రజతోత్సవానికి తరలిరండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీఆర్‌ఎస్ పార్టీ రజతో త్సవ సభకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. ఎల్లారెడ్డిపేటలో ఆదివారం ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. తమ అధినేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో సముచితస్థానం ఉందన్నారు. ఈనెల 27న ప్రజలు తమ ఇంట్లో పండుగలా గుర్తించి రజ తోత్సవ సభకు తరలిరావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు అందె సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, నర్సింలు, రమేశ్, నెమలికొండ శ్రీనివాస్ ఉన్నారు.
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య


