Rajanna Sircilla District News
-
దేవయ్యకు గద్దర్ ఐకాన్ అవార్డు
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి చెందిన జానపద గాయకుడు ఆకునూరి దేవయ్యకు సాయి అలేఖ్య సాంస్కృతిక సేవాసంస్థ గద్దర్ ఐకాన్ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం రాత్రి ఈ పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల, అలేఖ్య సంస్థ చైర్మన్ ఉపద్రష్ట అరుణఅశోక్, ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలపై ప్రతిష్టంభన
● డిగ్రీ విద్యార్థుల్లో ఆందోళన ● పరీక్షలపై కాలేజీ యాజమాన్యాల సహాయ నిరాకరణ ● గడువు ముగిసినా పరీక్ష ఫీజులు చెల్లించని వైనం ● ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని విన్నపంసిరిసిల్లకల్చరల్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణకు ముందుకొస్తామని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు.. ముందుగా పరీక్ష ఫీజు చెల్లించండి అని యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనల మధ్య అసలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు పూర్తికాగా.. శాతవాహన పరిధిలో డిగ్రీ పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది. డిగ్రీ చివరి సెమిస్టర్ విద్యార్థులు మాత్రం తాము పోటీపరీక్షలకు అనర్హులమ వుతామని.. పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఏడాదిగా సాగుతున్న ఫీజు పోరు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడున్నరేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదు. కళాశాలల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు అప్పు చేయాల్సిన పరిస్థితులు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల్లో జాప్యంతో అధ్యాపకులకు వేతనాలు, భవనాలకు అద్దెలు, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక ప్రైవేట్ కాలేజీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు, మంత్రులకు ఎన్నో సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గత్యంతరం లేని స్థితిలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సహాయ నిరాకరణకు దిగాయి. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినా యాజమాన్యాలు యూనివర్సిటీకి మాత్రం చెల్లించలేదు. ఈమేరకు శాతవాహన వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు లేఖలు అందించారు. మే 14 నుంచి పరీక్షలు ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు విడుదల చేస్తేనే ఫీజులు చెల్లిస్తామని, అప్పటి వరకు పరీక్షల నిర్వహణకు సహకరించేది లేదని శాతవాహన ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(సుప్మా) నిర్ణయించింది. వైస్‌చాన్స్‌లర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని భావించినా పరీక్ష ఫీజు చెల్లిస్తేనే చర్చలకు అవకాశం ఉంటుందని వీసీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తే తప్ప విద్యార్థుల ఆందోళనకు తెరపడే అవకాశం లేదు. కాగా కొత్త విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ ప్రకటన విడుదల కావడం విశేషం. గత్యంతరం లేని పరిస్థితిలోనే.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వాలకు చిన్న చూపు. రేపటి తరాన్ని రూపొందించే విద్యావ్యవస్థల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం విచారకరం. అప్పులు, వడ్డీలు పెరిగిపోయి నిర్వాహకులు నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు. ఫీజులు విడుదలైతే కానీ పరీక్షలు జరగనివ్వం. – శ్రీపాద నరేశ్, సుప్మా, కార్యదర్శిప్రైవేట్ కాలేజీలు : 62 విద్యార్థులు : 50 వేలు (దాదాపు) -
రైతుల సంక్షేమమే లక్ష్యం
కోనరావుపేట(వేములవాడ): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. సభలో మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఇదివరకు మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్పూర్, రాజన్నపేట, దేవునిగుట్టతండా, గొల్లపల్లి బాకూరుపల్లి, తిమ్మాపూర్ వరకు నీటిని విడుదల చేశామన్నారు. సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 25,694 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. ఎడమకాలువ కోసం ఇప్పటి వరకు 70 ఎకరాలు సేకరించామని, మరో 70 ఎకరాలు భూసేకరించనున్నట్లు ప్రకటించారు. ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ధ్రుడ సంకల్పంతో ఉందన్నారు. కోనరావుపేట మండలం ధర్మారంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికే రూ.30లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు మంజూరు చేశామన్నారు. మహిళలు ముందుకొస్తే మండలానికో రైస్‌మిల్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మల్కపేటలో మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కుటుంబీకులు నిర్మించిన రామాలయాన్ని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నీటిపారుదలశాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, ఈఈ కిశోర్, డీఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, డీఆర్డీవో శేషాద్రి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు, ఏఈలు సురేశ్, శ్రీశైలం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల -
అడవిని చూసొద్దాం
● సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పిల్లల సందడి ● వేసవిలో సందర్శనీయ ప్రాంతం ● అడవిపై అవగాహన.. జంతువుల సందర్శన ● ఆసక్తి చూపుతున్న విద్యార్థులుసిరిసిల్ల: విద్యార్థులకు అడవిని పరిచయం చేయడం.. ఫారెస్ట్ ద్వారా కలిగే లాభాలు వివరించడం.. జంతువులను చూడడం.. వీటన్నింటికీ సిరిసిల్ల అర్బన్ ఫారెస్ట్ పార్క్ వేదికగా నిలుస్తోంది. 125 ఎకరాల్లో రూ.6కోట్ల ప్రతిపాదనలతో పనులు ప్రారంభించగా.. సుమారు రూ.2కోట్లతో చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ శివారులో కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకుని ఫారెస్ట్ పార్క్ ముఖద్వారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అర కిలోమీటరు అడవిలోకి వెళ్లగానే.. పిల్లలకు ఆట వస్తువులు, చెరువులో వంతెన.. ఊయలలు, నీటి కొలనులను ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో ఎండిన అడవి కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మేత కోసం వచ్చే వన్యప్రాణులను దూరం నుంచే చూడవచ్చు. ఫారెస్ట్‌లో పిల్లల సందడి అర్బన్ ఫారెస్ట్‌పార్క్‌లో ఇటీవల సిరిసిల్లలోని ఓ ప్రైవేటు పాఠశాల పిల్లలు సందడి చేశారు. పార్క్‌ను సందర్శించి అడవి అందాలను ఆస్వాదించారు. అడవిలోని వివిధ రకాల చెట్లు, వన్యప్రాణులు, వాటి లక్షణాలు తెలుసుకున్నారు. సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులు, అడవి వాటి ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. వర్షాకాలంలో పచ్చగా ఉండే అటవీ అందాలు మరింత కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఆకులు ఎండి, నీరు అడుగంటి బోసిపోయి ఉంది. అయినా పిల్లలను ఆకర్షిస్తోంది. -
భగీరథ మహర్షికి నివాళి
సిరిసిల్ల: భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నివాళి అర్పించారు. కలెక్టరేట్లో ఆదివారం బీసీ సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి జరి గింది. మహర్షి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పూలమాలలు వేశారు. బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజమనోహర్‌రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. బలోపేతమవుతున్న ప్రభుత్వ బడులు ● మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లోని పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గాలిపల్లిలో ఉపాధి హామీ కింద రూ.20లక్షలతో చేపట్టే సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు గుర్రం సందీప్‌రెడ్డి, డీఈ సత్యనారా యణ, ఏఈ నాగరాజు, ఎంఈవో శ్రీనివాస్ గౌడ్, నాయకులు వెంకటరమణారెడ్డి, పాశం రాజేందర్‌రెడ్డి, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు. అబద్దాలతో మోసం చేయలేరు ● కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ సిరిసిల్లటౌన్: అబద్దాలతో ప్రజల మనస్సులను బీజేపీ నేతలు గెలువలేరని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 85,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కానీ బీజేపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు దొందూ దొందేనని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మంచి పథకాలపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, గడ్డం కిరణ్, అన్నల్దాస్ భాను, వంతడ్పుల రాము, అడ్డగట్ల శంకర్, మేకర్తి నారాయణ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ముస్తాబాద్ మండలం బందనకల్‌లో ఆదివారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే పనిలో ఉందన్నారు. దేశభద్రత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. పదకొండేళ్లుగా అత్యంత సురక్షిత దేశంగా భారత్ ఎదిగిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, నాయకులు కస్తూరి మహిపాల్‌రెడ్డి, కరెడ్ల రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కల్యాణ్, మహేశ్, కార్తీక్‌రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, గోపి తదితరులు ఉన్నారు. -
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు’
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్లలో నేతన్నల బలవన్మరణాలు జరుగుతున్నాయని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సుందరయ్యనగర్‌కు చెందిన పవర్లూమ్ అనుబంధ కార్మికుడు బత్తుల విఠల్ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి మాట్లాడారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి, ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారుల అలసత్వంతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నిరంతరం ఉపాధి, మెరుగైన కూలీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ ఆర్డర్‌కు కార్మికుల కూలి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఇప్పటికే దాదాపు 16 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నేతకార్మికులకు కూలి నిర్ణయించాలని, పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2023 సంవత్సరం 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిమల్ల సత్యం, బాస శ్రీధర్ పాల్గొన్నారు. -
ఓపెన్ సిట్టింగ్
సిరిసిల్ల: జిల్లాలో మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు, రాజీవ్‌నగర్, చిన్నబోనాల, చంద్రంపేట, రెండోబైపాస్ రోడ్డు ప్రాంతాలు సాయంత్రం అయితే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు మందుబాబుల కనిపిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. మరికొందరైతే ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడే మందుబాటిళ్లతో సిట్టింగ్ పెడుతున్నారు. ప్రధానంగా కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణం శివారు కాలనీలో ఈ పరిస్థితులు ఉన్నాయి. చంద్రంపేట బస్టాండ్‌కు సమీపంలోనే ఓ బెల్ట్‌షాపులో ఓపెన్‌గానే మద్యం సిట్టింగ్‌లు పెడుతున్నారు. పెద్దూరు శివారులో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్జోరు మండల కేంద్రాల్లో వైన్‌షాపులకు అనుబంధంగా సిట్టింగ్ రూమ్స్ ఉండగా.. గ్రామాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లోనూ బార్లను తలపించేలా సిట్టింగ్‌లు ఉంటున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులు ఎక్కువ మందు విక్రయించుకునేందుకు మందుబాబుల కోసం టేబుళ్లు, కుర్చీలు, కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది వరకు అనధికారిక బెల్టుషాపులు ఉన్నాయి. ప్రతీ షాపులో రోజుకు తక్కువకు తక్కువగా రూ.10వేల వరకు మందు విక్రయిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో అనధికారికంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్, కొండాపూర్ గ్రామాల్లో అయితే అర్ధరాత్రి సైతం బెల్టుషాపుల్లో మందుబాబులు కనిపిస్తున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని చెరువుకట్టలే అడ్డాలుగా మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా మందుబాబులు మారడం లేదు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం గ్రామ శివారులు, వాగులే అడ్డాలు దాడులు చేస్తున్నా ఆగని మందుబాబులు -
బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో ఉన్న చేతిపంపు పని చేయడం లేదని, ఆప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారని మార్చి 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఎంపీడీవో జయశీల చేతిపంపును బాగు చేయించారు. అధికారులు త్వరగా స్పందించారు బోయినపల్లి ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో బోరు చేడిపోయింది. మా సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంపీడీవో ఆదేశాలతో బోరుకు మరమ్మతు చేశారు. మా ఏరియా ప్రజలకు నీటి కొరత తీర్చిన ‘సాక్షి’కి సలాం. – మాడిచెట్టి శ్రీనివాస్, బోయినపల్లి -
ప్రాణం మీదికి తెచ్చిన మామిడికాయ వక్క
● ఊపిరాడక తల్లడిల్లిన బాలుడు పాలకుర్తి(రామగుండం): మామిడికాయ వక్క గొంతులో ఇరుక్కుని బాలుడు ఊపిరాడక నరకయాతన అనుభవించిన ఘటన శనివారం పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ పదినెలల వయసు ఉన్న బాలుడు ఇంట్లో మామిడివక్క మింగాడు. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడలేదు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బైక్‌పై పెద్దపల్లికి తరలిస్తూ కన్నాల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఎదురుగా 108 వాహనం రావడంతో అందులో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ఎయిర్వేను కొంతమేర క్లియర్ చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. పెద్దపల్లిలో పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందంటూ కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో మరో అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై సోషల్‌మీడియాలో విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి. చికిత్స పొందుతూ యువకుడు మృతిసైదాపూర్(హుస్నాబాద్): నాలుగేళ్ల ప్రాయంలో ఊహ తెలియక ముందే తల్లిదండ్రులను కోల్పోయాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. నా అనే వారు ఎవరూ లేరు. ఒంటరి తనం, అనారోగ్యం భరించలేక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన అనగోని సంపత్–సుజాత దంపతుల కుమారుడు వికాస్(27). నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి తాత, నాన్నమ్మ లక్ష్మయ్య, లక్ష్మి వద్ద పెరిగాడు. హుస్నాబాద్‌లోని ఓ షాపులో పని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. ఒంటరితనం, అనారోగ్యంతో ఐదురోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. -
ప్రాణం తీసిన మామిడికాయలు
● చెట్టు పైనుంచి పడి వృద్ధుడు మృతి గోదావరిఖని: మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో నివాసముంటూ వండ్రంగి పనులు చేస్తున్న నాగవెల్లి బాలయ్య(70).. శనివారం ఉదయం తన ఇంటి వెనకాల ఉన్న మామిడి కాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. కర్రతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా బాలయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలయ్యకు భార్య నాగవెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పింఛన్ డబ్బు కోసం బ్యాంక్‌కు వస్తే, వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. స్థానికుల వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు రమావత్ బాల్య పింఛన్ డబ్బుల కోసం గొల్లపల్లిలోని బ్యాంక్‌కు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాల్య అపస్మారక స్థితికి వెళ్లాడు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లో చీమల తిరుపతిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాలు.. 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ నిందితులు. బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తుందని రాజీ పడదామని ప్రధాన నిందితుడు తిరుపతిని రాజశేఖర్, రాకేశ్ కోరారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. తిరుపతిని హత్య చేస్తే గతంలోని హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈనెల 2న తిరుపతి నడుపుతున్న ఆన్లైన్ సెంటర్‌కు రాజశేఖర్, రాకేశ్ వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. శనివారం నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
కలిసుంటామని కడతేర్చాడు
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. ఇరవై ఏళ్ల క్రితం వివాహం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చే స్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇరవై రోజుల క్రితం పంచాయితీ తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురిపై కేసు -
ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొ త్త కల్వర్టు ప్రమాదకరంగా ఉండడం, ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించకపోవడంతోపాటు కనీ స ం రోడ్డుకు సమానంగా మట్టి కూడా పోయలేదు. దీంతో ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. ఈ సమస్యపై మా ర్చి 21న ‘సాక్షి’లో కథ నం ప్రచురించగా, బల్దియా కమి షనర్ జె.అరుణశ్రీ స్పందించారు. మార్చి 25న కల్వర్టును పరిశీలించి యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. కృతజ్ఞతలు ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ము న్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించారు. పనులు ప్రారంభించారు. 33వ డివిజన్ పరిధిలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మద్దెల దినేశ్, ఫైవింక్లయిన్ ఏరియా, గోదావరిఖని -
అడ్డు తొలగింది.. రోడ్డు పడింది
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీ నుంచి సిరిసిల్ల బైపాస్ (ఎన్టీఆర్ చౌరస్తా) వైపు వచ్చే రోడ్డు ముగింపు వద్ద పనులు అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ పోల్, లైన్లు అడ్డుగా ఉండడంతో పూర్తి చేయలేదు. సీసీ రోడ్ ఎత్తుగా, ఆర్అండ్బీ మెయిన్ రోడ్ దిగువన ఉండడం, కిందినుంచి నాలా వెళ్తుండడంతో, రెండింటికీ కనెక్టివిటీ లేక సీసీ రోడ్డు చివరలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాత్రివేళ వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేవారు. ఓ వ్యక్తి అందులో శవమై తేలాడు కూడా. ఏళ్ల తరబడి సమస్య అలానే ఉండడంతో అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మార్చి 12న ‘సాక్షి’ ద్వారా వెలుగులోకి తీసుకురాగా, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పందించారు. ట్రాన్స్‌కో అధికారులతో పలు మార్లు చర్చలు జరపడంతో, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చి 27న తొలగించారు. దీంతో సీసీ, మెయిన్‌రోడ్డులను కలుపుతూ కల్వర్ట్ నిర్మించి, రోడ్డు వేయడంతో సమస్య పరిష్కారమైంది. ధన్యవాదాలు మా కాలనీవాసులు నిత్యం ఎదుర్కొనే సమస్యను పరి ష్కరింపచేసిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. సీసీ రోడ్డు ను ఆర్అండ్బీ రోడ్డుకు కలపకపోవడం, కింద నాలా ఉండడంతో ఆ గొయ్యిలో చాలా మంది పడి గాయపడ్డారు. ‘సాక్షి’ ‘వాట్సప్ చేయండి’ శీర్షికలో మా కాలనీ వ్యక్తి రాము సమస్యను తెలియచేయడంతో అధికారులు స్పందించి వైర్లు, పోల్‌ను తొలగించి రోడ్డు వేశారు. – లోకేందర్రావు, అలకాపురికాలనీ, కరీంనగర్ -
వాహనాలు పార్కింగ్ వీడాయి
జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో చేపల మార్కెట్ లోపల వాహనాలు పార్క్ చేస్తుండటంతో కొనుగోలుదారులు నిలబడటానికి స్థలం లేకుండాపోయింది. ఈ సమస్యపై మార్చి 19న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. చేపల మార్కెట్ నుంచి వాహనాలు తొలగించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి వాహనాలను తొలగింపజేశారు. కాగా, వాహనాల తొలగింపుతో మార్కెట్లో సౌకర్యవంతంగా ఉందని, తక్షణమే స్పందించిన బల్దియా సిబ్బందితో పాటు వార్త ప్రచురించిన ‘సాక్షి’కి కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. -
పత్తి రైతుపై విత్తన భారం
● ఐదేళ్లలో ప్యాకెట్‌పై రూ.200 పెంపు ● ఈ ఏడాది పెరిగిన రూ.37 ● జిల్లాలో 44వేల ఎకరాలకు పైగా సాగు ● జిల్లా రైతులపై ఏటా రూ.అర కోటి భారంచందుర్తి(వేములవాడ): పత్తి రైతులకు విత్తనాలు భారంగా మారుతున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచుతుండడం రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో పత్తి మద్దతు ధర గురించి పట్టించుకోవడం లేదు. విత్తన ధరలు పెంచిన ప్రభుత్వం మద్దతు ధర సైతం పెంచాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో 450 గ్రాముల పత్తి ప్యాకెట్ రూ.864 ఉండగా.. ప్రస్తుతం ప్యాకెట్ ధరను రూ.901కి పెంచింది. ఎకరానికి మూడు ప్యాకెట్లు వినియోగిస్తే ఏటా అదనంగా రూ.111 భారంగా మారుతుంది. ఇలా జిల్లాలో 44 వేల సాగు అవుతుండడంతో రైతులపై ఏటా రూ.50లక్షలకు పైగానే ఆర్థిక భారం పడుతుంది. గిట్టుబాటు ధర అంతంతే.. జిల్లాలోని 2.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. వరి 1.74లక్షల ఎకరాలు, పత్తి 44,650 ఎకరాలు, మిగతా మొక్కజొన్న, కందులు 7వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. గత మూడేళ్లుగా అధిక వర్షాలు పడుతుండడంతో పత్తికి తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుండడం, తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందులతో వ్యయం పెరిగిపోతుంది. ఒకప్పుడు ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ప్రస్తుతం 6 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రస్తుతం సీసీఐ గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,521 పెడుతుంది. నాణ్యత లేదనే సాకుతో రూ.7,421లకే కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.6,300 నుంచి రూ.6,500 వరకే కొంటున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం విత్తనాల ధరతోపాటు ఎరువులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని తగ్గించడంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏకంగా రూ.360 నుంచి రూ.700 వరకు పెరిగాయి. ఇదే సమయంలో పత్తి ధరను మాత్రం క్వింటాల్‌కు రూ.310 మాత్రమే పెంచింది. వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగడంతో ఇంధన ఖర్చు సైతం పెరిగింది. లూజ్ విత్తనాల వైపు రైతు చూపు కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలను పెంచడంతో రైతులు లూజ్ పత్తి విత్తనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు లూజ్ పత్తి విత్తనాలను ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విత్తనాలను కిలోకు రూ.550 నుంచి రూ.700 ధరకు విక్రయిస్తుండడంతో వీటిపైనే రైతులు దృష్టి సారిస్తున్నా రు. కంపెనీ విత్తనాలు అయితే ఎకరాకిని రూ.3,604 ఖర్చు అవుతుండడంతో రైతులు భారంగా భావిస్తూ లూజ్ విత్తనాలు కొంటున్నారు. పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు 2019 రూ.7102020 రూ.7302021 రూ.7672022 రూ.8102023 రూ.8532024 రూ.8642025 రూ.901విత్తనాల ధరలు తగ్గించాలి రైతులకు సాగు ఖర్చు ఏటా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించడంతో ఎరువుల ధరలు పెరిగాయి. పత్తి విత్తనాల ధరలు పెరుగుతుండడంతో ఏటా భారం పెరుగుతోంది. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ పెంచడం సాధ్యం కాకపోతే కనీసం పంటలకై నా గిట్టుబాటు ధరలు పెంచి ఆదుకోవాలి. – కటకం చంద్రయ్య, బండపల్లి -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
సిరిసిల్ల: విద్యార్థులు పక్కా ప్రణాళిక చదివి ఉన్నత స్థానాలకు చేరాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకాంక్షించారు. పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం అభినందించారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్‌స్కూల్ విద్యార్థులు విష్ణుప్రియ 580, విగ్నారెడ్డి 573, వైష్ణవి 553, అలేఖ్య 551 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ స్కూల్ విద్యార్థులు సాయిహర్షిత్ 573, భానుతేజ 562, నవజీత్ 561, సుశత 558, కావ్య 545, మైత్రి 531, భవ్య 535 మార్కులు సాధించారు. సీపీవో శ్రీనివాసాచారి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు పాల్గొన్నారు. పేదలకు ఆర్థిక సాయం అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మూడు పేద కుటుంబాలకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం ఆర్థిక సహాయం అందించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌కు చెందిన దాసరి మల్లవ్వ, కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన కుమ్మరికుంట కళావతి, వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన సింగం నర్సయ్య అనారోగ్యంతో ఉన్నామని, ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. చలించిన కలెక్టర్ శనివారం ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున చెక్కులు అందించారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు అభినందనలు -
నెరవేరుతున్న ప్ర‘జల’ ఆశలు
సిరిసిల్ల: మెట్టప్రాంత రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామనే పాలకుల ఐదు దశాబ్దాల హామీ కార్యరూపం దార్చుతోంది. ఈ ప్రాంత ప్ర‘జల’ ఆశలు నెరవేరుతున్నాయి. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 12 గ్రా మాలకు సాగునీటిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈమేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలాల్లోని బీడు భూములను తొలిసారి గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. కాల్వలను శుభ్రం చేసి కోనరావుపేట కనగర్తి–సుద్దాల గ్రామాల మధ్య కాల్వలో పేరుకుపోయిన మట్టిని నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల తొలగించారు. మల్కపేట రిజర్వాయర్ నీరు వేములవాడ అర్బన్ మండలం మారుపాక వెళ్లేలా పైపులైన్ పూర్తి చేశారు. మధ్యమానేరు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని, సొరంగంలో కాంక్రీట్ లైనింగ్ పనులు, సర్జిపూల్, పంప్‌హౌస్, డెలివరీ పైపులైన్ పూర్తి చేసి మల్కపేట రిజర్వాయర్‌లో ఒక్క టీఎంసీ నీటిని నింపినట్లు తెలిపారు. మల్కపేట నుంచి కెనాల్ ద్వారా మై సమ్మ చెరువు వరకు నీటిని విడుదల చేశామన్నారు. కాళేశ్వరం–9 ప్యాకేజీలో ఎత్తిపోతలు కాళేశ్వరం–9 ప్యాకేజీలో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు వరకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు మూడు టీఎంసీల సామర్థ్యంతో మల్కపేట రిజర్వాయర్ నిర్మించారు. మల్కపేటకు మధ్యమానేరు నుంచి ఇప్పటికే నీరు వస్తుంది. ప్రస్తుతం మల్కపేట నుంచి కుడికాల్వ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళ్లపల్లి, వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేయనున్నారు. మల్కపేట కుడికాల్వ సామర్థ్యం 350 క్యూసెక్కులు కాగా.. 25,654 ఎకరాలకు సాగునీరు అందించనుంది. ఎత్తిపోతలపై ‘సాక్షి’ ఎన్నో కథనాలు జిల్లాను సస్యశ్యామం చేసే గోదావరి జలాల ఎత్తిపోతల పథకం పనులపై ‘సాక్షి’ అనేక సందర్భాల్లో గ్రౌండ్ రిపోర్టును అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురించింది. 2013లోనే ఈ పథకానికి అప్పటి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రగుడు వద్ద శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పథకంగా నామకరణం చేసి పనులు ప్రారంభించగా.. ఆ పేరును కాళేశ్వరం–9వ ప్యాకేజీగా మార్చి పనులు చేశారు. సొరంగం పనులు, రిజర్వాయర్ పనులు పూర్తయినా బ్యాలెన్స్ పనులను, ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేయించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తి చేయించారు. దశాబ్దాల నాటి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చింది. ‘ఎత్తిపోతల’కు కార్యరూపం ‘మల్కపేట’ నుంచి నేడు నీటి విడుదల విడుదల చేయనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
తుప్పు పడుతున్నాయి
ఇది ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన ట్రాక్టర్. ఠాణాలో స్థలాభావంతో బయ ట నిలుపుతున్నారు. పట్టుకున్న పెద్ద వాహనాల (లారీలు, ట్రాక్టర్లు, జీపులు)ను ఇలా ఠాణా బయట ఉంచుతున్నారు. వీటిపై పోలీసులు నిఘా పెట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు వాటి భాగాలను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రికవరీ చేసుకునే సమయంలో అన్ని పార్టులు లేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పటికే కోర్టు ద్వారా అనుమతులు పొందడ ఆలస్యం కావడం, మళ్లీ కొత్త పార్ట్స్ కొనడం ఇబ్బందిగా మారుతుంది. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ వాహనాలు ఠాణాల్లోనే తుప్పుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని పోలీస్స్టేషన్లలో పట్టుబడ్డ వాహనాలు 550 వరకు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, కలప రవాణా, నాటుసారా తరలింపు, సరైన ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. కేసు విషయంలో కోర్టు వరకు పోవడం.. అక్కడ తీర్పు వచ్చే వరకు జాప్యమవుతుండడంతో ఠాణాల్లోనే వాహనాలు పాడవుతున్నాయి. కొన్ని ఠాణాల్లోని ఆవరణలో స్థలం లేక సీజ్ చేసిన వాహనాలను బయట మైదానంలో నిలుపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను ఎత్తుకెళ్తున్నారు. పట్టుకున్న వాహనాలపై పోలీసుల నిఘా లేకపోవడంతో విడిభాగాలు మాయమవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిమానాలు.. ఆపై పార్ట్స్ మాయం వాహనాలు పట్టుబడ్డ సమయంలో పోలీసులు కేసు నమోదు చేస్తుండడంతో బాధితులు కోర్టుకు వెళ్తున్నారు. అక్కడ జరిమానాలు చెల్లిస్తూ తమ వాహనాలను విడిపించుకుంటున్నారు. ఇదే సమయంలో ఠాణా పరిధిలో ఉన్న కొన్ని వాహనాల పార్ట్స్ మాయమవుతుండడంపై వాహన యజ మానులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవి కొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాహన యజమానులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఠాణాల్లోనే వాహనాలు వివిధ కేసుల్లో పట్టుబడుతున్న వాహనాలను కొందరు యజమానులు తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. సారాయి తరలింపు, ప్రమాదాలు జరిగిన సమయంలో తుక్కుతుక్కయిన వాహనాలను రికవరీ చేసేందుకు వాహన యజమానులు ముందుకురావడం లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 550 వాహనాలు ఠాణాల్లోనే ఉంటున్నాయి. కొన్ని వాహనాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. కేవలం ఎకై ్సజ్‌శాఖలో పట్టుబడ్డ వాహనాలను మాత్రమే అప్పుడప్పుడు వేలం వేస్తున్నారు. పోలీస్ అధికారులు పట్టుకున్న వాహనాలను వేలం వేయడం లేదు. పోలీస్ అధికారులు ముందుకొచ్చి వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. ఠాణాల్లోనే వాహనాలు పట్టుకున్న వాహనాలపై నజర్ కరువు మాయమవుతున్న పార్ట్స్ ఆందోళనలో వాహనదారులు జిల్లాలో పట్టుబడ్డ వాహనాలు 550 -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వేములవాడఅర్బన్: ఆస్పత్రికొచ్చే రోగులకు అన్నిరకాల నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులతో శనివారం సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లకు పైగా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓపీ సేవల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. మోకాళ్ల సర్జరీలు విజయవంతంగా పూర్తి చేయడంపై వైద్యులను అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య, వైద్యుడు సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంతో కలసిరండి వేములవాడ: ప్రజా ప్రభుత్వంతో కలిసిరావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మంది శనివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పారు. కులగణన చేపట్టి దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దీక్షలో కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. -
కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం ప్రెస్మీట్లో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి కులగణన చేయలేదని విమర్శించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, గజభీంకార్ చందు, కొండ నరేశ్, చొప్పదండి శ్రీనివాస్, దుమాల శ్రీకాంత్, వంతడుపుల సుధాకర్, సిరిసిల్ల వంశీ, మోర శ్రీహరి, ఊరగొండ రాజు, గుడ్ల విష్ణు పాల్గొన్నారు. వాహనపత్రాలు వెంట ఉంచుకోవాలి ● జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్ బోయినపల్లి(చొప్పదండి): వాహనాల పత్రాలను వెంట ఉంచుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వంశీధర్ పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక చౌరస్తాలో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించిన లైసెన్స్‌లు పరిశీలించారు. డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. కండక్టర్ లైసెన్స్ లేని రెండు ఆర్టీసీ బస్సుల కండక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సరైన వాహన పత్రాలు లేని మూడు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. పీసీలు సౌమ్య, ప్రశాంత్, హోమ్‌గార్డు ఎల్లయ్య ఉన్నారు. సమ్మె నోటీస్ అందజేత సిరిసిల్లటౌన్: సార్వత్రిక సమ్మె నోటీస్‌లను జిల్లా అధికారులకు అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలలో 29 చట్టాలను మార్చి 4 కోడ్లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు కడారి రాములు, అన్నల్దాస్ గణేష్, గొట్టె రుక్మిణీ, వెంగల శ్రీనివాస్, చిట్యాల మధు పాల్గొన్నారు. వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంవేములవాడ: కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి జూన్ 6 వరకు వేములవాడలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం ప్రకటనలో తెలిపా రు. 13 నుంచి 23 సంవత్సరాల్లోపు బా లురు, బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 3 వరకు ఆసక్తి గల వారు పేర్లు నమో దు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 91772 59935లో సంప్రదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ● బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరేందర్ సిరిసిల్ల: స్థానిక సంస్థలకు 14 నెలలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారి త సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ విమర్శించారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ద్వారా పల్లెలకు విడుదల కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చే శారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక.. నిధులు రాక పల్లెల్లో వసతులు కరువయ్యాయని పే ర్కొన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రం నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టండి
● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ● అనంతారంలో ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’కు స్పందనఇల్లంతకుంట: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆన్‌వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పొందాలంటే కేవైసీ చేయించాలన్నారు. అనంతారంలో గతంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్నవారు సంబంధిత అధికారులతో ఎంబీ రికా ర్డు చేయించుకుంటే నిధులు మంజూరు అవుతాయ ని తెలిపారు. గ్రామంలో లూజ్‌వైర్లను సరి చేయాలని సెస్ ఏఈ నగేశ్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అనంతారం బిక్కవాగుపై నిర్మించిన బ్రిడ్జి పూర్తి చేసేందుకు రూ.44లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సీసీరోడ్లకు రూ.25లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమిపూజ జూన్ 5వ తేదీన అనంతారం నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే.భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సుదర్శన్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తహసీల్దార్ ఎంఏ.ఫారూఖ్, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు. -
ధూప, దీపాలకు వేళాయె
● ఆలయాలకు ఆర్థిక సాయానికి కొత్త దరఖాస్తులు ● ఉమ్మడి జిల్లాలో 900వరకు ఆలయాలు ● చిన్న ఆలయాలకు రెండు మూడు నెలలకోసారి వేతనాలు ● గౌరవ భృతి పెంచాలని డిమాండ్ ● ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కావాలంటున్న అర్చకులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆలయాల్లో ధూప, దీపాలకు వేళయింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు ధూపదీప నైవేద్యాల (డీడీఎన్స్కీమ్) పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికయిన ఆలయానికి ప్రతినెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందులో రూ.4000 ధూపదీప నైవేద్యాలకు, మిగిలిన రూ.6000 కింద గౌరవ భృతి కింద చెల్లిస్తారు. ఈ పథకం కోసం ఈనెల 24వరకు దరఖాస్తులు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం నిబంధనలు రూపొందించి, ఆ మేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆలయం నిర్మాణమై కనీసం 15ఏళ్లు అయి ఉండాలని ప్రాథమిక నిబంధన విధించారు. వీటితోపాటు దరఖాస్తు ఫారంలో మిగిలిన నిబంధనలు పొందుపరిచారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవభృతి పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా కల్పించాలని అర్చకులు కోరుతున్నారు. వైఎస్ హయాంలో మొదలై 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం రూపుదిద్దుకుంది. అప్పట్లోఽ ధూపదీప నైవేద్యాల కోసం రూ.2500 చొప్పున ఆనాటి ఖర్చులకు అనుగుణంగా చెల్లించేవారు. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాల మాదిరిగానే ఈ పథకం కూడా రాష్ట్రం విడిపోయినా కొనసాగుతుండటం గమనార్హం. రూ.2500 నుంచి క్రమంగా ఆర్థికసాయం రూ.10,000కు చేరుకుంది. ధూపదీప నైవేద్యాల ఖర్చులకు 2018లో ఈ మొత్తం రూ.6000గా నాటి సీఎం కేసీఆర్ పెంచారు. తరువాత రూ.10,000 పెంచుతూ జీవో విడుదల చేసినా.. ప్రస్తుత సీఎం రేవంత్ హయాంలో అమలవుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. అదే సమయంలో పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని పలువురు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 2022లో ప్రతీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత నోటిఫికేషన్ వచ్చింది. ధూపదీప నైవేద్యాల కింద ఉమ్మడి జిల్లాలో 898 ఆలయాలు ఈ పథకం కింద నెలనెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్ల కాలంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మరో వంద వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ధూప, దీప నైవేద్యం పథకం కింద ఆలయాలు ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం కరీంనగర్ 118 71 67 256జగిత్యాల 153 67 102 322పెద్దపల్లి 64 40 49 153రాజన్నసిరిసిల్ల 83 36 48 167 -
ఈఎస్ఐ, బీమా కల్పించాలి
ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఈఎస్ఐ, ఆరోగ్య బీమా పథకాలను వర్తింప జేయాలి. ఈఎస్ఐ కూడా మాకు అమలు చేస్తే.. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. వీటితోపాటు పేద అర్చకులకు ఇండ్ల నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాం. – నాగరాజ్ శర్మ, డీడీఎన్ స్కీం అధికార ప్రతినిధి వేతనాలు పెంచాలి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్చకుల బాధలను తెలుసుకొని అర్చకులకు వేతనం కల్పించాలని ఉద్దేశంతో డీడీఎన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్చకుల బాధని అర్థం చేసుకొని డీడీఎన్ అర్చకులకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – రామకృష్ణమాచార్యులు, జిల్లా అర్చక సంఘం అధికార ప్రతినిధి -
ఎండతో అప్రమత్తంగా ఉండాలి
● వడదెబ్బ లక్షణాలుంటే.. ఆస్పత్రికి వెళ్లండి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: ఎండలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. చిన్నారులు, వయోవృద్దులతో ప్రయాణం శ్రేయస్కరం కాదని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇంటి నుండి బయటికి వస్తే తలకు ఎండ తగలకుండా గొడుగు, కండువా,టోపితో కవరు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు కూలీలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటలు వరకు పనులు చేపించాలని, పనులు జరుతున్న ప్రదేశాల్లో రక్షణ, జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూభారతిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి వీసీలో సమీక్షించారు. ఈ నెల 5 నుంచి మే 20 వరకు జిల్లాలో ఒక్క మండలాన్ని పైలెట్‌గా తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఆ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షలపై జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాలను ముందుగా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన మేర పోలీస్ భద్రత కల్పించాలని అన్నారు. ప్రశ్న పత్రాలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూం వద్ద సీసీటీవీ ఉండాలని, పోలీస్ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల గేటు మధ్యాహ్నం 1.30 గంటలకు మూసి వేయాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని, బయో మెట్రిక్ అటెండెన్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు. -
రాహుల్ ఆలోచనే సకల కులగణన
సిరిసిల్లటౌన్: భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్‌గాంధీ సంకల్పించిన జనగణనలో కులగణన ఆలోచన విధానమే దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని టీపీసీసీ పరిశీలకుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంంలో మాట్లాడారు. కులగణనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా న్యాయం జనగణన ద్వారా కులగణన చేపట్టడంతో సాధ్యమైతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులగణన పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎం.డి. హమీద్, వెంగళ అశోక్, నేరెళ్ల శ్రీకాంత్, నీలి రవిందర్, గుజ్జె రమేష్, అడ్డగట్ల శంకర్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. మందుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి ● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, చీర్లవంచ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్సీడీ, టీబీ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆమె కోరారు. ఆస్పత్రి రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆమె వెంట సీహెచ్‌వో బాలచంద్రం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. తంగళ్లపల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ పీహెచ్సీ, చీర్లవంచ పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు, మందులు పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. సీహెచ్‌వో బాలచంద్రం, సిబ్బంది పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా చట్టాలు బోయినపల్లి: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలు ఎత్తివేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక హైస్కూల్ మైదానంలో శుక్రవారం సీపీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల పొట్ట గొడుతున్నారని ఆరోపించారు. ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మీసం లక్ష్మణ్, మండల కార్యదర్శి లింగాల వెంకటి, కొండ నాగరాజు, కొత్తూరు నర్సయ్య, ఎల్లయ్య, కొమురవ్వ, మల్లయ్య, శంకరయ్య, అంజయ్య, వీరయ్య, పూజ, పోచయ్య, వెంకయ్య, దుర్గయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్‌లో ఉచిత శిక్షణ సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన వందమంది యువతకు సివిల్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి ఎం. ఏ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 040–23236112 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
చివరి గింజ వరకు కొంటాం
కోనరావుపేట: రైతులు పండించిన ఆఖరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వేమువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా వడ్ల కొనుగోలు జరుగుతోందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని తీసుకుని వస్తే వెంటనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం సేకరించి మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం తాలుతప్ప పేరుతో నిలువునా మోసం చేసిందని రైతులు విప్ దృష్టికి తెచ్చారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దర్శావళి ఉత్సవాలకు రావాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారులో గల దర్శావళి దర్గా ఉత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతో పాటు జిల్లా అధికారులకు శుక్రవారం ఉత్సవ నిర్వాహకులు అజీజ్‌బాయి, కాంగ్రెస్ నాయకులు ఆహ్వానం పలికారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలను వారి కార్యాలయాల్లో కలిసి ఉత్సవ ఆహ్వానపత్రికలను అందజేశారు. అనంతరం సిరిసిల్లలో గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌కు అందించారు. ఈ నెల 15న ఉర్సు ఉత్సవాలు ఉంటాయని, అదే రోజు మండల కేంద్రం నుంచి దర్శావళి దర్గా వరకు సందల్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుందని నిర్వహకులు అజీజ్‌బాయి తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ -
ప్రైవేట్ వల
శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025నోటిఫికేషన్ రాలేదు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు జారీచేసే నోటిఫికేషన్‌ను బట్టి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికై తే డిగ్రీ తరహా దోస్త్ ఆన్లైన్ విధానం లేదు. ఉన్నతాధికారులు ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయి. – శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి విద్యార్థుల చుట్టూ తిరుగుతున్న కాలేజీల నిర్వాహకులుగంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంటర్ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తిరుగుతున్నారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఇళ్లకు వచ్చి తమ కాలేజీలో చేరితే జేఈఈ మెయిన్, నీట్ ర్యాంక్‌లు పక్కా వస్తాయంటూ ఆశలు చూపి అడ్మిషన్లు తీసుకునేలా చేస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసమంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నా రు. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరుతున్న పిల్లల సంఖ్య ఏటా తగ్గిపోతుంది. పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరుతుంటే.. అంతంతే మార్కులు వచ్చిన వారు స్థానికంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో చేరుతున్నారు. ఫలితంగా ఇంటర్లో ఫలితా లు తగ్గిపోతున్నాయి. ఇంటర్మీడియట్ ప్రవేశాలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు పల్లెల్లోకి వచ్చి విద్యార్థుల ప్రవేశాలు తీసుకుంటున్నారు. ఆర్థిక దోపిడీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే కా ర్పొరేట్ కళాశాలల పీఆర్వోలు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని కళాశాలలు వారు విద్యార్థుల నుంచి కొంత ఫీజులు తీసుకొని అడ్మిషన్లు కూడా ఇచ్చేశారు. కళాశాలలు ప్రారంభమైన తర్వాత బోధన విధానం, హాస్టల్లో ఫుడ్, ఇతర ఏ అంశంలోనైనా నచ్చక విద్యార్థి ఇంటికి తిరిగొస్తే ఫీజు తిరిగి ఇవ్వరు. ఒక వేళ ఇచ్చినా ఎంతో కొంత కట్ చేసుకునే ఇస్తారు. డిగ్రీ దోస్త్ తరహాలో ఇంటర్‌లోనూ ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ఇలాంటి ఇబ్బందులకు అవకాశం ఉండదని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. ‘ప్రైవేట్’ ఒత్తిడికి చెక్ పడేదెప్పుడో.. ఇంటర్ ప్రవేశాల్లో దోస్త్ తరహా ఆన్లైన్ విధానం అమలైతే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మేలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకునే వీలుంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇంటర్లో సీట్ల కేటాయింపులు జరిగితే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో చదివే అవకాశం లభిస్తుంది. ‘ఆన్లైన్’ అంతేనా..? ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్‌లో విద్యార్థుల ప్రవేశాల కోసం పాత విధానాన్నే అమలు చేయనున్నారు. తొలుత డిగ్రీ మాదిరిగా శ్రీదోస్త్శ్రీ తరహా విధానం అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు భావించింది. కానీ అమలు ప్రస్తుతం వీలు కాదని బోర్డు అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పాత విధానం అమలుకు నిర్ణయించారు. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఇళ్ల వద్దకు వచ్చి అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ, 31 ప్రభుత్వ అనుబంధ, 6 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతూనే ఉంది.న్యూస్‌రీల్ ‘ఇంటర్’లో ప్రవేశాలకు పాత విధానమే ఆన్లైన్ ప్రవేశాలు ఇప్పట్లో లేనట్లే‘ఐఐటీ, నీట్ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులే ఏటా ర్యాంక్‌లు సాధిస్తున్నారని.. ఎంసెట్‌లోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నారంటూ ఆశలు కల్పిస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. తమ కాలేజీలో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, మెయిన్‌లో మంచి ర్యాంక్ వస్తుందంటూ నమ్మబలికి ఎలాగోలా ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు.’ ఇదంతా ఇటీవల జిల్లాలోని పలు గ్రామాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యాలు. పదో తరగతి పూర్తయిన పిల్లల ఇంటికే హైదరాబాద్, కరీంనగర్ నగరాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు వస్తున్నారు. -
ఆర్జీ రావు ట్రస్టు అర్హత పరీక్షకు స్పందన
సిరిసిల్లకల్చరల్: ఆర్జీ రావు ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత ఇంజినీరింగ్ విద్యావకాశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు స్పందన లభించింది. రగుడులోని రంగినేని మోహన్‌రావు చారిటబుల్ ట్రస్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 500 మంది విద్యార్థులు హాజరైనట్లు ట్రస్టు నిర్వాహకుడు బొంత దామోదర్ తెలిపారు. ట్రస్టు నిర్వాహకుడు రంగినేని మోహన్‌రావు, ఆర్జీ రావు ట్రస్టు మేనేజర్ రాకేశ్, ట్రస్టు కాలేజీ ఇన్చార్జి దినేశ్, ఉపాధ్యాయులు సలా వుద్దీన్, శంకర్, విష్ణు, సతీశ్ పాల్గొన్నారు.విద్యార్థులు గ్రామాల్లో సేవ చేయాలి: జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంబోయినపల్లి(చొప్పదండి): విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవచేయాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం కోరారు. బాబూ జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు మండలంలోని తడగొండలో గురువారం ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాల అసోసియేట్ డీన్ కేపీ సునీతాదేవి మాట్లాడుతూ గ్రామంలో వారంపాటు నిర్వహించే శిబిరంలో వివిధ కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. శిశు సంక్షేమాధికారి రోజా, ఎంఏవో ప్రణిత, ప్యాక్స్ డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు టి.అరుణ్‌బాబు, పి.మాధవి, మాజీ సర్పంచ్ చిందం రమేశ్ పాల్గొన్నారు.చిన్నారులకు పౌష్టికాహారం అందించాలిగర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. మండలంలోని కోరెంలో టీచర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎండాకాలంలో నెల రోజులు ప్రీ స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తామన్నారు.పనిముట్లతో స్వర్ణకారుల నిరసనముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని స్వర్ణకారులు చేపట్టిన రిలేదీక్షలకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి గురువారం సంఘీభావం తెలిపారు. స్వర్ణకారుల కులవృత్తులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వర్ణకారులు తమ పనిముట్లతో ఆందోళన చేపట్టారు. పట్ట ణాధ్యక్షుడు గజ్జెల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, దీటి నర్సింలు, నరేశ్, భా ను, బాల్‌రెడ్డి, ప్రశాంత్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, బ్రహ్మం, శ్రీను, అనిల్, వెంకటేశం పాల్గొన్నారు.‘‘చీటి’ పార్టీకి పనికిరాడు’సిరిసిల్లటౌన్: పార్టీకి ఎలాంటి పనిచేయని చీటి ఉమేశ్‌రావుతో సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు లాభం లేదని ఆ పార్టీకి చెందిన మండలాల అధ్యక్షులు అధిష్టానాన్ని కోరారు. సిరిసిల్లలో కోవర్ట్ రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. చీటి ఉమేశ్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరా రు. ఆయన ప్రవర్తన ఆది నుంచి అనుమానంగా, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల మెప్పుకోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని ఆరోపించారు. ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రహించి అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు జల గం ప్రవీణ్, ముస్తాబాద్ మండలాధ్యక్షుడు ఏళ్ల బాల్‌రెడ్డి, బొప్ప దేవయ్య, రెడ్యానాయక్, రవికుమార్, కల్లూరి చందన పాల్గొన్నారు. -
సకాలంలో రావడం లేదు
సకాలంలో వేతనాలు రావడం లేదు. మూడు నెలలుగా కూలీ డబ్బులు రావాల్సి ఉంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి తాగునీరు తీసుకొచ్చుకుంటున్నాం. పని ప్రదేశంలో టెంటు వేయాలి. – గుడికాడి బుచ్చయ్య, కూలీ, గంభీరావుపేటఅలవెన్సు చెల్లించాలి ఎండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం అలవెన్సు ఇవ్వాలి. మండుతున్న ఎండల్లో అతికష్టం మీద పనిచేస్తున్నాం. గతంలో ఎండాకాలంలో అదనంగా అలవెన్సు చెల్లించారు. ఇప్పుడు చెల్లించి కూలీలకు అండగా నిలవాలి. – చెరుకు స్వప్న, కూలీ, గూడూరునెట్వర్క్ సమస్య ఉంది నూతన విధానంలో ప్రత్యేక యాప్ ద్వారా కూలీల హాజరును నమోదు చేస్తున్నాం. మస్టర్ ఎంట్రీ నెట్‌వర్క్‌తో తొందరగా పనికావడం లేదు. ఐరీష్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. కూలీలతోపాటు ఫీల్డ్అసిస్టెంట్లకు అలవెన్సు ఇవ్వాలి. – శ్రావణ్, ఫీల్డ్ అసిస్టెంట్ -
‘వర్కర్లను ఓనర్లు’గా మార్చాలి
● నేతన్నలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఏవీ ● ధనిక, పేదల మధ్య వ్యత్యాసం పెరిగింది ● మాజీ ఎంపీ వినోద్కుమార్సిరిసిల్ల: నేతకార్మికులను ఓనర్లుగా మార్చాలని, ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం బీఆర్టీయూ నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దూరు బైపాస్ వెంట వర్కర్లను ఓనర్లు మార్చేందుకు షెడ్లను నిర్మించి, వసతులు కల్పించిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈపాటికి వర్కర్లు ఓనర్లు అయ్యేవారన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను ఓనర్లను చేయాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. నేతన్నలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కరువైందన్నారు. కార్మికులకు రూ.5లక్షల బీమా సదుపాయాన్ని తాను ఎంపీగా ఉండగా.. పార్లమెంట్లో ఆమోందించామని గుర్తు చేశారు. కార్మిక వర్గాలు అసంఘటితంగా ఉండడంతోనే ఇంకా పేదరికంలో ఉన్నారని, హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్, రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్, గుండ్లపల్లి పూర్ణచందర్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రమేశ్, బత్తుల వనజ, గొట్టె దేవేంద్ర, కమలాకర్, అగ్గిరాములు పాల్గొన్నారు. కార్మికులకు సన్మానం సిరిసిల్లలోని వివిధ వర్గాల కార్మికులను మేడే సందర్భంగా సన్మానించారు. వచ్చే ఏడాది వేలాది మందితో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా కాకుండా.. ఎర్ర జెండాను ఎగురవేయాలని వినోద్‌కుమార్ సూచించారు. -
కులగణన ప్రకటనపై హర్షం
సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని కులస్తులు స్వాగతిస్తున్నారన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి గజభీంకార్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేశ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీపై మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ● జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య సిరిసిల్ల: జిల్లాలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగా రెండు స్వయం సహాయక సంఘాల మహిళలకు 60 శాతం సబ్సిడీపై మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు మంజూరయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య గురువారం తెలిపారు. నీలి విప్లవం 2018–19 పథకంలో భాగంగా జిల్లాలో 40 శాతం లబ్ధిదారులు వాటాధనం చెల్లించాల్సి ఉందని వివరించారు. ఆసక్తి గల మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సౌజన్య తెలిపారు. మే 2 నుంచి 9లోగా కలెక్టరేట్లోని మత్స్యశాఖ ఆఫీస్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 40 శాతం వాటాధనం చెల్లించే ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు దరఖాస్తు చేయాలని, 60 శాతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని వివరించారు. వివరాలకు 94916 51263లో సంప్రదించాలని కోరారు. -
సీఎం పోరాట ఫలితమే కులగణన
● సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల హర్షం ● రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకంసిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోరాట ఫలితంగానే కేంద్రం దిగివచ్చి జనగణన చేసేందుకు ముందుకొచ్చిందని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనపై ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి చిత్రపటా లకు గురువారం క్షీరాభిషేకం చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. మ్యాన ప్రసాద్, బొప్ప దేవయ్య, నీలి రవీందర్, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, గుండ్లపల్లి గౌతం, ఎదురుగట్ల వనిత, రోజా పాల్గొన్నారు. -
ఉపాధి అలవెన్స్ ఉత్తదేనా..
● అందని వేసవి భత్యం ● పని ప్రదేశంలో సౌకర్యాలు కరువు ● పెండింగ్‌లో కూలీలు, ఉద్యోగుల వేతనాలు ● సమ్మె చేస్తున్న ఉపాధిహామీ సిబ్బందిముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలుకావడం లేదు. కూలీలకు సరైన పనిదినాలు కల్పించడం లేదు. ఎండలు మండుతున్నా వేసవి అలవెన్సుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది అలవెన్సును ఇప్పటికీ ప్రకటించకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 98వేల ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉండగా.. 92వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇదే సమయంలో కూలీలు, ఉద్యోగులకు వేతనాలు కూడా అందడం లేదు. ఈ విషయమై ఉపాధిహామీ సిబ్బంది బుధవారం నుంచి సమ్మె చేస్తున్నారు. వేసవిలో అలవెన్సు ఇలా.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో వేసవిలో పనిచేసే కూలీలకు ఏటా అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్‌లో 25 శాతం, మేలో 30 శాతం, జూన్‌లో 25 శాతం అలవెన్సు చెల్లించాల్సి ఉంది. ఎండలో నేల కఠినంగా ఉండడంతోపాటు తొందరగా కూలీలు అలసిపోయి ఎక్కువ పనిచేయలేరు. ఈనేపథ్యంలో కూలీలకు వేసవిలో అదనంగా భత్యం చెల్లిస్తారు. 2024–25లో జిల్లాలో కూలీలకు రూ.21.78కోట్లు మంజూరు చేశారు. 2025–26లో రూ.12.43 కోట్లు కేటాయించారు. పెంచిన వేతనాలతో సరి.. వేసవిలో ప్రత్యేకంగా అలవెన్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఉపాధిహామీలో పనిచేసే కూలీలకు గరిష్టంగా రూ.307 నిర్ణయించారు. కనిష్టంగా రూ.222.39 చెల్లిస్తున్నారు. గతంలో రూ.280 ఇవ్వగా, దానిని రూ.27కు పెంచారు. భత్యం చెల్లించకపోవడంతో, పెరిగిన వేతనాలతో కూలీలు సంతృప్తి పడాల్సి వస్తోంది. 98,133 జాబ్‌కార్డులు జిల్లా వ్యాప్తంగా 98,133 జాబ్‌కార్డులు ఉండగా.. 1,99,721 మంది కూలీలు పనులు చేస్తున్నారు. పథకం అమలులో 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 153 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 9 మంది ఏపీవోలు, ఐదుగురు ఈసీఎన్లు, 19 మంది సీవోఎస్‌లు పనిచేస్తున్నారు. మూడు నెలలుగా కూలీలకు, ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు రావడం లేదు. బయోమెట్రిక్ హాజరు పని ప్రదేశంలోనే కూలీల హాజరును ఫీల్డ్అసిస్టెంట్లు నమోదు చేస్తారు. ఈసారి మాత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తున్నారు. పనిలో చేరిన నిమిషంలోనే ముఖాన్ని ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయడం, పనిముగిసే సమయంలో ఐరీష్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నారు. ఉపాధి పనులు గుట్టలు, అడవిలో చేస్తుండడంతో అక్కడ నెట్వర్క్ సరిగా లేక బయోమెట్రిక్ హాజరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో రోజు నెట్వర్క్ పనిచేయక అప్లోడు కావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. పనిప్రదేశంలో సౌకర్యాలు కరువు వేసవి కావడంతో ఉపాధి పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు నీడ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఓర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా అవి అందుబాటులో లేవు. ఎండ వేడిమికి తట్టుకోలేక కూలీలు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. -
బీసీల పోరాట ఫలితమే కులగణన
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు సిరిసిల్లటౌన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీల పోరాటాల ఫలితంగానే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణలో 42 శాతం, బిహార్‌లో 65 రిజర్వేషన్‌ను కేంద్రం ఆమోదించాలని కోరారు. బీసీ నాయకులు వీరవేని మల్లేశ్‌యాదవ్, కమలాకర్, బొప్ప దేవయ్య, తడుక కమలాకర్, ఇల్లంతకుంట తిరుపతి, బచ్చు ప్రసాద్, సామల తిరుపతి, కొండ విజయ్, తొట్ల మల్లేశం, రోహిత్‌యాదవ్, కొండయ్య, దామోదర్, శ్రీనివాస్, నరేందర్, శ్రీధర్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కోర్టు మంజూరు చేయండి
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రానికి ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని న్యాయవాదుల సంఘం కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ కోర్టు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్లో ఉండడంతో కక్షిదారులకు దూరభారం అవుతోందన్నారు. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కోర్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు తంగళ్లపల్లి వెంకటి, ఎస్.అనిల్‌కుమార్, వేముల నరేశ్, నర్మెట రమేశ్, వుచ్చిడి శరత్‌రెడ్డి, మహిళా ప్రతినిధి మంద పుష్పలత, సీనియర్ న్యాయవాది దోర్నాల జనార్దన్‌రెడ్డి, న్యాయవాదులు అన్నల్దాస్ వేణు, కడగండ్ల తిరుపతి, బూర్ల కల్యాణి, బి.అనీల పాల్గొన్నారు. -
రైతుబిడ్డకు మూడో ర్యాంక్
ముస్తాబాద్(సిరిసిల్ల): రైతుబిడ్డ జిల్లా మూడో ర్యాంకర్‌గా నిలిచాడు. ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చెందిన పల్లాటి మల్లేశం, జమున దంపతుల మూడో కుమారుడు పల్లాటి అరుణ్‌కుమార్ పదో తరగతిలో 579 మార్కులు సాధించా డు. ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదివిన అరుణ్‌కుమార్ టాపర్‌గా నిలవడంపై ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్ అభినందించారు. అరుణ్ తండ్రి వ్యవసాయం చేస్తుండగా, తల్లి జమున మోహిని కుంటలో ఆశవర్కర్. అరుణ్ పెద్దసోదరుడు మహేశ్ జ గిత్యాలలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, రెండో సోదరుడు భరత్ ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అరుణ్ పేర్కొన్నాడు. -
ఘనంగా మహనీయుల జయంతి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం రాత్రి మహనీయుల జయంతి ఉత్సవ సభ నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ వోరుగంటి ఆనంద్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ల జయంతి వేడుకలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈక్రమంలోనే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో దరువు ఎల్లన్న, సభ కమిటీ కన్వీనర్ సావనపల్లి రాకేశ్, నాయకులు పసుల వెంకన్న, బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేశ్, వివిధ గ్రామాల అంబేడ్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వర్ణకార మహిళల ఆందోళనముస్తాబాద్(సిరిసిల్ల): స్వర్ణకారుల ఉపాధిని కాపాడాలని కోరుతూ దీక్షల్లో వారి కుటుంబికులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గ్రామపంచాయతీ ఎదుట ఏడు రోజులుగా స్వర్ణకారులు రిలే దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం స్వర్ణకారుల కుటుంబాలకు చెందిన మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. మండలా ధ్యక్షుడు చింతోజు బాలయ్య, చింతో జు లావణ్య, శ్యామల, స్వాతి, కవిత, ఎర్రోజు మంజుల, రమ్య, లక్ష్మి, రేఖ, ఉమ, ప్రేమల, శ్రీలేఖ పాల్గొన్నారు. -
నేత ఇంట్లో సెకండ్ ర్యాంకర్
ముస్తాబాద్(సిరిసిల్ల): నేతకార్మికుడి కొడుకు పదో తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచాడు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో చదువుతున్న జక్కని విగ్నేశ్ 600 మార్కులకు 580 సాధించి జిల్లా రెండో ర్యాంక్ సాధించాడు. టెక్స్‌టైల్‌పార్క్‌కు చెందిన విగ్నేశ్ ముస్తాబాద్ గురుకులంలో చదువుతున్నాడు. తండ్రి జక్కని రాజు నేతకార్మికుడు కాగా.. సరైన ఉపాధి లేక సిరిసిల్ల మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి జమున బీడీకార్మి కురాలు. విగ్నేశ్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రత్యేక ప్రణాళికతో చదివానని తెలిపాడు. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
‘పది’లో ఐదో స్థానం
● 128 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత ● 10 కేజీబీవీలు శతకొట్టాయి ● ఆరు గురుకులాలు అదుర్స్సిరిసిల్ల ఎడ్యుకేషన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 198 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవగా 128 స్కూళ్లు 100 శాతం ఉత్తీ ర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 6,754 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 6,629 మంది ఉత్తీర్ణత సాధించారు. 98.15 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 13 కేజీబీవీలలో 10 కేజీబీవీలు శతశాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలో ఉన్న ఏడు గురుకులాల్లో ఆరు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గురుకులాల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అభినందించారు. కేజీబీవీల్లో.. 13 కేజీబీవీల్లో 506 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 503 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.41 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు ఎస్వో పద్మజ తెలిపారు. 13 కేజీబీవీలలో 10 కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సిరిసిల్ల కేజీబీవీలో శ్రీనిత్య 566, ఇల్లంతకుంటలో అర్చిత 564, తంగళ్లపల్లిలో కృష్ణవేణి 563 మార్కులు సాధించినట్లు తెలిపారు. గురుకులాల్లో 580 మార్కులు జిల్లాలో ఏడు గురుకుల విద్యాలయాలు ఉండగా ఆరు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు గురుకుల సమన్వయ అధికారి థెరిస్సా తెలిపారు. ముస్తాబాద్ గురుకులంలో జె.విగ్నేశ్ 580, అరుణ్‌కుమార్ 579, చిన్నబోనాలలో జి.సాత్విక, ఇల్లంతకుంటలో కె.మీనాక్షి, నర్మాలలో జి.నిహారిక 579 మార్కులు సాధించారు. విద్యార్థులకు కలెక్టర్ అభినందనలుపదోతరగతి ఫలితాల్లో ప్రతిభచూపిన జిల్లా విద్యార్థులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అభినందించారు. కలెక్టరేట్లో పుష్పగుచ్ఛాలు అందించి, సన్మానించారు. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన పి.వర్షిణి 591 మార్కులు సాధించి, ఓవరాల్‌గా జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. -
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సిరిసిల్ల: జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని ఆన్లైన్ చేశారని హౌసింగ్ పీడీ శంకర్‌ను అడుగగా.. 7,690 దరఖాస్తులను సర్వే చేశారని, 5,776 ఆన్లైన్ చేసినట్లు వివరించారు. మే 2న ఆయా దరఖాస్తుదారు జాబితా ప్రదర్శించాలని, మే 5న తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, డీవైఎస్వో రాందాస్ పాల్గొన్నారు. భూభారతితో సమస్యలు పరిష్కారం ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. భూభారతి, నూతన ఆర్వోఆర్ చట్టంపై ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రభుత్వం భూధార్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. రైతుల కు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని, గ్రామ రెవె న్యూ రికార్డులు నిర్వహిస్తారని వివరించారు. ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, వీర్నపల్లి చైర్మన్ రాములునాయక్, తహసీల్దార్లు సుజా త, ముక్తార్ పాషా, మండల ప్రత్యేకా ధికారి అఫ్జల్ బేగం, వీర్నపల్లి ఇన్చార్జి ఎంపీడీవో అబ్దుల్ వాజీద్, ఆర్ఐ శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ లెక్కల లక్ష్మణ్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేవు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ సందీప్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లతో కలిసి బుధవారం ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటి వరకు 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సిరిసిల్ల, వేములవాడలో అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి తూకం వేసిన ధాన్యాన్ని తరలించినట్లు తెలిపారు. 2న లబ్ధిదారుల జాబితా 5న తుది జాబితా ప్రకటించాలి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
సర్కారు బడులను బలోపేతం చేయాలి
సిరిసిల్లటౌన్: కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు దొంతుల శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ మండలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సంఖ్య తగ్గించే యోచన ప్రభుత్వానికి ఉంటే ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు బూర సదానందం మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. జి ల్లా ప్రధాన కార్యదర్శి ఆవురం సుధాకర్‌రెడ్డి, రాజేశ్వరరావు, దేవేందర్, వంగ తిరుపతి, విష్ణు ప్ర సాద్, సురేశ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలోనూ పౌష్టికాహార సేవలు
బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట: గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వేసవి సెలవుల్లోనూ పౌష్టికాహారం అందిస్తామని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. మంగళవారం కొదురుపాక, ఎల్లారెడ్డిపేట సెక్టార్లలో టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఎండాకాలం నెలరోజుల పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 రోజులపాటు ఆయాలు, మరో 15 రోజులు టీచర్లకు సెలవులు ప్రకటించామని వివరించారు. కేంద్రంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండి ప్రభుత్వం నిర్దేశించిన సేవలు అందించాలని కోరారు. జిల్లా ఉమెన్ ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్ రోజా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శంకరమ్మ, కళావతి, టీచర్లు పాల్గొన్నారు. -
● తెలంగాణకు అసలు విలన్ కేసీఆర్ అని ప్రజలు తేల్చారు ● ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్
సిరిసిల్ల: రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టలేదని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పుట్టిందని, ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్‌లో మంగళవారం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను అన్ని స్థాయిల్లోనూ పునఃనిర్మాణమే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందన్నారు. వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని అనడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను విలన్‌గా భావించి ఎన్నికల్లో పక్కన పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం పార్టీగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పని చేస్తుందన్నారు. దేశంలో రాజ్యాంగం, జుడీషియరీ, పార్లమెంట్ వ్యవస్థలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, వాటిని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. నాయకులు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడాలన్నారు. ఉమేశ్‌రావు మాటలతో వాగ్వాదం ఎన్నికల్లో ఓడిపోయే నాయకులకే టిక్కెట్లు ఇస్తున్నారని, గెలిచే అభ్యర్థులను గుర్తించాలని కాంగ్రెస్ నాయకులు చీటి ఉమేశ్‌రావు మాటలతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. పరోక్షంగా ఆయన కేకే మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లు గుర్తించిన పార్టీ నాయకులు ఉమేశ్‌రావుతో వాగ్వాదానికి దిగారు. విప్ ఆది శ్రీనివాస్ వారిస్తున్నా నాయకులు శాంతించలేదు. ఉమేశ్‌రావు స్టేజీ దిగాలని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు నాయకులు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు. ఏఐసీసీ పరిశీలకులు ఫకృద్దీన్, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, అకునూరి బాలరాజు, కూస రవీందర్, గడ్డం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్లు స్వరూపారెడ్డి, శ్రీనివాస్, కచ్చకాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. మంగళవారం పీసీపీఎన్డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నిబంధనలు వ్యతిరేకంగా నిర్వహించే, లింగనిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తామన్నారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతూరు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతిప్రకాష్ శుక్లా, ఎన్జీవో కమిటీ సభ్యురాలు ఝాన్సీలక్ష్మి, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్ఈ బాలయ్య, డీఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరంసిరిసిల్లకల్చరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వేసవి సెలవుల్లో వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం నుంచి శిబిరాల నిర్వహణ ప్రారంభమవుతుందని జిల్లా క్రీడాధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. మే 1 నుంచి జూన్ 6వరకు జరిగే శిక్షణ శిబిరం రాజీవ్‌నగర్‌లోని మినీ స్టేడియంలో కొనసాగుతుంది. అథ్లెటిక్స్, కరాటే, యోగా, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, కబడ్డీ, క్యారమ్స్, చెస్ మొదలైన క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే శిబిరాల్లో ఆసక్తి గల బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణసిరిసిల్లకల్చరల్: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త నిర్వహణలో వివిధ వృత్తి రంగ కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్, సర్వీస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీ టీవీ టెక్నీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి, క్విల్ట్ బ్యాగ్స్ మేకింగ్ రంగాల్లో ఆరునెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతీ, యువకులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని సంస్థ కార్యాలయంలో మే 7న ఉదయం 10 గంటలకు సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 91339 08000, 91339 08111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి ‘ఉపాధి’ సిబ్బంది పెన్‌డౌన్ సమ్మె సిరిసిల్ల: ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని, వెంటనే వేతనాలు మంజూరు చేయాలని మంగళవారం ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతిపత్రం అందించారు. జేఏసీ అధ్యక్షుడు గుడిసెల రమేశ్ మాట్లాడుతూ, నాలుగు నెలలుగా జీతాలు రాక పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా జాప్యం చేయడంపై అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు అందించామని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో బుధవారం నుంచి పెన్‌డౌన్, షట్ డౌన్ సమ్మె చేస్తున్నామని, మే 2న చలో సీఆర్డీ ప్రజాభవన్ ముట్టడికి వెళ్తామని, 3న మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. నాలుగు నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రికి వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీవోలు, ఈసీలు, సీవోలు, టీఏలు పాల్గొన్నారు. -
భూభారతి చట్టం.. రైతులకు చుట్టం
కోనరావుపేట(వేములవాడ): ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం రైతులకు చుట్టం లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని నిజామాబాద్ రైతువేదికలో అవగాహన సదస్సులో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్లను, నిరుపేదలకు భూముల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని అధికారులకు విప్ సూచించారు. నిజామాబాద్‌లోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి పరిశీలించారు. మర్తనపేట, గొల్లపల్లి గ్రామాల్లో బోర్లను పరిశీలించారు. మర్తనపేటకు 2, గొల్లపల్లికి 1, మరిమడ్లకు ఒకటి నూతన మోటార్లను కలెక్టర్ మంజూరు చేశారు. మర్తనపేటలో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇళ్లను, పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, తహసీల్దార్ వరలక్ష్మి, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
హెల్మెట్.. నెగ్లెక్ట్
● ‘ఈ ఫొటోలోని మృతుడు ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కర్రె మైసయ్య(49). బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు’. ● ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహేశ్‌బాబు. వయస్సు 18 ఏళ్లు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతనితోపాటు మరో యువకుడు మధు(25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేవలం హెల్మెట్ లేని కారణంగానే ఇద్దరి తలలు పగిలి విగతజీవులుగా మారారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వారిపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ● హెల్మెట్‌పై వాహనదారుల అనాసక్తి ● జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు ● కరీంనగర్– కామారెడ్డి మార్గంలో డేంజర్ స్పాట్స్ ● టీనేజీలోనే నిండు నూరేళ్లు ● తల్లిదండ్రుల ఆశలు ఆవిరి ● 49 ప్రమాదాల్లో 11 మంది మృతి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అతివేగం.. అజాగ్రత్త.. హెల్మెట్ ధరించకపోవడంతో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు నిలిచేవని చర్చ సాగుతోంది. ఎండాకాలం.. హెల్మెట్ ధరిస్తే చెమట వస్తుందనే భావనతో వాహనదారులు హెల్మెట్‌ను బండికి తగిలేసుకొని వెళ్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జిల్లాలో రెండు నెలల్లో జరిగిన 49 రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. కరీంనగర్–కామారెడ్డి రోడ్డుపై డేంజర్ స్పాట్స్ ● కరీంనగర్– కామారెడ్డి రోడ్డు జిల్లాలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద మొదలై గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వరకు కొనసాగుతోంది. నర్సింగాపూర్ నుంచి పెద్దమ్మస్టేజీ వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరంలో అనేక డేంజర్స్పాట్స్ ఉన్నాయి. ● బోయినపల్లి మండలం కొదురుపాక జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి, రుద్రవరం, నాంపల్లి, వేములవాడ నందికమాన్, అగ్రహారం స్టేజీల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ● జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ● సిరిసిల్ల శివారులోని చంద్రంపేట స్టేజీ వద్ద డేంజర్ స్పాట్ ఉంది. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకు గురిచేస్తుంది. ● సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్దాపూర్, సిరిసిల్ల పట్టణంలోని గోపాల్నగర్చౌరస్తా వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ● ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని హనుమాన్ ఆలయం వద్ద, హరిదాస్‌నగర్ శివారులోని అర్బన్‌ఫారెస్ట్ పార్క్, పదిర నుంచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వరకు గల రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు అతివేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు. ● ఎల్లారెడ్డిపేట మండలం సత్తెపీరీల దర్గా, గంభీరావుపేట మండలం నాగంపేట శివారులో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జరిమానాలపైనే దృష్టి జిల్లా వ్యాప్తంగా పోలీసులు తరచూ డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించని వారిని ఆపి అడగడం లేదని తెలుస్తోంది. అయితే వాహనదారుల ఫొటోలు తీస్తూ జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలు మాత్రం ఉన్నాయి. హెల్మెట్ ధరించని వాహనదారుడిని పోలీసులు ఆపి, హెల్మెట్ ధరిస్తేనే బైక్ ఇస్తామని హెచ్చరిస్తే చాలా మంది ధరించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్ ధరిస్తేనే క్షేమం ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే ఏ పరిస్థితుల్లోనైనా క్షేమంగా ఉంటారు. ప్రమాదాలు జరిగినా గాయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నాం. ఇకపై హెల్మెట్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. – శ్రీనివాస్‌గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట -
ఫిర్యాదులపై స్పందించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులు, నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ, పెట్రోలింగ్ సమయంలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని, అనుమానితులు కనిపిస్తే వివరాలు సేకరించాలని సూచించారు. మత్తు పదార్థాల నివారణ, సైబర్నేరాలను అడ్డుకోవడంపై గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రవాణా, సేవించడం, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతంర నిఘా పెట్టి కట్టడి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రమాకాంత్, ఎల్లాగౌడ్, సిబ్బంది ఉన్నారు. -
విన్నపాలు వినవలే..
● సమస్యలు విన్నవించిన బాధితులు ● సత్వర పరిష్కారం చూపుతామన్న కలెక్టర్ ● 209 దరఖాస్తులు స్వీకరణసన్నధాన్యం కేటాయించొద్దు రబీ సీజన్ సన్నధాన్యం సేకరణ ప్రభుత్వం ప్రారంభించింది. మన జిల్లా పారాబాయిల్డ్ వైరెటీ ధాన్యం వచ్చింది. ఈ ధాన్యం నుంచి పచ్చిబియ్యం పెట్టలేము. ఆ ధాన్యంలో ఎక్కువ నూక వస్తుంది. కానీ అధికారుల నుంచి సన్నధాన్యం నుంచి పచ్చిరైస్ పెట్టమని ఆదేశాలున్నాయి. దాని సీఎంఆర్ రా రైస్ పెట్టలేకుండా ఉన్నాము. మాకు సన్నధాన్యం కేటాయించొద్దు. – పారాబాయిల్డ్ మిల్లర్స్ పనులు పూర్తిచేయించండి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం అభివృద్ధి పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మైదానం ఎత్తు పెంచడం, క్రీడల కోర్టులు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే గ్రౌండ్‌కు నలువైపులా గేట్లు, వీధిదీపాలు లేక రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిలిచిన పనులు పూర్తిచేయించి వసతులు పూర్తి చేయాలి. – వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొడుకులు పట్టించుకోవడం లేదుమాది సిరిసిల్ల పోచమ్మవీధి. నా భర్త హరయ్య చాలా ఏళ్ల క్రితమే కాలం చేశారు. నాకు ఆర్థికంగా స్థిరపడిన నలుగురు కొడుకులు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లు ఉన్నారు. కొడుకుల్లో రిటైర్డ్ ఉద్యోగి, మాజీ ప్రజాప్రతినిఽధి, ఇద్దరు వ్యాపారులు. నా భర్త పోయినప్పటి నుంచి బీడీ పింఛన్, ఈపీఎఫ్ డబ్బులతోనే బతుకుతున్న. ముప్పై ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నా. నాకు అ య్యే వైద్యఖర్చులకు పెద్దకుమార్తె కొడుకు నెలకు రూ.7వేలు ఇస్తున్నాడు. ఇప్పుడు పూర్తిగా చేతకావ డం లేదు. నలుగురు కొడుకులున్నా ఎవరూ అండగా ఉండడం లేదు. కొడుకులు ఒక్కొక్కరి నుంచి రూ.20వేలతోపాటు తోడుగా ఒకరు ఉండేలా చర్యలు తీసుకోండి. – గుడ్ల సత్తమ్మ, సిరిసిల్లసిరిసిల్లటౌన్: సుదీర్ఘకాలంగా తమ సమస్యలు విన్నవిస్తూనే ఉంటున్నామని.. క్షేత్రస్థాయిలో అధికారులు పరిష్కరించడం లేదని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వందలాది సంఖ్యలో బాధితులు వచ్చి గంటల తరబడిగా వేచి ఉండి కలెక్టర్‌కు తమగోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పందిస్తూ ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 209 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు 36, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 26, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, హౌసింగ్‌శాఖకు 13 చొప్పున, తహసీల్దార్ కోనరావుపేట, తంగళ్లపల్లికి 11 చొప్పున, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి 8, ఎస్పీ ఆఫీస్, తహసీల్దార్ ముస్తాబాద్‌కు ఏడు చొప్పున.. మొత్తం 209 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ జ్యువెల్లరీకి అనుమతులు ఇవ్వొద్దు చేతివృత్తులైన తమ ఉపాధికి విఘాతంగా మారకుండా కార్పొరేట్ జ్యువెల్లరీ షాపును ప్రారంభించకుండా చూడాలని ముస్తాబాద్ మండల స్వర్ణకారులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతిపత్రం అందించి మాట్లాడారు. మండలంలో 80 మంది వరకు స్వర్ణకారులు కులవృత్తిని నమ్ముకున్నామని, కార్పొరేట్ జ్యు వెల్లరీతో ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షాపును తెరవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, వెంగలం శ్రీనివాస్, నవీన్, సతీశ్ పాల్గొన్నారు. స్తంభంపల్లి వంతెన పూర్తిచేయండి పది నెలలుగా అసంపూర్తిగా ఉంటున్న స్తంభంపల్లి హైలెవల్ వంతెన పనులు పూర్తిచేయాలని బోయినపల్లి మండలం స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి, తడగొండ గ్రామస్తులు బైక్‌ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. రానున్న వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయకపోతే 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లు చెల్లించండి నేను తంగళ్లపల్లి శివారులోని పద్మనగర్ సర్పంచ్‌గా పనిచేశాను. ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సొంత డబ్బులతో సరఫరా చేశాను. వీటికి సంబంఽధించి రూ.1.20లక్షలు పెండింగ్‌లో ఉంది. కలెక్టర్, మిషన్ భగీరథ ఈఈకి పలుమార్లు విన్నవించాను. బిల్లులు చెల్లిస్తలేరు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి బిల్లులు మంజూరు చేయాలి. – పోచయ్య పద్మనగర్, మాజీ సర్పంచ్ అక్రమ అంతస్తులపై చర్యలు చేపట్టండి టౌన్‌ప్లానింగ్ అధికారుల వైఫల్యంతో సిరిసిల్లలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గాంధీచౌక్‌లో చేపడుతున్న ఓ షాపింగ్‌మాల్ నిర్మాణంలో యజమానులు సెట్‌బ్యాక్ పాటించడం లేదు. టౌన్‌ప్లానింగ్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపేసి యజమానిపై చర్యలు తీసుకోవాలి. – ఎలిగేలి రాజశేఖర్, సిరిసిల్ల డ్రెయినేజీ మరమ్మతు చేయించండికేసీఆర్నగర్లోని రోడ్డు నంబర్ 4లో డ్రెయినేజీ లీకేజీ అవుతోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పాడైన సెప్టిక్‌ట్యాంకును బాగుచేయించాలి. మురుగునీరు కూడా డ్రెయినేజీకి సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – కేసీఆర్‌నగర్ వాసులు -
మే డే విజయవంతం చేయండి
సిరిసిల్లటౌన్: మే డేను కార్మికులు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేటలో నిర్వహించే కార్మిక దినోత్సవం కార్యక్రమం కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండు రమేశ్, నాయకులు సబ్బని చంద్రకాంత్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్దేవి జగదీశ్, చెముటి రాము, మ్యాన రాజు, గడుదాస్ వేణు, ఇమ్మశెట్టి లక్ష్మణ్, మిట్టపల్లి ప్రసాద్ పాల్గొన్నారు. -
దుష్టపాలన అంతమే లక్ష్యం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యసిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలన అంతమే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలం ముందుకు సాగుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్నారు. అధినేత కేసీఆర్ పిలుపుతో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెసోళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అవివేకంతో వ్యాఖ్యలు చేస్తున్నారని వారి ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు గూడూరు ప్రవీణ్, సిద్ధం వేణు, ఒజ్జల అగ్గిరాములు, గజభీంకార్ రాజన్న, మాట్ల మధు, కుంభాల మల్లారెడ్డి, గుగులోతు సురేష్, జక్కుల యాదగిరి, ఇమ్మనేని అమర్‌రావు, గుండు ప్రేమ్‌కుమార్, సయ్యద్ అప్రోజ్ పాల్గొన్నారు. వాహనాలను సరిగ్గా నిర్వహించాలి సిరిసిల్లకల్చరల్: అత్యవసర సేవల అంబులెన్స్‌లు, అమ్మఒడి వాహనాలను సరిగ్గా నిర్వహించాలని రాష్ట్ర అంబులెన్స్ మరమ్మతుల కోఆర్డినేటర్ సూర్యనారాయణరాజు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ సలీం పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నిలిపిన వాహనాలను సోమవారం పరిశీలించారు. 108 సిబ్బంది మామిడాల ఆంజనేయులు, బుర్ర స్వాతి, సిరిసిల్ల ప్రవీణ్, మంత్రి కిశోర్, యాసరవేణి సాగర్, డాక్టర్ మనీషా, కెప్టెన్ ద్యాగం నరేశ్, హెల్పర్ ప్రశాంత్ పాల్గొన్నారు. ఉషుపోటీల్లో తల్లీకొడుకుల ప్రతిభ సిరిసిల్లకల్చరల్: ఆముచూర్ ఉషు మూడో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన తల్లీకొడుకులు తిప్పరవేని స్వప్న, బొల్లాజీ ఆదిదేవ్ ప్రతిభ చూపారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. 47 కిలోల విభాగంలో తన్షుఫైట్లో తిప్పరవేని స్వప్న రెండో ర్యాంక్, 30 కేజీల విభాగంలో తాన్షాప్ ఫైట్‌లో బొల్లాజీ ఆదిదేవ్ రెండో స్థానం దక్కించుకున్నారు. వీరిద్దరూ తల్లీకొడుకులు కావడం విశేషం. ‘కర్రెగుట్టలో నరమేధాన్ని ఆపాలి’సిరిసిల్లటౌన్: కర్రెగుట్ట ప్రాంతంలో నరమేధాన్ని కేంద్ర బలగాలు వెంటనే ఆపివేయాలని అఖిలపక్షం నేతలు కోరారు. స్థానిక కార్మిక భవనంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కగార్ నిలిపేయాలి..మావోయిస్టులతో చర్చలు జరపాలి’ అనే నినాదంతో సోమవారం అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్రెగుట్టపై ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుంచి వందలాది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన ఆదివాసీలను వదిలిపెట్టాలని కోరారు. నాయకులు గుంటి వేణు, మూశం రమేశ్, సోమిశెట్టి దశరథం, బొజ్జ కనకయ్య, సకినాల అమర్, మార్వాడీ సుదర్శన్, అంకని భాను, రాగుల రాములు, బడే స్వామిదాస్, చెట్కూరి ఆంజనేయులు, గొట్టె రవి, మిట్టపెల్లి రాజమౌళి, దర్శనం కిషన్, వేమండ్ల రమేశ్, కల్లూరి చందన, పోకల సాయికుమార్ పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల బిల్లులు ఇప్పించండి
ఇల్లంతకుంట(మానకొండూర్): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదని, ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పలువురు బాధితులు విన్నవించారు. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన 20 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనట్లు మూడేళ్ల క్రితం వ్యక్తిగతంగా ప్రొసీడింగ్స్ వచ్చినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంటు కోసం ఒక్కొక్కరం రూ.10వేలు డీడీ కోసం చెల్లించినట్టు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 20 మందిలో 11 మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోగా కొన్ని పూర్తిస్థాయిలో, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు ఇప్పించాలని వేడుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ చల్ల నారాయణ, బాధితులు ఎండీ కరీం, క్రాంతి, మచ్చ ప్రభాకర్, బట్టి మల్లేశం, జాని, రాజు పాల్గొన్నారు. -
భూసమస్యలు భూభారతితో పరిష్కారం
సిరిసిల్ల: భూమి సమస్యలు భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని, ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేట రైతువేదికలో సోమవారం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూమిహక్కుల రికార్డు– భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు. భూముల మ్యాప్ జియోట్యాగింగ్‌తో పాస్‌బుక్కులు జారీ చేస్తామని వివరించారు. పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారని వివరించారు. పాసుపుస్తకాల్లో భూమి పటం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటి స్థలాలకు ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని తెలిపారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చినా, ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఇన్చార్జి తహసీల్దార్ విజయ్ భాస్కర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు. ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ధాన్యం కొనుగోలు చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చే యాలని కోరుతూ ఎల్లారెడ్డిపేటలో సోమవారం సింగారం గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేశా రు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు రావాలని, ధాన్యం తూకం వేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. సన్నవడ్లను తూకం వేయడం లేదన్నారు. ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని.. రైతులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్వో వసంతలక్ష్మి, తహసీల్దార్ సుజాత, సీఐ శ్రీనివాస్‌గౌడ్ చేరుకుని రైతులు, నాయకులతో మాట్లాడారు. ధాన్యం తూకం వేసి, వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మ ణ్ రావు, గుండాడి వెంకట్‌రెడ్డి, నాగరాజు, సందీప్, బీజేపీ నాయకులు పొన్నాల తిరుపతిరెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, కిరణ్‌నాయక్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో రోడ్డెక్కిన రైతులు అధికారులతో రైతులు, నాయకుల వాగ్వాదం -
తప్పనిసరైతేనే బయటకు రండి
● ఎండలో జాగ్రత్తలు తీసుకోండి ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజితసిరిసిల్ల: జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. ఉదయం 10 గంటల తరువాత బయటకు రావొద్దని.. అత్యవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత పనులు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూ చించారు. జిల్లాలో తీవ్ర వడగాలుల నేపథ్యంలో సోమవారం ఈమేరకు ప్రకటన జారీ చేశారు. గత పది రోజులుగా వేడిగాలులతోపాటు ఎండలు తీవ్రంగా ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎండదెబ్బ తగలకుండా తలకు తువ్వాలు, గొడుగు, టోపీలతోపాటు తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. తాగునీటిని వెంట తీసుకెళ్లాలని, తల తిరగడం, అధికంగా చెమటలు రావడం కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లాలని కోరారు. ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, చెరుకు రసం వంటి పానీయాలు తీసుకోవాలని కోరారు. -
ఎండకు చేపలు విలవిల
● అధిక ఉష్ణోగ్రతలకు వేడెక్కుతున్న నీరు ● ఆవిరి అవుతున్న జలం ● చనిపోతున్న చేపలు ● జాగ్రత్తలతోనే రక్షించుకోవచ్చు ● జిల్లా మత్స్యశాఖ అధికారిసిరిసిల్ల/బోయినపల్లి(చొప్పదండి): ఎండలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో నీటిలో ప్రాణవాయువు కొరతతో చేపలు విలవిలలాడుతున్నాయి. నీటిలో నాణ్యత తగ్గడం.. ఒకే చోట ఎక్కువ చేపలు చేరడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీరు తగ్గి చేపలు చనిపోతున్నాయి. అయితే జాగ్రత్తలతో చేపలను కాపాడుకోవచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మూడు ప్రాజెక్టులు, 329 చెరువులు జిల్లాలోని 13 మండలాల్లో 329 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్‌మానేరు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు, ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. సముద్రలింగాపూర్ చెరువు, గంభీరావుపేట పెద్దచెరువు, వేములవాడ, విలాసాగర్ లార్జ్ ట్యాంకులు ఉన్నాయి. గతేడాది జిల్లాలో 45.20 లక్షల చేపపిల్లలను వదిలారు. 329 చెరువుల్లో 30 లక్షలు, మిడ్‌మానేరులో 14.25లక్షలు, అన్నపూర్ణ ప్రాజెక్టులో 4,53,251 చేపపిల్లలు వదిలారు. గంభీరావుపేట ఎగువమానేరులో చేపపిల్లలు వదల లేదు. 8 వేల మంది మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా 8,642 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 135 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, పలు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతోపాటు ఎగువమానేరులో మత్స్యకార్మిక సొసైటీ ద్వారా అక్కడ మత్స్యకార్మికులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారు.చేపల పెంపకం ఇలా.. ప్రాజెక్టులు : మిడ్‌మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ చెరువులు, కుంటలు : 329 చేపపిల్లలు వదిలిన ప్రాజెక్టులు : మిడ్‌మానేరు, అన్నపూర్ణ వదిలిన చేపపిల్లలు : 45.20 లక్షలు మత్స్యకార్మికులు : 8,642మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు : 135 -
భీముని మల్లారెడ్డిపేటలో కలెక్టర్, ఎస్పీ పూజలు
సిరిసిల్ల: గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శివారులోని శ్రీఆంజనేయస్వామిని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువా కప్పి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్రను కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి, సదుపాయాల కల్పన, గ్రామంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్, గంభీరావుపేట ఎస్సై ప్రేమానందం, ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ పాల్గొన్నారు. ● ఆంజనేయస్వామి దర్శనం -
నాడు నక్సలైట్.. నేడు వంటలక్క !
● కొడుకుల కోసం జనజీవన స్రవంతిలోకి.. ● వంటలతో ఉపాధి పొందుతున్న ఎల్లవ్వఇల్లంతకుంట(మానకొండూర్): సమసమాజ స్థాపన కోసం నాడు నక్సలైట్‌గా భర్త అడుగుజాడల్లో నడిచింది. నేడు బతుకుదెరువు కోసం వంటలక్కగా మారింది. పోరుబాటలో భుజాన చంటిబిడ్డను ఎత్తుకొని అడవిబాట పట్టిన మర్రి ఎల్లవ్వ.. నేడు కుటుంబ బాధ్యతలను మోస్తూ కమ్మని నోరూరించే వంటలు తయారు చేస్తోంది. కాలక్రమంలో తన జీవితంలో వచ్చిన మార్పులను మండల కేంద్రానికి చెందిన మాజీ దళ సభ్యురాలు మర్రి ఎల్లవ్వ గురించి.. భర్త వెంటే ఉద్యమబాట.. ఇల్లంతకుంటకు చెందిన మర్రి ఎల్లవ్వ తన భర్త మర్రి రాజమల్లు జనశక్తి దళ సభ్యుడిగా పనిచేసేవాడు. ఆ సమయంలో తాను కూడా పార్టీలో చేరి భర్త వెంట అడవిబాట పట్టింది. అయితే తనకు అప్పటికే చంటిపిల్లలు ఉండడంతో అడవిలో అన్నల వెంట తిరగడం ఇబ్బందిగా ఉండడంతో దాదాపు ఏడాది తర్వాత 1991లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతర కాలంలో తన భర్త రాజమల్లు సైతం లొంగిపోయాడు. అయితే అనారోగ్యంతో చనిపోయాడు. ఎల్లవ్వ తన ఇద్దరు కొడుకులను పోషించుకునేందుకు కూలీ పనులకు వెళ్లింది. ప్రస్తుతం పెళ్లిళ్లు, గణపతి, దుర్గామాత ఉత్సవాలకు వంటలు చేస్తూ ఉపాధి పొందుతోంది. సొంతిల్లు లేక ఇల్లంతకుంటలో అద్దెకు ఉంటుంది. తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఆదుకోవాలని ఎల్లవ్వ కోరుతుంది. -
స్వర్ణకారులకు అండగా ఉంటాం
ముస్తాబాద్(సిరిసిల్ల): కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు భరోసా ఇచ్చారు. ముస్తాబాద్‌లో దీక్షలు చేస్తున్న స్వర్ణకారులకు ఆదివారం సంఘీభావం ప్రకటించారు. శరత్‌రావు మాట్లాడుతూ ముస్తాబాద్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెల్లరీ దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని, మండలానికి చెందిన స్వర్ణకారులకు న్యాయం చేయాలని కోరారు. కొద్దిరోజులుగా స్వర్ణకారులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక అధికారులు ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, సీపీఎం నాయకుడు మల్లారెడ్డి, గీస భిక్షపతి, మిట్టపల్లి రాజమౌళి, దుబ్బాక సంఘం నాయకులు కాళీదాస్, చారి, బొప్పాపూర్, గొల్లపల్లి సంఘం బాధ్యులు వసంత్‌కుమార్, బ్రహ్మం, సావిత్రి, సుమతి, జానబాయి సంఘీభావం తెలిపారు. కార్మికహక్కులు సాధించుకుందాం సిరిసిల్లటౌన్: కార్మికుల హక్కులను పోరాటా లతో సాధించుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలో ని అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడా రు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే రోజున నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. అన్నల్దాస్ గణేశ్, సిరి మల్లె సత్యం, నక్క దేవదాస్, కుమ్మరికుంట కిషన్, బెజిగం సురేష్, బాస శ్రీధర్, ఎక్కలదేవి జగదీశ్, ఎలిగేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై పట్టింపేది? సిరిసిల్లటౌన్: ప్రజాపాలన దరఖాస్తులపై అధికారుల్లో పట్టింపు కరువైందని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ఆరోపించారు. సిరిసిల్లలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డుల్లో పేర్ల చేర్పులు, మార్పులు కోరుతూ దరఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా స్పందన లేదన్నారు. కొత్తరేషన్‌కార్డుల ఊసే లేదన్నారు. పౌరసంక్షేమ సమితి సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, సభ్యులు చిప్ప దేవదాసు, వేముల పోశెట్టి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు ఔట్సో ర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆదివా రం కలెక్టరేట్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిగాయి. మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా పోస్టులను అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ ఉన్నారు. రేపు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రసిరిసిల్ల: రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా మంగళవారం సిరిసిల్లలో జైబాపు..జై భీమ్.. జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్ నుంచి అంబేడ్కర్‌చౌరస్తా వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక లహరి గ్రాండ్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్, పీసీసీ ఇన్చార్జీలు హాజరవుతున్నట్లు తెలిపా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
ఆలయ విస్తరణ పనులకు మోక్షం
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులకు శృంగేరి పీఠాధిపతులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడ్వయిజర్ గోవిందాహరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి బృందం ఆది వారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ స్వామితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆలయ విస్తరణ నమూనాలు, పూజా విధానాలు, భక్తుల దర్శనాలపై మాట్లాడారు. విస్తరణ పనులు సాగే క్రమంలో శ్రీరాజరాజేశ్వరస్వామికి నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు యథావిధిగా ఏకాంతంగా దేవాలయ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవల ఏర్పాట్లు భీమేశ్వర ఆలయంలో చేయాలని తెలిపినట్లు చెప్పారు. త్వరలోనే ఆలయ విస్తరణపై టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆర్అండ్బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, సురేష్‌శర్మ, శృంగేరిపీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణశర్మ, ఏఈ రాంకిషన్‌రావు ఉన్నారు. శృంగేరి పీఠాధిపతుల గ్రీన్‌సిగ్నల్ రాజన్న గుడిలో ఏకాంత సేవ భీమన్నగుడిలో దర్శనాలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రాజన్నా.. దారికొచ్చేనా !
● వేములవాడలో కొలిక్కిరాని రోడ్ల విస్తరణ ● సర్వేలతోనే సరిపెడుతున్న అధికారులు ● ఏడు శాఖల ఆధ్వర్యంలో కొలతలు ● పునరావాసం కల్పించాలంటున్న దుకాణ యజమానులు వేములవాడ: దక్షిణ కాశీ.. ఆధ్యాత్మిక పట్టణం వేములవాడలో స్థానికులు, భక్తులు నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పట్టణంలో ఇరుకై న రహదారితో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ప్రత్యేక వారాలు శని, ఆది, సోమవారాల్లో భక్తుల రాక పెరగడంతో వాహనాల రద్దీ సైతం పెరిగిపోతుంది. దీంతో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం, అక్కడి నుంచి కోరుట్ల బస్టాండ్, ఇటు జగిత్యాల బస్టాండ్ వరకు రోడ్లపై వాహనాలు, జనం రద్దీతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీనికి పరిష్కారంగా ప్రధాన రహదారులను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.47కోట్లు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. ఏళ్లుగా సర్వేలతోనే సరిపెడుతున్నారు. ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో 243 మంది తమ ఆస్తులు పోయే పరిస్థితి ఉంది. అయితే పరిహారం విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో యజమానులు ముందుకురావడం లేదని తెలిసింది. వేములవాడలో రోడ్ల విస్తరణలో జాప్యంపై స్పెషల్ స్టోరీ. కొలతలతోనే సరి వేములవాడ పట్టణంలోని మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్లు భవనాలశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, అటవీశాఖ.. ఏడు శాఖల అధికారులతో కూడిన నాలుగు బృందాలు 24 మంది సభ్యులు ఇప్పటికే పలుమార్లు అంచనాలు వేశారు. పరిహారం అందించేందుకు తుది జాబితాను సిద్ధం చేయాలన్న అధికారుల ఆదేశాలతో కొలతలు వేసినట్లు బృందం సభ్యులు చెబుతున్నా దుకాణాల యజమానులు కోర్టు స్టే ఉన్నందున కొలతలు తీయొద్దని అడ్డుకుంటున్నారు. ప్రధాన అడ్డంకులు ఇవే.. ● మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం తమ భవనాలకు పరిహారం అందదని భూయజమానులు అసంతృప్తిగా ఉన్నారు. ● పాత ధరలకే భూములు తీసుకోవడంపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. ● దుకాణం పోతే తమ కుటుంబానికి అంతే స్థాయిలో ఆదాయం వచ్చేలా ఆధారం చూపాలని వ్యాపారుల నుంచి డిమాండ్ ఉంది. ● రోడ్డు విస్తరణలో కొందరి ఇళ్లు 70 నుంచి 80 శాతం కోల్పోతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ● తమకు జీవనాధారం చూపాలని రోడ్డును ఆనుకుని ఉన్న వ్యాపారులు, భవన యజమానులు కోరుతున్నారు. న్యాయపోరాటంలో నిర్వాసితులు..పునరావాసానికి ఓకే వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు ప్రధాన రోడ్డును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌పై దుకాణాలు కోల్పోతున్న నిర్వాసితుల హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా 10–4–2025 రోజున వాయిదా వేసిన ఉత్తర్వు కాపీని తమ దరఖాస్తుతోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి, భూసేకరణ అధికారి వేములవాడ ఆర్డీవోకు నిర్వాసితులు అందజేశారు. తమ షాపులు అప్పగిస్తున్నందుకు గుడిచెరువు కట్టకింద ఒక్కో యజమానికి ఒక్కో షాపు చొప్పున అప్పగిస్తూ పరిహారం చెల్లిస్తే ముందుకొచ్చేందుకు నిర్వాసితులు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్ల విస్తరణ స్వరూపంనిధులు రూ.47 కోట్లకుపైగా విస్తరించాల్సిన రోడ్డు ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు 80 ఫీట్లు విస్తరణలో పోతున్న షాపులు 243భూ యజమానులు 200 సేకరించాల్సిన స్థలం 8,200చదరపు గజాలునిర్వాసితులకు సరైన పరిహారం 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం ద్వారా జీవో విడుదల చేయించాను దాని ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా భూమి పూజ చేసుకున్నాం. ఈ ప్రక్రియ కోసం ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. నిర్వాసితులను ఒప్పించి..మెప్పించి సరైన పరిహారం చెల్లించి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ -
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించిన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన జై భీమ్.. జై బాపు, జై సంవిధాన్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి రజతోత్సవ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు. వారు ఎన్ని ఎత్తుగడలు వేసిన మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నోరు మూయించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ.. మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్కే గౌస్, శ్రీనివాస్, నంది కిషన్, సాహెబ్, బండారి బాల్‌రెడ్డి, దత్తాద్రిగౌడ్, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశ సమగ్రత కాపాడుకుందాం
కొవ్వొత్తులతో ర్యాలీలో కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు సిరిసిల్లటౌన్: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మృతులకు నివాళి అర్పిస్తూ శనివారం సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజు, మ్యాన ప్రసాద్, కాముని వనిత, కల్లూరి చందన పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు
● సబ్సిడీ ట్రాక్టర్లతో ఇసుక రవాణాను నిరోధించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీ ఐ–పాస్ కింద వచ్చిన దరఖాస్తులను నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ, జిల్లాలో టీజీ ఐ–పాస్ విధానం అమలవుతున్న తీరును ఆరా తీశారు. నూతన పరిశ్రమల స్థాపనకు వచ్చిన 27 ప్రతిపాదనలలో 21 ప్రతిపాదనలకు వివిధ శాఖలు జారీచేసిన అనుమతులను కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న 6 ప్రతిపాదనలు సైతం తక్షణమే సమీక్షించి అనుమతులు జారీ చేసి, ఆన్లైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టీ– ప్రైడ్ పథకం కింద మంజూరు చేసిన 42 యూనిట్లు ఫైల్స్ పూర్తిస్థాయి వివరాలను అందించాలన్నారు. టీఫ్రైడ్లో అందించిన ట్రాక్టర్లను ఇసుక రవాణాకు వినియోగించకుండా చూడాలన్నారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ టి.హన్మంతరావు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, జిల్లా రవాణా శాఖ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.స్వప్న, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నాజర్ అహ్మద్, ఫైర్ ఆఫీసర్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే భూ భారతి తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూ భారతి చట్టం చేసిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. తంగళ్లపల్లిలో భూభారతి చట్టంపై శనివారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని రాష్ట్రంలో మొదటగా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ చట్టం అమలు చేస్తుందని తెలిపారు. ముప్పై రోజుల్లోగా మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. లైసెన్స్ సర్వేయర్ల ద్వారా భూమి మ్యాప్ తయారు చేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతిలో కొనసాగుతాయని స్పష్టం చేశారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ నేరెళ్ల నర్సింగం, తహసీల్దార్ జయంత్‌కుమార్ పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు అభినందనల వెల్లువ
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నీరజ, ఫస్ట్ అడిసనల్ జిల్లా జడ్జి పుష్పలతను న్యాయవాదులు, మ్యాక్స్ సొసైటీ నాయకులు కలిశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపెల్లి శ్రీనివాస్‌రావు, మాక్స్ సొసైటీ చైర్మన్ గోవింద్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఇరుకుల అశ్విన్‌చంద్ర, డైరెక్టర్లు అనిల్‌కుమార్, వెంకటరెడ్డి, గుర్రం ఆంజనేయులు, పరశురాములు, శ్రీనివాస్, జ్యోతి, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, సభ్యులు ఉన్నారు. సీసీ కెమెరాలతో భద్రతపై భరోసావేములవాడ: సీసీ కెమెరాలతో భద్రతపై భరోసా కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ నిధులతో వేములవాడలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయన్నారు. వేములవాడలో మోడల్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్, జిల్లా కేంద్రంలో మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని డీఎస్పీ కార్యాలయనికి అప్పగించినట్లు తెలిపారు. వేములవాడ టెంపుల్ టౌన్ కాబట్టి రాత్రి 11.30 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచేలా చూడాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు తదితరులు ఉన్నారు. నాట్యంతో వ్యక్తిత్వ వికాసం ● వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సిరిసిల్లటౌన్: నాట్యంతో సమగ్ర వ్యక్తిత్వ వికాసం, ధారణ శక్తి పెరుగుతుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో శ్రీబాలత్రిపుర సుందరి నాట్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా నాట్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు కింకిణి ధారణ మహోత్సవం(గజ్జ పూజ) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎస్పీ మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా కూచిపూడి నాట్యం నేర్చుకున్నానని తెలిపారు. కోనరావుపేట ఎంపీడీవో శంకర్‌రెడ్డి, కరీంనగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయికుమార్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరిపురం కృష్ణ, ప్రధాన అర్చకుడు హనుమంత్ పంతులు, నాట్యాచార్యులు భోగ ధర్మరాజు, వసంత పాల్గొన్నారు. స్వర్ణకారుల వృత్తిని కాపాడాలి ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెల్లరీ దుకాణం అనుమతులు రద్దు చేసే దాకా ఉద్యమిస్తామని స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాల య్య పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో స్వర్ణకారు ల రిలేదీక్షలు శనివారం కొనసాగాయి. దీక్షలకు బీజేపీ నాయకులు సంఘీభావం పలికారు. వారు మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో జ్యువెల్లరీ దుకాణాలు పెట్టడంతో స్థానిక స్వర్ణకారులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారుల సంఘం నాయకులు వెంగళం శ్రీను, చింతోజు శ్రీను, భాస్కర్, బ్రహ్మం, వెంకటేశం, అనిల్, రవి, రాజు, శ్రీనివాస్, సతీశ్ పాల్గొన్నారు. -
నేడు శృంగేరికి అధికారులు
● రాజన్న ఆలయ అభివృద్ధికి మరో అడుగు వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణకు మరో అడుగు ముందుకుపడనుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదివారం శృంగేరికి వెళ్లనున్నారు. ఆమేరకు ఆది శ్రీనివాస్ సూత్రప్రాయంగా ఈ అంశాన్ని శనివారం వెల్లడించారు. ఈనెల 17న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, వీటీడీఏ వైస్‌చైర్మన్ సందీప్‌కుమార్ ఝా, ఆర్అండ్బీ రాష్ట్ర స్థాయి అధికారులు, ఆలయ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తీసుకున్న ప్రాథమిక నిర్ణయాలను శృంగేరి పీఠాధిపతులకు వివరించి, అనుమతులు తీసుకోనున్నారు. -
ఉద్యమస్ఫూర్తి..పాలనకీర్తి
● రజతోత్సవ వేళ బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలు ● నేడు ఊరూరా ఉద్యమజెండా ఆవిష్కరణలు ● వరంగల్ సభకు భారీగా తరలిపోతున్న జిల్లా గులాబీ శ్రేణులు ● పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పురుడుపోసుకుంది. ఉద్యమమే ఊపిరిగా ఎదిగిన టీఆర్ఎస్ కాలక్రమంలో బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ ఏర్పాటు.. ఆ తర్వాత రెండు పర్యాయాలు అధికారంలోకి రావడం తన పాతికేళ్ల వయసులో సాధించిన విజయాలుగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల సందర్భంగా వరంగల్‌లో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిపోతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాతికేళ్ల అడుగుజాడలను జిల్లాలోని ఆ పార్టీ అభిమానులు చర్చించుకుంటున్నారు. 2009లో కీలక పరిణామాలు రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 7న సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు ఆఫీస్‌లో బసచేశారు. మరుసటి రోజు ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో కేటీఆర్ క్యాంపు ఆఫీస్‌కు మళ్లీ వెళ్లే సమయం లేక దుస్తులను సిరిసిల్ల మానేరు వంతెనపైకి తెప్పించుకుని అక్కడే రోడ్డుపైనే మార్చుకున్నారు. సమయం.. విలువ తెలిసిన వ్యక్తిగా.. ఉద్యమ సారఽథిగా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా బక్కపల్చని పెద్ద మనిషి కేసీఆర్ రోడ్డుపై బట్టలు మార్చుకుని వెళ్లడం అప్పట్లో చర్చగా మారింది. నేడు జెండా పండుగలు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 25వేల మందిని సమీకరించి వరంగల్‌కు తరలించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం అన్ని గ్రామాల్లో జెండా పండుగలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు జెండా గద్దెలకు రంగులు వేసి సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి జై కేసీఆర్ నినాదాలు చేసి.. బస్సులు, వ్యాన్లలో పార్టీ శ్రేణులు ఎల్కతుర్తికి తరలివెళ్లనున్నాయి. ఎండల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామాల్లోని మహిళలను కాకుండా.. యువకులను, యువరైతులను సభకు ఆహ్వానించారు. ఎండల నేపథ్యంలో మహిళలు ఇబ్బందులు పడతారని, వృద్ధులు వస్తే.. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శనివారం మధ్యాహ్నం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ సభకు వస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాలను సమకూర్చుకున్న తీరును, సభ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంపై కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫోన్లో కేటీఆర్ మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో వరంగల్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ జిల్లా నాయకులు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల వారీగా, మండలాలు, గ్రామాల వారీగా సమీక్షించుకుంటూ.. జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచుదాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజసిరిసిల్లకల్చరల్: న్యాయ వ్యవస్థపై సమాజానికి నమ్మకం పెరిగేలా సమన్వయంతో పనిచేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కక్షిదారులకు సరైన న్యాయం జరిగేందుకు అడ్వకేట్లు, జ్యుడీషియల్ అధికారులతో సమన్వయం పెంచుకోవాలన్నారు. నూతన కోర్టు భవనం మంజూరైన నేపథ్యంలో అవసరమైన అన్ని ప్రక్రియలను సమష్టిగా సాధించాలన్నారు. వీలైనంత త్వరగా నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపల్లి వెంకటి, సీనియర్ న్యాయవాదులు రవీందర్రావు, కోడం సురేశ్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మంద పుష్పలత, నర్మెట రమేశ్, గాజుల రాజమల్లు, ఉచ్చిడి శరత్‌రెడ్డి సీనియర్, జూనియర్ న్యాయవాదులు సుమారు 200 మంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదాం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని , ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగును కట్టడి చేయాలన్నారు. బహిరంగంగా మద్యం సేవించకుండా నిరోధించాలని, పాన్‌షాపులు, సినిమా థియేటర్లు, బార్ల వద్ద నిఘా ఉంచాలని సూచించారు. బార్ నిర్వాహకులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి షాపులను ఎప్పుడు మూస్తున్నారో గమనించాలన్నారు. డ్రగ్స్ పరీక్షలు చేసే యూరిన్ కిట్లను పోలీసు, ఎకై ్సజ్ అధికారులు సమకూర్చుకోవాలని సూచించారు. ఎస్పీ మహేశ్ బి గితే మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణకు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్లను, హ్యాండ్‌బుక్‌లను ఆవిష్కరించారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష పాల్గొన్నారు. సెలవుల్లో పిల్లలపై దృష్టి పెట్టండి సిరిసిల్లక్రైం: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఆటలు, ఈత కొట్టడం వంటి వాటి కోసం ఆరుబయటకు వెళ్లే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు వారి కదలికలపై దృష్టి పెట్టాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాలమీదికి వస్తుందని పేర్కొన్నారు. పిల్లలు చెరువులు, కాల్వలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకులు ఎండవేడి నుంచి సేదతీరేందుకు ఈత నేర్చుకునేందుకు చెరువులు, కాల్వల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు ఈత నేర్చుకోవాలని సూచించారు. -
రైతులు సాంకేతిక పద్ధతులు పాటించాలి
● వ్యవసాయ శాస్త్రవేత్తలు బోయినపల్లి(చొప్పదండి): రైతులు సాగులో సాంకేతిక విధానాలు పాటించాలని జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ కె.మదన్‌మోహన్‌రెడ్డి కోరారు. బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయకళాశాల విద్యార్థులు మండలంలోని తడగొండలో శుక్రవారం రైతుసదస్సు, రైతులతో వ్యవసాయశాస్త్రవేత్తల చర్చాగోష్టి నిర్వహించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు శ్రీలత మాట్లాడుతూ మారుతున్న వాతావరణానికి అనుగణంగా రైతులు తమ పంటల సరళిని మార్చుకోవాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ కేబీ సునీతాదేవి నీటి యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్తలు మధూకర్‌రావు, రాజేంద్రప్రసాద్, ఉషారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇందూజ, మాధవి, అరుణ్, డీఏవో అఫ్జల్‌బేగం, ఏడీఏ రామారావు, ఉత్తమరైతు గుడి శ్రీనివాసరెడ్డి, నాయకులు చిందం రమేశ్, ఉయ్యాల శ్రీనివాస్, రావెప్ విద్యార్థులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పలువురు కోరారు. స్థానిక శివనగర్ శివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హక్కుల్ని తుంగలో తొక్కిందన్నారు. లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్న వివిధ పరిశ్రమలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకొని కార్మికుల ఉపాధి దెబ్బతీయడం శోచనీయమన్నారు. వివిధ యూనియన్ల నాయకులు వెంగళ శ్రీనివాస్, గుర్రం సతీశ్, కూరపాటి రమేశ్, అజ్జా వేణు, కడారి రాములు, సోమిశెట్టి దశరథం, జిందం ప్రసాద్, గొట్టె రుక్మిణి, కోడం రమణ, మూషం రమేశ్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన ● కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సంక్షేమ పథకాలతో సుస్థిర పాలన అందించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి, అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన జై భీమ్.. జై బాపు, జై సంవిధాన్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు ఎస్కే గౌస్, శ్రీనివాస్, గుర్రపు రాములు, షకీల్, గోపాల్, బండారి బాల్‌రెడ్డి, బుచ్చాగౌడ్, బాబు పాల్గొన్నారు. ముగిసిన ఓపెన్ పరీక్షలు● 26న సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ● డీఈవో జనార్దన్‌రావు సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. శుక్రవారం ఉదయ 3 పరీక్షా కేంద్రాల్లో 704 మందికి 638 మంది విద్యార్థులు హాజరుకాగా.. మధ్యాహ్నం 2 పరీక్షా కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు 47 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 26 నుంచి సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల నియంత్రణ సహాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేయాలి
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయాలని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. లారీలు, హమాలీ సమస్య లేదన్నారు. ధాన్యం తరలించడానికి సరిపడా వాహనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సీసీ పద్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వనిత పాల్గొన్నారు. ధరణిలోని రికార్డులు భూభారతిలో.. ధరణిలో ఉన్న భూరికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ రైతువేదికలో భూభారతి ఆర్వోఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతితో రైతుల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పరిపాలన అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాధాబాయి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు యాదగిరి, గుండం నర్సయ్య పాల్గొన్నారు. మలేరియా నిర్మూలనలో భాగస్వాములు కావాలి జిల్లాలో మలేరియాను సమూలంగా నిర్మూలించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. మలేరియా నిర్మూలనపై ఎల్లారెడ్డిపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ సయిరా అంజుమ్ పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
అప్పు పుట్టడం లేదు
వ్యవసాయం తర్వాత అధికులైన నేతకార్మికులకు పనుల్లేవు. సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రోత్పత్తి చేసే కార్మికులకు యజమానులు తక్కువ కూలీ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి సిరిసిల్ల నేతకార్మికులకు యారన్ సబ్సిడీ ద్వారా రూ.7కోట్లు రావాల్సి ఉంది. అవసరాల నిమిత్తం ఇప్పటికే ఆ డబ్బు వచ్చాక ఇస్తామని అప్పులు చేసిండ్రు. ఇంట్లో శుభకార్యాలు, ఆరోగ్యపరిస్థితుల రీత్యా అప్పులు అడిగితే కార్మికులకు ఇచ్చేవారు లేకుండా పోతుండ్రు. పనుల్లేక కనీసం ఇంటి సరుకులు కూడా అప్పు ద్వారా తెచ్చుకోలేని పరిస్థితిని కార్మికులు ఎదుర్కొంటున్నారు. – కోడం రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి -
ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు
రైతన్నలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వపరంగా రైతుబంధు అందివ్వకపోవడంతో పంటలు వేయడానికి ఇప్పటికే అప్పులు చేయడంతో వారి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉంది. ఉపాధిహామీ కూలీలు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాల్లేవు. ఫీల్డ్అసిస్టెంట్లు, ప్రభుత్వ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి రావడం లేదు. నేతకార్మికులకు కూడా పనుల్లేక వారికి అప్పులు పుట్టడం లేదు. ప్రభుత్వం ఆదుకోవడం లేదు. – గుంటి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
అప్పు పుట్టట్లే..!
జిల్లాలో దివాలా దిగులు ● జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులు దివాలా తీస్తున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ హోటల్ వ్యవస్థాపకుడు తనకు హైదరాబాద్ వంటి నగరాలతోపాటు చాలా ప్రాంతాల్లో హోటల్ వ్యాపారం నడిపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. దాదాపు రూ.300కోట్ల వరకు దివాలా తీసినట్లు ప్రచారం ఉంది. ● దశాబ్దంన్నరకు పైగా సిరిసిల్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిస్తూ జిల్లాలోనే నంబర్‌వన్ కౌంటర్‌గా ఓ వ్యాపారి పేరు గడించాడు. అనూహ్యంగా సదరు వ్యాపారీ రూ.3కోట్ల వరకు దివాలా తీసి కోర్టును ఆశ్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ● ఓ స్టీల్షాపు యజమాని రూ.కోటి, ఎలక్ట్రానిక్స్ షాప్ యజమాని కూడా కోట్లాది రూపాయలు దివాలా తీసి రుణదాతలకు ఐపీలు పంపించినట్లు ప్రచారంలో ఉంది. ● వేములవాడలో సైతం ఓ పూజారి జనాలకు అధిక వడ్డీలు ఆశ చూపించి రూ.2కోట్లు వరకు డబ్బులు వసూలు చేసి రుణదాతలకు ఇవ్వకుండా ఐపీలు పెట్టడం సంచలనం సృష్టించింది. ● వీరేకాకుండా జిల్లావ్యాప్తంగా పలువురు దివాలా తీసి పోగా రుణదాతలు ఆందోళనలో పడ్డ సంఘటనలు ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో మరికొంత మంది కూడా రుణాలు ఎగ్గొట్టే పరిస్థితుల్లో ఉన్నారన్న వార్తలు కూడా అప్పులు ఇచ్చే వారికి భయం పుట్టిస్తోంది.ఇంటి అవసరాలు చెల్లించేదెట్లా? సిరిసిల్లలో అధికశాతం జనాభా నేతకార్మి కులు, బీడి, వ్యవసాయరంగాల కార్మికులే. ఇక మధ్యతరగతి, వేతనజీవులు తర్వాతి స్థానంలో ఉంటారు. సంపన్నులు, వడ్డీకి ఇస్తూ గడిపేవారు తక్కువగా ఉంటారు. వేతన, మధ్యతరగతి, శ్రామికజీవులకు నెలలో ఆర్థిక అవసరాలకు కొందరు మాత్రమే ఉన్నారు.ఇటీవల జిల్లావ్యాప్తంగా వరుసగా దివాలా దీయడంతో నగదు లావాదేవీలు తగ్గిపోయాయి. అయిన వారికి కూడా అవసరానికి డబ్బులు ఇవ్వడానికి సంశయించే పరిస్థితులను జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక సగటు మధ్య తరగతి జీవి నెలవారీ బడ్జెట్‌తోనే కాలం వెల్లదీస్తుంటాడు. ఆ నెలంతా అయిన ఖర్చులకు ఒకటో తేదీన వచ్చే జీతంతో ఒకేసారి చెల్లిస్తుంటాడు. ఇంటి అద్దె, పాలబిల్లు, కిరాణం, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఆటోచార్జీలు, సెల్బిల్లు, డిష్బిల్లు...ఇలా నెల కాగానే బారెడు చెల్లింపులు ఉంటాయి. ప్రతీనెల ఒకటి నుంచి 5వ తేదీలోపు వీటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబం కనీసం రూ.10వేల నుంచి రూ.15వేలు చెల్లిస్తుంటాయి. -
సాదాబైనామాలకు భూభారతితో పరిష్కారం
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల/గంభీరావుపేట(సిరిసిల్ల): పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు నూతన ఆర్వోఆర్ చట్టం భూభారతితో పరిష్కారం లభించనుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. గంభీరావుపేటలోని రైతువేదికలో గురువారం నిర్వహించిన భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పీవోటీ, ఎల్టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.100 అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని వివరించారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివిల్‌కోర్టుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఆర్డీవో రాధాభాయి, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఆర్ఐలు గోపి, సత్యనారాయణ, ఎంఏవో సలావొద్దీన్ పాల్గొన్నారు. అనంతరం ముస్తఫానగర్, దేశాయిపేట గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలింపు నిమిత్తం రెండు వాహనాలను కేటాయించామని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులు ఆందోళన చెందొద్దని, పది రోజుల్లోపు వర్షాలు లేవని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పష్టం చేశారు. కలెక్టరేట్లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అపెరల్పార్క్తోపాటు అందుబాటులో ఉన్న గోదాములను గుర్తించి ధాన్యం నిల్వ చేయాలన్నారు. రైస్‌మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను పెట్టాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు పద్మయ్య, సుధారాణి, ఏపీఎంలు పాల్గొన్నారు. అపెరల్ పార్క్ సందర్శించిన కలెక్టర్ అపెరల్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించారు. అపెరల్ పార్క్‌లోని ఆరు షెడ్లు, 12 కంపార్టుమెంట్లను ధాన్యం నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని పౌరసరఫరాల డీఎం రజితను ఆదేశించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడింగ్ చేయాలని, హమాలీలకు తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. -
‘సెస్’ ఆస్తులను రక్షించాలి
● స్టోర్స్‌కు స్థలం సాధించాలి ● అక్రమ విద్యుత్ కనెక్షన్లు నియంత్రించాలి ● విద్యుత్ బకాయిలు వసూలు చేయాలి ● అవినీతి రహితంగా సేవలందించాలి ● సిరిసిల్ల ‘సెస్’ మహాజన సభలో సభ్యులు ● మిడిల్ పోల్స్ వేసి సమస్యలు పరిష్కరిస్తాం ● సభలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించిన చైర్మన్ చిక్కాల రామారావుసిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆస్తులను రక్షించాలని, అవినీతి రహితంగా సేవలందించాలని సంస్థ 51వ మహాజన సభలో సభ్యులు కోరారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మహాజన సభలో మాట్లాడారు. జిల్లాలో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 76 ఉండగా.. కొత్తగా మరో 17 కొత్త సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, టెండర్ల దశలో ఉన్నాయన్నారు. అదనంగా మరో 10 సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థలం కేటాయించాల్సి ఉందన్నారు. జిల్లాలో 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఆరు ఉండగా.. మరో రెండు నేరెళ్ల, బోయినపల్లిల్లో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో కలపాలని కొందరు అవగాహన లేక మాట్లాడుతున్నారని, సహకార రంగంలో దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ‘సెస్’కు పేరుందన్నారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కంటే మెరుగైన సేవలు అందిస్తున్నామని రామారావు వివరించారు. విద్యుత్ కనెక్షన్ల మేరకు సిబ్బంది లేకున్నా.. సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 5 హెచ్‌పీల వరకే ఉచిత కరెంట్‌ను ఇస్తున్నారని, కొందరు 7.5, 10, 15 హెచ్‌పీల మోటార్లను అక్రమంగా అమర్చి విద్యుత్‌ను వాడుకుంటున్నారని, అలాంటి వారు విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తే సంస్థ లాభాల్లోకి వస్తుందన్నారు. ‘సెస్’లో అక్రమంగా నియామకమై ప్రమోషన్లు పొందిన వారిపై విచారణ కమిటీని వేసి, కమిటీ సిపార్సుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సభలో ‘సాక్షి’ కథనం ప్రస్తావన ‘సెస్’ స్టోర్స్‌కు సిరిసిల్లలోని పాతస్థలాన్ని అప్పగించాలని, లేదా.. ఐదెకరాల స్థలంతోపాటు రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నా రు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ‘సెస్’ సేవా సదన్‌ను, 20 గుంటల స్థలాన్ని సంస్థకు స్వాధీనమయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చైర్మన్ సభలో ప్రస్తావించారు. ‘సెస్’లో కొత్త రిక్రూట్మెంట్లను ఎన్పీడీసీఎల్ ద్వారా పారదర్శకంగా నియమిస్తామని స్పష్టం చేశారు. ‘సెస్’ ఎండీ పి.విజయేందర్‌రెడ్డి సంస్థ వార్షిక నివేదికను వివరించారు. ఆదాయ, వ్యయాలు, అంచనా బడ్జెట్, ప్రతిపాదిత లక్ష్యాలను ‘సెస్’ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ‘సెస్’ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దా ర్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్‌రెడ్డి, గౌ రినేని నారాయణరావు, చందుపట్ల అంజిరెడ్డి, వ రుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీని వాస్‌రావు, ఆకుల గంగారాం, నామాల ఉమ, రేగులపాటి హరిచరణ్‌రావు, ఆకుల దేవరాజం, కొట్టెపల్లి సుధాకర్, ‘సెస్’ అధికారులు, ‘సెస్’ విలేజీ ప్రాతినిథ్య సభ్యులు ఉన్నారు. సభ్యుల వాగ్వాదం మహాజనసభలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకే వ్యక్తి ఎజెండా అంశాలన్నీ ప్రస్తావించడాన్ని తప్పుపడుతూ అందరికీ అవకాశం ఇవ్వాలని సభ్యులు కోరారు. దీనిపై సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. చప్పట్లు కొట్టండి అంటూ.. ‘సెస్’ చైర్మన్ రామారావు పదే పదే కోరడాన్ని సభ్యులు తప్పు పట్టారు. చప్పట్లు కొడితే.. అంశాన్ని ఆమోదించినట్లే కదా.. అంశాన్ని చర్చించిన తరువాతే చప్పట్లు కొడతామని సభ్యులు వివరించారు.కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి మా మండలానికి మల్లన్నసాగర్ నీళ్లు వస్తున్నాయి. రైతులు కాల్వల్లో మోటార్లు పెట్టి పొలాలు పారించుకుంటున్నారు. ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ అవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. అక్రమ కనెక్షన్లు తొలగించాలి. ఏఈఈలు, ‘సెస్’ సిబ్బంది బాగా పని చేస్తున్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు సహకరిస్తాం. – కల్వకుంట్ల గోపాల్‌రావు, మోహినికుంట -
జాతీయస్థాయిలో రాణించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సిరిసిల్లటౌన్: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళా శాల గ్రౌండ్లో గురువారం రాత్రి జిల్లా స్థాయి ఆ హ్వానిత వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విజేతగా సి రిసిల్లకు చెందిన స్యాట్ టీమ్, ద్వితీయ స్థానంలో సిరిసిల్ల వీబీఏ టీమ్ నిలిచాయి. తృతీయ గంభీ రావుపేట, నాలుగోస్థానంలో రుద్రంగి జట్లు నిలి చాయి. విజేతలకు నగదు పారితోషికంతోపాటు ట్రోఫీ అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ ప ట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వాలీబాల్ అ సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, గుడ్ల రవి, కోడం శ్రీ నివాస్, నారాయణ, గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, సంపత్, సురేష్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ వుషూ చాంపియన్‌షిప్
సిరిసిల్లటౌన్: అమేచ్యూర్ వుషూ అసోసియేషన్, జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్ వద్ద ఈనెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయి వుషూ పోటీలు జరగనున్నాయి. 3వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్–జూనియర్– జూనియర్ వుషూ చాంపియన్‌షిప్, 2వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వుషూ చాంపియన్‌షి నిర్వహించనున్నట్లు వివరించారు. వివరాలకు 94940 73930లో సంప్రదించాలని కోరారు. కులవృత్తులను కాపాడండి ముస్తాబాద్(సిరిసిల్ల): కార్పొరేట్ నుంచి కులవృత్తులను రక్షించాలని కోరుతూ ముస్తాబాద్‌లో స్వర్ణకారులు గురువారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ముస్తాబాద్ గ్రామపంచాయతీ ఎదుట స్వర్ణకారుల సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య గురువారం దీక్షలను ప్రారంభించారు. బాలయ్య మాట్లాడుతూ ముస్తాబాద్‌లో రాజస్థాన్ జ్యువెలరీ దుకాణా లకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. జ్యువెల్లరీ దుకాణ యజమానులు ఇప్పటికే పలు పట్టణాల్లో మోసాలకు పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న స్వర్ణకారుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో ప్రారంభించే జ్యువెల్లరీ దుకాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ మండ ల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ వీరి దీక్షలకు సంఘీభావం తెలిపారు. స్వర్ణకారుల సంఘం నాయకులు నారోజు రాజు, శ్రీనివాస్, వెగ్గలం శ్రీను, రాజు, చేపూరి బ్రహ్మం, నాగరాజు, సతీశ్, శంకర్, రఘు, అనిల్, ఈశ్వరయ్య, వెంకటేశం, రవి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి ● కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరి జగన్మోహన్రెడ్డి కోరారు. మండలంలోని దుమాల, అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండాల్లో గురువారం నిర్వహించిన జై భీమ్.. జై బాపు, జై సంవిధాన్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీవ్ యువశక్తి పథకాన్ని యువకులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సన్నబియ్యం పథకంపై గ్రామాల్లో అందరికీ పూర్తిస్థాయిలో అవగాహన లేదని, దీనిపై ప్రచారం చేయాలన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఎస్కే గౌస్, శ్రీనివాస్, బాలయ్య, గణపతి, బుచ్చాగౌడ్, బండారి బాల్‌రెడ్డి, కదిరే శ్రీనివాస్, రవి, మధు, కిషన్, బాలాగౌడ్ పాల్గొన్నారు. 29న సదరం శిబిరం సిరిసిల్లకల్చరల్: దివ్యాంగుల వైకల్య నిర్ధారణ కోసం ఈనెల 29న సదరం శిబిరం నిర్వహించనున్నట్లు ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అవసరం ఉన్న వారు తమ వివరాలను తప్పుల్లేకుండా పొందుపరిచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. కంటిచూపు, మానసిక వైకల్యం గల వారు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్‌రే తదితర సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. చిన్నారులకు టీకాలు వేయించాలి● డీఎంహెచ్‌వో రజిత కోనరావుపేట(వేములవాడ): ఈనెల 21 నుంచి అమలు చేస్తున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో చిన్నారులకు టీకాలు వేయించాలని జిల్లా వైద్యాధికారి రజిత సూ చించారు. మండలంలోని పీహెచ్సీ పరిధిలోని నిజామాబాద్, ధర్మారం, కొండాపూర్(నిమ్మపల్లి) ఆరోగ్య ఉపకేంద్రాల్లో అమలు చేస్తున్న ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల శిబిరాలను గురువారం తనిఖీ చేశారు. కోనరావుపేట పీహెచ్సీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి, డీఐవో సంపత్‌కుమార్, ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి వేణుమాధవ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయండి
● సిరిసిల్ల, చందుర్తిలలో రోడ్డెక్కిన రైతులుసిరిసిల్లటౌన్/చందుర్తి(వేములవాడ): ధాన్యం వర్షార్పణం కాకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు సిరిసిల్ల, చందుర్తిలలో గురువారం రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. తాము పండించిన ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. సమీప జిల్లా నిజామాబాద్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా ఇస్తున్నారని, మన జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురుచూసుడే అవుతుందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తదితరులు రైతులకు సంఘీభావం తెలిపారు. చందుర్తిలో.. రైతులు ధాన్యం కొనాలని కోరుతూ చందుర్తి బస్టాండ్‌లో బైఠాయించారు. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై అంజయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను అక్కడి నుంచి బలవంతంగా లాగేశారు. అనంతరం ధాన్యం కల్లాల ఏర్పాటుకు 176 సర్వే నంబర్లో స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. రైతులు సిరికొండ శ్రీనివాస్, సిర్రం తిరుపతి, మర్రి రాజు, మెంగని రవి, షిర్డి మల్లేశం, సిర్రం మల్లేశం, తిప్పని భూమేశ్, మర్రి మల్లేశం, మర్రి రమేశ్, మేడిశెట్టి శ్రీహరి, మర్రి లక్ష్మీరాజం, మర్రి రాములుతో పాటు 50మంది రైతులు పాల్గొన్నారు. -
అత్తాకోడళ్లు కాదు.. తల్లీకూతుళ్లు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెల్పూ రి రాజమ్మ– రాములుది ఆదర్శ ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనోన్యత చాటే తోడికోడళ్లు. అత్త సారథ్యంలో కుటుంబ నిర్వహణ. తల్లీకూతుళ్ల వలె కలిసిమెలిసి ఉంటారు. వైషామ్యాలకు తావులేకుండా పండంటి కా పురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు సరిత, అంజలి, గాయత్రి, అంజలి. సరిత భర్త ఓదెలు, అంజలి భ ర్త గట్టయ్య, గాయత్రి భర్త రాజమౌళి, అంజలి భర్త లింగమూర్తి. అన్నదమ్ములందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలు సాయితేజ, సిందూజ, అమూల్య, అక్షిత, రేవంత్, రుత్విక్, రిషిత, కార్తీకేయ. ఇక ఆడబిడ్డలు శంకరమ్మ– శంకరయ్య, లక్ష్మీకాంత– రవి. వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఆడబిడ్డ కుమారుడైన లవకుమార్‌కు సిందూజతో వివాహం జరిగింది. ఆడబిడ్డలు, కూతురు వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లును చూసి ఆదర్శవంతమైన కుటుంబం అని గ్రామస్తులు కితాబునిస్తారు. -
పంచాయతీ కార్యదర్శి కథ సుఖాంతం
సిరిసిల్లక్రైం/తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ నాయకుల వేధింపులతో అదృశ్యమైన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రియాంక ఆచూకీ కడప జిల్లాలో లభ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా గురువారం ఉదయం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రియాంక తనగోడును పోలీసుల ఎదుట వెల్ల బోసుకుంది. ఇప్పటికే సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. దర్యాప్తు జరుగుతోంది. ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నలుగురు వ్యక్తులు గుగ్గిళ్ల శ్రీకాంత్, గుగ్గిళ్ల అభి, మల్లేశ్, రాజు వేధింపులతోనే తన ఉద్యోగానికి రాజీనామా పంపి వెళ్లిపోయానని తెలిపారు. చేయని పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల కోసం ఒత్తిడి చేశారని వెల్లడించారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాళిక పరిష్కారం మాత్రమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లను ప్రకటించాలని ఒత్తిడి చేశారని.. అది కుదరదని చెప్పడంతో అనేక మాటలన్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఏకవచనంతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. దీనిపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలికడం చిన్న స్థాయి అధికారులమైన తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వేధింపులు భరించలేకే రాజీనామా పత్రాన్ని వాట్సాప్ ద్వారా ఉననతాధికారులకు పంపించినట్లు వివరించారు. కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగులతో ఎలా ఉండాలో పార్టీ పెద్దలు కింది స్థాయి నాయకులకు సూచించాలని కోరారు. సిరిసిల్లకు చేరిన కార్యదర్శి ప్రియాంక పట్టణ పోలీస్ స్టేషన్లో హాజరు -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఉపాధి కూలీలు, రైతులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారిణి సారియా అంజుమ్ అన్నారు. మండలకేంద్రంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు, ఐకేపీ కేంద్రాల వద్ద వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. కార్యవర్గం ఎన్నిక ఇల్లంతకుంట(మానకొండూర్): మండల ఎన్హెచ్ఆర్సీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా కాసుపాక శ్రీనివాస్, గంగం అనిల్ ప్రధాన కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా పినకాసి మనోహర్, సహాయ కార్యదర్శులుగా, కాసుపాక బాబు, నారెడ్డి రాజశేఖర్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూగజీవాలకు ఆహారం పంపిణీగంభీరావుపేట(సిరిసిల్ల): భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దమ్మ అటవీ ప్రాంతంలోని మూగజీవాలకు గొల్లపల్లికి చెందిన సత్యసేవా సమితి సభ్యులు గురువారం పళ్లు, మంచినీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ కూర రవి, సభ్యులు కొండ రమేశ్, భిక్షపతి, బాబు, శ్రీనివాస్, దేవేందర్, హర్షవర్ధన్, దేవేంద్ర, స్పందన, విజయ, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
రెండు దశాబ్దాలుగా..
రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌కు చెందిన బైరి రాజేశం–జయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికి పెళ్లిళ్లయ్యాయి. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లతో కలిసి రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు. అంతా కలిసి పండుగలను సంతోషంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, ఎమ్మెస్సీ బీఎడ్ చదివి ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. కరోనాతో స్కూల్ మూతపడడంతో ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీలో నాగరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కిరాణం షాపు పెట్టుకుని ముగ్గురన్నదమ్ములు నాగరాజు, ప్రవీణ్‌కుమార్, సుమన్‌కుమార్ చుసుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటేనే ఆనందం ఉంటుందని రాజేశం పేర్కొన్నారు. -
అందరూ ఒకే ఇంట్లో..
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని అట్ల భూమవ్వ–అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి. తండ్రి కొద్ది రో జుల క్రితం మృతిచెందాడు. అ న్నదమ్ములు ఎవరి పనులు వారు చే సుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. తిరుపతిరెడ్డి–గాయత్రి దపంతుల కు ఇద్దరు కుమారులు అభినయ్, కార్తీక్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి– సంధ్యకు ఇద్దరు కుమారులు అక్షిత్, జశ్వంత్. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఉమ్మడిగానే సాగు చేస్తున్నారు. పిల్లల చదువులుసైతం ఉ మ్మడిగానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ పండుగే.. నా కొడుకులు ఎవరి పనులకు వారు వెళ్తారు. కోడళ్లు ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు చేతనైనంత ఇంటి పనుల్లో సాయం చేస్తుంటా. కొడుకులు, కోడళ్లు, మనుమళ్లతో కలిసి ఉంటే రోజూ పండుగ వాతావరణం ఉంటుంది. – అట్ల భూమవ్వ, తాటిపల్లి -
ఒకే రోజు ఆరు అగ్నిప్రమాదాలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో మొత్తం ఆరు అగ్రిప్రమాదాలు సంభవించాయి. వెంటవెంటనే జరిగిన ఆరు అగ్ని ప్రమాదాలు ఫైర్ అధికారులను ఊపిరిపీల్చుకోనివ్వలేదు. మండుటెండలకు విపరీతమైన వేడితో గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన అగ్నితో శాతవాహనలో అగ్నిమంటలు చెలరేగగా వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులే ఫైర్ అధికారులకు ఫోన్ చేశారు. డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ ఫైరింజిన్ శాతవాహన యూనివర్సిటీకి చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమవగా గాలికి మంటలు ఎక్కువ అవడంతో మానకొండూర్ నుంచి ఫైరింజిన్‌ను పిలిపించారు. కరీంనగర్, మానకొండూర్ ఫైర్ అధికారులు రాజ్‌కుమార్, భూదయ్యలు సిబ్బందితో కలిసి రాత్రి వరకు శాతవాహనలో పొగలురావడంతో అక్కడే ఫైరింజన్ల సహాయంతో సేవలు అందించారు. ● ఇవే మంటలకు చెందిన పొగలు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు రావడంతో అప్రమత్తమైన ట్రైనీ ఐపీఎస్ వసుంధరాయాదవ్ ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే చేరుకొని అక్కడ విధులు నిర్వహించి మంటలు ఎగిసిపడకుండా చర్యలు చేపట్టారు. ఈప్రమాదంలో శాతవాహనలో వివిధ రకాల చెట్లు కాలిపోయాయి. ● పద్మనగర్‌లోని వ్యవసాయ కేంద్రం వెనుక నుంచి ప్రారంభమైన మంటలు యూనివర్సిటీ వైపు రావడంతో అక్కడి వైపు నుండి కూడా పొగమంటలు పెద్ద ఎత్తున రావడంతో వేములవాడకు చెందిన ఫైర్ ఇంజన్ పిలిపించారు. ● శాతవాహన యూనివర్సిటీ గేటువద్ద ఒక సానిటరీ షాపులో షాట్‌సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని వెంటనే యూనివర్సిటీలో సేవలందిస్తున్న మానకొండూర్ ఫైర్ ఇంజన్‌ను పంపించి అక్కడ మంటలను ఆర్పారు. ● కరంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద గల ఐటీ టవర్ వెనక ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫోన్ చేయగా చొప్పదండి ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు. ● నాగులమల్యాలలోని ఇండ్ల పక్కన గల ఖాళీ ప్రదేశంలో మంటలు చెలరేగడంతో వేములవాడ ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పారు. శాతవాహనలో పెద్ద ఎత్తున మంటలు రాత్రి వరకు సేవలందించిన నాలుగు స్టేషన్ల ఫైర్ సిబ్బంది -
ఎన్నాళ్లీ ‘కరెంట్’ కష్టాలు !
ఇది రుద్రంగిలోని సెస్ సభ్యుల సేవాసదన్. రుద్రంగి కొత్త మండలం కావడంతో ఇక్కడ సంస్థకు సొంత స్థలం, భవనం లేదు. ఓ అద్దె భవనంలోని రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి.ఇది రుద్రంగి మండలం వీరునితండాలో వ్యవసాయబావి వద్ద విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడడంతో సదరు రైతు మిడిల్ పోల్(మధ్య స్తంభం)కు బదులుగా కర్రను ఊతంగా పెట్టుకున్నారు. 2016 నుంచి 2023 వరకు 11,458 మిడిల్ పోల్స్ వేసినట్లుగా, 2024లో మరో 2,897 స్తంభాలను రైతుల పొలాల్లో లూజువైర్లను సవరించేందుకు వేసినట్లుగా ‘సెస్’ రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇలాంటి ప్రదేశాల్లో ఇంకా కర్రస్తంభాలే కనిపిస్తున్నాయి.ఇది ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్. వాస్తవానికి ఈ భవనం ‘సెస్’ సభ్యుల సేవాసదన్ది. మూడున్నర దశాబ్దాల క్రితం ఎల్లారెడ్డిపేట మండలంలోని విద్యుత్ వినియోగదారుల సేవలందించేందుకు ‘సెస్’ సంస్థ నిర్మించింది. అప్పట్లో శాంతిభద్రతల కారణంగా పోలీస్‌స్టేషన్ నిర్వహణకు ఈ భవనాన్ని పోలీసులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ భవనం పోలీసుల ఆధీనంలో ఉంది. ‘సెస్’ సంస్థకు సొంత భవనం లేకుండా పోయింది. -
రజతోత్సవ సభకు దండుగా కదలిరావాలి
● బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్ సిరిసిల్లటౌన్/ఎల్లారెడ్డిపేట: ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు దండుగా కదలిరావాలని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అందె సుభాష్, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, రాచర్లబొప్పాపూర్, రాచర్లతిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, హరిదాస్‌నగర్, వెంకటాపూర్ గ్రామల్లో బుధవారం రజతోత్సవసభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నమిలికొండ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్, నర్సింలు, నాగరాజు, సీత్యానాయక్, గట్ల అనిల్, రాములునాయక్, శంకర్‌నాయక్, పర్శరాములు పాల్గొన్నారు. ఇంటింటికీ ఆహ్వానపత్రిక సిరిసిల్లలో మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి డప్పుచప్పుళ్ల మధ్య ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందించారు. నాయకులు గూడూరి ప్రవీ ణ్, బత్తుల వనజ, వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కూరపాటి భూమేశ్, వేముల తిరుపతి, ముదారపు లలిత పాల్గొన్నారు. క్రీడలకు పెద్దపీట● జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం సిరిసిల్లటౌన్: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. స్థానిక కాలేజీగ్రౌండ్‌లో బుధవారం జిల్లాస్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీలను జిల్లావాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొననున్నాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజ్మీర రాందాస్, గుడ్ల రవి, కోడం శ్రీనివాస్, నారాయణ, దేవయ్య, సంపత్, సురేష్, కోడం శ్రీనివాస్, బుర్ర నారాయణ పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ గంభీరావుపేట(సిరిసిల్ల): ఐఐటీ తిరుపతి నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ హాక్ 5.0 వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో మండలంలోని దమ్మన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పొన్నాల లోహిత ప్రతిభ కనబర్చింది. ఆన్లైన్లో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లోహిత తయారు చేసిన ‘క్లాస్ రూం ఫ్రెండినో’ ప్రదర్శనకు బహుమతి లభించింది. హెచ్ఎం వెంకటేశ్వర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్: భూభారతి ద్వారా గతంలోని సమస్యలకు పరిష్కారమార్గం ఏర్పడుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం హన్మాజీపేటలో భూభారతి చట్టంపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాట ప్రకారం నేడు భూభారతి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో నేను ముమ్మాటికీ భారతీయుడిని అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి కూడా న్యాయస్థానం ఎదుట తలవంచి రూ.30లక్షలు చెల్లించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం కృషి చేసేదన్నారు. రూ.2లక్షలు రుణమాఫీ చేశామని, హన్మాజీపేట బ్రిడ్జి పూర్తి చేశామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తహసీల్దార్ అబుబాకర్, ఏవోలు సాయికిరణ్, వినీత, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సెస్ డైరెక్టర్ దేవరాజం, నాయకులు సామ తిరుపతిరెడ్డి, చిలుక ప్రభాకర్, చెన్నాడి శ్యామల పాల్గొన్నారు. -
ఉగ్రదాడిపై ఆగ్రహజ్వాల
సిరిసిల్లటౌన్/వేములవాడ: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్లలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మహిళా నాయకులు పల్లం అన్నపూర్ణ, వైశాలి, కర్ని హరీష, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్న గుడి ఎదుట బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, రేగుల మల్లికార్జున్, రాపెల్లి శ్రీధర్ తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. -
బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులు బుధవారం జిల్లా కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, పోక్సో కోర్టు, ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి బి.పుష్పలత బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే కలిసి, పూలమొక్క అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపల్లి వెంకటి, ఇతర ప్రతినిధులు ఉచ్చిడి శరత్‌రెడ్డి, గాజుల రాజమల్లు, నర్మెట రమేశ్, వేముల నరేశ్ జడ్జీలను కలిశారు. -
ఓ పాఠం
గెలుపు ఓటమిఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు. ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదుఈ ఏడాది ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యఇంటర్హుజూరాబాద్: ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.కరీంనగర్పెద్దపల్లిజగిత్యాలసిరిసిల్ల -
డబ్బుల్ అందవేమి?
ముస్తాబాద్(సిరిసిల్ల): సొంతింటి కల నిజం చేసుకునేందుకు అప్పు చేసి డబుల్బెడ్రూమ్ ఇళ్ల పనులు మొదలుపెట్టారు. అయితే బిల్లులు మంజూరుకాకపోవడంతో కొందరి ఇళ్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ అప్పు పుట్టక ఇళ్లు పూర్తికాక ‘డబుల్’ లబ్ధిదారులు కొందరు అద్దె ఇళ్లు.. మరికొందరు గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రస్తుత ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో సొంతింటి కల నిజం చేసుకుందామనుకున్న లబ్ధిదారులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పటికై నా తమను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులకు వర్తింపజేసి బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. – వివరాలు 8లో.. -
● వెలుగుల ‘సెస్’ను కమ్మిన చీకట్లు ● లూజు వైర్లు.. కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్లు ● గుదిబండగా రూ.883.25 కోట్ల బకాయిలు ● నేడు ‘సెస్’ 51వ మహాసభ
సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)కు ఇప్పుడు ‘కరెంట్’ కష్టాలు ఎదురవుతున్నాయి. ‘సెస్’ సంస్థ అంటే ఒకప్పుడు వినియోగదారుల శ్రమదానం.. సొంత ఆస్తులు.. ఆర్థిక సమృద్ధి.. సామాజిక సేవలు.. జాతీయబ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు.. సొంత సిబ్బందితో అద్భుతమైన సేవలతో గుర్తింపు పొందింది. మరిప్పుడు.. కాంట్రాక్టర్ వ్యవస్థ.. డిప్యూటేషన్ సిబ్బంది.. క్షేత్రస్థాయిలో అవినీతి.. ఏ పని చేయాలన్నా చేతివాటం.. పాలకవర్గాల ధనదాహం.. అద్దె భవనాలు.. ఆవిరైన సంపద.. వెరసి రూ.883.25 కోట్ల బకాయిల భారం.. ఇది ‘సెస్’ ప్రస్తుత రూపం. 55 ఏళ్ల చరిత్ర గల ‘సెస్’ సంస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ‘సెస్’ 51వ మహాసభ గురువారం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఏమిటీ ‘సెస్’ ప్రత్యేకత కేంద్ర గ్రామీణ విద్యుద్ధీకరణసంస్థ(ఆర్ఈసీ) దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలను స్థాపించగా అందులో సిరిసిల్ల ‘సెస్’ ఒక్కటి. అన్ని సంస్థలు కాలగమనంలో ఉనికి కోల్పోగా సిరి సిల్ల సంస్థ ఉత్తమ సేవలతో ముందుకెళ్తోంది. ‘సెస్’ పరిధిలో వ్యవసాయాభివృద్ధి, వస్త్రోత్పత్తిరంగ అభివృద్ధికి బాటలు వేసింది. వినియోగదారులు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. విద్యుత్ ట్రా న్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లోనే రీప్లేస్ చేస్తారు. విద్యుత్ వినియోగదారులు క్రమం తప్పకుండా కరెంట్ బిల్లులు చెల్లిస్తూ సంస్థకు సహకరిస్తారు. కాలక్రమంలో.. ఏమైంది ? విద్యుత్ వినియోగదారులు సభ్యులుగా ‘సెస్’ సంస్థ కొనసాగుతూ.. పార్టీ రహితంగా ఎన్నికలు జరి గేవి. మండలానికి ఒక్క డైరెక్టర్, వారిలోనే ఒక్కరు చైర్మన్, మరొకరు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యేవారు. ఇలా సహకార విధానంలో జరిగే ఎన్నికలు రెండు దశాబ్దాలుగా పార్టీల రంగుపులుముకుంది. ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బులు ఖర్చు చేయడంతో ఆ డ బ్బులు రాబట్టుకునేందుకు ‘సెస్’లో అవినీతి భీజా లు పడ్డాయి. సహకార స్ఫూర్తి కనుమరుగై కాంట్రా క్టర్ విధానం వచ్చింది. ఫలితంగా ‘నాకెంత.. నీకెంత’ అనే ధోరణి మొదలైంది. ఇలా ఎన్నికై న పాలకవర్గాలు సెస్‌ను నిండా ముంచాయి. 2001లో వివి ధ వాణిజ్య బ్యాంకుల్లో ‘సెస్’ సంస్థ ఫిక్స్‌డిపాజిట్లు రూ.150కోట్లుగా ఉండేవి. కాలక్రమంలో అవి కరి గిపోయి.. ఇప్పుడు సంస్థ రూ.వెయ్యి కోట్ల బకాయిల్లో నిండా మునిగింది. చేయి తడపనిదే పనిచేయని స్థాయికి ఉద్యోగులు, సిబ్బంది దిగజారారు. మహాసభ కారాదు మొక్కుబడి ! ‘సెస్’కు మహాసభ తీర్మానాలే శిరోధార్యం. కానీ సభ్యులు మొక్కుబడిగా చప్పట్లు కొట్టి తీర్మానించడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే కొత్త ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు. కానీ మళ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మిడిల్పోల్స్ వేయకుండానే వేసినట్లు రికార్డులు రాసిన అంశంపై థర్డ్‌పార్టీ విచారణ బుట్టదాఖలైంది. డబ్బులు తీసుకుని సి బ్బంది నియామకాలు అభాసుపాలయ్యాయి. సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసేలా, విద్యుత్ బకాయిలు వసూలుకు ప్రణాళిక సిద్ధంగా పనిచేస్తేనే సంస్థ మనుగడ సాధ్యం. ఆ దిశగా మహాసభలో సభ్యులు విజ్ఞతతో తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది.‘సెస్’ స్వరూపం సభ్యులు: 3,45,628 ఉద్యోగులు: 355 వ్యవసాయ కనెక్షన్లు : 78,611 మరమగ్గాల కనెక్షన్లు : 8,265 గృహవిద్యుత్ కనెక్షన్లు : 1,65,928 పరిశ్రమలు: 1,657 దుకాణాలు: 14,138 విద్యుత్ సబ్స్టేషన్లు: 46ఆదాయ, వ్యయాలు ఇలా.. విద్యుత్ కొనుగోలు నెలకు : రూ.45 కోట్లు బిల్లుల వసూలు నెలకు : రూ. 14.50 కోట్లు ప్రభుత్వం చెల్లించే రాయితీలు: రూ.23.50 కోట్లు నెలవారీగా సిబ్బంది జీతాలు: రూ.3 కోట్లు డిస్కమ్‌కు బకాయిలు: రూ.558.44 కోట్లు సంస్థకు రావాల్సిన బకాయిలు : 624.92 కోట్లు మొత్తం బకాయిలు: 883.25 కోట్లు -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రామ కమిటీలు గుర్తించిన వారితోపాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్ ఉన్నారు. మాతాశిశు మరణాలు నివారించాలిమాతాశిశు మరణాలు నివారించాలని, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గత నెలలో 666 డెలివరీలు చేశామని డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. గైనకాలజిస్ట్లు అవసరం ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు. విదార్థులకు అభినందన ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన హేమంత్ 496 మార్కులతో మొదటి ర్యాంకు, ఆదిల్ షరీఫ్ 483, షారుక్ 969, సంజయ్ 962 మార్కులు సాధించారు. -
సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 11,446 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,195 మంది బల్దియా కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. యూనిట్ల వారీగా అర్హులను గుర్తించడం కోసం ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. తొలిరోజు ఎన్టీపీసీ, రామగుండం ఏరియాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ రెండు బ్యాంకులకు 1,050 మంది దరఖాస్తు చేసుకోగా, ఇదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇద్దరే అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేశించారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్, పాన్‌కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ● భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు -
గుడిసెలో ఉంటున్నం
రెండేళ్ల క్రిందట డబుల్బెడ్రూమ్ ఇల్లు సాంక్షన్ అచ్చిందని చెప్పిండ్రు. రూ.3లక్షలు అప్పు చేసి బేస్మెంట్, పిల్లర్ల వరకు కట్టుకున్న. నా పెనిమిటి దుబాయ్‌కు పోతే అక్కడ మోసం చేసిండ్రు. ఇంటికొచ్చి, గుంట జాగ అమ్మి మళ్లా దుబాయ్‌కు పోయిండు. నా బిడ్డ, నేను గుడిసెలో ఉంటున్నం. కలెక్టర్ సారూ.. ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ ఇప్పించి ఆదుకోవాలే. – లింగాల గౌరవ్వ, చీకోడు ప్రభుత్వానికి నివేదించాం గతంలో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఆర్అండ్బీ చూసింది. ఇళ్ల పనులు మొదలుపెట్టిన వారి వివరాలు.. ఎంతమేరకు బిల్లులు చెల్లించామో అధికారులకు అందించాం. 2బీహెచ్‌కే లబ్ధిదారులు, బిల్లులు రాని వివరాలు ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గృహనిర్మాణ శాఖకు అప్పగించారు. – శాంతయ్య, ఆర్అండ్బీ డీఈఈ -
జగిత్యాలకు రెడ్ అలర్ట్
బయటకు వెళ్లలేని పరిస్థితి ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)మరో నాలుగు రోజులు వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వడదెబ్బతో విలవిల ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు. వాతావరణ మార్పులే కారణం వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మరో నాలుగు రోజులూ ఎండలే రోజురోజుకూ ఆగ్రహిస్తున్న సూర్యుడు బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. -
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్రోడ్లోగల లో చిట్‌ఫండ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్రోడ్లోగల ఓ చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. ● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు ● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని నిర్వాహకులు ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు 19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్‌ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్‌లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్‌ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది. చిట్స్‌ఫండ్స్ మోసాలు జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్డ్ చిట్స్‌ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్‌ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్స్‌ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాకట్టు వ్యాపారం జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్‌ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల్లేని ఫైనాన్స్‌లపై చర్యలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్‌లు, చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్‌ఫండ్స్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను గత నెలలో రిమాండ్‌కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్‌ను అభినందించారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
బద్దెనపల్లి గురుకుల విద్యార్థుల హవా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. ఎంపీసీలో బి.నందిని 995, కె.కీర్తన 979, కె.వర్శిత 976, ఏ.హేమలత 976, జి.అఖిల 974, కె.నిత్యశ్రీ 974, బైపీసీలో బి.మమత 989, హరిప్రియ 981, డి.వర్శిని 980, ఎం.చందన 975, సీహెచ్.గాయత్రి 965 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలో కె.శ్రీజ 437, శ్రీవాణి 433, సౌత్రిక 432, ఐశ్యర్య 432, అభినయ 427, ఎంపీసీలో ఎం.సౌమ్య 453, అనూష 451, హరిణి 448, సోనా 441, దీక్షిత 437 మార్కులు సాధించారు. -
‘ఎస్వీజేసీ’ విజయదుందుబి
కరీంనగర్: ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఫస్టియర్‌లో ఎంపీసీలో సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి 468, బి.వెన్నెల 466, బి.శ్రీనిత్య 466, బి.హరిణి 465, ఎన్.అరుణ్‌తేజ 464, కె.సహస్ర 463, ఎస్కే.తమన్నా 463, జె.సునీల్ 462, పి.సంజన 462, ఏ.హర్షవర్దన్ 462 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర 437, డి.శివకుమార్ 437, డి.శ్రీనిధి యాదవ్ 435, ఎం.స్పందన 434, అనికేత్ మిశ్రా 434,శ్రీవల్లి 432, బి.రుచిత 431, ఎన్.నిహారక 430 మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీలో పి.లిఖిత 992, ఎం.స్పూర్తి 992, ఎస్.రిషిక 991, టి.లిఖిత గౌడ్ 989, ఆర్.మేఘన 988, కె.కార్తీక్ 988, ఎస్.లావణ్య 987, ఎం.త్రిణిజ 987, ఎస్.రక్షిత 987 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్‌రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
బోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన సందరగిరి రాకేశ్ (24) అ నుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై పృధ్వీధర్‌గౌడ్, స్థానికులు తెలిపిన వివరాలు.. బోయినపల్లికి చెందిన రాకేశ్ డిగ్రీ చదివి కరీంనగర్లో ప్రైవేట్ జాబ్ చే స్తూ అక్కడే నివాసం ఉంటాడు. ఇంట్లో జ రిగిన కార్యానికి ఈనెల 17న గ్రామానికి వచ్చాడు. 18న ఉ దయం బైక్‌పై బయటకు వెళ్లాడు. డ్యూటీకి వెళ్లాడని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కంగారు ప డ్డారు. మంగళవారం బోయినపల్లి– మర్లపేట శివారు లక్కుంట పరిసరాల్లో ఓ బైక్, వ్యక్తి మృతదేహం ఉండడాన్ని ఉపాధి కూలీలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా కొద్ది రోజులుగా తన కుమారుడు ఏదో బాధలో ఉంటున్నాడని తండ్రి గమనించి అడిగితే.. తన ప్రైవేటు ఫొటోలు స్నేహితుల వ ద్ద ఉన్నాయని, అవి బయట పెడితే తన పరువు పోతుందని తండ్రికి చెప్పాడని పోలీసులు తెలిపారు. రాకేశ్ ఆత్మహత్య చే సుకునేంత పిరికివాడు కాదని బంధువులు పేర్కొంటున్నారు. మృతదేహం కుళ్లిపోయింది. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరె డ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించా రు. రాకేశ్ మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు. -
ఎల్లారెడ్డిపేట పరిధిలో..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో ఎండీ రిహాన్ 982, బైపీసీలో బి.రాణి 960, సీఈసీలో కె.నిహారిక 935 మార్కులు సాధించారు. ఫస్టియర్ సీఈసీ లో స్పందన 437, బైపీసీలో ధనలక్ష్మి 382, ఎంపీసీలో కె.చర్చిత 426 మార్కులు సాధించారు. వీరిని కళాశాల అధ్యాపకులు అభినందించారు. అలా గే దుమాల ఏకలవ్య గురుకులం విద్యార్థులు సెకండియర్ ఫలితాల్లో ప్రతిభచూపారు. ఓవరాల్‌గా 90 శాతం ఫలి తాలతో కాలేజీ మండలంలో అగ్రస్థానంలో నిలిచింది. కాలేజీకి చెందిన విద్యార్థులు ఎంపీసీలో 975, బైపీసీలో 961, సీఈసీలో 849 మార్కులు సాధించారు. -
ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్(జీడీనగర్) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు సాపల్ల శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. అయితే, శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య కన్నాల బోడగుట్ట క్వారీలో పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మంగళవారం వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన శశిరేఖ.. మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి శశిరేఖ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె కాగా ఇద్దరు కుమారులలో ఒకరు ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో చదువుచున్నాడు. మరో కుమారుడికి ఇటీవలనే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. -
‘ఎస్ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్‌లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్‌లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు. -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటీ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనాయత్, రశ్మిత, నేహ, నిఖిత 467మార్కులు సాధించారు. 48మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్.హేమనందిని 438 మార్కులు, 16మంది 436 మార్కులు, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494మార్కులు, రాహుల్, దీపిక 490 మార్కులు, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994 మార్కులు, 13మంది 993, 21మంది 992, 27మంది 991మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996, మహతి, పల్లవి 994మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు. -
‘సర్కార్’ సత్తా
ఇంటర్ ఫలితాల్లో ● ప్రైవేట్ కాలేజీలకు దీటుగా మార్కులు సాధించిన విద్యార్థులు సిరిసిల్లటౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సర్కారు కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేట్‌కు దీటుగా మార్కులు సాధించారు. సిరిసిల్ల బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్ బైపీసీలో బుసమల్ల సాహితీమిత్ర 980, జిల్లా రాధిక 966, ఎంపీసీలో కోడం వైశాలి 955, సీఈసీలో పత్రి స్వప్న 900, హెచ్ఈసీలో సుస్మిత 951, ఫస్టియర్ ఎంపీసీలో పెండేటి స్నేహిక 462, కుడిక్యాల అఖిల 461, బైపీసీలో ఉడుత లాస్య 422, గంగిశెట్టి రాజస్విని 418, సీఈసీలో గాజుల శివాని 455, హెచ్ఈసీలో ఖతీజా ఫలక్ 320 మార్కులు సాఽధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీటీసీలో కె.అరవింద్ 963, టి.శరణ్య 960, శశి 955, బైపీసీలో మనీష్ 967, భువన 940, సీఈసీలో సాయికృష్ణ 983, పూజ 948, అల్ట్రాఫ్ 940, హెచ్ఈసీలో రమ్య 904, ఏఅండ్టీలో మాన్విత 904, ఏఈటీలో జి.రాకేశ్ 911, సీటిలో సాయిరాం 872 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయరఘునందన్, డీఐఈవో వై.శ్రీనివాస్ తదితరులు అభినందించారు. -
కేసీఆర్ పార్టీ పెట్టకుంటే తెలంగాణ వచ్చేదే కాదు
● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సిరిసిల్ల: కేసీఆర్ 2001లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీని పెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టులు రాక, సాగునీరు లేక.. ఇన్ని పంటలు పండేవి కావని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాట్లాడారు. తెలంగాణ సాధన ఆకాంక్ష 1960లో మొదలై 360 మంది విద్యార్థుల బలిదానాలతో సాగిందన్నారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబు ఇది మూణ్ణాళ్ల ముచ్చటే అని కొట్టిపారేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ జెండాను ఎత్తుకున్న కేసీఆర్ ఐదుగురు ఎంపీలతో 32 జాతీయ పార్టీల అంగీకారాన్ని సాధించి తెలంగాణ సాధించారని వివరించారు. బీఆర్ఎస్ పాతికేళ్ల ఆవిర్భావ వేడుకలకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని, అన్ని ఏర్పాట్లు బాగా చేశామన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరేసి సభకు రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మూడేళ్లే.. టీఆర్ఎస్కు పాతికేళ్లు అంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతల తీరును వినోద్‌కుమార్ తప్పుబట్టారు. ఎన్నిసార్లు కాంగ్రెస్, బీజేపీలు పేర్లు మార్చుకున్నాయో చరిత్రను చూడాలని, గుర్తులను కూడా మార్చుకున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో వేములవాడ బీఆర్ఎస్ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, మాట్ల మధు, చీటి లక్ష్మణ్‌రావు, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, గడ్డం నాగరాజు, కుంబాల మల్లారెడ్డి, జక్కుల నాగరాజుయాదవ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. మంగళవారం మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞానసదస్సులో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఎప్పటికీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఉచిత న్యాయసేవాకేంద్రం ఉందని, నిరుపేదలు సహాయం పొందవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులను పరిష్కరించుకుంటే కేసు కొట్టేయడంతో పాటు ఆ కేసుల్లో కోర్టుకు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుందన్నారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్‌రావు, ప్రిన్సిపాల్ రాంసూరత్యాదవ్, న్యాయవాదులు ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భూభారతితో సమస్యలు దూరం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి/చందుర్తి: భూ భారతి చట్టంతో ధరణి ఇబ్బందులు దూరం కానున్నాయని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. మంగళవారం రుద్రంగిలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథులుగా విప్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ధరణి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర మంత్రులు, నిపుణులు భూ భారతి చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి చట్టంలోని వివరాలు వెల్లడించారు. శాశ్వత పరిష్కారానికే భూ భారతి భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం చందుర్తి రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టం ద్వారా భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, నిషేధిత భూముల మార్పులు, చేర్పుల వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. అలాగే చందుర్తి మండలం మల్యాల, సనుగుల, లింగంపేట, రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం వెనువెంటనే తరలించాలని ఆదేశించారు. రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు మర్రి కృష్ణ, నాగుల శంకర్, నాయకులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. మంగళవారం ఉదయం 4 పరీక్షా కేంద్రాల్లో 954 మంది విద్యార్థులకు 865 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 కేంద్రాల్లో 114 విద్యార్థులకు 102 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ధాన్యాన్ని గోదాంలకు తరలించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే గోదాంలకు తరలించాలని డీఆర్డీవో శేషాద్రి కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేసి గోదాంలకు తరలించాలన్నారు. లారీల సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. రైతులకు కేంద్రాల్లో నీడ, నీటి సౌకర్యం కల్పించాలని, గన్నీసంచుల కొరత లేకుండా చూడాలని, టారాల్పిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్ఐ శ్రావణ్, సివిల్ సప్లయ్ అధికారి సందీప్, ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీలు దేవేందర్, సుధాకర్, పద్మ, వీవోఏ రేణుక ఉన్నారు. -
ఇంటర్ ఉత్తీర్ణత
స్వల్పంగా పెరిగిన ● ఫస్టియర్ 51.74.. సెకండియర్‌లో 66.43 శాతం ఉత్తీర్ణత ● బైపీసీలో గంభీరావుపేట ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి 989 మార్కులు సిరిసిల్లఎడ్యుకేషన్: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో గతేడాదితో పోలిస్తే సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రకటించింది. గతేడాది సెకండియర్‌లో 65.21 శాతం, ఈసారి 66.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో గతేడాది 56.62, ఈ విద్యా సంవత్సరం 51.74 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఈసారి ఫస్టియర్‌లో 3,189 విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,976 మంది, సెకండియర్‌లో 3,670 మందికి 2,438 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చేనెల 22 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సప్లమెంటరీ పరీక్ష ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు చెల్లించవచ్చని, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఈనె ల 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. కాగా, గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వి ద్యార్థిని కీర్తన బైపీసీలో 989 మార్కులు సా ధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్ర థమ స్థానంలో ఉన్నట్లు డీఐఈవో తెలిపారు. కేజీబీవీలో ఫలితాలు.. జిల్లాలోని కస్తూరిబా పాఠశాలల విద్యార్థులు సత్ఫలితాలు సాధించినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. సిరిసిల్ల కేజీబీవీలో సీఈసీ విభాగంలో ఎ.అశ్విని 913, కేజీబీవీ తంగళ్లపల్లి ఎంపీహెచ్‌డబ్ల్యూలో రేష్మ 968 మార్కులు సాధించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల గురుకులంలో ఫస్టియర్ 86 శాతం, సెకండియర్ 84 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో సామ శరణ్య 457, బైపీసీలో నందిని 424, సెకండియర్ ఎంపీసీలో లహరి 940, బైపీసీలో అశ్విత 980 మార్కులు సాధించగా వారిని ప్రిన్సిపాల్ అభిందించారు. -
లారీలు రావు.. కాంటా పెట్టరు !
● సర్ధాపూర్ ఏఎంసీ గోదాం వద్ద అన్లోడింగ్ తిప్పలు ● ఇప్పటికే వడ్లతో నిండిపోయిన గోదాములు ● ధాన్యం కొనుగోళ్లకు కష్టకాలం ● మొగులు చూస్తే రైతు గుండెల్లో గుబులుధాన్యం సేకరణ ప్రణాళిక వరి సాగు 1,78,350 ఎకరాలు దిగుబడి అంచనా 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మద్దతు ధర (క్వింటాలుకు..) ‘ఏ’ గ్రేడ్‌కు: రూ.2,320, కామన్ రకానికి: రూ.2,300కొనుగోలు కేంద్రాలు : 241ఇప్పటి వరకు ప్రారంభించిక కేంద్రాలు 239కొనుగోళ్లు ప్రారంభించిన కేంద్రాలు 179కొనుగోలు చేసిన ధాన్యం 12,203.720 మెట్రిక్ టన్నులు గోదాముకు చేరిన ధాన్యం 7,785.060 మెట్రిక్ టన్నులు వడ్లను అమ్ముకున్న రైతులు 1,707రెండు ఎకరాలు కోసిన రెండెకరాల పొలం కోసి పది రోజులైంది. వడ్లు ఆరినయి. లారీలు రావడం లేదని రెండు రోజులుగా కాంటా పెడుతలేరు. మొగులు చూస్తే చెడగొట్టు వానలు పడుతాయని భయమవుతుంది. తొందరగా లారీలు పంపించి వడ్లను జోకాలి. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – శివరాత్రి ఎల్లయ్య, గూడెంవంద లారీలు ఆగిపోయాయి సర్ధాపూర్ గోదాములో వందలారీలు అన్లోడింగ్ కోసం ఉన్నాయి. నాలుగు రోజులుగా లారీలు లోడింగ్తోనే ఉంటే టైర్లు దెబ్బతింటాయి. మాకు ఆర్థికంగా నష్టం వస్తుంది. హమాలీల సంఖ్య పెంచాలి. గోదాముల్లో జాగ లేదంటున్నారు. – రఫిక్, లారీ యజమాని, సిరిసిల్లమిల్లర్లు ముందుకొస్తున్నారు జిల్లాలో రైస్‌మిల్లర్లు ఒక్కొక్కరుగా బ్యాంకు గ్యారంటీ ఇస్తూ ముందుకొస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికి వడ్లను కేటాయిస్తాం. రా రైస్‌మిల్లులకు ఈ సీజన్ వడ్లు కేటాయించం. బాయిల్డ్ రైస్‌మిల్లులకే ఇస్తాం. సర్ధాపూర్ గోదాములో లారీలు అన్లోడింగ్ సమస్యను పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పర్యవేక్షిస్తారు. రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. – పి.వసంతలక్ష్మి, డీఎస్వో ఇది ముస్తాబాద్ మండలం గూడెం. రైతులు పది రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబెట్టగా తేమశాతం వచ్చింది. దీంతో బస్తాల్లో నింపి తూకం వేశారు. కానీ వడ్లను తరలించేందుకు లారీలు రాకపోవడంతో తూకం నిలిపివేశారు. లారీలు వస్తేనే, తూకం వేసి బస్తాలు రవాణా చేస్తేనే కొత్తగా వరుస క్రమంలో తేమశాతం వచ్చిన వడ్లకుప్పలను తూకం వేస్తామని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.వడ్లు ఆరినయి నాకు ఎకరం కంటే కొంచెం ఎక్కువ భూమి ఉంది. మరో ఎకరమంత కౌలుకు తీసుకుని వరి వేసిన. వరి కోసి వారం దాటింది. వడ్లు ఆరినయి. అయినా ఇంకా వడ్లను నేర్పుతూనే ఉన్నా. వడ్లు జోకినా లారీలు రాక ఎక్కడి బస్తాలు అక్కడే ఉన్నాయి. రైస్‌మిల్లులకు వడ్లు కేటాయించలేదట. – పోచంపల్లి మల్లయ్య, పెద్దూరుఇవీ తంగళ్లపల్లి మండలంలో ఆరబోసిన వడ్లకుప్పలు. తేమశాతం రావడంతో అకాల వర్షాల భయంతో కొందరు రైతులు వడ్లకుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పగా.. మరికొందరు కవర్లు లేక అలాగే వదిలేశారు. ఒక్క వర్షం పడినా వడ్లు తడిసిపోతాయని రైతులు భయాందోళన చెందుతున్నారు. లారీలు రాక.. వడ్లు కాంటా పెట్టడం లేదు. ఇదీ.. సిరిసిల్ల పట్టణ శివారులోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గోదాముల వద్ద వడ్ల లారీలు. ఒక్కటి.. రెండు.. కాదు.. ఏకంగా వందలారీలు ఇలా వడ్ల బస్తాల లోడ్లతో నాలుగు రోజులుగా ఉంటున్నాయి. హమాలీలు ఉన్నా సరిపోక అన్లోడింగ్ కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాయి. మరోవైపు గోదాములు సైతం వడ్లబస్తాలతో నిండిపోయాయి. ఇక్కడ ఇంకా వడ్లను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి.సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సవాలక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వారం, పది రోజులు గడుస్తోంది. చాలా మటుకు తేమశాతం కూడా వచ్చింది. అయితే తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో గోదాముల వద్దకు పంపిస్తే రోజులకొద్దీ అన్లోడింగ్ కావడం లేదు. ఫలితంగా లారీలు ఖాళీ కాకపోవడంతో కేంద్రాల్లోని ధాన్యం కుప్పలుగా పేరుకుపోతుంది. జిల్లా శివారులోని సర్ధాపూర్ ఏఎంసీ గోదాములు నిండిపోయి వంద లారీలు నిలిచిపోయాయి. జిల్లాలో 36 బాయిల్డ్ రైస్‌మిల్లులు ఉండగా... నలుగురు మాత్రమే ధాన్యం దింపుకునేందుకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. మిగతా 32 రైస్‌మిల్లులు బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదు. రా రైస్‌మిల్లులు సీఎమ్మార్ బియ్యం పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో వడ్లను కేటాయించలేదు. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్థంగా మారింది. మరోవైపు అకాల వర్షాలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. -
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్ల: ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉపాధిహామీ ఫీల్డ అసిస్టెంట్లు నిరసన తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేదూరి మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.25వేలు చెల్లించాలని కోరారు. ఉపాధిహామీల ఉద్యోగుల లాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు ‘ఎఫ్‌టీఈ’లుగా కన్వర్టు చేసి వేతనాలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న చలో సీఆర్డీ హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు జిల్లా డీఆర్డీవో శేషాద్రికి వినతిపత్రం అందించారు. -
ధర్మగుండంలో ఇలాగైతే ఎలా..
● బట్టలు ఉతుకుతున్న కొందరు భక్తులు ● ఇబ్బందులు పడుతున్న మిగతా వారువేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. దాదాపు అందరూ ధర్మగుండంలోనే స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు. ధర్మగుండంలో స్నానాలాచరించడాన్ని భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు. అయితే కొందరి చేష్టలతో మిగతా వారు ఇబ్బందులు పడుతున్నారు. ధర్మగుండంలో స్నానాలు మాత్రమే చేయాల్సి ఉండగా.. విడిచిన బట్టలను సైతం అక్కడే ఉతుకుతూ ఆరేస్తున్నారు. ఇలా ఇతరులు బట్టలు శుభ్రం చేసుకున్న నీటిలోనే స్నానం చేసేందుకు మిగతా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై శానిటేషన్ ఇన్చార్జి పర్యవేక్షకులు వరి నర్సయ్య మాట్లాడుతూ ధర్మగుండంలో బట్టలు ఉతుకకుండా ఇప్పటికే మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నాం. అయినా చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇక ముందు ఎవరూ బట్టలు ఉతుకకుండా చర్యలు తీసుకుంటాం. -
‘కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర’
సిరిసిల్లటౌన్: కార్మికులను బానిసలుగా మార్చేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కై లాబ్‌బాబు విమర్శించారు. మే డే సంబంధించిన కరపత్రాలను సోమవారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పనిగంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. మే 1న అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగురవేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి, జువ్వాజి విమల, కోడం రమణ, గన్నేరం నర్సయ్య, గణేశ్, పద్మ, రమేశ్చంద్ర పాల్గొన్నారు. -
కాంటా ఎప్పుడు పెడతారు
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ హన్మాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ధాన్యం కాంటా పెట్టడం లేదని.. ఎప్పుడు పెడతారో చెప్పాలంటూ నిరసనకు దిగారు. ధాన్యం ఎప్పుడు జోకుతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో మండుటెండల్లో పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎంసీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి రైతులకు మద్దతు పలికారు. రైతులు బాలెల్లు, తాళ్ల రాజు, కర్రె మైసయ్య, శ్రీనివాస్ నిరసన తెలిపారు. గ్రీవెన్స్ డేకు 25 ఫిర్యాదులు సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 25 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కోర్టుకు నూతన పాలనాధికారులు సిరిసిల్లకల్చరల్: జిల్లా న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు పాలనాధికారులు బదిలీపై వచ్చా రు. మూడో అదనపు జిల్లా జడ్జిగా మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న పి.మాధవి సిరిసిల్ల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ముఖ్య పాలనాధికారిగా నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా కోర్టులో విధులు నిర్వహించిన బొజ్జా వేణుగోపాల్ సిరిసిల్ల మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టుకు పాలనా ధికారిగా నియమితులైనట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ‘డబుల్’ బిల్లుల జాప్యంపై ఆందోళన గంభీరావుపేట(సిరిసిల్ల): డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ బిల్లుల జాప్యంపై మండలంలోని దేశాయిపేటలోని లబ్ధిదారులు సోమవారం గ్రామపంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం దేశాయిపేటలో 20 ఇళ్లు మంజూరు కాగా.. ఏడుగురు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు రూ.లక్ష మాత్రమే చెల్లించారని తెలిపారు. మిగతా రూ.4లక్షలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణ పథకాలు సిరిసిల్లటౌన్: అంతర్ జిల్లాస్థాయిలో ఉమెన్స్ విభాగం వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సిరిసిల్లకు చెందిన క్రీడాకారిణి నేహ స్వర్ణ పతకాలు సాధించింది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయి పోటీలు నిర్వహించారు. వీటిలో జిల్లా నుంచి పాల్గొన్న నేహ కేటగిరీ సీనియర్స్ 63కేజీలో పాల్గొని స్వాట్స్ 110 కేజీ, బెంచ్ 47.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 132.5కేజీ విభాగాల్లో బంగారు పతకాలు సాఽధించింది. కోచ్ తదితరులు నేహను అభినందించారు. జీపీవోలుగా అవకాశం ఇవ్వాలి సిరిసిల్ల: జీపీవోలుగా ఆప్షన్స్ పెట్టుకున్న పూర్వపు వీఆర్ఏలకు(మున్సిపల్ విభాగంలో సర్దుబాటు కాబడిన) వార్డ్ ఆఫీసర్లకు జీపీవోలుగా అవకాశం ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్(ఏవో) రాంరెడ్డికి సోమవారం వార్డు ఆఫీసర్ల ప్రతినిధులు వినతిపత్రం అందించారు. వార్డు ఆఫీసర్ల అ సోసియేషన్ రాష్ట్ర నాయకుడు మల్లారం అర్జున్ మాట్లాడుతూ వీఆర్ఏలను 2023లో పదోన్నతులతో ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారన్నారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ ప రిపాలన అధికారి(జీపీవో) నియమించాలని చూస్తున్నారని వివరించారు. జీపీవోలుగా వీ ఆర్ఏలకు అవకాశం కల్పించాలని కోరారు. రహీం, రాకేశ్, దేవేంద్ర, ఆంజనేయులు, మంజుల, అంజమ్మ, పరశురాం, సుధీర్ ఉన్నారు. -
జలవెల!
● అడుగంటుతున్న జలాశయాలు ● ఎల్ఎండీ డెడ్‌స్టోరేజీకి రాలేదంటున్న అఽధికారులు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎనిమిది టీఎంసీలు ● మిడ్ మానేరులోనూ అదే తీరు ● సాగునీటికి ఇబ్బందులు లేవంటున్న ఇరిగేషన్శాఖసాక్షిప్రతినిధి,కరీంనగర్: రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు క్రమంగా అడుగంటుతున్నాయి. వరదకాలువ, కాళేశ్వరం నుంచి కొంతకాలంగా ఎత్తిపోతలు లేకపోవడంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తయిన నేపథ్యంలో వ్యవసాయపరంగా ఇబ్బందులు లేవని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు జూన్ వరకు సరిపోతుందని, తాగునీటికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. దంచికొడుతున్న ఎండల నేపథ్యంలో రోజుకు పదుల సంఖ్యలో క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. తాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితే ఉత్పన్నమవదని, ఆలోపు వర్షాలు వచ్చేస్తాయని ఇరిగేషన్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోయర్ మానేరులో ఏడు టీఎంసీలు లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం ఏడు టీఎంసీల నీరు నిల్వఉంది. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథకు డెడ్‌స్టోరేజీ 3.8 టీఎంసీలు, కాగా సాధారణ డెడ్‌స్టోరీజీ 2 టీఎంసీలుగా పరిగణిస్తామని తెలిపారు. తాగునీటి అవసరం కోసం ప్రాజెక్టు నుంచి ఇప్పటి నుంచి జూలై నెలవరకు వరకు రోజుకు సుమారు 300 క్యూసెక్కుల నీటిని వాడుకున్నా.. 1.5 టీఎంసీలు అవసరం అవుతుంది. ఇతర అవసరాలకు టీఎంసీ కావాలి. 3.8 టీఎంసీల కన్నా దిగువకు వస్తే ఎలగందుల, పరిసర ప్రాంతాలకు మాత్రం ఇబ్బందిగా మారుతుంది. ఆలోపు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లిలో 8.76 టీఎంసీలు 20.175 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 8.76 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఇదే రోజు 6.75టీఎంసీల నీరు ఉండేది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 2టీఎంసీల నీరు ఎక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలకు ఢోకాలేదని సబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మె ట్రోవర్క్ స్కీం (హెచ్ఎండబ్ల్యూఎస్) కోసం 330 క్యూసెక్కులు, రామగుండంలోని ఎన్టీపీసీ పంప్ హౌజ్‌కు 121 క్యూసెక్కులు, పెద్దపల్లి, రామగుండం మిషన్ భగీరథ పథకం కోసం 58 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మంచిర్యాల జిల్లా ప్ర జల తాగునీటి అవసరాల కోసం 23 క్యూసెక్కుల ను విడుదల చేస్తున్నారు. ఎండల కారణంగా 190 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రతిరోజు ప్రాజె క్టు నుంచి 723 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తు తం ప్రాజెక్ట్‌లోని నీరు జూన్ వరకు తాగునీటి అవసరాలు తీరుస్తుందని అధికారులు వెల్లడించారు. మిడ్‌మానేరులో 7.074 టీంఎసీలు మిడ్‌మానేరు జలాశయం నుంచి పంటలకు, తాగునీటి అవసరాలకు ఇప్పటి వరకు కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్ట్‌లోకి 20 టీఎంసీల మేర నీరు తరలింది. ఎండలకు రోజుకు 140 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. జూలై వరకు ఒకటిన్నర టీఎంసీ నీరు ఆవిరి కానుంది. మిడ్ మనేరు ప్రాజెక్ట్ నుంచి సిరిసిల్ల జిల్లాకు రోజుకు మిషన్ భగీరథ కింద 40క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జూలై 31వరకు మిడ్ మానేరులో తాగునీటి అవసరాలకు నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేదని మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఈఈ జగన్ తెలిపారు. 2024 ఏప్రిల్ 21న ప్రాజెక్ట్‌లో 5.96 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు 7.074 టీఎంసీల మేర నీరు ఉందని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉందన్నారు. -
చెరువులో మునిగి ఒకరి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చా డు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు న మోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు ప ట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు. కొనసాగుతున్న టాస్ పరీక్షలుసిరిసిల్లఎడ్యుకేషన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఇంటర్, పదోతరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 1,090 మందికి 987 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 41 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తెలిపారు. దాడి ఘటనలో ముగ్గురిపై కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్‌లో పాతకక్షలతో దాడి చేసిన ముగ్గురిపై సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. వెంకటాపూర్‌కు చెందిన మోతె కిరణ్, మోతె ఎల్లవ్వ, మోతె ఎల్లయ్యలపై ఆదివారం రాత్రి అదే గ్రా మానికి చెందిన మోతె సతీష్, మోతె ఎల్లవ్వ, మోతె బాలమణి బండరాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్, ఎల్లయ్య, ఎల్లవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ ఫిర్యాదుతో సతీష్, ఎల్లవ్వ, బాలమణిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తి రిమాండ్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయకుంటే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డ మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అల్లె రాజును రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. వెంకటాపూర్ మాజీ సర్పంచ్ కోల నర్సయ్య గ్రామ శివారులోని 928/బీ సర్వే నంబర్లో 1.04 ఎకరాలను అల్లె అన్వేశ్ వద్ద కొన్నాడు. గతంలో భార్యను, కూతురిని చంపి జైలుకు వెళ్లి 9 నెలల క్రితం అల్లె రాజు బయటకు వచ్చాడు. ఈనెల 18న ఆ భూమిలో కోల నర్సయ్య ట్రాక్టర్‌తో చదును చేయిస్తుండగా.. అల్లె రాజు వెళ్లి ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈమేరకు కోల నర్సయ్య ఫిర్యాదుతో సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తి అరెస్టు ఇల్లంతకుంట: పొత్తూరు బిక్కవాగు నుంచి ఇసుక తరలిస్తున్న వ్యక్తిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలి పారు. డిప్యూటీ తహసీల్దార్ గతనెల 31న గస్తీ తిరుగుతుండగా పొత్తూరు బిక్కవాగులో అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నాడు. వీరిని చూసి ట్రాక్టర్‌తో సహా ఆకుల తిరుపతి పారిపోయారని ఎస్సై తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తిరుపతిని సోమవారం రిమాండ్‌కు తరలించి, ట్రాక్టర్ ఇంజిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్‌రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అ భ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అని కొని యాడారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో నిర్వహించిన సెమినార్‌కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్‌రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు -
డిజిటల్ భవిష్యత్‌కు ఏఐ
గంభీరావుపేట(సిరిసిల్ల): డిజిటల్ భవిష్యత్ మొ త్తం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ సంస్థల ప్రొఫెసర్లు పాల్గొని పవర్ ప్రెజెంటేషన్లు, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐ గురించి వివరించారు. సెమినార్లో ఏం చెప్పారంటే.. డిజిటల్ భవిష్యత్‌కు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దోహదపడుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని ముందుకు సాగించే క్రమంలో త్వరలోనే కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులు డిజిటల్ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, రీసోర్స్ పర్సన్లు కల్యాణి, స్వాతి మాతూర్, హంట్ మెట్రిక్ సీఈవో అయూబ్ షేక్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటర డాక్టర్ శ్రావణ్‌కుమార్, పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి ‘కృత్రిమ మేధ’ గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ సెమినార్ హాజరైన రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆకట్టుకున్న ప్రొఫెసర్ల పవర్ ప్రెజెంటేషన్లు -
సైబర్ నేరగాడి అరెస్ట్
సిరిసిల్లక్రైం: దేశవ్యాప్తంగా ఆన్లైన్ సెంటర్లు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన దాసరి మురళి మరో నలుగురు ముఠాగా ఏర్పడి ఆన్లైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరాలకు పాల్పడ్డారు. నలుగురిని గతంలోనే పోలీసులు అరెస్టు చేయగా దాసరి మురళిని సోమవారం సిరిసిల్లలో అరెస్టు చేశారు. మురళిపై దేశవ్యాప్తంగా 35 ఫిర్యాదులు నమోదుకాగా... రూ.45లక్షల విలువైన సైబర్ నేరాలకు పాల్ప డ్డాడు. మురళి భీవండిలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపించుకునేవాడు. విలాసాలకు అలవాటుపడి సులభమార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులు విలేశ్పటేల్, చిరగ్ రమేశ్పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేశ్ జై సింగ్‌లతో ముఠాగా ఏర్పడ్డారు. మొదట ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్చేసి తనని తాను ఉన్నత స్థాయి వ్యక్తిగా పరిచయం చేసుకునేవాడు. ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని, తమ వాళ్లతో నగదు పంపిస్తానని.. తనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి డబ్బు కాజేసేవాడు. అలా వచ్చిన సొమ్మును ఐదుగురు పంచుకునేవారు. దీనిలో భాగంగానే వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలోని ఓ ఆన్లైన్ సెంటర్‌ను, సిరిసిల్లలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి మోసం చేశాడు. బాధితులు వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన వేములవాడ పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా విలేశ్పటేల్, చిరగ్ రమేశ్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేశ్ జైసింగ్‌లను గతంలోనే రిమాండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మురళి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్సై రమేశ్, సైబర్ టీమ్ ఆర్ఎస్ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరుట్ల బస్ స్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. ఆన్లైన్ సెంటర్లు లక్ష్యంగా దందా దేశవ్యాప్తంగా 35 ఫిర్యాదులు రూ.45లక్షలు మోసం -
‘పెద్దింటి’కి అరుదైన గౌరవం
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన జిగిరి, గోస, అనగనగా ఓ కోడిపెట్ట అనే కథలను వరంగల్‌లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్‌గా ప్రవేశపెట్టారు. ఆయా కథలను బోధించే బాధ్యతను కూడా అప్పగించారు. స్వతహాగా ఉపాధ్యాయుడైన పెద్దింటి కళాశాల విద్యార్థులకు కథలను పాఠాలుగా బోధించారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల కళాశాలలో రచయితే అధ్యాపకుడై బోధించడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ సానబోయిన సతీశ్ తెలిపారు. తన కథలపై తానే విస్తృతోపన్యాసం ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా పెద్దింటి అభివర్ణించారు. ఈ సందర్భంగా పెద్దింటిని మానేరు రచయితల సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు అభినందించారు. -
ప్రజావాణి లేదని తెలువక..
● కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు ● కలెక్టర్ లేక.. ప్రజల గోడు వినేవారు కరువు ● ఉసూరుమంటూ ఇంటిదారిసిరిసిల్ల: ప్రతీ సోమవారం కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణి ఎప్పటి మాదిరిగానే ఈవారం కూడా ఉంటుందనే ఆశలో వచ్చిన పలువురు లేదని తెలిసి ఉసూరుమంటూ వెనుదిరిగారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా రెండు రోజుల ముందే తాను హైదరాబాద్‌కు కోర్టు పనిపై వెళ్తున్నానని, సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమాచారం జిల్లా ప్రజలు అందరికీ చేరకపోవడంతో చాలా మంది ప్రజావాణి ఉంటుందనే భావనతో కలెక్టరేట్ వరకు వచ్చి నిరాశకు గురయ్యారు. వచ్చిన వారిలో అత్యధికులు చదువురాని వారు. కలెక్టర్ అందుబాటులో లేకుంటే.. జిల్లాలో ఉన్న ఇతర ఉన్నతాధికారులు ప్రజావాణి నిర్వహించే అవకాశం ఉంది. గతంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రజావాణి నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనట్లు కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చేతిలో నీళ్ల సీసా.. జబ్బపై కాటన్ తువ్వాలతో ఉన్న ఈ దంపతులు ఇరుమల్ల కనకవ్వ, కొమురయ్య. బోయినపల్లి మండలం విలాసాగర్. గ్రామంలో డ్రెయినేజీ నీళ్లు పోనీయకుండా.. పైపులైన్ వేయకుండా.. స్థానికులు అడ్డుకుంటున్న సమస్యను ప్రజావాణిలో తెలిపేందుకు వచ్చారు. ప్రజావాణి లేదని తెలియడంతో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు.వీరు బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన పర్లపల్లి లక్ష్మీ, దుర్గయ్య దంపతులు. ఈ వృద్ధ దంపతులకు బ్యాంకు ఖాతాను స్థానిక బ్యాంకు అధికారులు బతికి ఉండగానే చనిపోయినట్లుగా తొలగించారట. ఆసరా పింఛన్ రావడం లేదని, ఎకరం భూమి ఉన్నా.. బ్యాంకు ఖాతా లేక.. రైతు భరోసా పైసలు రావడం లేదనే సమస్యను విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. కానీ అధికారులు ఎవరూ లేక ఎండలోనే ఇంటిదారి పట్టారు. -
రోడ్డు దాటాలంటే భయమే..
వేములవాడఅర్బన్: కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి వాహనాలతో బిజీగా ఉంటుంది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాలకు చందిన వారు రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి ప్రాణం పోతుందో తెలియక భయాందోళన చెందుతున్నారు. ప్రతీ నెల దాదాపు పదికి మించి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యలోనే ఆగిన రోడ్డు కరీంనగర్ నుంచి కామారెడ్డికి వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానం. మధ్యలో నాంపల్లి స్టేజీ నుంచి కుడివైపు మళ్లితే వేములవాడకు వెళ్లవచ్చు. రాజన్న భక్తులకు సైతం ఇదే ప్రధాన రహదారి. నిత్యం తిరిగే వాహనాలతోపాటు రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో ఈ రోడ్డు బిజీగా మారుతోంది. కరీంనగర్ నుంచి కొదురుపాక వరకు ఫోర్‌లేన్ రోడ్డు వేశారు. సిరిసిల్ల నుంచి నందికమాన్ వరకూ ఫోర్‌లేన్ రహదారి పూర్తి చేశారు. నందికమాన్ నుంచి కొదురుపాక మిడ్‌మానేరు వంతెన వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఫోర్‌లేన్ రోడ్డు పూర్తి కాలేదు. ఈ 8 కిలోమీటర్ల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే భయమే.. వేములవాడ నందికమాన్ నుంచి ఆరెపల్లి వరకు కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కొడుముంజ, శాభాష్‌పల్లి, శాంతినగర్, నాంపల్లి, అనుపురం, రుద్రవరం, సంకెపల్లి, అరెపల్లి గ్రామాల ఇళ్లు రోడ్డును ఆనుకుని రెండు వైపులా ఉన్నాయి. నిత్యావసరాలు, ఇతరత్ర పనుల కోసం గ్రామస్తులు ఇటు నుంచి అటు వైపు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిందే. అయితే ఈక్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకో ప్రమాదం.. పోతున్న ప్రాణం పూర్తికాని ఫోన్లేన్ రోడ్డు నాంపల్లిగుట్ట నుంచి కొదురుపాక వరకు ప్రమాదకరం తరచూ రోడ్డు ప్రమాదాలు గత 15 రోజుల క్రితం అనుపురం గ్రామానికి చెందిన వంశీ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. అనుపురం గ్రామానికి చెందిన రాజయ్య బైక్‌పై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రాజన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనుపురం వద్ద ఖాజీపూర్‌కు చెందిన కుటుంబం వెంకటేశ్, రజిత, అభిరామ్‌లను కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. ఐదు రోజుల కిత్రం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఆరెపల్లి శివారులో ఇద్దరు, నాంపల్లి శివారులో ఒక్కరు, అనుపురం శివారులో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. -
సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు
● ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ అశోక్ సిరిసిల్ల: సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దని, నేతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు. సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను ఆదివారం పరామర్శించి మాట్లాడారు. నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. నేతకార్మికులు వస్త్రాన్ని నేయడంలో గొప్ప కళాకారులని, దారంపోగులను ఏకం చేసి బట్టను నేసే సూక్ష్మ నైపుణ్యత వారికే ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు గోనె ఎల్లప్ప, పద్మశాలి జాతీయ పరిషత్ అధ్యక్షుడు కొక్కుల భాస్కర్, యువనాయకులు పత్తిపాక సురేశ్, రమేశ్, జనార్దన్, వీరేందర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): అకాల వర్షాలు వెంటాడుతున్నందునా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, పారిపెల్లి సంజీవరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, కోనేటి సాయిలు, కిరణ్‌నాయక్, దాసరి గణేశ్ పాల్గొన్నారు. బదిలీ షెడ్యూల్ విడుదల చేయాలి సిరిసిల్లకల్చరల్: ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ కోరారు. సిరిసిల్ల ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధికి చాలినన్నీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఏ, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. కొలుగూరి కిషన్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుమాల రమానాథ్, వికృతి అంజయ్య, పురం వాసుదేవరావు, దబ్బెడ హనుమాండ్లు, మందాడి శ్రీనివాసరెడ్డి, దేవేందర్, తిరుపతి, శ్రీధర్, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, రాజేందర్, భాస్కర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, రమేశ్‌రెడ్డి, రాంప్రసాద్ పాల్గొన్నారు. నేడు నేషనల్ సెమినార్గంభీరావుపేట(సిరిసిల్ల): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నేషనల్ సెమినార్ నిర్వహించనున్నారు. విద్య, పరిశోధనరంగంలో కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై ఒకరోజు సెమినార్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి డిగ్రీ, యూనివర్సిటీ స్థాయి అధ్యాపకులు హాజరై పేపర్ ప్రజెంటేషన్, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజేస్ నుంచి ప్రొఫెసర్ల బృందం కళాశాలకు రానుంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. -
పరిహారం ఇచ్చి ఆదుకోండి
● న్యాయం చేయాలని నిర్వాసితుడి వేడుకోలురుద్రంగి(వేములవాడ): నష్టపరిహారం ఇవ్వకుండానే పట్టా భూమిని ఇరిగేషన్ అధికారులు లాక్కొని కాలువ పనులు చేపడుతున్నారని రుద్రంగికి చెందిన దయ్యాల నర్సయ్య ఆరోపిస్తున్నాడు. నష్టపరిహారం ఇచ్చే వరకు భూమిలో ఎలాంటి పనులు చేపట్ట వద్దని కోరారు. వివరాలు బాధితుని కథనం ప్రకారం. రుద్రంగిలోని సర్వేనంబర్ 428/137లో ఎకరం భూమిని సాగు చేసుకుంటుండగా.. 24 గుంటలకు పట్టా ఉంది. అది నాగారం చెరువులోకి గోదావరి నీటిని తరలించే కాలువలో ముంపునకు గురైంది. 17.5 గుంటలకు నష్టపరిహారం రాగా భూమి మధ్యలో నుంచి కాలువ వెళ్లడంతో మిగిలిన భూమి కూడా పనికిరాకుండా పోతోంది. దీంతోపాటు మరో సర్వేనంబర్ 313ఇ/2లో ఒక ఎకరం ఇళ్ల స్థలం, సర్వేనంబర్ 340లో 3.5 గుంటలు వ్యవసాయేతర భూమి, సర్వేనంబర్ 333ఆ/ ఛలో 6 గుంటలు వ్యవసాయేతర భూమి సూరమ్మ చెరువులకు గోదావరి నీటిని తరలించే కాల్వలో ముంపునకు గురవుతుంది. ఈ భూములకు ఒక్క పైసా కూడా పరిహారం రాలేదు. సర్వే నంబర్ 333లో గుంట భూమిని తమకు తెలియకుండానే అధికా రులు పట్టాను తొలగించారని ఆరోపించారు. నష్టపరిహారం ఇవ్వకుండానే భూమిని లాక్కోవడంతో రోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ సంతుప్రకాశ్ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేరు. -
వేతన వెతలు
● మూడు నెలలుగా అందని వేతనాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు సకాలంలో వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమం తప్పకుండా కూలీలతో పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు నెల లు గా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రూ.55లక్షలు పెండింగ్ జిల్లాలో 153 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి దాదాపు రూ.55లక్షల వేతనాలు అందాల్సి ఉంది. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కూలీలకు ఎక్కువ పనులు కల్పించడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా హరితహారం, డంపింగ్‌యార్డులు, నీటి నిల్వ పనులు, నర్సరీల నిర్వహణ, భూములు చదునుచేయడం, పూడికతీత పనులను కూలీలతో చేయిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారమైన పనులు చేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు అందడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలుకు నోచుకోని హామీ ఉపాధిహామీ పథకంలో 2006 నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తమకు పేస్కేల్ విధానం అమలు చేయాలనేది ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం వీరికి పేస్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఆ దిశగా ముందడుగు పడడం లేదు. ఇబ్బంది పడుతున్నాం సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ విధానం అమలు చేయాలి. – మధు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అన్నదాత విలాపం
ప్రకృతి ప్రకోపం..● వడగండ్లవానకు మద్దికుంట విలవిల ● 350 ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిన వరి ● 34 ఎకరాల్లో మామిడితోటలు ● ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల వేడుకోలుఇతను ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రైతు ఎలుసాని దేవయ్య. మద్దికుంట శివారులో ఉన్న 4.20 ఎకరాలలో వరి సాగుచేస్తున్నాడు. మరో వారం రోజులైతే హర్వెస్టర్తో పంట కోద్దామనుకోగా శుక్రవారం సాయంత్రం భారీ వడగండ్ల వానతో వరిపంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క గింజ మిగలకుండా పంటంతా నేలపాలైంది. ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెట్టిన దేవయ్యకు.. చేసిన శ్రమ మట్టిపాలు కాగా, పెట్టుబడులు మీదపడ్డాయి. ఆ పంట చేతికొస్తే ఎకరాకు రూ.50వేల వరకు ఆదాయం వచ్చేది. రాలిన ధాన్యం వద్ద దేవయ్య కన్నీరుపెడుతున్నాడు.ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిలలాడుతున్నారు. కళ్ల ఎదుటే నోటికాడి ముద్ద మట్టిలో కలిసిపోతుంటే చూస్తూ కన్నీరుపెడుతున్నారు. ధాన్యం నేలరాలిపోగా, మామిడిచెట్లు విరిగిపోయాయి. ముస్తాబాద్ మండలం మద్దికుంట, ముస్తాబాద్ గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు 360 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది, ఒక్క మద్దికుంటలోనే 120 మంది రైతులకు చెందిన 350 ఎకరాల్లో వరిపంట దాదాపు వందశాతం దెబ్బతింది. అలాగే 34 ఎకరాల్లోని మామిడితోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు సర్వే చేపట్టారు. బాధిత రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మద్దికుంట, ముస్తాబాద్, మొర్రాయిపల్లి గ్రామాల్లో ఈదురుగాలులకు 12 షెడ్లు లేచిపోయాయి. పంటల బీమాపై అవగాహన కరువు వ్యవసాయంపై ఎలాంటి బీమా లేదు. నష్టం జరిగితే పరిహారం మాట ఉండదు. ప్రభుత్వాలు మారినా పంటల బీమాపై భరోసాను పాలకులు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై నిర్ధిష్టమైన విధానమంటూ లేకపోవడం, అన్నదాతలకు శాపంగా మారింది. ఒక్క మద్దికుంట గ్రామంలోనే 350 ఎకరాలకు పైగా వరిపంట, మునగ, మామిడితోటలు ధ్వంసమయ్యాయి. ప్రతీ ఐదుగురు రైతుల్లో ముగ్గురు బాధితులే ఉన్నారు. ఏ ఇంటా చూసిన వడగండ్ల నష్టం తాలుకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఫసల్‌బీమా అమలు చేసిన పరిహారం వచ్చేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి అవుతుండగా, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలపై విమర్శలు ఉన్నాయి. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా ఇవ్వడం లేదంటున్నారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.మామిడి తోట ధ్వంసమైంది మద్దికుంట శివారులో ఆరు ఎకరాల్లో మామిడితోట ఉంది. మరో రెండున్నర ఎకరాలు వరిపంట వేశాను. మామిడి ఈసారి మంచి కాతకు వచ్చింది. పంట బాగా పండింది. అంతా బాగుందని మురిసిపోతుండగా వచ్చిన రాళ్లవాన మమ్ముల్ని ఆగం చేసింది. మామిడికాయలు మొత్తం రాలిపోయాయి. పది మామిడి చెట్లు కూలిపోయాయి. రేకులషెడ్డు లేచిపోయింది. వరిపంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజు, మద్దికుంట -
ముందు జాగ్రత్తలే మేలు
సిరిసిల్ల: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి ఎన్.నరేందర్ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్లలో ఆదివారం ర్యాలీ నిర్వహించి, సిబ్బంది విన్యాసాలు చేశారు. ఎస్ఎఫ్వో మాట్లాడుతూ అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుజాగ్రత్తలే మేలు అన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే.. 101, 87126 99258, 87126 99260 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అన్నారు. ఫైర్ సేఫ్టీకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిరిసిల్ల గాంధీచౌక్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ మీదుగా నేతన్నచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. నేతన్నచౌక్‌లో అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణ విన్యాసాలు చేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అభినయ్, డాక్టర్లు రమణారావు, గూడూరి రవీంద్ర, యాదగిరిగౌడ్, గోపీనాథ్, సినిమా థియేటర్ మేనేజర్ కె.వెంగయ్య, దళిత నాయకుడు మేకల కమలాకర్ పాల్గొన్నారు.అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు -
శిఖం భూమి.. పరిహారం రాదేమి
● వెంకట్రాయిని చెరువులో మునిగిన 170 ఎకరాలు ● ఉపాధి కోల్పోయిన 150 కుటుంబాలు ● ఆదుకోని పాలకుల హామీలు ● పనులు లేక వలసపోతున్న పలువురు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలివేములవాడఅర్బన్: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరుణకుమారి కోరారు. స్థానిక గుమ్మిపుల్లయ్య భవన్లో ఆదివారం అంగన్వాడీ టీచర్లు, ఆయాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఐసీడీఎస్ ద్వారా 50 ఏళ్లుగా సేవలందిస్తున్న తాము చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇవ్వాలని కోరారు. వీర్నపల్లి(సిరిసిల్ల): భూమి ఉంటే భరోసా.. మనోధైర్యం.. ఉన్న కొద్దిపాటి భూమిలో పంట పండించుకొని బతుకు వెల్లదీసేవారు పల్లెల్లో చాలా మంది కనిపిస్తుంటారు. ఆ భూమి నీళ్లలో మునిగిపోతే రైతులకు భరోసా పోతుంది. శిఖం భూములైతే వర్షాకాలంలో చెరువునీటితో మునిగిపోయినా వేసవిలో తేలి పంటలు సాగుచేసుకునే అవకాశం ఉంటోంది. కానీ వీర్నపల్లిలోని వెంకట్రాయిని చెరువు శిఖం భూములు తేలడం లేదు. ఐదేళ్ల క్రితం చెరువును మరమ్మతు చేయడంతో నీటి లీకేజీలు ఆగిపోయి నీటిమట్టం తగ్గడం లేదు. దీంతో పలువురు రైతులు తమ భూములు మునిగిపోయాయని, పరిహారం ఇప్పించాలని వారి విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయి. ఉపాధి కోసం కూలీలుగా మారుతున్నారు. 170 ఎకరాల శిఖం వీర్నపల్లి మండల కేంద్రంలోని వెంకట్రాయినిచెరువులో సుమారు 170 ఎకరాల శిఖం భూములు ఉంటాయి. దాదాపు 150 మంది దళితులు ఆ భూములను సాగు చేసేవారు. వానాకాలంలో చెరువు నిండిపోయి బుంగలు పడి, తూము లీకేజీతో రెండు నెలల్లోనే ఖాళీ అయ్యేది. ఆ సమయంలో తేలిన భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకునేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయలో భాగంగా రూ.49 లక్షలతో చెరువు కట్టకు మరమ్మతు చేసి బుంగలు పూడ్చారు. అయినా నీరు నిలవకపోవడంతో మళ్లీ రూ.50లక్షలతో కొత్తగా తూము నిర్మించారు. ఆరేళ్లుగా చెరువుకు లీకేజీల బెడద తప్పింది. ఫలితంగా చెరువు నిండా నీరు కనిపిస్తోంది. కాగా, ఐదేళ్లుగా శిఖం భూములు తేలక రైతులు ఏడాదికో పంట కూడా సాగుచేసుకోలేక పోయారు. అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు వెంకట్రయినిచెరువు 110 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 49.29 ఎకరాలు కంచర్ల శివారు, 66 ఎకరాలు వీర్నపల్లి శివారులో ఉంది. చెరువు శిఖం ముంపు భూభాగంలో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఈ భూములన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద రైతులవే. ఎత్తిపోతల పథకంలో భాగంగా రూ.166కోట్లతో పనులు చేపట్టి చెరువును నింపాలని ప్రణాళికలు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ పాలకులు, అధికారుల చుట్టూ రైతులు తిరిగారు. ఎత్తిపోతల పథకంలో చెరువును నింపి పరిహారం అందిస్తామన్న హామీతో వివాదం సద్దుమణిగింది. తర్వాత బాధితులను పట్టించుకునే వారు లేరు. చెరువు తూమును ధ్వంసం చేసిన ఘటనలో రైతులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో 150 రైతు కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధినపడ్డాయి. వారిలో కొందరు గల్ఫ్‌బాట పట్టారు. మరికొందరు దినసరి కులీలుగా మారారు. ప్రభుత్వం ఆదుకోవాలి మా తాత ముత్తాతల నుంచి ఏక్ పసలు పంట పండించుకుంటున్నాం. మేము కూడా ఆరేళ్ల వరకు వరి పండించాం. సెప్టెంబర్‌లో తూము తీసి కంచర్లలోని పోతారా యిని చెరువులోకి నీళ్లు తీసుకెళ్లారు. ఆరేళ్లుగా చెరువులో నీరు తీయడం లేదు. నష్టపరిహారం ఇవ్వాలని డీఆర్వోకు, ఆర్డీవోకు, కలెక్టర్, మా జీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. – గద్దరాశి భగవంతం, రైతు, వీర్నపల్లి గల్ఫ్ బాట పట్టాడు వెంకటరాయిని చెరువులో రెండెకరాల భూమి పోయింది. ఇక్కడ పని దొరక్క మా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. నా భర్త తిరుపతి ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – చింతనపల్లి మంగ, వీర్నపల్లి -
రజతోత్సవానికి తరలిరండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీఆర్ఎస్ పార్టీ రజతో త్సవ సభకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. ఎల్లారెడ్డిపేటలో ఆదివారం ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. తమ అధినేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో సముచితస్థానం ఉందన్నారు. ఈనెల 27న ప్రజలు తమ ఇంట్లో పండుగలా గుర్తించి రజ తోత్సవ సభకు తరలిరావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు అందె సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, నర్సింలు, రమేశ్, నెమలికొండ శ్రీనివాస్ ఉన్నారు.● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య -
వడగండ్ల బాధితులకు అండగా ఉంటాం
● అన్నదాతలు ధైర్యంగా ఉండాలి ● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి ముస్తాబాద్(సిరిసిల్ల): వడగండ్ల బాధిత రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వడగండ్ల వానలతో దెబ్బతిన్న వరి, మామిడిపంటలను ముస్తాబాద్, మద్దికుంట, మొర్రాయిపల్లి గ్రామాల్లో శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను మహేందర్‌రెడ్డి ఓదార్చారు. ప్రకృతి వైపరీత్యానికి చేతికందిన పంటలు నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి బాధిత రైతులకు అండగా ఉంటారన్నారు. వడగండ్లతో నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో మహేందర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి, పంట నష్టం వివరాలను తె లియజేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బా ల్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, కొండం రాజిరెడ్డి, దీటి నర్సింలు, కొండల్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, కొండయ్య, గజ్జెల రా జు, శ్రీనివాస్, నరేశ్, ప్రశాంత్, అంజన్‌రావు, మధు, బాల్‌రెడ్డి, రాజు, ఎలుసాని దేవయ్య, ఆంజనేయులు, దేవిరెడ్డి, అనిల్, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ లక్ష్యం సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అబద్దపు పునాదులపైనే బీఆర్ఎస్ పుట్టిందని, అమాయకులను రెచ్చగొట్టి ఎందరో ప్రాణాలు పోవడానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీశ్‌రావుకు అగ్గిపెట్టె దొరకలేదని, నిమ్మరసం తాగి దొంగదీక్షలు కేసీఆర్ చేశాడని ఆరోపించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పాలన సాగిస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ, గ్యాస్సిలిండర్లపై రాయితీ, ఆరోగ్యశ్రీని రూ.10లక్షల వరకు పెంచారన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప, చెన్నమనేని కమలాకర్‌రావు, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, వైద్యశివప్రసాద్, కల్లూరి చందన, బొప్ప దేవయ్య, రాగుల జగన్, కుడిక్యాల రవికుమార్ పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేస్తామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఇల్లంతకుంట తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని తెలిపారు. జిల్లాలో 36 బాయిల్డ్ రైస్‌మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైస్‌మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వ చేస్తామన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, డీఎస్వో పి.వసంతలక్ష్మి, పౌరసరఫరాల డీఎం రజిత, అధికారులు కిశోర్, ఇల్లంతకుంటలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతిలో భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట రైతువేదికలో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని తెలిపారు. కొత్తచట్టంలో పెండింగ్ సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూమిహక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారని తెలిపారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వ పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణిలో ఇక్కట్లు పడ్డ రైతులకు భూభారతితో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, ఎంపీడీవో శశికళ, వ్యవసాయాధికారి సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
అన్నపూర్ణ అడుగంటుతోంది..
● తగ్గుతున్న నీటిమట్టం ● ఎండిన బిక్కవాగు పరివాహకం ● బోరుబావుల్లో అడుగంటిన భూగర్భ జలాలు ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల వరప్రదాయిని అనంతగిరి(అన్నపూర్ణ) ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లోని వ్యవసాయబావులు, బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. బిక్కవాగులో ఇసుక తేలింది. సగానికి పైగా పడిపోయిన నీటిమట్టం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో నీటి కెపాసిటీ 3.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.24 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిడ్ మానేరు ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన సొరంగమార్గం నుంచి అనంతగిరి అన్నపూర్ణ జలాశయం వద్ద ఉన్న సర్జికల్పూల్లోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తూ అన్నపూర్ణ జలాశయంలోకి నీరు వెళ్తోంది. మిడ్‌మానేరులో 13 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే సొరంగమార్గం ద్వారా సర్జికల్పూల్లోకి నీరు వస్తోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులో ఏడు టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో నీటిపంపింగ్ నిలిచిపోయింది. దీంతో అన్నపూర్ణ జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీరు వెళ్తోంది. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు వెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అనంతగిరి కొసగుట్టపల్లి పూర్తిగా మునిగిపోయాయి. మార్చి 2020లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఆచరణలోకి వచ్చింది. ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఎడమ, కుడి, రెండు కాలువలు ఉన్నాయి. ఎడమకాలువ కింద 5 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉండగా.. కుడికాలువ కింద రెండు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉన్నవి. ప్రాజెక్టు కింద ఉన్న ఎడమకాల్వ ద్వారా ఇల్లంతకుంట మండలంలో 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కుడికాల్వ ద్వారా బెజ్జంకి మండలానికి 14వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, గన్నేరువరం మండలానికి 800 ఎకరాలకు నీరు అందుతోందని అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు డీఈ దేవేందర్ తెలిపారు. అన్నపూర్ణ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం ఉన్నప్పుడు సర్ఫేస్ గేట్లు ఎత్తడంతో అనంతారం ప్రాజెక్టులోకి నీరు త్వరగా చేరి అనంతరం ప్రాజెక్టు నిండుతుంది. మండల ప్రధాన బిక్కవాగు ప్రవహించి పరివాహక రైతుల వ్యవసాయబావుల్లో నీరు సమృద్ధిగా ఉండి పంటలు పండుతాయి. అనంతారం ప్రాజెక్టు మత్తడి నెల రోజుల క్రితమే ఆగిపోవడంతో బిక్కవాగు ఎండిపోయింది. పరివాహక ప్రాంతాలైన అనంతారం, రహీంఖాన్‌పేట, వంతడ్పుల, ఇల్లంతకుంట, నర్సక్కపేట, జవారిపేట గ్రామాల బోరుబావుల్లో నీటిమట్టాలు తగ్గిపోయాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటి లభ్యత 13 టీఎంసీల కంటే తక్కువగా ఉన్నందున అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ప్రస్తుతం లేదని ప్రాజెక్టు డీఈ దేవేందర్ తెలిపారు. మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పూర్తి కావాలసి ఉంది అన్నపూర్ణ ప్రాజెక్టు ఎండీసీ(మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్)–2 పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తి కావడానికి 50 ఎకరాల వరకు భూసేకరణ అవసరం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలో మైనర్ కెనాల్స్ నిర్మాణానికి 250 ఎకరాల భూసేకరణ అవసరం ఉంది. మైనర్ కాలువలు పూర్తయితే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల పొలాలకు కాలువల ద్వారా డైరెక్ట్ గా నీరు అందుతుంది. – ప్రాజెక్టు డి ఈ దేవేందర్ గొలుసు కట్టు చెరువులు నింపాలి అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా గొలుసు కట్టు పద్ధతిలో మండలంలోని చెరువులను నింపాలి. చెరువులు నిండితే వ్యవసాయ బోరుబావులలో ఊట పెరుగుతుంది. పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, చర్యలు తీసుకోవాలి. – గన్నేరం నర్సయ్య, పెద్దలింగాపురం అన్నపూర్ణ ప్రాజెక్టు వివరాలు సామర్థ్యం : 3.5 టీఎంసీలు ఆయకట్టు : 30 వేల ఎకరాలు ప్రస్తుత నీటి లభ్యత : 1.24 టీఎంసీలు -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తాం
ముస్తాబాద్(సిరిసిల్ల): చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తామని డీఆర్డీవో శేషాద్రి శనివారం ప్రకటనలో తెలిపారు. ‘నిలువ నీడ లేదాయే’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కేంద్రాల్లో చలువపందిళ్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశించినట్లు తెలిపారు. సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండాపూర్, ముస్తాబాద్ సీసీలు మాట్లాడుతూ కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. కొండాపూర్‌లో రైతుల కోసం షెడ్డు ఉందని, ముస్తాబాద్ సబ్సెంటర్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని వారు వివరించారు. ధాన్యం అన్లోడింగ్ పరిశీలన ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంటలోని రహీంఖాన్‌పేటలో గల ధాన్యం గోదాంను శనివారం డీఆర్డీవో శేషాద్రి పరిశీలించారు. మండలంలోని 28 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో వస్తున్న ధాన్యాన్ని రహీంఖాన్‌పేట గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ పెంపు సిరిసిల్లటౌన్: బ్యాంకులో నగదు డిపాజిటర్లకు రూ.50పైసలు అదనంగా వడ్డీ ఇస్తున్నామని సిరిసిల్ల సహకార అర్బన్‌బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సర ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలోనే బ్యాంకులో డిజిటల్ లావాదేవీలు కస్టమర్లు నేరుగా చేసుకునేందుకు యూపీఐ, క్యూఆర్ కోడ్లను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.104కోట్లు డిపాజిట్లు చేశామని.. ఈఏడాది మరో రూ.100కోట్లు డిపాజిట్లు సాధించేలా కృషి చేస్తామన్నారు. జిల్లా సహకారాధికారి రామకృష్ణ, బ్యాంకు సీఈవో పత్తిపాక శ్రీనివాస్, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, కోడం సంజీవ్, చొప్పదండి ప్రమోద్, వేములు సుక్కమ్మ, ఎనగందుల శంకర్, వలుస హరిణి పాల్గొన్నారు. ప్రజావాణి రద్దు సిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం ప్రకటనలో తెలిపారు. హైకోర్టు కేసు విషయంలో వ్యక్తిగతంగా హాజరుకానుండడంతో అందుబాటులో ఉండడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ అర్జీలతో రావద్దని కోరారు. బాధ్యతగా పనిచేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మరింత బాధ్యతగా పనచేయాలని... లేదంటే ఇతర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని స్థానిక మహాత్మాజ్యోతిబాపూలే డిగ్రీ కాలేజీ అధ్యాపకులను గురుకులాల జాయింట్ సెక్రెటరీ శ్యాంప్రసాద్‌లాల్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని మహా త్మాజ్యోతిబాపూలే డిగ్రీ కాలేజీని శనివారం తని ఖీ చేశారు. కళాశాలలోని అన్ని గ్రూపుల్లో కలిసి 32 మంది మాత్రమే చదువుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ఒక్కో అధ్యాపకుడు 10 మంది చొప్పున విద్యార్థులు అడ్మిషన్ పొందేలా చూడాలన్నారు. జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభఇల్లంతకుంట(మానకొండూర్): రేపాకకు చెందిన రోండ్ల దత్తాశ్రీరెడ్డి జేఈఈ మెయి న్స్లో జాతీయస్థాయిలో 6,581 ర్యాంక్ సాధించాడు. తండ్రి జగన్మోహన్రెడ్డి టీచర్, తల్లి గృహిణి. -
‘మైకు’
మేల్కొలుపుతోంది..● గంట గంటకీ ఆధ్యాత్మిక సందేశం ● ఊరందరికీ ప్రామాణికం ● సమయం.. రోజు.. వారం.. నెల.. గంటకొట్టి చెబుతోంది ● బావుసాయిపేటలో బహుముఖ ప్రయోజనాలుతెల్లవారుజాము 5 గంటలు.. ఏమయ్యో మైకు మోగింది. లెవ్వు.. లేచి బర్రెపాలు పిండి, పాలకేంద్రంలో పోసిరాపో.. అంటూ భర్తను భార్య పురమాయిస్తుంటోంది. అగో తెల్లారుతోంది.. లేచి పొలం చుట్టూ తిరిగిరాపో అంటూ.. మరో ఇల్లాలు తన భర్తను అప్రమత్తం చేస్తుంటోంది.సాయంత్రం 5 గంటలు.. మూలవాగు ఒడ్డున గల రవి పొలంలో ముదురుకలుపు తీసేందుకు పది మంది మహిళలు కై కిలి వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి కలుపుతీత పని కొనసాగుతోంది. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు కూలీలు భోజనం చేశారు. మళ్లీ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఊరిలోని మైకు గంటలు మోగాయి. భగద్గీత శ్లోకం వినిపించింది. ఈ రోజు ఆదివారం, ఏప్రిల్ నెల.. 2025.. ఇప్పుడు సమయం ఐదు గంటలు అంటూ.. మైకులో సందేశం వినిపించింది. అంతే అప్పటి వరకు పొలంలో ముదురుకలుపు తీసిన కూలీలు వెంటనే ఒడ్డుపైకి చేరారు. టైమైంది మేం పోతున్నామంటూ ఇంటిబాట పట్టారు.మైకు చెబుతోంది.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట జనాన్ని మైకు మేల్కొలుపుతోంది. ఆ ఊరి మైకు చెప్పే.. సమయం.. రోజు, వారం, నెల ఆ గ్రామస్తులకు ప్రామాణికమయ్యాయి. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. వ్యవసాయం ప్రధానవృత్తి. కోళ్లు, పాడిపరిశ్రమలు ఉన్నాయి. ఊరంతా ఆ మైక్ చెప్పే సమయాన్ని పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. -
సబ్బండ వర్గాలతో రజతోత్సవ సభ
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యసిరిసిల్లటౌన్: వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు సిరిసిల్ల నుంచి సబ్బండ వర్గాలు హాజరవుతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు ఆకునూరి శంకరయ్య, దార్నం లక్ష్మీనారాయణ, మ్యాన రవి, ఎండీ సత్తార్, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు తరలిరావాలి గంభీరావుపేట(సిరిసిల్ల): వరంగల్ సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. గంభీరావుపేటలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, నాయకులు గంధ్యాడపు రాజు, కొమిరిశెట్టి లక్ష్మణ్, మోతె రాజిరెడ్డి, దయాకర్‌రావు, రత్నాకర్, రాజేందర్, సత్యం పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ వైఫల్యాలు ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. ముస్తాబాద్‌లో మాట్లాడారు. రైతుభరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాడే లేదన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కొమ్ము బాలయ్య, మాజీ ఎంపీపీ శరత్‌రావు, ఆర్బీఎస్ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రావు, నాయకులు విజయరామారావు, సర్వర్, మల్లేశ్, జానబాయి, సుమతి, నర్సయ్య, సంతోష్‌రావు, చెవుల మల్లేశ్ పాల్గొన్నారు. -
గ్రామ కమిటీలతో నేర నియంత్రణ
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ కోనరావుపేట(వేములవాడ): నేరాల నియంత్రణకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. కనగర్తిలో మానేరు స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారికి రెండేళ్ల వరకు జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. లోక్‌అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ మాట్లాడుతూ సివిల్ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకుంటే.. కేసు కొట్టేయడంతోపాటు కోర్టు ఫీజు వాపస్ వస్తుందని తెలిపారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్‌రావు, న్యాయవాధులు విజయ్, ఆంజనేయులు, క్రాంతికుమార్, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ భూంరెడ్డి, కార్యదర్శి కవితారెడ్డి, మాజీ సర్పంచ్ బాపురెడ్డి, ఉపసర్పంచ్ దేవరాజు పాల్గొన్నారు. వేములవాడ సబ్జడ్జిగా అజయ్కుమార్వేములవాడ: వేములవాడ సబ్జడ్జిగా అజ య్‌కుమార్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఇన్‌చార్జీగా లక్ష్మణాచారి వ్యవహరించారు. ఆయన స్థానంలో అజయ్‌కుమార్ నియమితులయ్యారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదుతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఇందిర మ్మ ఇళ్ల పథకం పైలట్ గ్రామం రాళ్లపేటలో బేస్మెంట్ స్థాయికి ఇంటి నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లోకి గురువారం నగదు జమైనట్లు ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ తెలిపారు. రాళ్లపేటలో 102 మందిని ఎంపిక చేయగా 52 మంది పనులు ప్రారంభించారని.. 9 మంది బేస్మెంట్ వరకు పూర్తిచేయగా వారి ఖాతాల్లో మొదటి విడతగా రూ.లక్ష చొప్పున జమైనట్లు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీలు సిరిసిల్లకల్చరల్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంగీత విభాగంలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసినట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. htt p://agnipathvayu.cdac.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రొవిజన ల్ అడ్మిట్‌కార్డు పొందే వీలుంటుందని తెలిపా రు. బెంగళూరు, న్యూఢిల్లీలో జరిగే ర్యాలీలో పాల్గొని సంగీత విభాగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసంసిరిసిల్లటౌన్: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం సుభాష్‌నగర్ సెక్టార్ పరిధిలోని పెద్దూరు అంగన్వాడీ సెంటర్లో పోషణ జాతర, అన్నప్రాసన, సామూహిక సీమంతా లు, అక్షరాభ్యాసం నిర్వహించారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భవతి అని తెలిసినప్పటి నుంచే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. సీడీపీవో ఉమారాణి, సూపర్వైజర్ దివ్య, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత, టీ చర్లు మంజుల, అన్నపూర్ణ, శాంత, నాగలక్ష్మి, విజ య, పద్మ, సునీత, రేణుక, రాధ, చిట్టి, పుష్పలత, జ్యోతి, సురేఖ, మహేశ్వరి పాల్గొన్నారు. ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ అవసరంసిరిసిల్లక్రైం: జన రద్దీ అధికంగా ఉండే ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ అవసరమని సిరిసిల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ స్పష్టం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలోని పలు ఆస్పత్రుల్లో గురువారం ఫైర్‌సేఫ్టీపై అవగాహన కల్పించారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే వాటి నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలుసాక్షి ,పెద్దపల్లి ●: అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. రోజూ ఇద్దరు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. నివారిద్దాం ఇలా.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి. ● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’. ● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’. ● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది. ...వీరంతా బతకాల్సిన వారే కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి.. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
ప్రొటోకాల్ వివాదంతో ఉద్రిక్తత
గంభీరావుపేట(సిరిసిల్ల): బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ప్రొటోకాల్ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం ఐకేపీ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పెద్దవేని వెంకటి, గోగు లింగం, వెంకటస్వామిగౌడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పె ట్టలేదని అధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరగా.. స్పందన రాకపోవడంతో వారే తొలగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నేతృత్వంలో వివిధ మండలాల నుంచి ఆ పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఠాణాకు వచ్చి బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై ప్రేమానంద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కలెక్టరేట్లో లీకువీరుడు!
● సిరిసిల్లలో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి ● ఆయన శాఖలో తరచుగా లోపాలు గుర్తిస్తున్న కార్యాలయం ● అటెన్షన్ డైవర్షన్ కోసం కార్యాలయంపై దుష్ప్రచారం ● సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో ఇదే తంతు ● ధరణి, లే అవుట్ల విషయంలో పలుమార్లు భంగపాటు ● ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్?సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కొంతకాలంగా పలుసంచలనాలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఓ అధికారి తీరే ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. కొన్నినెలలుగా సిరిసిల్ల కలెక్టరేట్లో జరుగుతున్న పలు పరిణామాలను, విధాన పరమైన నిర్ణయాలను తప్పుడుగా ప్రచారం చేస్తున్న అధికారిపై కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సైతం అతని తీరుపై గుర్రుగా ఉన్నారని, జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఈ విషయం సిరిసిల్ల కలెక్టరేట్లో చర్చానీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరాయన? ఐదారేళ్లుగా సిరిసిల్ల జిల్లాలో పాతుకుపోయిన సదరు అధికారికి స్థానిక రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా భూవివాదాలకు సంబంధించిన విషయాల్లో సదరు అధికారి అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. తన శాఖలో ఏం జరుగుతుందన్న విషయం గాలికి వదిలి.. నిత్యం ధరణి, లే అవుట్ల విషయంలో తల దూరుస్తూ.. వివాదాస్పద విషయాలను కార్యాలయానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టరేట్ వర్గాలు గుర్తించాయి. ఆయన పనిలో ఎపుడు లోపాల్ని గుర్తించినా.. వెంటనే తనపై ఎవరూ శ్రద్ధ పెట్టకుండా.. వెంటనే కలెక్టర్ కార్యాలయంపై ఏదో తప్పుడు ప్రచారం చేసి, తనపై చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లడం, కలెక్టర్ కార్యాలయానికి లీవులపై కనీస సమాచారం ఇవ్వకపోవడం, ప్రభుత్వ సమీక్షాసమావేశాలకు తరుచుగా ఆలస్యంగా వస్తుండటంతో అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఆయన బదిలీ కాకపోవడం గమనార్హం. భూములంటే అమితాసక్తి.. ఇటీవల ధరణి రికార్డుల్లో మార్పులు చేర్పులు, లేఅవుట్ల విషయంలో కలెక్టరేట్లో ఆయన అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. ఒక సందర్భంలో ఏకంగా కలెక్టర్ అనుమతి లేకుండా ధరణిలో రికార్డులు మార్చేందుకు సదరు అధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. రికార్డులు మార్చే అధికారి ముందుజాగ్రత్తగా.. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దూరు, ఆగ్రహారంలో పలువురు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి సహకరించిన విషయాన్ని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ముందస్తుగానే పసిగట్టడంతో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. తన అక్రమాలు, శాఖలో లోపాలు బయటపడ్డ ప్రతీసారీ.. కలెక్టర్ కార్యాలయంలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారంచేసి ఇతరులపై దృష్టి మరల్చేలా చేస్తున్నారని సమాచారం. ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భోజన ఖర్చులపై దుమారం, ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగానూ.. జరిగిన పరిణామాల వెనుక సదరు అధికారే ఉన్నారని కలెక్టర్ కార్యాలయం గుర్తించింది. తమకు తరచుగా ఆటంకాలు కలిగిస్తున్న ఆ అధికారిని సరెండర్ చేయాలని నివేదిక పంపేందుకు కలెక్టర్ సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
● భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం ● ఆధార్‌లా భూమికి భూధార్ సంఖ్య ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● బోయినపల్లిలో అవగాహన సదస్సుబోయినపల్లి(చొప్పదండి): భూ సమస్యల సత్వర పరిష్కారానికి ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో భూభారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) కొత్త ఆర్వోఆర్ చట్టం 2025పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనచట్టంపై ఈనెల 17 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. భూసమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ద్వారా ఆర్డీవోలు, కలెక్టర్ల నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఽగతంలో ఉన్న ధరణిలో రికార్డుల్లో సవరణకు అవకాశం లేదని, సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందేనని గుర్తుచేశారు. అప్పీల్ వ్యవస్థతో సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టులకు వెళ్లవచ్చన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో గ్రామపరిపాలన అధికారులను నియమిస్తారని, ఆధార్‌కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపుతో భూఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. ఎకరం భూమి మ్యూటేషన్‌కు రూ.2500 ఫీజు చెల్లించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణరెడ్డి, డీటీ భూపేశ్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, ఎంపీడీవో భీమ జయశీల, ఎంఏవో ప్రణిత తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’పై అవగాహన సదస్సులుసిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ‘భూ భారతి’పై మండల స్థాయిలో అవగాహన సదస్సులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిర్వహిస్తున్నారు. ఈనెల 19న ఇల్లంతకుంట, 21న కోనరావుపేట, 22న రుద్రంగి, చందుర్తి, 23న వేములవాడ, వేములవాడరూరల్, 24న గంభీరావుపేట, 25న ముస్తాబాద్, 26న తంగళ్లపల్లి, 28న సిరిసిల్ల, 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. -
చార్జిషీట్ దాఖలుపై నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలపై ఈడీ పెట్టిన అక్రమకేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు బుధవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్ మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ సర్కారు తట్టుకోలేక పోతుందన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు ఆకునూరి బాలరాజు, కల్లూరి చందన, కోడం అమర్, కుడిక్యాల రవికుమార్, అన్నల్దాస్ భాను తదితరులు పాల్గొన్నారు. -
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఇల్లంతకుంట(మానకొండూర్): గంజాయి సేవించడం, అక్రమ రవాణా చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి కట్టడి చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఠాణాను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానితులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఠాణాలోని గ్రౌండ్లో నాటిన పండ్లతోటకు బిందు సేద్యం ప్రారంభించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ ఉన్నారు. సీనియర్ సిటిజెన్ పోస్టర్ ఆవిష్కరణ సిరిసిల్లకల్చరల్: వృద్ధుల సంరక్షణ చట్టంలోని కీలక సెక్షన్లతో కూడిన పోస్టర్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం ఆవిష్కరించారు. ఎస్పీ ఆఫీస్‌లో పోస్టర్ ఆవిష్కరణలో సీనియర్ సిటీజన్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, సంఘం బాధ్యులు శ్రీగాద మైసయ్య, దొంత దేవదాస్, అంకారపు జ్ఞానోభ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఆర్డీవో శేషాద్రిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 191 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం సేకరించకపోతే సమీపంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తామని తెలిపారు. వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్‌బేగం, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, నారాయణపూర్, సింగారం, రాచర్లబొప్పాపూర్, గుండారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో శేషాద్రి ప్రారంభించారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరబేగం, వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బండారి బాల్‌రెడ్డి, సిరిపురం మహేందర్ ఉన్నారు. -
వంతెన పూర్తి చేయండి
● స్తంభంపల్లి నుంచి సిరిసిల్లకు పాదయాత్ర సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి): అర్ధంతరంగా నిలిచిన స్తంభంపల్లి హైలెవెల్ వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు బుధవారం స్తంభంపల్లిలోని సుగ్రీవ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. మధ్యలో వేములవాడలో రాజన్న, అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయాల్లో దర్శనం చేసుకుని తమ సమస్య పరిష్కారం కావాలని పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కలెక్టరేట్‌కు రాగా పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ కార్యాలయం ఏవో రామ్‌రెడ్డి వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. స్తంభంపల్లి మాజీ సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి, మాజీ ఉపసర్పంచ్లు బొంగాని అశోక్, బీరవెల్లి వెంకటేశ్వరరావు, ముచ్చె లింగారెడ్డి, తునికి తిరుమలేశ్, రాచర్ల రాజేశ్, అక్కెనపల్లి గణేష్, అక్కెనపల్లి రమేశ్, గొర్రె విజయ్ పాల్గొన్నారు. -
● స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేపట్టాలి ● వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్
లింగ నిర్ధారణపై కఠిన చర్యలుసిరిసిల్లటౌన్: జిల్లాలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలన్నారను. భ్రూణ హత్యలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకో వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో నూతన ఆస్పత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్ర క్రియ కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలని సూచించా రు. స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు కమిషనర్ అనుమతి తప్పనిసరి అని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉన్న డ్రగ్స్ వివరాలపై వైద్యసిబ్బందికి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవల వివరాలు తెలుసుకున్నారు. రేడియాలజీ పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లు అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు సమర్థంగా అందించేలా చూడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.