ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సిరిసిల్ల: జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని ఆన్‌లైన్ చేశారని హౌసింగ్ పీడీ శంకర్‌ను అడుగగా.. 7,690 దరఖాస్తులను సర్వే చేశారని, 5,776 ఆన్‌లైన్ చేసినట్లు వివరించారు. మే 2న ఆయా దరఖాస్తుదారు జాబితా ప్రదర్శించాలని, మే 5న తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, డీవైఎస్‌వో రాందాస్ పాల్గొన్నారు.
భూభారతితో సమస్యలు పరిష్కారం
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. భూభారతి, నూతన ఆర్‌వోఆర్ చట్టంపై ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్రభుత్వం భూధార్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. రైతుల కు ఉచిత న్యాయ సహాయం అందజేస్తారని, గ్రామ రెవె న్యూ రికార్డులు నిర్వహిస్తారని వివరించారు. ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, వీర్నపల్లి చైర్మన్ రాములునాయక్, తహసీల్దార్లు సుజా త, ముక్తార్ పాషా, మండల ప్రత్యేకా ధికారి అఫ్జల్ బేగం, వీర్నపల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో అబ్దుల్ వాజీద్, ఆర్‌ఐ శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ లెక్కల లక్ష్మణ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేవు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ సందీప్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లతో కలిసి బుధవారం ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటి వరకు 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సిరిసిల్ల, వేములవాడలో అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి తూకం వేసిన ధాన్యాన్ని తరలించినట్లు తెలిపారు.
2న లబ్ధిదారుల జాబితా
5న తుది జాబితా ప్రకటించాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా


