మే డే విజయవంతం చేయండి
సిరిసిల్లటౌన్: మే డేను కార్మికులు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేటలో నిర్వహించే కార్మిక దినోత్సవం కార్యక్రమం కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండు రమేశ్, నాయకులు సబ్బని చంద్రకాంత్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్‌దేవి జగదీశ్, చెముటి రాము, మ్యాన రాజు, గడుదాస్ వేణు, ఇమ్మశెట్టి లక్ష్మణ్, మిట్టపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.


