Ind Vs Aus ODIs: భారత్‌- ఆసీస్‌ వన్డే సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు.. పూర్తి వివరాలు

Ind Vs Aus ODIs 2023: Schedule Timings Squads Live Streaming Details - Sakshi

Australia tour of India, 2023- ODI Series: ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023ని ముద్దాడిన టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన రోహిత్‌ సేన.. కంగారూలతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. 

స్వదేశంలో జరుగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కాగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌.. తల్లి మరణం నేపథ్యంలో ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టీవ్‌ స్మిత్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

మరి క్రికెట్‌ ప్రేమికులకు మజాను అందించే టాప్‌ 2 ర్యాంకింగ్‌ (టీమిండియా- ఆస్ట్రేలియా) జట్ల మధ్య మరో ఆసక్తికరపోరుకు సంబంధించిన వివరాలు చూద్దామా?!

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ 2023 షెడ్యూల్‌
1. మొదటి వన్డే- మార్చి 17- శుక్రవారం- ముంబై- వాంఖడే స్టేడియం- ముంబై
2. రెండో వన్డే- మార్చి 19- ఆదివారం- డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, విశాఖపట్నం
3. మూడో వన్డే- మార్చి 22- బుధవారం- ఎంఏ చిదంబరం స్టేడియం- చెన్నై

మ్యాచ్‌ ఆరంభ సమయం
►టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం కానున్నాయి.

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడ?
►టీవీ: స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌
►డిజిటల్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌(వెన్నునొప్పి కారణంగా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం) 

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్‌ ఎల్లిస్‌(జై రిచర్డ్‌సన్‌ స్థానంలో జట్టులోకి).

చదవండి: Virat Kohli: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్‌1 అశూ! ఇక కోహ్లి ఏకంగా
Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్‌ అదుర్స్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top