
ప్రకాశం జిల్లా: పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చూడటానికి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీస్ జులుం ప్రదర్శించారు. స్టేషన్ లోపలికి వెళ్లడానికి లేదంటూ చెవిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు.

దాంతో సీఐ వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే తనపై సీఐ అసభ్యంగా మాట్లాడరంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ముందే బైఠాయించి పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మీరు అక్రమ అరెస్ట్‌లు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు.