ప్రైవేట్‌ వల | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వల

May 3 2025 11:19 AM | Updated on May 3 2025 11:19 AM

ప్రైవ

ప్రైవేట్‌ వల

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

నోటిఫికేషన్‌ రాలేదు

ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి నోటిఫికేషన్‌ రాలేదు. ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు జారీచేసే నోటిఫికేషన్‌ను బట్టి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికై తే డిగ్రీ తరహా దోస్త్‌ ఆన్‌లైన్‌ విధానం లేదు. ఉన్నతాధికారులు ఇచ్చే నోటిఫికేషన్‌ ప్రకారం ప్రవేశాలు ఉంటాయి.

– శ్రీనివాస్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

విద్యార్థుల చుట్టూ తిరుగుతున్న కాలేజీల నిర్వాహకులు

గంభీరావుపేట(సిరిసిల్ల):

జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంటర్‌ ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల పీఆర్వోలు తిరుగుతున్నారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఇళ్లకు వచ్చి తమ కాలేజీలో చేరితే జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంక్‌లు పక్కా వస్తాయంటూ ఆశలు చూపి అడ్మిషన్లు తీసుకునేలా చేస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసమంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ కళాశాలల్లో చేర్పిస్తున్నా రు. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరుతున్న పిల్లల సంఖ్య ఏటా తగ్గిపోతుంది. పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు హైదరాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరుతుంటే.. అంతంతే మార్కులు వచ్చిన వారు స్థానికంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో చేరుతున్నారు. ఫలితంగా ఇంటర్‌లో ఫలితా లు తగ్గిపోతున్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రవేశాలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల పీఆర్వోలు పల్లెల్లోకి వచ్చి విద్యార్థుల ప్రవేశాలు తీసుకుంటున్నారు.

ఆర్థిక దోపిడీ

పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే కా ర్పొరేట్‌ కళాశాలల పీఆర్వోలు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని కళాశాలలు వారు విద్యార్థుల నుంచి కొంత ఫీజులు తీసుకొని అడ్మిషన్లు కూడా ఇచ్చేశారు. కళాశాలలు ప్రారంభమైన తర్వాత బోధన విధానం, హాస్టల్‌లో ఫుడ్‌, ఇతర ఏ అంశంలోనైనా నచ్చక విద్యార్థి ఇంటికి తిరిగొస్తే ఫీజు తిరిగి ఇవ్వరు. ఒక వేళ ఇచ్చినా ఎంతో కొంత కట్‌ చేసుకునే ఇస్తారు. డిగ్రీ దోస్త్‌ తరహాలో ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడితే ఇలాంటి ఇబ్బందులకు అవకాశం ఉండదని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.

‘ప్రైవేట్‌’ ఒత్తిడికి చెక్‌ పడేదెప్పుడో..

ఇంటర్‌ ప్రవేశాల్లో దోస్త్‌ తరహా ఆన్‌లైన్‌ విధానం అమలైతే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మేలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకునే వీలుంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇంటర్‌లో సీట్ల కేటాయింపులు జరిగితే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో చదివే అవకాశం లభిస్తుంది.

‘ఆన్‌లైన్‌’ అంతేనా..?

ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్‌లో విద్యార్థుల ప్రవేశాల కోసం పాత విధానాన్నే అమలు చేయనున్నారు. తొలుత డిగ్రీ మాదిరిగా శ్రీదోస్త్‌శ్రీ తరహా విధానం అమలు చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు భావించింది. కానీ అమలు ప్రస్తుతం వీలు కాదని బోర్డు అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పాత విధానం అమలుకు నిర్ణయించారు. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఇళ్ల వద్దకు వచ్చి అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ, 31 ప్రభుత్వ అనుబంధ, 6 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతూనే ఉంది.

న్యూస్‌రీల్‌

‘ఇంటర్‌’లో ప్రవేశాలకు పాత విధానమే

ఆన్‌లైన్‌ ప్రవేశాలు ఇప్పట్లో లేనట్లే

‘ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులే ఏటా ర్యాంక్‌లు సాధిస్తున్నారని.. ఎంసెట్‌లోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నారంటూ ఆశలు కల్పిస్తున్నారు. ఏడాదికి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. తమ కాలేజీలో చదివితే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, మెయిన్‌లో మంచి ర్యాంక్‌ వస్తుందంటూ నమ్మబలికి ఎలాగోలా ఇంటర్‌లో ప్రవేశాలు తీసుకుంటున్నారు.’ ఇదంతా ఇటీవల జిల్లాలోని పలు గ్రామాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యాలు. పదో తరగతి పూర్తయిన పిల్లల ఇంటికే హైదరాబాద్‌, కరీంనగర్‌ నగరాల్లోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల పీఆర్వోలు వస్తున్నారు.

ప్రైవేట్‌ వల1
1/1

ప్రైవేట్‌ వల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement