అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం: చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి | Chevireddy Bhaskar Reddy Son Harshit Reaction To Illegal Cases | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం: చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి

Jun 18 2025 3:51 PM | Updated on Jun 18 2025 4:13 PM

Chevireddy Bhaskar Reddy Son Harshit Reaction To Illegal Cases

సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్నపై మొదట హత్య కేసు పెట్టారు. మా నాన్నపై ఫాక్సో కేసు పెట్టారు. కేసుల పేరుతో లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు’’ అని హర్షిత్‌రెడ్డి  పేర్కొన్నారు.

లిక్కర్ వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మేము లిక్కర్ ఎప్పుడూ పంచ లేదు, విక్రయించలేదు. మాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం. మా గన్ మ్యాన్, పీఏ, మా సిబ్బందినీ కూడా బెదిరిస్తున్నారు. లిక్కర్ కేసులో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.

మా వ్యాపార పనుల రీత్యా విదేశాలకు వెళ్తుంటే పారిపోతున్నామని ప్రచారం చేస్తున్నారు. మా పై పెట్టిన అక్రమ కేసులను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మా అన్నపై కేసు పెట్టారు.. మా నాన్నపై కేసు పెట్టారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం. మాపై కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని హర్షిత్‌రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement