మళ్లీ అర్చర్‌ ట్రాప్‌లో చిక్కుకున్న శాంసన్‌.. వీడియో వైరల్‌ | Sanju Samson Third Consecutive Failure Against England In 3rd T20I, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND vs ENG: మళ్లీ అర్చర్‌ ట్రాప్‌లో చిక్కుకున్న శాంసన్‌.. వీడియో వైరల్‌

Jan 28 2025 10:21 PM | Updated on Jan 29 2025 11:21 AM

Sanju Samson third consecutive failure against England

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ పేల‌వ ఫామ్ కొన‌సాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన శాంసన్‌.. ఇప్పుడు రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. 

ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. ఆరు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అదిల్‌ రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాగా సంజూ మూడు మ్యాచ్‌లలోనూ అర్చర్‌ బౌలింగ్‌లోనే ఔట్‌ కావడం గమనార్హం.

మూడు మ్యాచ్‌లలోనూ బౌన్సర్లతోనే అర్చర్‌ బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన శాంసన్‌.. రెండో టీ20లో కేవలం 5 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు టీ20ల్లో శాంసన్‌ కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండు వరుస సెంచరీలతో శాంసన్‌ చెలరేగిన సంగతి తెలిసిందే.

ఐదేసిన వరుణ్‌..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్‌ స్టోన్‌(43), జోస్‌ బట్లర్‌(24) పరుగులతో రాణించారు.
చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement