చార్జిషీట్ దాఖలుపై నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలపై ఈడీ పెట్టిన అక్రమకేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు బుధవారం స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్ మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ సర్కారు తట్టుకోలేక పోతుందన్నారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాయకులు ఆకునూరి బాలరాజు, కల్లూరి చందన, కోడం అమర్, కుడిక్యాల రవికుమార్, అన్నల్‌దాస్ భాను తదితరులు పాల్గొన్నారు.


