మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
ఎన్నికల సిత్రాలు
నాడు... నేడు
కమటం లావణ్య
కమటం నర్సవ్వ
కమటం పరుశురాం
కమటం రాములు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకే ఇంటి నుంచి సర్పంచ్‌గా మామ..అత్త.. భర్త పనిచేయగా.. నేడు కోడలు సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చే శారు. మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామపంచాయతీ సర్పంచులుగా గత మూడు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పనిచేశారు. కమటం పరుశరాములు రెండు పర్యాయాలు, అతని భార్య కమటం నర్సవ్వ రెండు పర్యాయాలు 1995–2011 వరకు, కొడుకు రాములు సర్పంచ్‌గా ఎన్నికై గ్రామానికి సేవలందించారు. 2013 నుంచి 2018 వరకు కమటం పరశురాములు కోడలు లావణ్య స ర్పంచ్‌గా కొనసాగారు. ప్రస్తుతం లావణ్య రెండోసారి గెలుపొందారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ముప్పై ఏళ్లుగా ఆ గ్రామ సర్పంచులుగా ఎన్నికవుతుండడం విశేషం.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఇల్లందుల గీతాంజలి గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. బీఆర్‌ఎస్ మద్దతుదారు అయిన గీతాంజలి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామస్తుల మన్ననలు పొందారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి విజ యం సాధించారు. సోమవారం సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్ సర్పంచ్‌గా పిట్ల బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, నిన్నటి వరకు ఆయన కోడలు పిట్ల పావని సర్పంచ్‌గా పనిచేశారు. అదే కుటుంబం నుంచి ఆమె మామ బాబును ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. బాబును ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
వట్టెంలలో సర్పంచ్
రంగు వెంకటేశ్‌గౌడ్
లింగంపల్లిలో
తిరుపతిరెడ్డి దంపతులు
పిట్ల పావని
పిట్ల బాబు
వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన రంగు వెంకటేశ్‌గౌడ్ గతంలో ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం సర్పంచ్‌గా గెలుపొందారు. లింగంపల్లి గ్రామ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసిన సామ తిరుపతిరెడ్డి భార్య గతంలో సామ కవిత సర్పంచ్‌గా చేశారు. మల్లారం ఎంపీటీసీగా పనిచేసిన వీరారెడ్డి భార్య సంగెం అర్పిత సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం
మూడు దశాబ్దాలు.. ఒకే కుటుంబం


