రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. హెలికాఫ్టర్‌ సాయంతో

MLA Chevireddy Bhaskar Reddy Distributes Food With Help of Helicopter - Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు.

స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు.

చదవండి: (ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి)

రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి 
వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు సహాయక, పునరావాస సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు వరద ముంపు తగ్గించే పనులు వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. టీటీడీ అందించిన ఖాళీ గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్ సంచుల్లో ఇసుక మిశ్రమం నింపి మూట కట్టి అడ్డుకట్ట వేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

చదవండి: ('మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top