breaking news
Nara Lokesh Babu
-
గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
-
జగన్ కొన్న స్కూల్ బెంచ్ అందమైన క్లాస్ రూమ్.. దానికి నీ కొడుకు పేరు పెట్టాడనికి సిగ్గుండాలి
-
లోకేష్ చిన్న మెదడు కథ
-
జగన్ పథకాలు కాపీ పేస్ట్.. లోకేష్ ఖాతాలో అమ్మఒడి
-
అమ్మవడి తెచ్చింది.. నా కొడుకు..! ఎందుకీ సిగ్గులేని రాజకీయం బాబు
-
అమ్మఒడి దొంగలు
-
‘అమ్మఒడి’ దొంగలు!
మొన్నటి నిజం..‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ – ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటనేటి అబద్ధం..‘తల్లికి వందనం’ పథకం లోకేశ్ ఆలోచనే..!! – కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబుసాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్ కూర్చున్న టేబుల్ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్‌ను కూడా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్ జగన్ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పిదాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. సదుపాయాలన్నీ జగన్ సర్కారు సమకూర్చినవే..వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్‌పీలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. వైఎస్ జగన్ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్‌పీ స్క్రీన్ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ను తానే నిరి్మంచానని.. సెల్‌ఫోన్, కంప్యూటర్ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్ఈ సిలబస్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్ బోధనను చేరువ చేశారు. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్‌ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్ జగన్ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. ఈ విద్యా ప్రగతి మీది కాదు..కూటమి పాలనలో ఈవెంట్ ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులుమెగా పీటీఎంపై సోషల్ మీడియాలో విమర్శలు కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపోతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో గురువారం మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలనలో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన పాఠశాలలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్ కూర్చుని వేడుకలు చేసుకున్నారని సెటైర్లు వేశారు. ‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్‌పీ ప్యానల్ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాలలకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భాటపు పనికిమాలిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యాయులను ఈవెంట్ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీశారు. మీ ‘పేరెంట్ టీచర్ మీటింగ్’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్ షాప్‌లో, బుక్ షాప్‌లో, ఫ్లెక్సీ షాప్‌లో చూసినా అయ్యవార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధికారుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ లేకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం
-
ఒక కేసు పెడితే మూడు కేసులు పెడతాం.. టీడీపీకి దిమ్మతిరిగే వార్నింగ్
-
సారీ.. ఈసారి క్రెడిట్ లోకేష్ బాబుకే!
కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు?.. సెల్‌ఫోన్ కనిపెట్టింది ఎవరు?.. చార్లెస్ బబ్బేజ్, డాక్టర్ మార్టిన్ కూపర్లు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలను అడిగితే టక్కున చెప్పే పేరు.. నారా చంద్రబాబు నాయుడు. హా.. షాకయ్యారా!. సెటైరిక్‌గాలే లేండి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా.. ఎవరు ఏం కనిపెట్టినా.. టెకనలాజియాకు ముడిపెట్టి ఆ క్రెడిట్ అంతా కొట్టేయాలని ఉవ్విళ్లూరుతుంటారు చంద్రబాబు. ఈసారి అలా క్రెడిట్‌ను తన కుమారుడు నారా లోకేష్‌కు కట్టబెట్టారు. తల్లికి వందనంపై పథకంపై సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్లోంచి పుట్టిందని, ఆ క్రెడిట్ అంతా లోకేష్ బాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారాయన. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు స్కూల్లో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు.. అక్కుడున్న విద్యార్థులనే కాదు, నెట్టింట విస్తుపోయేలా చేస్తున్నాయి. దేశంలో.. పేద కుటుంబాలకు విద్యా సహయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారాయన. అయితే.. ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చేసుకుంది. పోనీ.. పథకం అయినా సక్రమంగా అమలు అవుతుందా? అంటే.. అదీ లేదు. అర్హతల పేరుతో మెలికలు పెట్టి చాలామందిని తొలగించింది. పైగా ఒక అకడమిక్ ఇయర్ సొమ్మును కాగితం మీద లెక్క పెట్టి.. తల్లుల అకౌంట్లలో జమ చేయకుండా ఎగ్గొట్టింది కూడా!. అలాంటిది జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని హైజాక్ చేసి.. తన తనయుడి ఆలోచనగా చంద్రబాబు ప్రమోట్ చేసుకోవడాన్ని కొందరు నెటిజన్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. -
KSR Comment: బాబు, లోకేశ్ కు హైకోర్టు చివాట్లు.. జాతీయ స్థాయిలో నవ్వులపాలు
-
లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.. అన్నీ గుర్తుపెట్టుకోండి: అంబటి హెచ్చరిక
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక మార్లు అనుమతి లేదని, చివరికి గత్యంతరం లేక అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొట్టకుండా నిర్భంధిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడడం బాధాకరం. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు. మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు. చిత్తూరు మామిడి పంటను ధర లేక రోడ్ల మీద పడవేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక వాహనాలను తనిఖీ చేసి, కొన్ని వాహనాలకు నోటీసులు ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శిస్తే తప్పు ఏంటి? మీకు ఎందుకు అంత భయం. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు.. మేము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదు. బుర్ర లేని నారా లోకేష్ మాటలు ఐపీఎస్ అధికారులు వినటం బాధాకరం. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలకు మీరు మంచి చేస్తే భయం ఎందుకు. రాష్ట్ర డీజీపీ మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అందుకే ఆయనకు మళ్లీ పోస్టింగ్ పొడిగిస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113మంది వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు.కూటమి మంత్రులు పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు.రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం మద్యం ప్రజలకు చేరువ చేస్తుంది. అమరావతి రాజధాని కోసం ఇప్పటికే తీసుకున్న భూములకు న్యాయం చేయలేదు. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కాదు మమల్ని రానివ్వాల్సింది.. ప్రజలు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. కూటమి పెడుతున్న అక్రమ కేసుల కోసం బస్సులు వేసుకుని పిక్నిక్ కి వెళ్లినట్లు వెళ్లాల్సి వస్తుంది. కూటమికి ఏ కేసులో మెటీరియల్ లేదు. బోనులో పెట్టి మమల్ని సింహాలను చేస్తున్నారు. కూటమి మరో ఏడాది పాలన చూస్తే ప్రజలు ఛీ కొడతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
అంత భయమెందుకు లోకేశ్? జగన్ చిత్తూర్ పర్యటనపై సీక్రెట్ మీటింగ్
-
లోకేశ్ సీక్రెట్ మీటింగ్.. జగన్ టూర్ పై కుట్ర..
-
‘లోకేష్, భరత్‌లు అసలు నిందితుల్ని తప్పించారు’
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్‌కు క్యాపిటల్‌గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతుంది. డ్రగ్స్‌కు క్యాపిటల్‌గా విశాఖను తయారు చేశారు. డ్రగ్స్ గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికింది. వెలగపూడి రామకృష్ణ బాబు సీపీ మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారు.ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పోలీసులు మీద ఒత్తిడి తెచ్చారు. డ్రగ్స్ కేసులో సీఎంవో కూడా ఇన్వాల్ అయింది. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారు. ఎప్పుడూ రాని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు. టీడీపీ నేతలు సీపీనీ కలిసిన సీసీ ఫుటేజీ బయట పెట్టే ధైర్యం ఉందా. వైఎస్ జగన్ పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్షయ్, థామస్, కృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని ఎందుకు వదిలేశారు. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీకి అత్యంత సన్నిహితుడు.వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం దెబ్బ తీస్తోంది.వైఎస్ జగన్ పాలనలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికిందని తప్పుడు ప్రచారం చేశారు. తరువాత సీబీఐ విచారణలో అది ఈస్ట్ అని తేలింది. కొకైన్ డ్రగ్స్ వ్యవహారం ఎల్లోమీడియాకు కనిపించలేదా. వాస్తవాలను ఎందుకు ప్రజలకు చూపించడంలేదు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఈనాడు చంద్రబాబు భజన చేస్తుంది. డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి.అసలు నిందితులను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
రెడ్ బుక్ రాజ్యాంగంపై కన్నెర్ర చేసిన ఏపీ హైకోర్టు
-
చంద్రబాబు వంద చెబితే.. లోకేష్ రెండొందలు చెబుతున్నాడు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు కచ్చింగా మోసపోతారని.. ఇలా మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనడంలో తప్పే లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం వంగా గీత అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయ్యరా?. అడిగితే మక్కెలు విగకొడతాం, తాట తీస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు తేరగా ఉన్నారా?. ఒక్కసారి గ్రామాల్లో తిరగండీ.. ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.మాయమాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనలా? వద్దా?. కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు. చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతారు. ఏప్రిల్.. మే మాసంలో రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తామని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఏ నెల నడుస్తుందో రైతులు,ప్రజలు గుర్తించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళాలి అని బొత్స పిలుపు ఇచ్చారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీతా మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు వెన్నంటే ఉన్నారు. ఏలేరు వరదల సమయంలో జగన్ వెంట జనం ఉన్నారు అని చూపించారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక వీదికో రెండు బెల్టు షాపులు పెట్టారు. నాణ్యమైన గంజాయి వ్యాపారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు మాటలకు విలువలు..విశ్వసనీయత ఉండదు. అందుకే బాబు హమీలకు నాది భాధ్యత అని గత ఎన్నికల్లో పవన్ చెప్పారు. ఇద్దరు మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటీ?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు కుప్పాన్ని...స్వర్ణ కుప్పం ఎందుకు చేయ్యలేదు. సుపరిపాలనలో తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయిన తరువాత పిఠాపురం నియోజకవర్గం కు పవన్ ఎన్నిసార్లు వచ్చారు?. పిఠాపురం లో ప్రజల సమస్యల మీద ఒక్క క్షణం ఆలోచించే పరిస్ధితిలో లేరు. వాలంటీర్ల ద్వారా అదృశ్యమయ్యారని చెప్పిన పవన్.. మరి ఆ మహిళలను వెనక్కి తీసుకువచ్చారా?. కాపు సామాజిక వర్గంలో యువత పవన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు. వారంతా ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టారా?. లేదంటే చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయ్యడానికి పార్టీని పెట్టారా? చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయ్యాలని తాపత్రాయ పడే పవన్ ను హీరోగా చూడడం ఖర్మ.వంగవీటి మోహన రంగా , ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి..బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భాగ్యం. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్‌కు, వంగా గీతా కు మధ్య ఉన్న వ్యత్యాసం పిఠాపురం ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురం లో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి.తోట నరసింహం మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. మేనిఫెస్టోను భగవత్ గీత,బైబిల్,ఖురాన్ గా ఆరాధించారు. మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని పవన్ అంటున్నారు. పిఠాపురం లోనే కూటమీకి బీటలు వారాయి. జెండాలతో.. కుర్చీలతో కూటమి నేతలు కొట్టుకుంటున్నారు. -
చినిగిపోతున్న లోకేష్ రెడ్ బుక్.. AP పోలీసులకు హెచ్చరిక
-
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
-
CPM Ramakrishna: నీతులు చెప్పడం మానుకుని న్యాయం చేయండి
-
ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు...చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.కూటమి సర్కార్ నయ వంచన: కన్నబాబుమాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు. -
నా భార్య YSRCP MPTC.. అందుకే నాపై దాడి..
-
సూపర్ సిక్స్ పె లోకేష్ వీడియో చూపించి ఏకిపారేసిన బొత్స..
-
జగన్ పేరు చెప్తే.. కోటి రూపాయలు..! బట్టబయలైన లోకేష్ కుట్ర
-
లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో పలువురిని అరెస్ట్ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు. -
YSRCP సర్పంచ్ పై లోకేష్ అనుచరుల దాడి..!
-
Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్
-
Sailajanath: లోకేష్... దమ్ముంటే సింగయ్య భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పు
-
అంబులెన్స్ లోనే అసలు కుట్ర.. ?
-
చినబాబు దర్శనానికి రూ.40 లక్షలు..!
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్మెంట్ ఇప్పించారని సమాచారం.ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది. -
హత్య వెనుక లోకేష్? సింగయ్య భార్య సంచలనం..!
-
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్‌కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు. -
వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్
-
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్‌లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్‌గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్‌కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్‌కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్‌ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
మంగళగిరిలో కొకైన్ ఎలా దొరికింది?
సాక్షి, అమరావతి: ‘నగరాల్లో డ్రగ్స్ మాఫియా విక్రయించే కొకైన్ మంగళగిరిలాంటి పట్టణంలో ఎలా దొరికింది? దీని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు?’ అని కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్‌కుమార్ నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని... గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ–అడిక్షన్ సెంటర్ కూడా లేదని, సీఎం నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. రాయదుర్గం టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. లిక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో గంజాయి దందా జరుగుతుంటే ఏం చేస్తోందని ప్రశి్నంచారు. కూటమి సర్కారు వచ్చాక నెలకు రూ.2 వేల కోట్ల గంజాయి వ్యాపారం జరిగిందని దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలోని కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్ (ఎస్సీ), లంకా పవన్, పట్నాల చిన్న సత్యనారాయణ (బీసీ), దారపు దుర్గ, తమ్మకట్ల అశోక్ కుమార్ ను గంజాయి అక్రమ కేసులో ఇరికించారని, బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి, రాజానగరం సీఐ సుభాష్ మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోందని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచి్చన వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం.. అమాయకులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. కొత్త కొత్త దారుల్లో గంజాయి సరఫరా అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తెస్తే.. ఈ సర్కారు ఈగల్ ను తీసుకొచి్చందని, ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈవెంట్లు, స్టేట్ మెంట్లకే పరిమితవుతోంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. గంజాయి మాఫియా కమీషన్ల కోసమే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కమీషన్లలో 30 శాతం పోలీసులకు.. మిగిలింది అధికారంలో ఉన్నవారికి వెళ్తోందన్నారు. గంజాయి స్మగ్లింగ్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని పేర్నొన్నారు. పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచి్చన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాలను పటిష్ఠంగా నిర్వహించాలని విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. యువత కోసం, వారి భవిష్యత్తు నిరీ్వర్యం కాకుండా పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తామని తేలి్చచెప్పారు. -
నారా లోకేష్ కి బిగ్ షాక్.. రెడ్ బుక్ పై కూటమిలో వ్యతిరేకత
-
జక్కంపూడి రామ్మోహన్ రావు భార్యగా చెప్తున్నా.. మేము గాని బుక్ రాస్తే..
-
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం
-
అరెరె.. తమ్ముడి పనేనా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్ వద్ద గత సోమవారం బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు కూటమి నాయకులు రాజకీయాలు అద్దేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తమ పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయవద్దని జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పిల్లలను బడులకు కూడా తల్లిదండ్రులు పంపడం లేదు. వారి సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందిలేదు. ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేస్తున్న వారు ఈ నెల 23న పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావుకు సమస్యను వివరించి, వినతిపత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. వాస్తవంగా జరిగింది ఇదీ.. దీన్ని రాజకీయం చేసి, మాజీ ఎమ్మెల్యే జోగారావునే పిల్లలను ధర్నాకు తీసుకొచ్చినట్లు కూటమి నాయకులు ప్రచారానికి ఎత్తుకున్నారు. మంత్రి లోకేశ్‌కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ఎవరు? జరిగిన ఘటనను పూర్తిగా వక్రీకరిస్తూ.. మాజీ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేస్తూ.. పాఠశాల సమయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన హెచ్ఎం, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని శ్యామ్ అనే వ్యక్తి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ఈ శ్యామ్ అనే వ్యక్తి పక్కా టీడీపీ కార్యకర్త. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడు. సోషల్ మీడియా ఖాతాలనూ అతనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు.. మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ పలు సందర్భాల్లో ఫొటోలు దిగాడు. ఒక టీడీపీ కార్యకర్త.. వాస్తవాలను వక్రీకరిస్తూ, పోస్టులు పెట్టగానే చర్యలకు ఆదేశాలివ్వడం, నిర్ధారణ చేసేయడం గమనార్హం. టీడీపీ వారు ఏది చెబితే అదే రాజ్యాంగమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.దయచేసి రాజకీయాలు చేయొద్దు.. మా పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే గత సోమవారం ధర్నాకు వచ్చాం. ఇందులో ఎవరి ప్రమేయమూ, ఒత్తిడి లేదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు. వీలైతే పాఠశాలను తరలించకుండా చూడండి. – సంతో‹Ù, విద్యార్థి తండ్రిమంత్రిని మభ్యపెట్టిన ఎమ్మెల్యే? తమను ఎవరూ పిలవలేదని.. పిల్లల పాఠశాల సమస్యపై తామే స్వచ్ఛందంగా వచ్చామని ఇప్పటికీ సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆటో ప్రమాద ఘటన దురదృష్టవశాత్తు జరిగిందే గానీ.. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహానికి పోయి, స్వయానా మంత్రి లోకేశ్‌ను మభ్యపెట్టి, సామాజిక మాధ్యమాల్లో తమ అనుచరునితో పోస్టులు పెట్టించి, డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీయడం విమర్శలకు తావిస్తోంది. తన అనుచరుని నిర్వాకాన్ని దాచిపెట్టి.. హడావిడిగా స్థానిక ఎమ్మెల్యే సైతం.. మాజీ ఎమ్మెల్యేనే నిందిస్తూ, ప్రకటన జారీ చేయడం గమనార్హం.ఏం జరుగుతోంది... ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత బుధవారం పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అంటే.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ పోలీసులు వివరాలేవీ సేకరించలేదా, లేకుంటే ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రోజు కూడా పాఠశాలకు వెళ్లిన అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల భవిష్యత్తుపైనా రాజకీయాలకు ముడిపెట్టి, తమ స్వప్రయోజనాల కోసం కూటమి నాయ కులు చేస్తున్న ప్రయత్నాలపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చేసేది మేమే.. నిజం ఒప్పుకున్న లోకేష్
-
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: హామీల అమలుపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారన్నారు.వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కుట్ర రాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్రజలను నమ్మించేందుకు బాండ్లు తయారు చేసి, వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎలా చేయాలో తమ వద్ద ప్రణాళిక ఉందని, సూపర్ సిక్స్ అమలు చేయకలేకపోతే తన కాలర్ పట్టుకోవాలని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సవాల్ విసిరాడు. కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే ఈ ముగ్గురూ చేతులెత్తేశారు.ఈ చేతకాని చంద్రబాబు పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే అధ్వాన్నంగా తయారైంది. ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు చూస్తే నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి మదనపల్లె ఫైల్స్, తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని, ప్రకాశం బ్యారేజ్‌కి బోట్లు అడ్డం పెట్టారని, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరా అని.. డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సరిపోయింది. కూటమి నాయకుల దుష్ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే ప్రజాస్పందనే దీనికి నిదర్శనం.రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదిరాజకీయ మనుగడ కోసం ఎంతకైనా దిగజారే మనిషి చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు చెబుతున్నదే నిజమైతే, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే, రోప్ పార్టీ ఉంటే ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? వైఎస్ జగన్ ఏ పర్యటన వీడియోలు చూసినా పోలీసు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిందిపోయి ఆయన పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చంద్రబాబు కుట్రలు చేయడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా బాలకృష్ణ ఇంట్లో నిర్మాత బెల్లకొండ సురేష్ పై కాల్పులు జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. నందమూరి కుటుంబం పట్ల ఆరోజు సీఎంగా ఉన్న వఘెస్సార్ హుందాగా వ్యవహరించారే కానీ అవకాశాన్ని చౌకబారు రాజకీయాలకు వాడుకోవాలని చూడలేదు. కానీ చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా నేరంగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం.రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమలేదుబనకచర్ల ప్రాజెక్టును కడతామంటే రాయలసీమ వాసులుగా మేమంతా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాది కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? ఒక్క పిడికెడు మట్టయినా తీసుంటే చూపించాలి. చంద్రబాబుకి నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద బాధ్యత ఉంటే జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టుకి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేకపోయారు.రూ.వెయ్యి కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రూ.40 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను చేపడతానని చెబితే గుడ్డిగా నమ్మడానికి రాయలసీమ వాసులు సిద్ధంగా లేరు. పూర్తయ్యే స్థితిలో ఉన్న ప్రాజెక్టుల్లో భారీగా కమీషన్లు రావు కనుక, కొత్త ప్రాజెక్టులైతే దోచుకోవచ్చనేది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు సీఎం అయ్యాక కూటమి పాలనలో అన్ని వ్యవస్థల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారు కాబట్టే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పిపోయాయి.అన్ని వ్యవస్థల్లో వేళ్లూనుకునిపోయిన అవినీతి కారణంగా, కమీషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో కట్టబెట్టిన టెండర్లన్నీ సమీక్ష చేస్తే భారీగా అవినీతి బయటపడుతుంది. ఆయన పిలిచిన టెండర్లను 20 శాతం తక్కువకి ఇస్తే ఆ పనులు చేసేదానికి ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్త వరకు అవినీతి అజెండా పాలన సాగుతోంది. విజయవాడకి వరదలొస్తే ఆ సందర్భాన్ని కూడా అవినీతికి వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.30 కోట్లు కేటాయించారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని మెప్పించడం కోసం ఒక పూట చేసిన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి రూ. 300 కోట్లు ప్రజాధనం వృథా చేశాడు. -
సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా?
శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన జనసేనని.. ఇప్పుడు ఇంకో 20 ఏళ్లు కూటమిని, ప్రభుత్వాన్ని మోయడానికి తనకి ఎలాంటి భేషజాలు, నామోషి, సిగ్గు లేదని తేల్చేశారు.వైఎస్ జగన్ మీద కడుపుమంట కావచ్చు.. అక్కసు కావచ్చు... ఈర్ష్య.. అసూయ కావచ్చు ఏదైనా కానీ జనసేనాని మాత్రం ఆజన్మాంతం చంద్రబాబుకు, లోకేష్‌కు సేవకుడిగా బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్, దార్శనికత.. ముందుచూపు, పార్టీ బలోపేతంపై నిబద్ధత లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే మూటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచనికైనా దిగజారతానని తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం అంటూ ఆయన సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం నైరాశ్యం మిగిలింది. నిన్ను గెలిపించడానికి.. సీఎంగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం వారికి ఊడిగించేయాలి అంటూ వారు తమలో తాము కుమిలిపోతున్నారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంతకాలం లేదా ఆయనకు ఆసక్తి ఉన్నంతకాలం బాబుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కల్యాణ్‌కు ఎప్పటికీ ముఖ్యపాత్ర దక్కదు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకు ఉన్న పరపతి, ఓటు బ్యాంకును చంద్రబాబు విజయవంతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని.. ప్రోటోకాల్ తగ్గిందని పవన్‌కు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న లోకేష్ అనధికారికంగా సీఎంగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చేస్తున్నారు.మరోవైపు, ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నాయకుల నుంచి డిమాండ్లు కూడా తెర వెనుక నుంచి చేయిస్తున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి లోకేష్‌ను సీఎం అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. అంటే లోకేష్ సీఎం కావడానికి కూడా పవన్ బేషరతుగా ఒప్పుకున్నట్లుగా లెక్క.. అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్లుగా ఇటు కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు లోకేష్‌కు అయినా సరే ఆయన అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లు మొన్నటి ప్రకటనలతో అర్థమైంది.ఇంకో 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి తాను పాలేరుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకరించరు. ఎన్నటికీ పవన్ వారి తాబేదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం. నిన్ను సీఎంగా చూడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు తెలుగుదేశానికి 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని మరి పాలేరుగా పనిచేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇక మేమేం చేస్తాం.. అంటూ జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో గూడు పుఠాణీ... అంతా గుంభనంగా!
-
‘చినబాబు సర్వీసు’ కమిషన్!
నారా చంద్రబాబునాయుడు..! వైఎస్ జగన్మోహన్రెడ్డి..! వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!! సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేనివిధంగా కమిషన్‌లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్‌గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్ సభ్యుడిని తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?2023 గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం స్పోర్ట్స్ కేటగిరీలో 42 మందిని, జనరల్ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరుగుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపోతుందని ఆక్రోశిస్తున్నారు.మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్.. కమిషన్‌లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్‌తోపాటు సభ్యుల్లో సీనియర్‌ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్‌గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..వారం క్రితం గ్రూప్–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్‌లో ఫైల్ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘాలపై కొత్త సభ్యుడిని నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమవారం రోజు బోర్డులో ఉన్న సీనియర్ సభ్యుడిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్‌ను అప్పటికప్పుడు నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.సీనియర్ సభ్యులను పక్కనపెట్టి..టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తికాలం కొనసాగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్టీయూ వైస్ చాన్సలర్‌గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా గత ప్రభుత్వంనియమించింది. అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రూప్–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తలరాతలు తారుమారు...టీడీపీ హయాంలో సర్వీస్ కమిషన్ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్‌భాస్కర్ చైర్మన్‌గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2018 గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు, ఒక సబ్జెక్టు నిపుణుడు (యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. -
‘ఏడాదిలోనే చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల రూ.1.62 లక్షల కోట్లు’
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘ఓట్ల కోసం కూటమి నేతలు,ఎల్లో మీడియా వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు,లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు,పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని.. చంద్రబాబు,లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేశారు’అని ఆరోపించారు. -
Lakshmi Parvathi: దరిద్రపు పరిపాలన.. తండ్రికొడుకుని ఒక్కటే అడుగుతున్న
-
ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు?. లోకేష్‌కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్‌తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
పాఠశాలను విలీనం చేస్తే.. నిరాహార దీక్ష చేస్తాం!
పుత్తూరు: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేస్తే నిరాహార దీక్ష చేస్తామని తిరుపతి జిల్లా పుత్తూరు మండలం ఎగువ గూళూరు గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌రెడ్డికి వినతి పత్రం అందచేశారు. తడుకు పంచాయతీ పరిధిలోని పాఠశాలను శిరుగురాజు పాళెం పంచాయతీలోని దిగువ గూళూరులో ఉన్న పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉన్న పాఠశాలను మూసివేయడానికి ఎవరికీ అధికారం లేదనీ, ఇక్కడ చదువుతున్న దళిత విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకొనే పరిస్థితి లేదని చెప్పారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోతే అంబేడ్కర్ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. మా పాఠశాలే మాకు ముఖ్యం వరికుంటపాడు ఎస్సీకాలనీ వాసుల ఆందోళనవిద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్ విధానాన్ని విద్యావంతులు, ఉపాధ్యాయ లోకం విమర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పలువురు తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించబోమని స్పష్టం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సీ కాలనీలో 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మోడల్ స్కూల్ విధానంలో ఎస్సీకాలనీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను వరికుంటపాడు రామాలయం సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేశారు. అంతదూరం తమ పిల్లలు ఎలా వెళతారంటూ సోమవారం కాలనీ వాసులు పాఠశాల ఎదుట ఆందోళన చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు. మా పాఠశాలే మాకు కావాలంటూ నినాదాలు చేశారు. – ఉదయగిరి (వరికుంటపాడు) -
ఇయర్ మారుతుంది తప్ప.. జాబ్ క్యాలెండర్ మాత్రం లేదు
-
Adimulapu Suresh: జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాం
-
మా ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాలేదు: నారా లోకేశ్
సాక్షి, న్యూఢిల్లీ: ‘మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలి అస్సలు బాలేదు. నియోజకవర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మాట తీరు, వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.’’ అని లోకేశ్ అన్నారు. బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేశ్ భేటీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ ద్వారా సహకారం అందించాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను మంత్రి నారా లోకేశ్ కోరారు. గురువారం ఢిల్లీలో టోనీ బ్లెయిర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరినట్లు లోకేశ్ ‘ఎక్స్’లో తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు. -
YS Jagan: మీరా మహిళల గౌరవం గురించి మాట్లాడేది
-
YSRCP పార్టీలో ఎందుకున్నావు అంటూ DSP హనుమంతు రావుపై జగన్ ఫైర్
-
కొడాలి నాని, వల్లభనేనిని అక్రమ అరెస్టులుపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ధృతరాష్ట్ర పాలన.. ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది!’
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం పాలనను.. ప్రభుత్వాన్ని హైజాక్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్న పరిపాలనా ?..రాష్ట్రంలో పరిపాలన కన్నా కక్షలు.. కార్పణ్యాలు తీర్చుకోవడమే లక్ష్యంగా పడుతున్న తప్పుబడుగులను బాబు సరిదిద్దే పని చేయడం లేదా? దుర్యోధనుడి మాదిరిగా లోకేష్ అరాచకాలు సాగిస్తుంటే చంద్రబాబు కూడా పుత్రవాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారా ? ఇలాంటి సందేహాలు రాష్ట్రప్రజలను చుట్టుముడుతున్నాయి. గెలిచింది మొదలు లోకేష్ చేస్తున్న ప్రకటనలు, ప్రతిపక్ష నేతలు.. సోషల్‌మీడియా కార్యకర్తలమీద చట్టాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న దాడులు .. కేసులు బాబుకు లీలగా కనిపిస్తున్నాయా ? వినిపిస్తున్నాయా ? అదే అనిపిస్తోంది.బాబుపాలనకు వచ్చి ఏడాదైన సందర్భంగా పలు ప్రయివేటు జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో ఘోరమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. టీడీపీ నేతల అరాచకాలు.. దొమ్మీలు .. దోపిడీలు బాబు ప్రభుత్వ ప్రతిష్టను ఎలా దిగజారుస్తున్నదీ ఆ సర్వేలో వెల్లడింది.. ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం పెచ్చుమీరిన అవినీతిలో మునిగితేలియాడుతున్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ .. ఇతర సర్వే సంస్థల ద్వారా బాబు చెవిన పడిందా ?. ఇసుక.. గనులు.. వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యేలు కార్యకర్తల రుబాబు ఆకాశాన్ని తాకింది. ఈ వ్యతిరేకత అంతా తాజా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇది బాబు దృష్టికి వెళ్లిందని.. అందుకే విశాఖలో యోగా కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అయన కార్యకర్త్తలను సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు. గట్టిగా వార్ణింగ్ ఇవ్వలేక సుతిమెత్తగా తమలపాకుతో .. నెమలీకతో కొట్టినట్లుగా మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే అయన 'ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా.. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా' అంటూ హెచ్చరికలు చేసారు. ఇలా చెబితే ఎవరు వింటారు.. మళ్ళా ఎవరి దందాల్లో వాళ్ళుంటారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు... కార్యకర్తలు తల ఎగరేస్తున్నారు. ::: సిమ్మాదిరప్పన్న -
జగన్ గుంటూరు పర్యటనపై నారా లోకేష్ కుట్ర..
-
ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి: రవిచంద్ర
-
మీడియా ముందు తొడలు కొట్టడం కాదు.. నారా లోకేష్ కి రోజా ఛాలంజ్
-
చెల్లని చెక్కులు పంచిన మంత్రి లోకేష్!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్‌ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్‌లు అందించారు. అయితే ఆ చెక్‌లను బ్యాంక్‌లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు. అయితే ఆ చెక్‌లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్‌లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్! -
‘తల్లికి వందనం.. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకున్నాడు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. -
తల్లికి వందనం పథకంపై రామాంజులు రెడ్డి కామెంట్స్
-
మీరు కట్ చేసే 2వేలు ఎవరి ట్యాక్స్.. లోకేష్‌కు గుడివాడ దిమ్మతిరిగే కౌంటర్
-
నువ్వు లోకేశా లేక జోకేశా.. ప్యాకేజీ స్టార్ నీతులు..
-
తండ్రి, కొడుకులని ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
సీఎం చంద్రబాబుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
-
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్‌ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్‌సిక్స్‌తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్‌సిక్స్‌లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్‌కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్‌ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
యూడైస్ పై కనీస అవగాహన లేని మంత్రి లోకేశ్
-
‘తల్లికి వందనం’లో ట్విస్ట్.. సర్పంచ్ల పిల్లలకు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం(Talliki vandanam) పథకానికి అర్హత లేదని కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. వారు ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం తీసుకుంటున్నందున, వారిని ఉద్యోగుల కేటగిరీ కింద లెక్కేసి.. వారి పిల్లలను అనర్హుల జాబితాలో చేర్చింది. దీంతో, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నేలగొండ గ్రామ సర్పంచి పాటిల్ భాగ్యమ్మ భర్త చిన్న రైతు. వీరికి ఇద్దరు పిల్లలు. మొత్తంగా నలుగురు సభ్యుల కుటుంబం. వీరికి తల్లికి వందనం పథకం పొందే అర్హత ఉంది. అయితే, సర్పంచ్‌గా ఆమె ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం అనర్హుల జాబితాలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 మంది గ్రామ సర్పంచ్‌లతో పాటు 9 వేల మందికి పైగా ఎంపీటీసీ, 660 మంది జెడ్పీటీసీ సభ్యులు, 660 దాకా మండల పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మేరకు వీరి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇతరత్రా నిబంధనల ప్రకారం అర్హులుగా ఉంటే చాలు.. అన్ని పథకాలకు వీరిని అర్హులుగా పేర్కొంటూ లబ్ధి కలిగించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సంఘం నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించడంతో పాటు అందులో అంతర్గతంగా ఆయా సామాజిక వర్గాల వారీగా 50 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. వీరంతా మామూలు కుటుంబాల వారు. చాలా మంది ఉపాధి పనులకు సైతం వెళుతున్నారు.తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది.వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. ⇒పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు. -
మిడిమిడి జ్ఞానమా.. అతి తెలివా!?
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్‌కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్‌పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్‌గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.యూడైస్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ సెల్ఫ్ గోల్ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్‌కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్‌ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రినీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?లోకేశ్‌కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్‌లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్‌మీట్‌కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా! తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి -
అంత ఉలుకెందుకు లోకేశ్!?
సాక్షి, అమరావతి :తల్లికి వందనం పథకం అమలుతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. మంత్రి సవాల్‌కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ స్పందన ఏమిటంటే..‘‘నారా లోకేశ్.. యూడైస్ నివేదిక 2023–24 ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్టును జతచేస్తున్నాం. కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలను ఈ నివేదిక సమర్థించడంలేదు. దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా, హేళనచేస్తూ మాట్లాడ్డం సంస్కార హీనం’’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారానికి సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్స్లు జతచేసింది. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?‘‘మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బులు లాగేస్తున్నారని గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేశ్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మేం చెప్తుంటే అంత ఉలుకెందుకు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి? అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావో ఒక్కసారి విను’’.ఆ రోజుల్లో మీ వేదన అంతా ఇంతా కాదు..‘‘వైఎస్సార్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీరు, మీకు వత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండివార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పోస్టు ఇది. వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. మరి దీనికి ఎవరిపై కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియాను నడిపిన మీపైనా? ఏనాడూ నిజం చెప్పని ఈనాడుపైనా? లేక ఇద్దరిపైనా? లేకపోతే ఆ పోస్టు చేసింది మా పార్టీ కాదని మళ్లీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావా? అంతటి ఘనుడివే నువ్వు’’.. అంటూ శుక్రవారం వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్‌ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్‌లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు
-
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
లోకేష్ కు నాగార్జున యాదవ్ మాస్ వార్నింగ్..
-
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా.. మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను, కొమ్మినేని అరెస్ట్ తదితర అంశాలను ఖండిస్తూ.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లకు ఆయన చురకలంటించారు.పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైఎస్సార్సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోగా.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, జనాల దృష్టి మరలించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు.. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్... వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న నినాదం వెనుక ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కడే.. సొంత ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం!. అలాంటప్పుడు ఇది నిజమైన మహిళా గౌరవ రక్షణా?. ఈ ఘటనలు వారి అసలైన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల ముందు ఒక ప్రచారాన్ని నిర్మించుకుంటూ.. నిజమైన విలువలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి..కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?: చంద్రబాబుఅమ్మాయిల వెంటపడమంటే ఊరుకుంటారా నా ఫ్యాన్స్. ఏమయ్యా.. ఊరుకోరు కదా. ఎళ్లి ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేసేయాలి అంతే.. అంతే కమిట్ అయిపోవాలి. ఏదో ఒకటి: నందమూరి బాలకృష్ణవిదేశీ యువతులతో డ్యాన్సులు వేస్తూ.. ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025 ఏడాది కాలంలో 188 రేపులు, 15 హత్యాచారాలు ఇదేనా మహిళలకు రక్షణ కల్పించడం అంటే?. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిమండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై టీడీపీ నేతలే అత్యాచారానికి పాల్పడడం.. లాంటి ఘటనలు తాజా నిదర్శనాలు. ఇదేనా వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీ?. ఇదేనా వాళ్లు కాపాడుతున్న మహిళా గౌరవం?.. వాళ్ల చేతలు, మాటలు.. పొంతన లేకుండా పోతోంది. మహిళల పట్ల వీరి వైఖరి సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న వంకతో కక్షసాధింపు చర్యలు తీసుకోవడం అత్యంత దారుణమైన చర్య’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
కొమ్మినేనిని అరెస్ట్ చేయడం రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట: రోజా
-
పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్‌లతో కలిసి బీభత్సం
-
మంత్రి లోకేశ్‌కు గురువుల నిరసన సెగ
సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు పార్వతీపురం మన్యం జిల్లాలో గురువుల నుంచి నిరసన ఎదురైంది. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం పార్వతీపురం వచ్చారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. లోకేశ్ పర్యటన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు,ఆయనను కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే బదిలీల విషయమై మంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో రెండు బృందాలుగా టీచర్లు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వేచి చూశారు. చివరికి మంత్రి లోకేశ్ ను ఉపాధ్యాయులు కలిశారు. తమ డిమాండ్లు వినిపించారు. -
చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్‌కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్‌కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. -
లోకేష్ చెప్పినట్టే చేసి.. షాక్ ఇచ్చిన పబ్లిక్
-
విశాఖపట్నం : మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)
-
Red Book: కానిస్టేబుల్ మీద ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ సాయి దాడి
-
ఏ పాఠశాలకు వస్తావో రా.. లోకేష్‌కి విద్యార్థుల ఛాలెంజ్
-
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్‌లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్‌లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్‌లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్‌తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్‌లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారుఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్‌ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.ఈ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్‌ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్‌లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట్జర్ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ఆర్గనైజేషన్‌తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్ జగన్ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్‌ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్‌ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు, లోకేష్ కు నాగార్జున యాదవ్ ఓపెన్ ఛాలెంజ్
-
డీఎస్సీ అభ్యర్థులకు గడువు గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి ప్రకటించిన డీఎస్సీ పరీక్షలు ఉపాధ్యాయ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తిగాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది నమ్మి ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులను షాక్‌కు గురిచేస్తూ మరుసటి రోజే మెయిన్స్ నిర్వహించారు. దీంతో వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కూటమి సర్కారు డీఎస్సీ పరీక్షలకూ అనుసరించింది. దీంతో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది సిలబస్ పూర్తిగాక, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన 6100 పోస్టుల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, మెగా డీఎస్సీ ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు హామీ ఇచ్చింది. అలాగే సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్‌పై చేశారు. అంతేగాక, వెంటనే నోటిఫకేషన్ ఇచ్చి డిసెంబర్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పలు రూపాల్లో వాయిదాలపై వాయిదాలతో సుమారు ఏడాదిదాకా సాగదీశారు. అంధకారంలోకి అభ్యర్థుల జీవితాలు ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. ప్రధానంగా 50 శాతం అర్హత మార్కుల నిబంధన విధించి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అర్హతను నిర్దయగా కోల్పోయేలా చేసింది. 50 శాతం మార్కుల అర్హత పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు.టెట్ అర్హత మార్కుల ప్రకారం ఈ మార్పు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే వరుసలో ఉన్న జనరల్ అభ్యర్థుల అర్హత కనీసం మార్కులను మాత్రం 50 శాతం అలాగే ఉంచారు. వాస్తవానికి టెట్‌కు జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆమేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌ను, ఆశలను అంధకారంలోకి ప్రభుత్వం నెట్టేసింది.గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షలకు ఇలాంటి నిబంధనలు లేవు. కేవలం కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన డీఎస్సీ–2025లోనే ఈ పరిస్థితి తీసుకురావడం ఉద్దేశపుర్వకంగానే చేశారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. టెట్ రాసేటప్పుడే ఈ నిబంధన విధించి ఉంటే సమస్య ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం తమ భవిష్యత్‌ను నాశనం చేసిందని వాపోతున్నారు. ప్రణాళికాబద్ధంగా మోసంప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులనూ భర్తీ చేస్తామని, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ నెలలో ప్రకటించింది. అనంతరం అదే సమయంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని జూలై నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రచారం చేశారు. దీనిప్రకారం ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ రావాలి. తర్వాత టెట్‌కు, డీఎస్సీకి మధ్య 3 నెలల వ్యవధి ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన టెట్ ను అక్టోబరులో జరిపిన ఫలితాలను ప్రకటించారు. టెట్ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో పరీక్షలు పెట్టాలి. కానీ తొలుత నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తర్వాత 6వ తేదీన నోటిఫికేషన్ అన్నారు. ఆరు నెలలుగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. నోటిఫికేషన్ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. -
ప్రజల చేతికి చిప్ప తప్పు... బాబు, లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
అయ్యా నారా వినపడుతుందా.. ఏకిపారేసిన అంబటి..
-
ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ శెభాష్ అనిపించుకున్నట్లే.. లోకేశ్ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్‌బుక్’ అంటూ వైఎస్సార్సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్‌లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 👉గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్‌ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్‌తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన లోకేష్ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో విద్యార్ధికి వెరిఫికేషన్‌లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్‌లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే 93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్ ప్రస్తావన కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే ఒక రకం. .. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా కథనాలు ఇస్తే విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా, ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్‌తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్‌కు వెళ్లిన వారంతా వైఎస్సార్సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Putha Siva Sankar: తక్షణమే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి..
-
‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి : మంత్రి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడమే కాకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల దిద్దుబాటులో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. ‘ జరిగిన తపఉకు అంగీకరించకపోగా ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. పదో తరగతి విద్యార్తుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మార్కులు తక్కువ వేసి వేలాది మంది విద్యార్థులను ఫెయిల్ చేశారు. రీవెరిఫికేషన్ చేయిస్తే ఎంతోమందికి మంచి మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ అనేది పిల్లలకు సున్నితమైన దశ. అలాంటి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రికార్డుల కోసం వారం రోజుల్లోనే పేపర్లు దిద్దాలని చూశారు. కనీసం టీచర్లు సంఖ్యను కూడా పంచకుండా పేపర్లు దిద్దించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. రీవెరిఫికేషన్ కు తీసుకున్న రూ. 6 కోట్ల ఫీజను వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తప్పించుకోవాలని చూస్తే సహించలేదు’ అని హెచ్చరించారు. -
వెన్నుపోటుకు ఏడాది
-
చదువు'కొన్న' మంత్రి.. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్..!
-
‘బాబు మహానుబావుడు.. అధికారంలోకి వచ్చాడు లక్షల ఉద్యోగాలు పీకేశాడు’
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్‌కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్‌పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్‌కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్‌కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్‌కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్‌లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్‌షాప్‌కు కనిపించవా?చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్‌లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్‌లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్‌లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్‌నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలిఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్‌తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్‌కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం. -
రెడ్ బుక్ అంటే ఏదో మగతనం అనుకుంటున్నావా? జగనన్న మా చేతులు కట్టేసాడు లేదంటే...
-
కూటమి పాలనలో విద్యా రంగం భ్రష్టుపట్టిపోయిందన్న వైఎస్ జగన్
-
10th వాల్యుయేషన్ లో బట్టబయలైన లోకేష్ బాగోతం
-
టెన్త్ విద్యార్థులపై చెరగని ‘రిమార్కు’
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్)/నూజివీడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పదో తరగతి ఫలితాల్లో తీవ్రస్థాయి తప్పులు జరగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై విద్యార్థి లోకం మండిపడుతోంది.. తమ బిడ్డల భవిష్యత్ ముడిపడి ఉన్న పరీక్ష పత్రాలను ఇంత అడ్డగోలుగా దిద్దుతారా? అంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు.. లేనిపోని ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అంటూ విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేశామంటూ గొప్పలు పోవడం వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో కూటమి సర్కారు ‘ఫెయిల్’ అయిందని తేల్చి చెబుతున్నారు. ఫెయిలైనవారిలో 60% మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్‌కు నమోదు చేసుకోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉంటుందని పేర్కొంటున్నారు. వాల్యుయేషన్‌లో ఇంత ఘోరంగా విఫలమైనవారు.. రీ వాల్యుయేషన్‌లో అయినా సరిగ్గా వ్యవహరిస్తారనే నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నారా లోకేశ్.. నోరు మెదపరేం..? ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత 66,363 మంది పేపర్ల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 11 వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కులు మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డే ప్రకటించింది. వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం అని గొప్పలు పోయేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్ద పొరపాటే చేసింది. దీంతో హడావుడి చేసి.. ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి వేగంగా పేపర్లు దిద్దించిన సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ నోరు మెదపరేం? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పే లోకేశ్.. స్వయంగా తన శాఖలో జరిగిన దారుణంపై ఉలుకుపలుకు లేకుండా ఉండడం ఏమిటని నిలదీస్తున్నారు. వేగంగా మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తెచ్చి, టీచర్లకు ఎక్కువ పేపర్లు ఇవ్వడమే తప్పులు దొర్లడానికి కారణమని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసిన సర్కారు.. మరి మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ఎందుకు తప్పించడం లేదని సూటిగా అడుగుతున్నారు. జీవితంపై దెబ్బకొట్టారు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రభుత్వ విభాగాల్లోని ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో మెరుగైన విద్యను పొందే అవకాశం దక్కుతుంది. ఊహించని విధంగా ఫెయిల్ కావడంతో అనేకమంది విద్యార్థులు ఐఐఐటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీట్లు పొందలేకపోయారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సాయం చేస్తుంటాయి. తప్పుల మూల్యాంకనం కారణంగా ఇప్పుడీ అవకాశాలు చేజారాయి. ఈ నేపథ్యంలో ఎవరిది తప్పు..? మాకెందుకీ శిక్ష? అని విద్యార్థులు నిలదీస్తున్నారు. తమ మనో వ్యథను ఎవరు తీరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారాయికాగా, ఈ ఏడాది 45,96,527 పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. 16,482 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 5,494 మంది స్పెషల్ అసిస్టెంట్స్, 2,747 మంది చీఫ్ ఎగ్జామినర్స్ ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. రోజుకు ఒక్కో ఉపాధ్యాయుడు 40 పేపర్లు దిద్దినట్టు వివరించారు. కొన్నేళ్లుగా 44.50 లక్షల నుంచి 47.80 లక్షల వరకు జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 99.76 శాతం కచ్చితత్వంతో పేపర్లు దిద్దామని.. 34,709 మంది విద్యార్థులు జవాబు పత్రాల రీచెకింగ్‌కు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారినట్లు తెలిపారు.‘కార్పొరేట్ ఇంటర్’ కొమ్ముకాయడానికే హడావుడి!ఇంటర్ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పొరేట్లకు కొమ్ముకాయడానికే పదో తరగతి పేపర్లు త్వరగా దిద్దించారు. మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. దీనికి ఉపాధ్యాయులను బలి చేయడం దారుణం. విద్యా సంస్కరణల పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇచ్చామని మంత్రి లోకేశ్ గొప్పలు చెబుప్పడం సిగ్గుచేటు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేశారు? ప్రభుత్వం విద్యార్థుల నుంచి వసూలు చేసిన రీవాల్యుయేషన్ ఫీజు తిరిగి చెల్లించాలి. –ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్రావు, ప్రసన్నకుమార్ విద్యార్థుల జీవితాలతో మంత్రి లోకేష్ చెలగాటం విద్యా వ్యవస్థను మంత్రి లోకేశ్ గాలికి వదిలేశారు. టెన్త్ ఫలితాలు వారం రోజుల్లోనే వెల్లడించేస్తాం అని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ప్రభుత్వ తప్పిదం పిల్లల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. –ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ ప్రతిభావంతులను ఫెయిల్ చేయడమేనా రికార్డు? వారం రోజుల్లో మూల్యాంకన ప్రక్రియ ముగించాలనే అనవసర ఒత్తిడితోనే తప్పులు దొర్లాయి. తక్కువ సమయంలో ఫలితాలు ప్రకటించామని ప్రభుత్వం రికార్డుగా చెప్పుకొంటోంది. 66,363 పేపర్ల రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తులు రావడం, 11 వేలపైగా పేపర్లలో విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కులు మారడం ఏం రికార్డు? –ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ లోకేశ్ గొప్పలు.. విద్యార్థులకు తిప్పలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం విషయంలో ఉన్న శ్రద్ధ పదో తరగతి విద్యార్థులకు సరైన ఫలితాలను విడుదల చేయడంలో లేదు. తక్కువ సమయంలోనే ఫలితాలు విడుదల చేశామని ప్రభుత్వం, మంత్రి లోకేశ్ గొప్పలు చెప్పుకొంటే.. తమ ప్రతిభకు తగ్గట్లుగా మార్కులు రాక విద్యార్థులు మనో వేదనకు గురయ్యారు. –ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ విద్యార్థులను అంధకారంలోకి నెట్టిందికూటమి ప్రభుత్వం పది పరీక్షల మూల్యాంకనంతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తప్పుల మూల్యాంకనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలి. –ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదుపిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. –బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపీ -
లోకేష్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్‌కుమార్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. -
షర్మిలకు జగన్ 200 కోట్లు ఇచ్చాడు.. మీ నాన్న మీ అత్తకి కనీసం మజ్జిక ప్యాకెట్ అయినా ఇచ్చాడా
-
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
బిగ్ న్యూస్: ఏపీ టెన్త్ ఫలితాలపై సర్వత్రా అనుమానాలు!
