ధర్మంతో బతకాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధర్మంతో బతకడం నేర్చుకోవాలని సిరిసిల్ల ఇస్కాన్ టెంపుల్ ఇన్‌చార్జి ప్రాణనాథ్ అచ్యుత ప్రభుదాస్ కోరారు. మండల కేంద్రంలో బుధవారం భగవద్గీత పుస్తక వితరణ కార్యక్రమం జరిగింది. ప్రాణనాథ్ అచ్యుత ప్రభుదాస్ ఇస్కాన్ ఆధ్వర్యంలో డిసెంబర్ మాసంలో గీత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. 17 శాతం డిస్కౌంట్‌తో భగవద్గీత పుస్తకాలు అందజేస్తున్నట్లు చెప్పారు. కోడెం అశోక్, పులి రమేశ్, స్వామి, ధర్మాత్మ, వైకుంఠ పురుషోత్తం, సనుగుల ఈశ్వర్, చకిలం నారాయణ, బలరాం, దాస్, పారిపల్లి సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి చెందిన బాలమహేందర్ దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో ఇంటికి చేరుకోగా వారి కుటుంబానికి స్థానిక పాత అంగడి బజారుకు చెందిన యువకులు బుధవారం రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు. తన భర్త వైద్య ఖర్చుల కోసం సహాయం చేసిన పాత అంగడి బజార్ యువకులకు మహేందర్ భార్య బాలసంధ్య కృతజ్ఞతలు తెలిపారు. సదరు యువకులు మాట్లాడుతూ బాలమహేందర్ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు.
ధర్మంతో బతకాలి


