ఓవరాల్ చాంపియన్ మైనార్టీ గురుకులం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి స్పోర్ట్స్‌మీట్‌లో ప్రతిభచాటి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించినట్లు ప్రిన్స్‌పాల్ చంద్రమోహన్ తెలిపారు. బొమ్మకల్‌లో ఈ నెల 19నుంచి 21వరకు 3వ ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. పలు క్రీడల్లో విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కప్ అందించారు. కప్ సాధించిన విద్యార్థులను సోమవారం మైనార్టీ గురుకులాల ఇన్‌చార్జి సుభాన్, కోఆర్డినేటర్ విమల, విజిలెన్స్ అధికారులు అక్రమ్, ఇంతియాజ్ అభినందించారు.


