ప్రతీ ఎకరాకు నీరు అందిస్తాం
● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రాజెక్టుల కింద ఉన్న వ్యవసాయ భూములకు ప్రతీ ఎకరాకు నీరందిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా, అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ ద్వారా శనివారం నీటిని విడుదల చేసి మాట్లాడారు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 15వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని, భూ సేకరణ చేసి మరో 15 వేల ఎకరాలకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిడ్‌మానేర్ కుడికాలువ ద్వారా 100 క్యూసెక్కులు, అన్నపూర్ణ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పర్యాటక కేంద్రంగా అనంతగిరి ప్రాజెక్టు
అనంతగిరి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడుతానన్నారు. ఇంజినీరింగ్ అధికారులు సుధాకిరణ్, రమేశ్, ఉపేందర్, సమరసేన, వంశీ, నాగేందర్, అనంతగిరి సర్పంచ్ అరుకాల నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, గుడిసె ఐలయ్య, వెంకటరమణారెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు.


