ఎగువమా‘నీటి’ విడుదల
గంభీరావుపేట(సిరిసిల్ల): యాసంగి వరిసాగు కోసం మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు నుంచి సోమవారం నీటిని విడుదల చేశారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా నర్మాల, గంభీరావుపేట గ్రామాల పరిధిలోని దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. మరో రెండు రోజుల్లో కుడి ప్రధాన కాలువ ద్వారా గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని దాదాపు 9వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్, డీఈ నర్సింగ్, రవికుమార్, ఏఈలు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు కేటీఆర్ కానుకను సోమవారం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అందజేశారు. చిక్కాల రామారావు మాట్లాడుతూ సర్పంచులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సిరిసిల్ల: కార్మిక క్షేత్రంలో ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ చేనేత భవన్‌లో సోమవారం చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌కు పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. సిరిసిల్ల నేతకార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు పెద్దూరు శివారులో షెడ్లు నిర్మించారని, ఆ షెడ్లలో లూమ్స్‌ను ఏర్పాటు చేసి కార్మికులకు అందించాలని కోరారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సమక్షంలోనే పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్ వినతిపత్రం అందించారు. చేనేత, జౌళిశాఖ జేడీ వెంకటేశ్వర్‌రావు, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి బాధ్యతల స్వీకరణ
వేములవాడ: వేములవాడ ఏఎస్పీగా ఇటీవల బదిలీ అయిన రుత్విక్‌సాయి తన ట్రెయినింగ్ అనంతరం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మహేశ్ బీ గీతేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పరిస్థితులు, భద్రతపై చర్చించారు. డీఎస్పీ కార్యాలయ సిబ్బంది, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు రుత్విక్‌సాయిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
చింతల్‌ఠాణాలో ఉపసర్పంచ్.. వార్డుసభ్యులు
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం చింతల్‌ఠాణాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో నామినేషన్ అనంతరం ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి మృతిచెందిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన ఎన్నికల్లో మురళి గెలుపొందారు. అయితే గ్రామపంచాయతీలో మురళి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఉపసర్పంచ్, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు.
ఎగువమా‘నీటి’ విడుదల
ఎగువమా‘నీటి’ విడుదల
ఎగువమా‘నీటి’ విడుదల
ఎగువమా‘నీటి’ విడుదల


