
సాక్షి,విజయవాడ: ఏసీబీ కోర్టు వద్ద వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేనెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదు. తాగుడు వల్లే మా నాన్న,తమ్ముడు చనిపోయారు. అందుకే నేను లిక్కర్‌ను ద్వేషిస్తా. లిక్కర్‌ను ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్టు చేశారు. కొన్ని పత్రికల్లో ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారు. 13ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాని తెలిపారు.