సాక్షి, విజయవాడ: ఏపీ టెన్త్ మూల్యాంకనంలో ఈసారి మామూలు తప్పులు చోటు చేసుకోలేదు. రీవాల్యూయేషన్‌లో.. విద్యాశాఖ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మార్కుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఏకంగా 50, 60 మార్కుల వ్యత్యాసం వస్తుండడంతో అంతా కంగుతింటున్నారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని రీతిలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు చోటు చేసుకున్నాయి. రీవాల్యూయేషన్ ద్వారా మార్కుల్లో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. నారా లోకేష్ (Nara Lokesh) సారథ్యంలో విద్యాశాఖ తొలి ఏడాది ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. రికార్డ్ టైం కోసం మొత్తం మూల్యాంకనం గందరగోళంగా మార్చేశారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. మొత్తం 4,98,585 మంది పాసైనట్లు( 81.14 శాతం) ప్రకటించి అభినందనలు తెలిపారు. అయితే.. రీవాల్యూయేషన్ కోసం ఏకంగా 60% మంది దరఖాస్తు చేసుకోవడంతో బోర్డు కంగుతింది. దరఖాస్తు చేసుకున్న 66,363 మందిలో.. ఇప్పటిదాకా 11,175 మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు జరిగాయి. ఇక అధికారులు పర్సంటేజీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 16.8 శాతమే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం మీడియా ద్వారా బయటపడడంతో.. టీచర్లను సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు.. ఈ పరిణామంతో అసలు టెన్త్ఫలితాలపై ఇప్పుడు కొందరు పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు.. గతంలో రీవాల్యూయేషన్ కోసం ఐదు వేలకు మించి దరఖాస్తులు రాలేదని గణాంకాలతో సహా మాజీ విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు మీటింగ్ పెట్టి పిలిచి అడిగినా చెబుతానని, ఆ సమావేశంలో మూల్యాంకనంలో తప్పులు ఎలా జరిగాయో వివరించేందుకు తాను సిద్ధమని బొత్స అంటున్నారు.రికార్డు స్థాయి టైంలో రిజల్ట్స్ వెల్లడించాలని నారా లోకేష్ చేసిన ఒత్తిడి ఫలితమే తప్పుల తడకగా ఫలితాలు వెల్లడయ్యాయని, పాసైన వాళ్ళు కూడా ఫెయిలయ్యాయరనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ ఫలితాలతో వేల మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇంత ఘోరంగా వైఫల్యం చెందినా.. తప్పు జరిగిందంటూ లోకేష్ ఈ అంశంపై కనీసం ఒక ట్వీట్ చేయకపోవడం ఇంకా దారుణం. -
‘లోకేశ్.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’
విశాఖపట్నం: కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను, ఏడాది పాలన తరువాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే....కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించింది. కొత్త టెక్నిక్‌లతో లేనివి ఉన్నట్లుగా చూపించారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు రోజుల పాటు చాలా తాపత్రేయ పడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినం సందర్భంగా కార్యక్రమాలు చేసుకోవడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ తాను చేసిన పనులను చెప్పుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉండి, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీని ఆడిపోసుకుని ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమయ్యారు. స్థాయిలేని వ్యక్తులతో సభ్యత లేకుండా మాట్లాడిన భాషను మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు.మహానాడు సాక్షిగా పథకాలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ప్రాంతంలో కొత్త జిల్లాను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత సంకుచితంగా సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారు?పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంపై సమీక్ష ఏదీ?పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? 16వేల మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలింది. గతంలో ఏ నాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట ఇరవై మార్కులు వచ్చి, తరువాత రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. దీనిని బట్టి చాలా దారుణంగా పదోతరగతి విద్యార్ధుల జవాబుపత్రాలను దిద్దారనేది అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? గతంలో రోజుకు నలబై జవాబుపత్రాలను ఒకొక్కరికి ఇచ్చేవారు. కానీ తాజాగా వాల్యుయేషన్ చేసిన వారికి రోజుకు ఎన్ని జవాబుపత్రాలను దిద్దాలని ఇచ్చారో బయటపెట్టాలి. విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలి. ఈనాడు వంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఈ వ్యవహారాన్ని వక్రీకరించేలా ఎందుకు కథనాలు రాయిస్తున్నారో చెప్పాలి.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఉర్సాకు ఎంతకు భూములు ఇచ్చారో బయటపెట్టాలి. కారుచౌకగా కట్టబెడుతున్నారన్న మా ఆరోపణలను వాస్తవం కాదని దమ్ముంటే నిరూపించాలి.ఈ రోజు ఈనాడు పత్రికలో ఇరవై శాతం ఇలాగే రీవాల్యుయేషన్లో మార్కుల్లో తేడాలు రావడం సహజమన్నట్లుగా వచ్చిన కథనం పూర్తి అవాస్తవం. ఏ ఏడాది అయినా అయిదు వేల మంది కంటే ఎక్కువ విద్యార్ధులకు రీవాల్యుయేషన్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు రాలేదు. ప్రతిఏటా కనీసం పద్నాలుగు రోజులు జవాబు పత్రాలను దిద్దేవారు. కానీ తాజాగా మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జవాబు పత్రాలను దిద్దేవారిపై పనిఒత్తిడిని పెంచారు. వాల్యుయేషన్ సెంటర్లు, టీచర్లను పెంచకుండా ఎక్కువ జవాబుపత్రాలను దిద్దాలని ఇవ్వడం వల్లే ఇటువంటి ఫలితాలు వెలువడ్డాయి.మహానాడులో రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు ప్రకటించలేదు? అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తేదీలతో సహా ఎందుకు సంబంధిత మంత్రులు ఎందుకు వెల్లడించలేదు?ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని ఎత్తి చూపుతూ జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలను కలుపుకుని ఆరోజు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాం’ బొత్స తెలిపారు. -
తెలుగు రాష్ట్ర చరిత్రలో సంచలనం.. మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్
-
‘నవ’ మోసాలు.. ఉపాధ్యాయుల వినూత్న ఉద్యమం
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు.. అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్‌పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్‌కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్‌కు మెయిల్స్, వాట్సాప్‌ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్‌పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్‌రసూల్, సీఎస్‌పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్‌బాబు పేర్కొన్నారు. తొమ్మిది అంశాలివే..1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
‘నవ’ మోసాలు
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్‌పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్‌కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్‌కు మెయిల్స్, వాట్సాప్‌ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ సీఎస్‌పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్‌పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్‌రసూల్, సీఎస్‌పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్‌బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
‘టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. హాఫ్ ఇయర్లీ పరీక్షల నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీకేజీ జరగకుండా పటిష్టంగా పరీక్షల ప్రక్రియ నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లోనూ పేపర్ లీక్‌లతో ప్రభుత్వం అభాసుపాలైంది. ఇదిలా ఉంటే చివరికి పేపర్ మూల్యాంకనంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిలయ్యారు.వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్, రీ వేల్యూషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది మా జవాబు పత్రాలను తప్పుల తడకగా మూల్యాంకనం చేశారని దరఖాస్తు చేసుకోవడం ఎస్సెస్సీ బోర్డు చరిత్రలో ఇదే ప్రథమం. రీవేల్యూషన్, రీకౌంటింగ్ తర్వాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైనట్టు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంకన విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మోక్షిత అనే విద్యార్థినికి సాంఘిక శాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి. బాపట్లలో మరో విద్యార్థికి సాంఘిక శాస్త్రంలోనే 26 మార్కులొస్తే రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. ఏలూరులో ఒక విద్యార్ధి రాసిన జవాబు పత్రాలన్నీ మూల్యాంకనం చేయకుండా 14 మార్కులే వేశారు. రీ వేల్యూషన్‌లో ఆ విద్యార్ధినికి 86 మార్కులొచ్చినట్టు అధికారులు ప్రకటించారు.లోకేష్ అసమర్థతకు టీచర్లు బలిరాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే పేపర్ మూల్యాంకనం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. తీరా ఫలితాలు చూశాక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. తప్పుడు తడకలుగా మూల్యాంకనం చేసి 1,15,874 మంది విద్యార్థులు ఫెయిలైనట్లు ఫలితాలు ప్రకటించారు. రీవేల్యూషన్ లో 66వేల మందికిపైగా విద్యార్థులు పాసవ్వడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. మూల్యాంకనంలో టీచర్లకు టార్గెట్లు పెట్టి వేధించి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చింది.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీచర్లను దోషులుగా చూపించి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవడం దుర్మార్గం. నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచుకునే వ్యూహంలో భాగంగానే హడావుడిగా మూల్యాంకనం చేయించినట్టుగా తెలుస్తోంది. చివరికి మూల్యాంకనంలో లోపాలు తలెత్తడంతో టీచర్లను బలిచేశారు. విద్యావ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల జీవితాలతో లోకేష్ ఆడుకుంటున్నాడు. మూల్యాంకనంలో జరిగిన తప్పులకు, లోపాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. -
ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది... పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్సీపీ(YSRCP) ప్రశ్నించింది. .. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్ రీవాల్యూషన్(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.Unprecedented chaos in 10th class exam evaluation! Thousands of students’ futures at stake as 60% have applied for revaluation — a first in AP history. Shocking errors by the board failed even those who passed. Due to Nara Lokesh’s pressure, marks were tampered with. 66,363… pic.twitter.com/q34Gm46Yj1— YSR Congress Party (@YSRCParty) May 30, 2025 -
లోకేష్ ఒక జీరో.. లక్ష్మి పార్వతి కామెంట్స్
-
‘కూతురు కొడుకు ఎన్టీఆర్‌కు వారసుడా?’
సాక్షి, తాడేపల్లి: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప.. నారా లోకేష్ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ..‘మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌కు కూతురు కొడుకైన నారా లోకేష్.. ఏ విధంగా ఎన్టీఆర్‌కు వారసుడు అవుతాడు?. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా తరిమేశారు’ అని విమర్శలు చేశారు.కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రష్టుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. .@naralokesh ఎన్టీఆర్ గారి వారసుడిగా కాలేడు:మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌కు కూతురు కొడుకైన నారా లోకేష్, ఏ విధంగా ఎన్టీఆర్‌కు వారసుడు అవుతాడు?నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన… pic.twitter.com/mpEcSgXMPT— YSR Congress Party (@YSRCParty) May 29, 2025పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’ అని మండిపడ్డారు. -
చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు
సాక్షి ప్రతినిధి, కడప, అమరావతి: ఏడాదిలో చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు..! అంతా ఆత్మస్తుతి.. పరనింద..! వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకునెట్టి.. సొంత కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు సీఎం ఎత్తులు..! ఇదీ టీడీపీ మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేక పోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాన్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు. మరోవైపు మహా నాడును.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన కేడర్ చేతులతోనే ఎన్టీఆర్‌ను ఛీ కొట్టించి ఆయన్నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు.. టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నారా లోకేశ్ నాయకుడనేలా..మంత్రి నారా లోకేశ్‌ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయనను కొనసాగిస్తే తనయుడు లోకే‹శ్ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంపెట్టారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందుపెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరమూ తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారా వారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని కేడర్‌కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పరనిందలతో ఆత్మానందంకడప మహానాడులో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడడానికే టీడీపీ నేతలు ఎక్కడ లేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు, లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకొంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్కమాట చెప్పలేకపోయారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఏఐ వీడియో ప్రదర్శించడం బెడిసికొట్టింది. బాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.తీర్మానాలు పోయి శాసనాలు వచ్చె..సాధారణంగా మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి బాబు తన తనయుడు లోకేశ్‌తో చెప్పించారు. ఈ శాసనాలేమిటని తమ్ముళ్లు బుర్రగోక్కుంటూ చర్చించుకున్నారు. కార్యకర్తలే బలం అన్న రోజే బలవన్మరణ యత్నంఆరు శాసనాల్లో గొప్పగా చెప్పినవాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ, అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే మాధవి తమను అణచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్నిబట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత పదికి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండాపోయింది.వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్నా.. రామ్మోహన్‌నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి భారీగా జనం వచ్చినట్టు చిత్రీకరించడం విమర్శలకు దారి తీసింది.టీడీపీ నేత ఫిర్యాదుతో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసుముందుగా వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకుని.. ఆపై ఫిర్యాదు తెప్పించుకుని కేసులు నమోదు చేస్తున్న అపఖ్యాతిని పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు మూటగట్టుకున్నారు. బుధవారం నమోదు చేసిన ఓ కేసులో వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల అదుపులో ఉండిపోయారు. కడపలో మహానాడు నిర్వహణను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. వారి దురుద్దేశం, దుశ్చర్యలను గమనించిన వైఎస్సార్సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, సబ్ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారు. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ కేడర్ వాటిని తొలగించింది. ఈ చర్యలో ఎలాంటి గొడవ, ఘర్షణ చోటుచేసుకోలేదు. తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్సార్ విగ్రహాలకు జెండాలు, తోరణాలు కట్టి సవాళ్లు విసిరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ వారికే వత్తాసు పలికింది. టీడీపీ నేతలు చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసు ప్రతాపం చూపారు. అప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, టీడీపీ నేత అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం. విజయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మంది బుధవారం రాత్రి నుంచి పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నారు. కోర్టులో హాజరుపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసు స్టేషన్లు మారుస్తూ వారిని కొడుతూ వచ్చారు. దీంతో పులివెందుల పోలీసులు.. పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
పదే పదే లోకేశ్ పాట!
సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్‌ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్‌ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు. లోకేశ్ కోసం డిమాండ్ల డ్రామా.. మరోవైపు.. లోకేశ్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్ నాయకులతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వారిని లోకేశ్ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు. రామ్మోహన్‌తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్.. చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్‌తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.తేలిపోయిన తీర్మానాలు.. ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్కటి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మానాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమాటలు చెబుతూ నేతలు ప్రసంగించారు. -
‘చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయం’
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అని ఎలా చెప్తారు?.అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదురాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు. -
మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)
-
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు
-
షాడో సీఎం లోకేష్.. సకల శాఖ మంత్రిగా నియామకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!. వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!. గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది. కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్‌కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్‌ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు. లోకేశ్‌ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్‌ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్‌ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
YSRCP Leaders: మేము అధికారంలోకి వచ్చాక దీనికి రెట్టింపు తిరిగి ఇస్తాం
-
KSR Live Show: నారా లోకేష్ కు నెలకు 45కోట్ల ముడుపులు!
-
పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం
-
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్
-
నాకు పోరాటాలు కొత్త కాదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.బాబు 12 నెలల పాలనలో..ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.అప్పుల సామ్రాట్ బాబుఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈనాడు.. ఓ మీడియానా?ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు. పరాకాష్టకు స్కాంలురాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే.. జూన్ 4న వెన్నుపోటు డేకిందటి ఏడాది జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. బాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. తనపై కేసులను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై ఉంటూ అధికార దుర్వినయోగానికి పాల్పడుతున్నారు. బెయిల్ కండిషన్లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ కాకూడదు?లిక్కర్ స్కాం పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. ‘‘నాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్సార్సీపీ పుట్టింది.. పెరిగింది.. ఎదిగింది. న్యాయం, ధర్మం వైపే దేవుడు ఉంటాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
గంటా రవితేజ నోట.. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేశ్‌బాబు!
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. రాజబాబు వర్గం డుమ్మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్చార్జిగా ప్రకటించేశారు. స్థానిక కమిటీలపై అసంతృప్తి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.జోహార్ సీఎం సర్! గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్‌బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు. -
మహానాడులో చంద్రబాబు ప్రకటన!
-
అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్
-
చంద్రబాబు, నారా లోకేష్ పై శ్యామల ఫైర్
-
వంశీని వదలరా? ఎందుకంత కక్ష..!
-
Nara Lokesh: మనల్ని ఎవడ్రా ఆపేది.. చినబాబు పెద్ద ప్లాన్!
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది. -సిమ్మాదిరప్పన్న -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్‌కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్‌బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్‌బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. -
ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ
-
ఏపీఆర్ఎస్–2025 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఎస్) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్ఎస్ సెట్, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ ఫలితాలు బుధవారం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో విడుదల చేశారు. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఐదో తరగతిలో 3920 సీట్లకు 14061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది పోటీపడ్డారు. పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు ప్రకటించారు.ఫలితాలను విద్యార్థి ఐడీ ద్వారా https:// aprs.apcfss.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. టాపర్లు వీరే..ప్రవేశ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్ (శృంగవరపుకోట, విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (రాళ్లపాడు, శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (భోగాపురం, అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (చిన్నయగూడెం, తూర్పు గోదావరి జిల్లా) అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.ఇంటర్మీడియట్లో..» ఎంపీసీ– బాలినేని కళ్యాణ్ రామ్ (సింగివలస, విశాఖ జిల్లా) » బైపీసీ– బొడ్డుపల్లి మనోజ్ కుమార్ (కంతేరు, రాజమండ్రి రూరల్) » ఎంఈసీ/సీఈసీ– మాదివాడ వేదాశ్రిత (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)»ఈఈటీ– దగరి సాయి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)» సీజీటీ– సరికి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా) డిగ్రీలో..» బీఏ– కోటకొండ విజయుడు (మునగాల, కర్నూలు జిల్లా)»బీకామ్– చిన్నబసప్పగారి బసవరాజు (భైరవాని తిప్ప, అనంతపురం జిల్లా)»బీఎస్సీ (కెమిస్ట్రీ)– అడపా విజయ్ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)» బీఎస్సీ (డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్)– కల్వటాల కిరీటి (ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా)» బీ.ఎస్సీ (జువాలజీ)– వంతల శ్రీకాంత్ (గాడేపల్లి, అల్లూరి సీతారామరాజు) -
దారుణంగా లాక్కొని కారులో పడేసి MPTC కల్పన కూతురు సంచలన నిజాలు
-
LIVE: జగన్ అంటే ఏంటో చూపిస్తా... వైఎస్ జగన్ వైల్డ్ ఫైర్
-
సత్యవేడు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
-
పట్టాభిపురం పిఎస్ లో సీమరాజు, కిర్రాక్ ఆర్పీపై ఫిర్యాదు
-
అక్షయపాత్ర అమరావతి ఎవరి కోసం ? పవన్ తో పాటు లోకేష్ ఫోటో కారణం ఇదేనా!
-
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పవన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. -
99 పైసలకే భూమి.. ఉర్సా భూములపై మార్గాని భరత్ షాకింగ్ నిజాలు
-
ఉర్సా భూ రచ్చపై సుప్రీంకోర్టు న్యాయవాది కామెంట్స్
-
చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్‌లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్‌ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు