R Ashwin-Elon Musk: ట్విటర్‌ అకౌంట్‌పై ఆందోళన.. ఎలాన్‌ మస్క్‌కు లేఖ

Ravichandran Ashwin Writes Elon Musk Security Of His Twitter Account - Sakshi

టీమిండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ట్విటర్‌ అకౌంట్‌పై ఆందోళన చెందుతున్నాడు. ట్వీట్స్‌ చేసినప్పుడల్లా పాప్‌అప్స్‌ ఎక్కువగా వస్తున్నాయని.. మార్చి 19 అంటూ ఏదో గడువు చూపిస్తుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విటర్‌ అకౌంట్‌కు భద్రత కల్పించాలంటూ అశ్విన్‌ ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు బుధవారం లేఖ రాశాడు. 

''నా ట్విటర్‌ ఖాతాకు సంబంధించిన భద్రతపై ఆందోళనగా ఉంది. ట్వీట్‌ చేసినప్పుడల్లా ఏవో తెలియని పాప్‌అప్స్‌(Pop-Ups) వస్తున్నాయి. ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఎలాంటి సమాచారం రావడం లేదు. అయితే మార్చి 19వ తేదీ వరకు గడువు చూపిస్తూ పాప్‌అప్‌ లింకులు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పటిలోగా నా ట్విటర్‌ అకౌంట్‌ను ఎలా భద్రంగా ఉంచుకోవాలనేదానిపై మీరు(ఎలాన్‌ మస్క్‌) వివరణ ఇస్తే బాగుంటుంది'' అని పేర్కొన్నాడు.

కాగా ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ 'బ్లూ టిక్‌' తీసుకొచ్చినప్పటి నుంచి ట్విటర్‌ ఖాతాల నిర్వహణ, భద్రత విషయంలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పడు అశ్విన్‌ చెప్పింది కొత్త సమస్యలా కనిపిస్తుంది. మరి అశ్విన్‌ ఎదుర్కొంటున్న సమస్యపై ఎలాన్‌ మస్క్‌ స్పందించి పరిష్కారం ఏంటనేది చూపిస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా అశ్విన్‌ ఇటీవలే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. నాలుగు టెస్టులు కలిపి 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. జడేజాతో కలిసి సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును దక్కించుకున్నాడు. ట్విటర్‌లో విభిన్న పోస్టులను షేర్‌ చేస్తూ తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అశ్విన్‌ తాజాగా విరామం దొరకడంతో ట్విటర్‌ అకౌంట్‌ భద్రతపై ఎలాన్‌ మస్క్‌కు లేఖ రాశాడు.

చదవండి: '#Rest In Peace.. పాకిస్తాన్‌ క్రికెట్‌'

ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్‌1 అశూ! ఇక కోహ్లి ఏకంగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top