అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రామ కమిటీలు గుర్తించిన వారితోపాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్ ఉన్నారు.
మాతాశిశు మరణాలు నివారించాలి
మాతాశిశు మరణాలు నివారించాలని, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గత నెలలో 666 డెలివరీలు చేశామని డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. గైనకాలజిస్ట్‌లు అవసరం ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు.
విదార్థులకు అభినందన
ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన హేమంత్ 496 మార్కులతో మొదటి ర్యాంకు, ఆదిల్ షరీఫ్ 483, షారుక్ 969, సంజయ్ 962 మార్కులు సాధించారు.


