WPL 2023-Ellyse Perry: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్‌ క్రికెటర్‌

WPL: Ellyse Perry Cleans RCB Women Dugout Post Match-Gesture Win-Hearts - Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023) తొలి ఎడిషన్‌ నాకౌట్‌ స్టేజీకి దగ్గరైంది. ఇప్పటికే లీగ్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు ముగియడంతో ఎవరు ప్లేఆఫ్‌కు వెళ్తున్నారు.. ఎవరు వెళ్లడం లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ ఐదు వరుస విజయాలతో ప్లేఆఫ్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే.

అదే సమయంలో స్మృతి మంధాన సారధ్యంలోని ఆర్‌సీబీ వుమెన్‌ మాత్రం ఐదు వరుస ఓటములతో చివరి స్థానంలో కొనసాగుతూ దాదాపు లీగ్‌ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. దాదాపుగా ప్లేఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన ఆర్‌సీబీ తన చివరి మూడు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటుంది. ఇక ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఎలిస్‌ పెర్రీ మాత్రమే నిలకడగా రాణిస్తూ వచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడంతో కాస్త ఎమోషన్‌కు గురైన ఎలిస్‌ పెర్రీ కంటతడి పెట్టడం కదిలించింది. తాజాగా మరోసారి తన చర్యతో అందరిని ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ముగియగానే ఆర్‌సీబీ డగౌట్‌లో పడేసిన వాటర్‌బాటిల్స్‌, చెత్తను ఏరి డస్ట్‌బిన్‌లో పడేసింది. డబ్ల్యూపీఎల్‌లో తాను ఆడిన ప్రతి మ్యాచ్‌ తర్వాత ఎలిస్‌ పెర్రీ ఇదే కంటిన్యూ చేస్తూ వచ్చింది. పర్యావరణానికి ముప్పుగా ఉన్న ప్లాస్టిక్‌ను ఏరేస్తూ ఆమె చేస్తున్న మంచి పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఆర్‌సీబీ వుమెన్‌ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో తలపడనుంది.

చదవండి: Ind Vs Aus: భారత్‌- ఆసీస్‌ వన్డే సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు.. పూర్తి వివరాలు

R Ashwin: ట్విటర్‌ అకౌంట్‌పై ఆందోళన.. ఎలాన్‌ మస్క్‌కు లేఖ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top