వ్యక్తి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బరిగెలగూడెంకు చెందిన ఈరగారి మురళి(42) ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు. ఇంటి మరమ్మతుల కోసం సుమారు రూ.5లక్షల వరకు అప్పు చేశాడని, అవి తీర్చలేక, కూలీ పనులు దొరక్క ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని తెలపారు. ఆర్థిక ఇబ్బందులతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య దేవ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.


