ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ | Mohammed Shami returns to International cricket after 436 days | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ

Jan 28 2025 7:35 PM | Updated on Jan 28 2025 8:15 PM

Mohammed Shami returns to International cricket after 436 days

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ 14 నెల‌ల త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టీ20కు భార‌త తుది జ‌ట్టులో ష‌మీ చోటు ద‌క్కించుకున్నాడు. దీంతో అభిమానుల స‌దీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. రాజ్‌కోట్ టీ20కు యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలోనే షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.

కాగా ష‌మీ చివ‌రిసారిగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఫైన‌ల్ భార‌త్ త‌ర‌పున ఆడాడు. భార‌త్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన‌ప్ప‌టికి ష‌మీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టుకున్నాడు. ఆ తర్వాత షమీ చీలమండ గాయంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఎలో చేరి ఫిట్‌నెస్‌ సాధించేందుకు షమీ తీవ్రంగా శ్రమించాడు.

అతడు తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని భావించిన సమయంలో ఎడమ కాలి మడమలో మళ్లీ వాపు వచ్చింది. దీంతో అతడు రీ ఎంట్రీ అలస్యమైంది. అయితే అతడు తిరిగి కోలుకుని తొలుత దేశవాళీ క్రికెట్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్‌హాజారే ట్రోఫీలో షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 

ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి రెండు టీ20ల్లో మాత్రం షమీ ఆడే అవకాశం లభించలేదు. ఎట్టకేలకు రాజ్‌కోట్ టీ20తో షమీ పునరాగమనం చేశాడు.

తుది జట్లు
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీప‌ర్‌), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత్: సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: CT 2025: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement