రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: జిల్లాలోని డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో శనివారం మాట్లాడారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మణ్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలి
రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన, ఆయిల్‌పామ్ లక్ష్యం తదితర అంశాలపై శనివారం సమీక్షించారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలన్నారు. అన్ని షాపుల్లో హెల్ప్‌డెస్క్, ఒక సహాయకుడు ఉండాలని సూచించారు.
ఆయిల్‌పామ్ లక్ష్యం చేరుకోవాలి
వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు, పీఏసీ ఎస్ సీఈవోలు రైతులను కలిసి ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ సూచించారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే లాభాలు వివరించాలని, సబ్సిడీలు, ప్రోత్సాహకా లు, పంట ఉత్పత్తులకు మద్దతు ధర, అందుబాటులో ఫ్యాక్టరీ ఉందని విషయాలు తెలపాలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఉన్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఉత్తమ సేవలు అందించాలి
వేములవాడ, నాంపల్లి, గంభీరావుపేట, అల్మాస్ పూర్, సనుగుల, ఇల్లంతకుంట పీఏసీఎస్‌లు ఎఫ్‌పీవోలకు ఎంపిక కాగా, ఆయా పీఏసీఎస్‌ల బాధ్యులను అభినందించారు. రైతులకు ఉత్తమ సేవలు అందిస్తూ.. వ్యాపారంలోనూ వృద్ధి చెందాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ తదితరులున్నారు.
ఇన్‌చార్జి కలెక్టర్‌కు శుభాకాంక్షలు
పంచాయతీ ఎన్నికలు జిల్లాలో విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ ఆఫీస్ సిబ్బంది శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యాయమూర్తిని కలిసిన ఇన్‌చార్జి కలెక్టర్
సిరిసిల్లకల్చరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజను శనివారం ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను బహూకరించారు.


