పల్లెవించిన యువరాగం | - | Sakshi
Sakshi News home page

పల్లెవించిన యువరాగం

Dec 23 2025 7:20 AM | Updated on Dec 23 2025 7:20 AM

పల్లె

పల్లెవించిన యువరాగం

● 135 మంది 40 ఏళ్లలోపే.. ● నాగలి పట్టిన రైతుకు పల్లెపగ్గాలు ● పాలనలోకి వ్యాపారులు

సర్పంచులు ఇలా..

● 135 మంది 40 ఏళ్లలోపే.. ● నాగలి పట్టిన రైతుకు పల్లెపగ్గాలు ● పాలనలోకి వ్యాపారులు

సిరిసిల్ల: పల్లెపాలన పగ్గాలు యువతరం చేజిక్కించుకుంది. చదువు.. ఉద్యోగాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో బరిగీచి నిల్చున్నారు. నాగలిపట్టిన రైతులు పాల నలో అడుగుపెట్టారు. వేములవాడ అర్బన్‌ మండలం చింతల్‌ఠాణా సర్పంచ్‌ మినహా 259 గ్రామాల్లో కొత్తగా సర్పంచులు, పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలు సోమవారం పూర్తయ్యాయి. గ్రామ సర్పంచులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో 40 ఏళ్లలోపు వారు 135 మంది ఉన్నారు.

వ్యవసాయమే ప్రధానం

జిల్లాలో 259 మంది సర్పంచులు బాధ్యతలు స్వీకరించగా.. 174 మందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇక వ్యాపారులు పది మంది ఉండగా.. బీడీ కార్మికులు ఐదుగురు, దినసరి కూలీలు ఐదుగురు ఉన్నారు. ఇంటి పనులు చేసే గృహిణులు 40 మంది ఉండడం విశేషం. స ర్పంచ్‌లుగా రేషన్‌డీలర్లు, ప్రైవేటు వ్యాపారులు, రిటైర్డు టీచర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు, గీతకార్మికులు, నేతకార్మికులు, ఆటో డ్రైవర్లు ఉన్నారు. ము గ్గురు మాత్రం రాజకీయాలే వృత్తిగా పేర్కొనడం విశేషం.

25 ఏళ్లవాళ్లు ఇద్దరు..

60 ఏళ్లు దాటినోళ్లు 9 మంది

జిల్లాలో అతి చిన్న వయసు గల వారిని పరిశీలిస్తే.. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లెకు చెందిన బోంగోని అమ్మాయి డిగ్రీ చేసి 25 ఏళ్లలో సర్పంచ్‌ అయ్యారు. వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా సర్పంచ్‌గా ఎన్నికై న మాలోత్‌ సుధాకర్‌ డిగ్రీ చేసి 25 ఏళ్లకే సర్పంచ్‌ అయ్యారు. 40 ఏళ్ల లోపు యువకులు 135 మంది సర్పంచ్‌లు కాగా.. 60 ఏళ్లు దాటిన వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి సర్పంచ్‌ పన్నాల లక్ష్మారెడ్డి, ఇల్లంతకుంట మండలం తాళ్లళ్లపల్లి సర్పంచ్‌ మీసాల కనకరాజు(రిటైర్డు టీచర్‌), తెనుగువానిపల్లెకు చెందిన వంచ చంద్రారెడ్డి, కందికట్కూర్‌కు చెందిన చింతపల్లి విజయ, తంగళ్లపల్లి మండలం ఒబులాపూర్‌కు చెందిన కొమ్మెట పర్శయ్య, పద్మనగర్‌కు చెందిన మోర నిర్మల, తంగళ్లపల్లికి చెందిన మోర లక్ష్మీరాజం, వేణుగోపాల్‌పూర్‌కు చెందిన జూపల్లి రమాదేవి, గంభీరావుపేట మండలం కోళ్లమద్దికి చెందిన ఆడబోయిన దిలీప్‌కుమార్‌ ఉన్నారు. జిల్లాలో విద్యావంతులు, యువకులు సర్పంచులు కావడం విశేషం. జిల్లాలో 259 మందిలో 119 మంది మహిళా సర్పంచులు పల్లెపాలన పగ్గాలు చేపట్టారు.

అట్టహాసంగా ప్రమాణ స్వీకరాలు

జిల్లాలో సోమవారం అట్టహాసంగా గ్రామసర్పంచుల ప్రమాణ స్వీకరాలు జరిగాయి. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మద్దతుదారులైన సర్పంచులను అభినందిస్తూ.. కొత్తపాలకవర్గాలకు శుభా కాంక్షలు తెలిపారు. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి తన పరిధిలోని గ్రామాల్లో సర్పంచులను సన్మానిస్తూ.. అభినందించారు. జిల్లాలో కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

కోనరావుపేట: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ హితవు పలికారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట, మామిడిపల్లి నూతన పాలకవర్గాలను సన్మానించి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

ఆదర్శ వార్డుకు బహుమతి

ఇల్లంతకుంట: ఇల్లంతకుంటలో ఏ వార్డు ఆదర్శంగా నిలుస్తుందో ఆ వార్డుకు నగదు బహమతి అందజేస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ముస్కానిపేట, ఇల్లంతకుంట పాలకవర్గాల సన్మాన కార్యక్రమానికి హాజరై అభినందించారు.

అండగా ఉంటాం..

ముస్తాబాద్‌: పంచాయతీలను అభివృద్ధి చేసుకునేందుకు పాలకవర్గాలకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొర్రాపూర్‌ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. పార్టీలో పలువురు చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.

ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ముస్తాబాద్‌ మండలం మొర్రాపూర్‌లో మహేందర్‌రెడ్డి

పోసు్ట్రగాడ్యుయేషన్‌: 12, గ్రాడ్యుయేషన్‌: 57

ఇంటర్మీడియట్‌: 26, ఎస్‌ఎస్‌సీ: 69

పదోతరగతి లోపు: 55, ఏడో తరగతి: 25

చదువు రాని వారు: 15

పల్లెవించిన యువరాగం1
1/2

పల్లెవించిన యువరాగం

పల్లెవించిన యువరాగం2
2/2

పల్లెవించిన యువరాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement