స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ఇద్దరు న్యాయవాదులు భారత ప్రభుత్వ ఆధీనంలోని న్యాయ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపికయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన వరద మారుతి ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ సభ్యుడిగా వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. అడిషనల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్ సభ్యుడిగా స్థానిక అంబికానగర్‌కు చెందిన అన్నల్‌దాస్ వేణు ఎంపికయ్యారు. ఈ మేరకు భారత న్యాయ వ్యవహారాల శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. మూడేళ్ల పాటు వారు ఈ పదవిలో కొనసాగుతారు. తమ నియామకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్లకల్చరల్: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసంతో పాటు స్వరాష్ట్రం నుంచి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు పొందేందుకు దోహదం చేసే ఐఈఎల్‌టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ సిస్టమ్)పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి తెలిపారు. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ వివరాలను ఆన్‌లైన్ www. tgbcstudycircle. cgg. gov. in లో జనవరి 11లోపు వివరాలను పొందుపరచాలన్నారు. మరింత సమాచారం కోసం 040–24071178 లేదా 08723–223004 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న నీటి విడుదల
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్టు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.35 టీఎంసీలు ఉన్నట్టు పేర్కొన్నారు.
బండపల్లి కార్యదర్శికి డిప్యూటేషన్
చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రమేశ్‌బాబును మంగళవారం తంగళ్లపల్ల మండలం బాలుమల్లుపల్లె పంచాయతీకి డిప్యూటేషన్‌పై పంపినట్లు ఎంపీవో ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొద్ది రోజులుగా పలు వివాదాల్లో వివాదస్పదునిగా మారడం డిప్యూటేషన్‌కు కారణమని చర్చ కొనసాగుతోంది. గతంలో మండలంలోని నర్సింగపూర్ కార్యదర్శిగా పని చేసిన సమయంలో ఉపాధి హామీ డబ్బులు పక్కదారి పట్టించడంతో సస్పెన్షన్ కాగా, తిరిగి అధికారులు బండపల్లి పంచాయతీ కార్యదర్శిగా నియమించారు. రెండునెలలుగా పలు వివాదాలు కొని తెచ్చుకోవడంతో డిప్యూటేషన్‌పై పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
తండా రూపురేఖలు మారుస్తాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో కిష్టునాయక్ తండా రూపురేఖలు మారుస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి నిర్మల సర్పంచ్‌గా గెలుపొందడంతో మంగళవారం పాలకవర్గాన్ని సన్మానించారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కేంద్ర మంత్రి సహకారంతో ముందుకెళ్తామన్నారు. గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు సురేశ్, కిరణ్‌నాయక్, ఊడ్గుల యాదగిరి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక
స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక
స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక


