-
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్ చేసింది. ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన వుమెన్ ప్రీమియర్ లీగ్-2024 చాంపియన్ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. Guard of Honour for our WPL Champions at Johnnie Walker presents RCB Unbox powered by @Kotak_Life and @Duroflex_world 🫡👏#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 pic.twitter.com/ikwL5Mx0E1 — Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024 ఇదిలా ఉంటే.. అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్‌గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు. Virat Kohli speaking Kannada. - "THE NEW CHAPTER OF RCB" 👑pic.twitter.com/KQWk4Wdab8 — Johns. (@CricCrazyJohns) March 19, 2024 దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ లాంఛనం పూర్తి చేయలేకపోయింది. RCB is red Now kissed with blue We’re ready with our new armour To Play Bold for you! Presenting to you, Royal Challengers Bengaluru’s match livery of 2024! 🤩 How good is this, 12th Man Army? 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/2ySPpmhrsq — Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024 ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్‌ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్‌ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్‌గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్‌గా, కెప్టెన్‌గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement