‘సర్కార్’ సత్తా
ఇంటర్ ఫలితాల్లో
● ప్రైవేట్ కాలేజీలకు దీటుగా మార్కులు సాధించిన విద్యార్థులు
సిరిసిల్లటౌన్: ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో సర్కారు కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేట్‌కు దీటుగా మార్కులు సాధించారు. సిరిసిల్ల బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్ బైపీసీలో బుసమల్ల సాహితీమిత్ర 980, జిల్లా రాధిక 966, ఎంపీసీలో కోడం వైశాలి 955, సీఈసీలో పత్రి స్వప్న 900, హెచ్‌ఈసీలో సుస్మిత 951, ఫస్టియర్ ఎంపీసీలో పెండేటి స్నేహిక 462, కుడిక్యాల అఖిల 461, బైపీసీలో ఉడుత లాస్య 422, గంగిశెట్టి రాజస్విని 418, సీఈసీలో గాజుల శివాని 455, హెచ్‌ఈసీలో ఖతీజా ఫలక్ 320 మార్కులు సాఽధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీటీసీలో కె.అరవింద్ 963, టి.శరణ్య 960, శశి 955, బైపీసీలో మనీష్ 967, భువన 940, సీఈసీలో సాయికృష్ణ 983, పూజ 948, అల్ట్రాఫ్ 940, హెచ్‌ఈసీలో రమ్య 904, ఏఅండ్‌టీలో మాన్విత 904, ఏఈటీలో జి.రాకేశ్ 911, సీటిలో సాయిరాం 872 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయరఘునందన్, డీఐఈవో వై.శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
‘సర్కార్’ సత్తా
‘సర్కార్’ సత్తా


