వడగండ్ల బాధితులకు అండగా ఉంటాం
● అన్నదాతలు ధైర్యంగా ఉండాలి ● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల): వడగండ్ల బాధిత రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వడగండ్ల వానలతో దెబ్బతిన్న వరి, మామిడిపంటలను ముస్తాబాద్, మద్దికుంట, మొర్రాయిపల్లి గ్రామాల్లో శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను మహేందర్‌రెడ్డి ఓదార్చారు. ప్రకృతి వైపరీత్యానికి చేతికందిన పంటలు నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి బాధిత రైతులకు అండగా ఉంటారన్నారు. వడగండ్లతో నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో మహేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి, పంట నష్టం వివరాలను తె లియజేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బా ల్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, కొండం రాజిరెడ్డి, దీటి నర్సింలు, కొండల్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, కొండయ్య, గజ్జెల రా జు, శ్రీనివాస్, నరేశ్, ప్రశాంత్, అంజన్‌రావు, మధు, బాల్‌రెడ్డి, రాజు, ఎలుసాని దేవయ్య, ఆంజనేయులు, దేవిరెడ్డి, అనిల్, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ లక్ష్యం
సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అబద్దపు పునాదులపైనే బీఆర్‌ఎస్ పుట్టిందని, అమాయకులను రెచ్చగొట్టి ఎందరో ప్రాణాలు పోవడానికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీశ్‌రావుకు అగ్గిపెట్టె దొరకలేదని, నిమ్మరసం తాగి దొంగదీక్షలు కేసీఆర్ చేశాడని ఆరోపించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పాలన సాగిస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ, గ్యాస్‌సిలిండర్లపై రాయితీ, ఆరోగ్యశ్రీని రూ.10లక్షల వరకు పెంచారన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప, చెన్నమనేని కమలాకర్‌రావు, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్, వైద్యశివప్రసాద్, కల్లూరి చందన, బొప్ప దేవయ్య, రాగుల జగన్, కుడిక్యాల రవికుమార్ పాల్గొన్నారు.


