కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Dec 21 2025 7:05 AM | Updated on Dec 21 2025 7:05 AM

కేటీఆ

కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ● ఐద్వా జిల్లా కార్యదర్శి జువ్వాజి విమల

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని అవమానిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. ఎల్లారెడ్డిపేటలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కుక్కలు, గాడిదలు, గుర్రాలతో పోల్చి న కేటీఆర్‌ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థులు అనేక స్థానాల్లో సర్పంచులుగా గెలుపొందారని, ముస్తాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీని సైతం కై వసం చేసుకున్నామన్నారు. ఎల్లారెడ్డిపేటలో నైతిక విజయం తమదేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అనేక స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు చందుపట్ల లక్ష్మారెడ్డి, నాయకులు మద్దుల బుగ్గారెడ్డి, నంది నరేశ్‌, దాసరి గణేశ్‌, బోనాల సాయి, మద్దుల బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు కాంగ్రెస్‌ నిరసన

సిరిసిల్లటౌన్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. పేదల సంక్షేమ పథకం ఉపాఽధిహామీపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం గాంధీచౌక్‌లో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మార్చివేయడాన్ని నిరసిస్తూ చేపట్టే కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్‌ నాయకులు తరలిరావాలని కోరారు.

ఉపాధిహామీని నీరుగార్చొద్దు

సిరిసిల్లటౌన్‌: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరారు. సిరిసిల్లలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం నిరసన తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా జీరామ్‌జీ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కోడం రమణ, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్‌చంద్ర, మిట్టపల్లి రాజమల్లు, నక్క దేవదాస్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, బింగి సంపత్‌, స్వర్గం శేఖర్‌, సూరం వీరేశం పాల్గొన్నారు.

మహిళా హక్కులు వినియోగించుకోవాలి

సిరిసిల్లటౌన్‌:మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పురుషులకు సమానంగా రాణించాల ని ఐద్వా జిల్లా కార్యదర్శి జువ్వాజి విమల కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర 14వ జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ మహాసభలకు తరలిరావాలని కోరారు. కోడం లలిత, ముద్రకోల విజయ, ఎల్లవ్వ, లావణ్య పాల్గొన్నారు.

ప్రతీ ఆదివారం నిరంతర దర్శనం

వేములవాడఅర్బన్‌: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిరంతరం దర్శనాలు కొనసాగుతాయని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ముందుగా వేములవాడకు వచ్చి దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. వరుసగా నాలుగు ఆదివారాలు నిరంతరం దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. బద్ది పోచమ్మ ఆలయంలోనూ ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు నిరంతరంగా దర్శనాలు ఉంటాయని వివరించారు.

కేటీఆర్‌ వ్యాఖ్యలు   వెనక్కి తీసుకోవాలి
1
1/2

కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

కేటీఆర్‌ వ్యాఖ్యలు   వెనక్కి తీసుకోవాలి
2
2/2

కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement