WPL 2023 RCB Vs GG: గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్‌సీబీకి హ్యాట్రిక్‌ ఓటమి

WPL 2023: RCB Women Vs Gujarat Giants Live Updates-Highlights - Sakshi

గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్‌సీబీకి హ్యాట్రిక్‌ ఓటమి
ఆర్‌సీబీ ఆటతీరు మారడం లేదు. వరుసగా మూడో ఓటమితో లీగ్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. 202 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ వుమెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోఫీ డివైన్‌ 45 బంతుల్లో 66 పరుగులు, హెథర్‌నైట్‌ 11 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌ రాణించినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడం.. మిగతావారు విఫలం కావడంతో ఆర్‌సీబీకి ఓటమి ఎదురైంది. గుజరత్‌ బౌలర్లలో అష్లే గార్డనర్‌ మూడు వికెట్లు తీయగా.. అన్నాబెల్‌ సదర్‌లాండ్‌ రెండు, మాన్సీ జోషీ ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్‌ డియోల్‌(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

14 ఓవర్లలో ఆర్‌సీబీ 118/2
14 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. సోఫీ డివైన్‌ 51 పరుగులతో, రిచా ఘోష్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

11 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. ఎలిస్‌ పెర్రీ 24, సోఫీ డివైన్‌ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లలో ఆర్‌సీబీ 74/1
9 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. ఎలిస్‌ పెర్రీ 16, సోఫీ డివైన్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
స్మృతి మంధాన(18) రూపంలో ఆర్‌సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. అష్లే గార్డనర్‌ బౌలింగ్‌లో మాన్సీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది.

టార్గెట్‌ 202.. ధీటుగా బదులిస్తున్న ఆర్‌సీబీ
202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్‌ నష్టపోకుండా 54 పరుగులు చేసిది. సోఫీ డివైన్‌ 18 బంతుల్లో 31, మంధాన 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దంచికొట్టిన గుజరాత్‌.. ఆర్‌సీబీ టార్గెట్‌ 202
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్‌ డియోల్‌(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో శ్రేయాంక్‌ పాటిల్‌ బౌలింగ్‌ బాగా వేయడంతో గుజరాత్‌ స్కోరు కాస్త తగ్గింది. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

దంచికొడుతున్న గుజరాత్‌.. 14 ఓవర్లలో 136/3
ఆర్‌సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ భారీ స్కో‍రు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్లిన్‌ డియోల్‌ 42, దయాలన్‌ హేమలత ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

18 బంతుల్లోనే అర్థశతకం.. 
గుజరాత్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ అందుకుంది. ప్రీతీ బోస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో డంక్లీ వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకున్న డంక్లీ 18 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. డంక్లీ 54, హర్లీన్‌ డియోల్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
ఆర్‌సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సబ్బినేని మేఘన స్కౌట్‌ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం గుజరాత్‌ మూడు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది. 

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బుధవారం ఆర్‌సీబీ వుమెన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ జెయింట్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. కాగా సీజన్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యి పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భోణీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇరుజట్లలో గుజరాత్‌ జెయింట్స్‌ కాస్త ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ బెత్‌ మూనీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా స్నేహ్‌ రాణానే కెప్టెన్‌గా గుజరాత్‌ను నడిపించనుంది.

ఆర్‌సీబీ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగాన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్

గుజరాత్‌ జెయింట్స్‌(ప్లేయింగ్‌ XI):  స్నేహ్‌ రాణా(కెప్టెన్‌) సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ(వికెట్‌ కీపర్‌), అష్లీగ్ గార్డనర్, దయాళన్ హేమలత, కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top