అమెరికాతో మ్యాచ్‌.. దూబేపై వేటు! శాంసన్‌కు ఛాన్స్‌ | Indias Predicted XI Against USA,Rohit Sharma To Make 2 Changes | Sakshi
Sakshi News home page

T20 WC: అమెరికాతో మ్యాచ్‌.. దూబేపై వేటు! శాంసన్‌కు ఛాన్స్‌

Jun 12 2024 5:07 PM | Updated on Jun 12 2024 5:09 PM

Indias Predicted XI Against USA,Rohit Sharma To Make 2 Changes

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య అమెరికాతో బుధవారం న్యూయర్క్‌ వేదికగా భారత్‌ తలపడనుంది. 

ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌నే ఓడించడం గమనార్హం. ఆదివారం(జూన్‌ 9)స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ సంచలన విజయం సాధించగా.. అమెరికా సూపర్‌ ఓవర్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 

కాగా పాక్‌పై గెలిచి ‍మంచి జోష్‌లో ఉన్న టీమిండియా యూఎస్‌ఎపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అమెరికా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్‌ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేపై వేటు వేయాలని మెన్‌జ్‌మె​ంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఐపీఎల్‌లో అదరగొట్టి భారత వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో దూబే నిరాశపరుస్తున్నాడు. 

ఈ క్రమంలో అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామాన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి రానున్నట్లు వినికిడి. ఇప్పటివరకు జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement