోపూజ చేయడం, భగవంతుడిని ప్రార్థించడం నేర్పించిన భక్తుడు. ►తిరుమల శ్రీవారిపై ఉన్న లక్ష్మీహారం, తిరుచానూరులో ఉన్న అమ్మవారి కాసుల దండ భక్తితో గతంలోనే వైవీ సుబ్బారెడ్డి సమర్పించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామికి అప్పట్లోనే 300 బంగారు పూలు సమర్పించారు. హిందూ పీఠాధిపతులు చేసే మత ప్రచారాలు, పూజలకు మద్దతుగా నిలిచిన వ్యక్తి వైవీ. ఈ విషయం ఏ పీఠాధిపతిని వాకబు చేసినా తెలుస్తుంది. ►సద్‌బ్రాహ్మణుడితో సమానంగా భగవంతునిపై భక్తి, భయం, శ్రద్ధ, నిష్ట కలిగిన సుబ్బారెడ్డి వంటి పరమభక్తుడిపై చంద్రబాబు విమర్శలు చేయడం బాధాకరం. ►వైవీ కుటుంబానికి భక్తిలో చంద్రబాబు కుటుంబం మరో జన్మ ఎత్తినా సాటిరాదు. -
‘చంద్రబాబు, ఆయన కుటుంబానికి ఉందా’
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకున్న వారు దరిద్రులని అన్నారు. జంజం వేసుకున్నటువంటి బ్రాహ్మణుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని అన్నారు. ఎంతో నియమ, నిష్ఠలతో హిందూ ధర్మాన్ని గౌరవించి, దేవుడిని కొలిచే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని పేర్కొన్నారు. సుబ్బారెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న భక్తి భావం చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుటుంబానికి ఉందా అని ప్రశ్నించారు. (ఏపీలో ఒక్కరోజే 74,710 కోవిడ్ పరీక్షలు) రాజకీయ ప్రయోజనాల కోసం భగవంతుడిని వాడుకోవడం సమంజసం కాదని అన్నారు.వయసు పెరిగే కొద్ది ఆలోచనా విధానాలు మార్చుకోవాలి. గతంలో పాదయాత్ర ప్రారంభించే ముందు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని కొలిచిన వ్యక్తి, భక్తి విశ్వాసం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. బ్రాహ్మణులకు, మిరాశి వ్యవస్థను చట్టం చేసి మరి మేలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. (సీఎం జగన్ కార్మిక వర్గానికి పెద్దపీట వేశారు) -
కరోనా పేషెంట్లను పరామర్శించిన చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రతిరోజు కోవిడ్ ఆస్పత్రుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతిలో కోవిడ్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి స్విమ్స్‌లోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రిని స్వయంగా సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి 330 మంది పేషెంట్లను స్వయంగా కలిసి వారితో మాట్లాడారు. ప్రతి పేషెంట్ వద్దకు వెళ్లి వాళ్లకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి తెలుసుకొన్నారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించి అక్కడి వైద్య సేవల గురించి తెలుసుకొంటున్నట్లు తెలిపారు. (నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా) స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని అలాగే సౌకర్యాలు కూడా బాగున్నాయని అన్నారు. అలాగే లోపాలు ఉంటే సరి చేయడమే తమ లక్ష్యమని, కోవిడ్ ఆస్పత్రుల మీద 45 రోజులుగా తిరుపతిలో సమన్వయ కమిటీ పని చేస్తోందన్నారు. అధికారులతో కలిసి రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని, ఎక్కడా లోపం ఉండకూడదన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. (రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్) -
కరోనా పేషెంట్లను పరామర్శించిన చెవిరెడ్డి
-
చంద్రబాబుకు ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడిన మిథున్‌రెడ్డి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. (చదవండి: 48 గంటలు గడువిస్తున్నా) చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సాక్షి, తిరుపతి: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండి పడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం తన ప్రయోజనాలకోసం అమరావతిని కోరుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో తమ పార్టీ నుంచి లాక్కొన్న ఎమ్మెల్యేలతో ఆనాడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. చేయించలేదన్నారు. కాలక్షేపం కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సమయం వృథా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. (ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు) -
కోవిడ్ వారియర్స్ కోసం ఈఎస్ఐలో ప్రత్యేక వార్డు
సాక్షి, తిరుపతి: కరోనా వైరస్‌కు ఎవరు అతీతులు కారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరస్ సోకిన వారిలో 99 శాతం మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అన్ని శాఖలతో సమన్వయ కమిటీలు వేశామని తెలిపారు. కరోనా బాధితులకు ఈ కమిటీలు అండగా ఉంటాయన్నారు. ఐఎంఏ తిరుపతి శాఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో మీడియా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీసుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా ఈ రోజు రుయా ఆస్పత్రి నుంచి 79 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అందించారు. కరోనాను జయించిన 101 సంత్సరాల బామ్మ నమ్మకం, సంకల్పబలం ఉంటే ఎలాంటి సమస్యనైనా జయింవచ్చని నిరూపించింది తిరుపతికి చెందిన ఓ 101 సంవత్సరాల బామ్మ. 60 ఏళ్లకు పైబడిన వారికి కరోనా సోకితే కష్టమని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ వీరి వ్యాఖ్యలను తప్పని నిరూపిస్తూ.. ఓ 101 సంవత్సరాల వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నారు. వారం రోజుల క్రితం తిరుపతికి చెందిన ఈ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో తిరుపతి స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో చేరింది. 14 రోజుల క్వారంటైన్ తప్పని సరిగా భావిస్తుండగా.. ఈ బామ్మ మాత్రం కేవలం 10 రోజుల్లోనే కోలుకుని డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో మరోసారి బామ్మకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ రావడంతో శనివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. -
‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయం ప్రక్రియ 1974 సంవత్సరం నుంచి జరుగుతోంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. టీడీపీ నేత అయిన చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయం(2015)లో నిరర్థక ఆస్తులను విక్రయించడానికి సబ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అప్పట్లో చదలవాడ అధ్యక్షతన పాలక మండలి తీర్మానం చేసింది. – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి, తిరుపతి సెంట్రల్, సాక్షి అమరావతి: బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించిన టీటీడీకి చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడని వేనని, కొన్ని చానళ్లు దీనిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవరిస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తుల వేలానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాల అమలుకు మాత్రమే ప్రస్తుతం ఆమోదం తెలిపామని వివరించారు. టీటీడీ ఆస్తులను, సదావర్తి సత్రం భూములను అధికారంలో ఉండగా వేలం వెర్రిగా విక్రయించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటాన్ని టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘దేవుడంటే మా ప్రభుత్వానికి భయమూ, భక్తి ఉన్నాయి. మేం తప్పు చేయం. ఎవరైనా తప్పు చేసినా అంగీకరించేది లేదు’ అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. దేవుడన్నీ చూస్తున్నాడని, భగవంతుడిని రాజకీయాలకు వాడుకుంటే పోతారని, ఆ తరువాత మీ ఖర్మని హెచ్చరించారు. తిరుపతి, విజయవాడలో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడిన విషయాలివీ.. వేలం తీర్మానాన్ని ఆమోదించింది మీరే: చెవిరెడ్డి ► టీడీపీ సర్కారు హయాం లో చదలవాడ కృష్ణ మూర్తి నేతృత్వంలోని పాలకమండలి టీటీడీకి సంబంధించి ఉపయో గంలో లేని, నిర్వహణకు ఇబ్బందైన 50 ఆస్తులను వేలం వేసి విక్రయించేందుకు సబ్ కమిటీని నియమించడం నిజం కాదా? ఆ భూములను విక్రయించాలని నాడు సబ్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ మేరకు పాలకమండలి తీర్మానం చేయడం నిజం కాదా? ► సబ్ కమిటీలో బీజేపీకి చెందిన భానుప్రకాష్‌రెడ్డి, నాటి టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఈనాడు పత్రిక ఎండీ కిరణ్ వియ్యపురాలు ఎల్లా సుచరిత సభ్యులు కారా? ► టీటీడీ భూములను విక్రయించాలని నివేదిక ఇచ్చి మీరు ఆమోదించడం నిజం కాదా? మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తుంటే మాపై విమర్శలా? ఇదెక్కడి న్యాయం? ► 28–7–2015న తీర్మానం నంబర్ 84 ప్రకారం సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ తీర్మానం నంబర్ 253, తేదీ 30–1–2016న భూముల వేలానికి ఆమోదించిన మీరే విమర్శలు చేయడం ఏమిటి? ► భగవంతుడిని ఇలా రాజకీయం కోసం, ప్రచారం కోసం వాడుకోవడం పాపం కాదా? 1974 నుంచి కొనసాగుతోంది.. ► టీటీడీకి సంబంధించిన ఏ అంశంపైనైనా పాలక మండలికే అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇది విమర్శకులకు తెలియదా? జీవో ఎంఎస్ నం.311 రెవెన్యూ( ఎండోమెంట్స్ –1) ఏప్రిల్ 9వ తేదీ 1990 రూల్ 165 చాప్టర్ 22 ప్రకారం టీటీడీకి ఆ హక్కుంది. ► 1974 నుంచి 2014 వరకు టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ జరిగింది. చంద్రబాబు హయాంతో కలిపి మొత్తంగా 129 ఆస్తులను వేలం వేసి రూ.6.39 కోట్లకు విక్రయించలేదా?, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు దీనిపై ఏం చెబుతారు? బాబు హయాంలో మెడికల్ కాలేజీకి దేవాలయ భూములు హారతి కర్పూరం.. ► విశాఖలో దేవదాయ శాఖకు చెందిన భూములను మెడికల్ కాలేజ్ కోసం విక్రయించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా 60 ఎకరాల భూమిని కట్టబెట్టింది మీరు కాదా? రూ.వేల కోట్లు విలువ చేసే సదావర్తి భూములను రూ.50 కోట్లకు వేలం పెట్టింది మీరు కాదా? ► విజయవాడలో 30 ఆలయాలను కూలదోసింది మీరు కాదా? దేవదాయ భూముల లీజు కాలపరిమితిని 12 ఏళ్ల నుంచి చట్ట సవరణతో 33 సంవత్సరాలకు పెంచింది మీరు కాదా? నిరర్థక ఆస్తులను విక్రయించే అంశాన్ని పరిశీలించి నివేదించేందుకు 2015 జూలై 28న ఒక సబ్ కమిటీని నియమిస్తూ టీటీడీ ఆమోదించిన తీర్మానం వెంకన్నను దర్శించుకున్నాకే జగన్ ప్రమాణ స్వీకారం.. ► అత్యంత భక్తి శ్రద్ధలతో 52 సార్లు శ్రీవారిని దర్శించుకున్న ఏకైక సీఎం దివంగత వైఎస్సార్. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తిరుమలకు నడిచి వెళ్లి సాధారణ క్యూలో నిలుచుని దర్శనం చేసుకు న్నాక ఇంటికి వెళ్లింది మా నాయకులు కాదా? వెంకన్నను దర్శించుకుని వెళ్లాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మా నాయకుడు కాదా? మా నాయకుడు దేవుడిని నమ్మి పనిచేస్తారు. మీలా భగ వంతుడిని రాజకీయాలకు వాడుకునే వ్యక్తి కాదు. బోర్డుకే అధికారాలు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► జీవో ఎంఎస్ నం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ –1), తేదీ 09 – 04 – 1990 రూల్ –165, చాప్టర్ – 22 ద్వా రా టీటీడీకి మేలు జరిగే అవకాశం ఉం టే దేవ స్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయి. బోర్డు నిర్ణయా లకు, ప్రభుత్వా నికి ఎలాంటి సంబంధం లేదు. ► దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయం ప్రక్రియ 1974 నుంచి జరుగుతోంది. 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ► చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పాలకమండలి తీర్మానం నం.84, తేదీ 28–07–2015 మేరకు టీటీడీకి ఉపయోగప డని ఆస్తుల ను బహిరంగ వేలం ద్వారా విక్రయించ డంపై సబ్ కమిటీని నియమించారు. ► కమిటీ నివేదిక మేరకు తీర్మానం నం.253, తేదీ 30–01–2016 ద్వారా సబ్ కమిటీ గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్ర యించేందుకు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాల్లోని 9 ఆస్తులు, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో 23 ఆస్తులకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల రికార్డుల్లో విలువ, బహిరంగ మార్కెట్ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించారు. ఒక ఆస్తికి సంబం ధించి కోర్టు కేసు ఉండడంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించారు. గత పాలక మండలి నిర్ణయాన్నే ఆమోదించాం.. ► రుషికేష్‌లోని 1.20 ఎకరాల భూమి దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండడంతో వేలం జాబితాలో చేర్చారు. 50 నిరర్థక ఆస్తుల విలువను రూ.23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నం.309 తేదీ 29–02 – 2020 ద్వారా నిర్ణయిస్తూ గత పాలక మండలి చేసిన నిర్ణయాలను అమలు చేయడానికి ఆమోదం మాత్రమే తెలిపాం. ► ఇందులో 5 సెంట్ల లోపు ఖాళీ ఇళ్ల స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు వ్యవసాయ భూముల వల్ల దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేకపోగా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించాం. ఆ రోజెందుకు ప్రశ్నించలేదు: దేవదాయ మంత్రి వెలంపల్లి ► టీటీడీ భూములను విక్రయిం చాలని టీడీపీ హయాం లోనే కమిటీ నిర్ణయించి నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడెందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ► చంద్రబాబు మాదిరిగా చీకటి జీవోలిచ్చి విక్ర యించే ఆలోచన సీఎం జగన్‌కు లేదు. సదావర్తి భూములను చంద్రబాబు దొంగ చాటుగా వేలం వేసినట్లుగా ఈ ప్రభుత్వం చేయదు. ► తన పాలనలో దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదే. ఏడాది పాలనపై చర్చకు మేం సిద్ధం. చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు ముందుకు రావాలి. అవినీతిని ఏడాది పాలనలో సీఎం జగన్ తరిమికొట్టారు. ► పవన్ కల్యాణ్ మాదిరిగా మేం ఫాంహౌస్‌లో తాగి పడుకోవడం లేదు. దేవదాయ శాఖ మంత్రి రంజాన్ తోఫా ఎలా పంచుతారు అని ప్రశ్నిస్తున్నారు. మొదట నేను ఎమ్మెల్యేను, తర్వాత మంత్రిని. నియోజకవర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటా. -
25 లక్షల సీ-విటమిన్ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్) చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్డు లేని వారికీ ఉచిత రేషన్ చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్‌కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి) -
‘బాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా వుండకూడదన్నదే చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రజల మధ్య గొడవలు పెట్టడమే ఆయనకున్న ఆలోచన అని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు రోజూ గంటల తరబడి మీడియా సమావేశాలు పెడుతూ పిచ్చి పట్టిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు బాబు పట్ల ప్రభుభక్తి చాటుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక వ్యక్తి కోసం రమేష్ కుమార్ న్యాయాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ('విచక్షణ' కోల్పోతోందా?) అక్కడ టీడీపీ వాళ్లవే ఎక్కువ నామినేషన్లు ఎన్నికల అధికారిగా ఆయన దారుణంగా వ్యవహరిస్తున్నారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు.. ఆరు నెలల తరువాత ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని.. అందుకే ఎన్నికల్లో ఏకగ్రీవాలు నమోదవుతున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క ఫిర్యాదు లేదని తెలిపారు. అక్కడ వైఎస్సార్ సీపీ కన్నా టీడీపీ వాళ్లవే ఎక్కువ నామినేషన్లున్నాయి’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు. (రమేష్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి: అందుకే ఆయన సేవలో!) చదవండి: ఎన్నికలు వాయిదా రాజ్యాంగం అపహాస్యం