అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది
రెండు స్థానాలు ఎగబాకి 715 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో నిలిచింది
బెంగళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో స్మృతి సెంచరీ సాధించడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది
గత వారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు 768 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయింది


