‘దిశ’ డౌన్‌లోడ్స్‌లో మెరిసిన చంద్రగిరి

Disha app downloads are highest in Chandragiri constituency - Sakshi

అదే తరహాలో అన్నిచోట్లా చేయాలని కలెక్టర్లకు సీఎం సూచన 

తిరుపతి రూరల్‌: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ యాప్‌’ డౌన్‌లోడ్స్‌ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ రికార్డు స్థాయిలో 1,73,363 మంది తమ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి మహిళా భద్రత కోసం దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి సందేశాన్ని అతి తక్కువ సమయంలో ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవ తీసుకుని మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లను దీన్లో భాగం చేశారు. తొలుత వారికి అవగాహన కల్పించి... తరువాతి దశలో వలంటీర్లు, వార్డు సభ్యుల్ని కూడా కలుపుకున్నారు.

వీరందరి ద్వారా నియోజకవర్గంలోని మహిళలందరి చేతా డౌన్‌లోడ్లు చేయించారు. ఈ నియోజకవర్గం విషయం సీఎం దృష్టికి వెళ్లటంతో అక్కడ తీసుకున్న చర్యలను అనుసరిస్తూ... అన్ని చోట్లా యాప్‌ డౌన్‌లోడ్లు చేయించి, మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు. అక్కడ ఏ ప్రక్రియను అనుసరించారనేది చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలంటూ... కలెక్టర్లందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు పంపించారు. కాగా అత్యధిక డౌన్‌లోడ్లు చేయించిన సంఘమిత్రలు, వలంటీర్లకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించటం విశేషం. 

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top