WPL 2023 RCB Vs UPW: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌.. ఆర్‌సీబీ ఇవాళైనా

WPL 2023: RCB-Women Won Toss Chose To Bowl Vs UP Warriorz - Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇంతవరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన స్మృతి మంధాన సేన ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్‌ అవకాశాలను కోల్పోయిన ఆర్‌సీబీ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌ ఆడనుంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ వుమెన్‌ బౌలింగ్‌ ఏంచుకుంది.

మరోవైపు యూపీ వారియర్జ్‌ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి.. మరో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై యూపీ వారియర్జ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో ఎల్లిస్‌ పెర్రీ మినహా మిగతావారు పెద్దగా రాణించడం లేదు.

స్మృతి మంధాన అయితే అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతూ వస్తోంది. ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. రిచా ఘోష్‌, సోఫీ డివైన్‌, హెథర్‌ నైట్‌లు బ్యాట్‌ ఝులిపించలేకపోతున్నారు. ఇక యూపీ వారియర్జ్‌ బ్యాటింగ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ అలిస్సా హేలీ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అయితే ఆమె మినహా మిగతావారు రాణించకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది.

ఆర్‌సీబీ వుమెన్‌ తుదిజట్టు: స్మృతి మంధాన(కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, కనికా అహుజా

యూపీ వారియర్జ్‌ తుదిజట్టు: అలిస్సా హీలీ(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్

చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్‌ క్రికెటర్‌

వైరల్‌గా మారిన రిషబ్‌ పంత్‌ చర్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top