మీ డబ్బు.. మీ హక్కు
సిరిసిల్ల: ‘మీ డబ్బు.. మీ హక్కు’ ను వినియోగించుకుని క్లెయిమ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం ‘మీ డబ్బు.. మీ హక్కు’పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలుందని తెలిపారు. బ్యాంకు శాఖ, బీమాసంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో ఎవరినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిపాజిట్ల వివరాలు ఆర్‌బీఐ ఉద్గమ్ వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్‌సాయి, యూబీఐ లీడ్ బ్యాంక్ ఏజీఎం రాధాకృష్ణ, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, ఎల్‌ఐసీ ఏఏవో వరలక్ష్మి, ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు.
ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు సన్నద్ధం కావాలి
సిరిసిల్లఅర్బన్: ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు సన్నద్ధం కావాలని ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.


