-
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్‌లో లేను. ఒకవేళ ఫామ్‌లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్‌ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్‌మన్ పావెల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా అయినా పరాగ్‌కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్‌ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్‌జెయింట్స్‌ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్న పంత్.. సంజూకు మరోసారి మొండిచెయ్యేనా..?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ టీ20 వరల్డ్‌కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖరారు చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.అలాగే అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా..అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్‌గా..అత్యధిక స్ట్రయిక్‌రేట్ కలిగిన కెప్టెన్‌గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వికెట్‌కీపర్ బ్యాటర్‌గా..అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్‌లు కూడా పట్టాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు అంటున్నారు. పంత్ వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైందనుకుంటే సెకెండ్ ఛాయిస్ వికెట్‌కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానంలో కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ రేసులో రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిలార్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి ఖాయం.శాంసన్‌ను తృణీకరించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజూ సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజూ అని ఓ ట్వీట్ చేశారు. సంజూ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలఖరులోగా టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement