నేటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కబడ్డీ కూతతో హోరెత్తనుంది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు క్రీడాదుస్తులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ అమిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్‌గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, కోచ్‌లు మల్లేశ్, శ్రీనివాస్, పద్మ అందించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.


