సకాలంలో రావడం లేదు
సకాలంలో వేతనాలు రావడం లేదు. మూడు నెలలుగా కూలీ డబ్బులు రావాల్సి ఉంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి తాగునీరు తీసుకొచ్చుకుంటున్నాం. పని ప్రదేశంలో టెంటు వేయాలి.
– గుడికాడి బుచ్చయ్య, కూలీ, గంభీరావుపేట
అలవెన్సు చెల్లించాలి
ఎండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం అలవెన్సు ఇవ్వాలి. మండుతున్న ఎండల్లో అతికష్టం మీద పనిచేస్తున్నాం. గతంలో ఎండాకాలంలో అదనంగా అలవెన్సు చెల్లించారు. ఇప్పుడు చెల్లించి కూలీలకు అండగా నిలవాలి.
– చెరుకు స్వప్న, కూలీ, గూడూరు
నెట్‌వర్క్ సమస్య ఉంది
నూతన విధానంలో ప్రత్యేక యాప్ ద్వారా కూలీల హాజరును నమోదు చేస్తున్నాం. మస్టర్ ఎంట్రీ నెట్‌వర్క్‌తో తొందరగా పనికావడం లేదు. ఐరీష్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. కూలీలతోపాటు ఫీల్డ్‌అసిస్టెంట్లకు అలవెన్సు ఇవ్వాలి. – శ్రావణ్, ఫీల్డ్ అసిస్టెంట్
సకాలంలో రావడం లేదు
సకాలంలో రావడం లేదు


