
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం కానుంది. భారత్-పాక్ మధ్య యుద్ద వాతవారణం నెలకొనడంతో తాత్కాలికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. మే 17 నుంచి తిరిగి అభిమానులను అలరించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీస్టార్ట్ అవుతుండడంతో ఆటగాళ్లు ఒక్కొకరుగా తమ జట్లతో కలుస్తున్నారు.
తాజాగా రాజస్తాన్ రాయల్స్ క్యాంపులో కెప్టెన్ సంజూ శాంసన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ షేర్ చేసింది. ఆ వీడియోలో సంజూకు రాజస్తాన్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతున్నట్లు కన్పించింది. కాగా రాజస్తాన్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. రాయల్స్‌కు ఇంకా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆర్ఆర్ జట్టు భావిస్తోంది.
ఫిట్‌నెస్‌పై నో క్లారిటీ?
కాగా పక్కటెముక గాయంతో బాధపడుతున్న సంజూ శాంసన్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలోనైనా ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. సంజూ ఈ ఏడాది సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. మిగితా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతడి స్ధానంలో రాజస్తాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నాడు. సంజూ 7 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 224 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
Our Malluminati is back! 💗🔥 pic.twitter.com/RNOdhYEIcl
— Rajasthan Royals (@rajasthanroyals) May 14, 2025
చదవండి: Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్‌మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే..!