జగన్‌ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన | Bhumana Karunakar Reddy Reaction To Illegal Case Against Chevireddy Bhaskar Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

Bhumana Karunakar Reddy: జగన్‌ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం

Jun 19 2025 3:32 PM | Updated on Jun 19 2025 4:32 PM

Bhumana Karunakar Reddy Reaction To Illegal Case Against Chevireddy

సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్‌ జగన్‌ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెవిరెడ్డి అరెస్ట్ ను ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement