బిగ్‌బాష్‌ లీగ్‌కు స్మృతి మంధాన దూరం!  | Smriti Mandhana dropped from Women's Big Bash League - Sakshi
Sakshi News home page

బిగ్‌బాష్‌ లీగ్‌కు స్మృతి మంధాన దూరం! 

Aug 29 2023 4:11 AM | Updated on Aug 29 2023 9:43 AM

Smriti Madhana dropped from Big Bash League - Sakshi

భారత్‌లో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కంటే ఎంతో ముందుగా ఆ్రస్టేలియాలో ప్రారంభమై ఆలరిస్తోన్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌) ప్లేయర్ల తుది జాబితా (డ్రాఫ్ట్‌) సిద్ధమైంది. 2023–24 కొత్త సీజన్‌ కోసం సెప్టెంబర్‌ 3న లీగ్‌ ఫ్రాంచైజీలు ఈ జాబితాలో ఉన్న క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుంటాయి.

భారత్‌ నుంచి 18 మంది క్రికెటర్లు ఈ డ్రాఫ్ట్‌లో ఉన్నారు. అయితే భారత స్టార్‌ ఓపెనర్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన తన పేరును ఇందులో నమోదు చేసుకోలేదు. గతంలో డబ్ల్యూబీబీఎల్‌లో స్మృతి బ్రిస్బేన్‌ హీట్, సిడ్నీ థండర్‌ జట్లకు ఆడింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement