రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy Strong Counter To Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి

Nov 24 2024 6:10 PM | Updated on Nov 25 2024 7:34 PM

Chevireddy Bhaskar Reddy Strong Counter To Balineni Srinivasa Reddy

సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.

రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్‌పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్‌మెంట్‌ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement