దుష్టపాలన అంతమే లక్ష్యం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలన అంతమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలం ముందుకు సాగుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్నారు. అధినేత కేసీఆర్ పిలుపుతో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెసోళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై అవివేకంతో వ్యాఖ్యలు చేస్తున్నారని వారి ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ నాయకులు గూడూరు ప్రవీణ్, సిద్ధం వేణు, ఒజ్జల అగ్గిరాములు, గజభీంకార్ రాజన్న, మాట్ల మధు, కుంభాల మల్లారెడ్డి, గుగులోతు సురేష్, జక్కుల యాదగిరి, ఇమ్మనేని అమర్‌రావు, గుండు ప్రేమ్‌కుమార్, సయ్యద్ అప్రోజ్ పాల్గొన్నారు.
వాహనాలను సరిగ్గా నిర్వహించాలి
సిరిసిల్లకల్చరల్: అత్యవసర సేవల అంబులెన్స్‌లు, అమ్మఒడి వాహనాలను సరిగ్గా నిర్వహించాలని రాష్ట్ర అంబులెన్స్ మరమ్మతుల కోఆర్డినేటర్ సూర్యనారాయణరాజు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ సలీం పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నిలిపిన వాహనాలను సోమవారం పరిశీలించారు. 108 సిబ్బంది మామిడాల ఆంజనేయులు, బుర్ర స్వాతి, సిరిసిల్ల ప్రవీణ్, మంత్రి కిశోర్, యాసరవేణి సాగర్, డాక్టర్ మనీషా, కెప్టెన్ ద్యాగం నరేశ్, హెల్పర్ ప్రశాంత్ పాల్గొన్నారు.
ఉషుపోటీల్లో తల్లీకొడుకుల ప్రతిభ
సిరిసిల్లకల్చరల్: ఆముచూర్ ఉషు మూడో రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన తల్లీకొడుకులు తిప్పరవేని స్వప్న, బొల్లాజీ ఆదిదేవ్ ప్రతిభ చూపారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. 47 కిలోల విభాగంలో తన్షుఫైట్‌లో తిప్పరవేని స్వప్న రెండో ర్యాంక్, 30 కేజీల విభాగంలో తాన్‌షాప్ ఫైట్‌లో బొల్లాజీ ఆదిదేవ్ రెండో స్థానం దక్కించుకున్నారు. వీరిద్దరూ తల్లీకొడుకులు కావడం విశేషం.
‘కర్రెగుట్టలో నరమేధాన్ని ఆపాలి’
సిరిసిల్లటౌన్: కర్రెగుట్ట ప్రాంతంలో నరమేధాన్ని కేంద్ర బలగాలు వెంటనే ఆపివేయాలని అఖిలపక్షం నేతలు కోరారు. స్థానిక కార్మిక భవనంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కగార్ నిలిపేయాలి..మావోయిస్టులతో చర్చలు జరపాలి’ అనే నినాదంతో సోమవారం అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్రెగుట్టపై ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుంచి వందలాది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన ఆదివాసీలను వదిలిపెట్టాలని కోరారు. నాయకులు గుంటి వేణు, మూశం రమేశ్, సోమిశెట్టి దశరథం, బొజ్జ కనకయ్య, సకినాల అమర్, మార్వాడీ సుదర్శన్, అంకని భాను, రాగుల రాములు, బడే స్వామిదాస్, చెట్కూరి ఆంజనేయులు, గొట్టె రవి, మిట్టపెల్లి రాజమౌళి, దర్శనం కిషన్, వేమండ్ల రమేశ్, కల్లూరి చందన, పోకల సాయికుమార్ పాల్గొన్నారు.
దుష్టపాలన అంతమే లక్ష్యం
దుష్టపాలన అంతమే లక్ష్యం
దుష్టపాలన అంతమే లక్ష్యం


