సుంకాల ప్రభావాన్ని విశ్లేషించడానికే 60 రోజుల విరామం | Russia sanctions pause to assess impact on India, global energy prices | Sakshi
Sakshi News home page

సుంకాల ప్రభావాన్ని విశ్లేషించడానికే 60 రోజుల విరామం

Oct 19 2026 6:12 AM | Updated on Oct 19 2026 6:12 AM

Russia sanctions pause to assess impact on India, global energy prices

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

వాషింగ్టన్‌: భారత్‌తో సహా ఇతర దేశాలకు సుంకాల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వడం, రష్యాపై కొన్ని ఆంక్షలు తొలగించడం అనేది ఈ చర్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పాడే ప్రభావాన్ని విశ్లేషించడానికి తీసుకున్న 60 రోజుల విరామమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. గ్రాహం చట్టం కింద అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన మినహాయింపుల గురించి స్పందించారు.

 విదేశాలపై ఆంక్షలు, సుంకాలు విధించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో విశ్లేషించుకోవడానికి అధ్యక్షుడు 60 రోజుల సమయాన్ని తీసుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా చమురువిషయంలో చైనా, భారత్‌లపై ఆంక్షలు విధించాలని అమెరికా తన ఐరోపా మిత్రదేశాలను కోరిందని, అయితే, ఆ దేశాలు నిరాకరించాయని అమెరికా మంత్రి స్కాట్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement