దంచికొట్టిన గుజరాత్‌ జెయింట్స్‌.. ఆర్‌సీబీ ఎదుట భారీ టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

WPL 2023: దంచికొట్టిన గుజరాత్‌ జెయింట్స్‌.. ఆర్‌సీబీ ఎదుట భారీ టార్గెట్‌

Published Sat, Mar 18 2023 9:23 PM

Gujarat Giants Set 189 Runs Target For RCB Women WPL 2023 - Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా డబుల్‌ హెడర్‌లో భాగంగా శనివారం రాత్రి ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. లారా వోల్వార్డట్‌ (42 బంతుల్లో 68 పరుగులు) వరుసగా రెండో అర్థసెంచరీతో రాణించగా.. అష్లే గార్డనర్‌ 41 పరుగులు, సబ్బినేని మేఘన 31 పరుగులు చేశారు.

చివ‌ర్లో హ‌ర్లీన్ డియోల్ (12), ద‌య‌లాన్ హేమ‌ల‌త (16)రెచ్చిపోయి ఆడారు. మేఘ‌న్ ష‌ట్ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌లో హ‌ర్లీన్, హేమ‌ల‌త‌ త‌లా ఒక‌ ఫోర్, సిక్స్ బాదారు. దాంతో, గుజ‌రాత్ భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. సోఫీ డెవినే, ప్రీతీ బోస్ త‌లా ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. 27 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. అయితే.. మ‌రో ఓపెన‌ర్ లారా వొల్వార్డ్ మొద‌టి ఓవ‌ర్ నుంచే దూకుడుగా ఆడింది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ సాధించింది. స‌బ్బినేని మేఘ‌న (31)తో క‌లిసి రెండో వికెట్‌కు 63 ర‌న్స్, అష్ గార్డ్‌న‌ర్‌తో క‌లిసి మూడో వికెట్‌కు 52 ప‌రుగులు జోడించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement