తప్పనిసరైతేనే బయటకు రండి
● ఎండలో జాగ్రత్తలు తీసుకోండి ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. ఉదయం 10 గంటల తరువాత బయటకు రావొద్దని.. అత్యవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత పనులు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత సూ చించారు. జిల్లాలో తీవ్ర వడగాలుల నేపథ్యంలో సోమవారం ఈమేరకు ప్రకటన జారీ చేశారు. గత పది రోజులుగా వేడిగాలులతోపాటు ఎండలు తీవ్రంగా ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎండదెబ్బ తగలకుండా తలకు తువ్వాలు, గొడుగు, టోపీలతోపాటు తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. తాగునీటిని వెంట తీసుకెళ్లాలని, తల తిరగడం, అధికంగా చెమటలు రావడం కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లాలని కోరారు. ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, చెరుకు రసం వంటి పానీయాలు తీసుకోవాలని కోరారు.


