Mumbai Indians
-
‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
IPL 2025: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 59 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.5వ ఓవర్- ఢిల్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో అశుతోష్ శర్మ (18) స్టంపౌటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2వ ఓవర్- 103 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వి (39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 9.2వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (2) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ7.6వ ఓవర్- 55 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విప్రాజ్ (20) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 27 పరుగలకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ4.2వ ఓవర్- 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో అభిషేక్ పోరెల్ (6) ఔటయ్యాడు. టార్గెట్ 181.. 20 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.4వ ఓవర్- 20 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు. టార్గెట్ 181.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4వ ఓవర్- 181 పరుగల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ (6) ఔటయ్యాడు. స్కై, నమన్ ధిర్ కొసమెరుపు.. ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేసిన ముంబైటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదిల్చింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి రెండు ఓవర్లలో నమన్ ధిర్, సై 48 పరుగులు పిండుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ముంబై16.3వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో ముకేశ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (3) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వికి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (27) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 95/312 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 95/3గా ఉంది. తిలక్ వర్మ (23), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 58 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాధవ్ తివారి క్యాచ్ పట్టడంతో రికెల్టన్ (25) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై5.3వ ఓవర్- 48 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (21) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 46/15 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 46/1గా ఉంది. విల్ జాక్స్ 20, రికెల్టన్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (5) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని భావించిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ముంబై విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మిగిలిన ఏకైక ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సీజన్లో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), అభిషేక్ పోరెల్(w), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: KL రాహుల్, సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్ -
అతడెలా ఖరీదైన ఆటగాడు?.. వారికి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలుసా?
ఐపీఎల్-2025(IPL 2025) ప్లే ఆఫ్స్ దశలో పలు ఫ్రాంఛైజీలలోకి కొత్త ఆటగాళ్లు చేరారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో లీగ్ వారం పాటు వాయిదా పడటంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన కొందరు ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మరికొంత మంది గాయాలు, ఫిట్నెస్ లేమి కారణంగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు కొత్త ప్లేయర్లతో వీరి స్థానాలను భర్తీ చేశాయి.ఇందులో భాగంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంఛైజీ కొత్తగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 26 తర్వాత జాతీయ జట్టుకు అందుబాటులో ఉండేందుకు ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ముంబై జట్టును వీడుతుండటంతో... ఫ్రాంఛైజీ వారి స్థానాలను మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంకలను జట్టులోకి తీసుకుంది.రూ.5.25 కోట్లుబెయిర్ స్టోతో రూ. రూ.5.25 కోట్లకు, గ్లీసన్‌తో రూ. కోటికి, అసలంకతో రూ. 75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన రెండు- మూడు మ్యాచ్‌ల కోసమే ముంబై వీరికి పెద్ద మొత్తంలో చెల్లిస్తోందని.. తద్వారా ముంబైతో పాటు కొత్త ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఫ్రాంఛైజీలపై అదనపు భారం పడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ముంబై జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకలను తీసుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ముస్తాఫిజుర్ రహ్మమాన్ కూడా వచ్చాడు.. ఇక ఆర్సీబీ లుంగి ఎంగిడి స్థానంలో బ్లెస్సింగ్ ముజర్బానీని తీసుకుంది.ఆడిన మ్యాచ్‌లను బట్టిమరి వీళ్లకు ఎంత డబ్బు చెల్లిస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా మంది సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఐపీఎల్లో బెయిర్‌స్టో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడని చెబుతున్నారు.కేవలం మూడు మ్యాచ్‌లకే రూ. 5.25 కోట్లు పొందుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. మీరన్నట్లు ఫ్రాంఛైజీలు వారితో ఆ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రొ-రెటా ఆధారంగా మాత్రమే వారికి డబ్బు చెల్లిస్తారు. అంటే.. అందుబాటులో ఉ న్న, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే ఫీజు ముట్టజెప్పుతారు’’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.ఢిల్లీతో అమీతుమీకాగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకునేందుకు తహతహలాడుతున్న ముంబై జట్టు... పాయింట్ల పట్టికలో తుది నాలుగు స్థానాల్లో నిలిస్తేనే ఈ ముగ్గురు ఆటగాళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం మ్యాచ్ ఆడనున్న ముంబై.. ఈ నెల 26న పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.ఆ తర్వాతే ఈ ముగ్గురు జట్టుతో కలవనున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ఈనెల 26 తర్వాత ముంబై జట్టును వీడనున్నారు. ‘జాక్ స్థానాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో భర్తీచేస్తాడు. అతడిని రూ. 5 కోట్ల 25 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసుకుంది. కాగా రికెల్టన్ స్థానంలో జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌కు 1 కోటి రూపాయాలు... శ్రీలంక బ్యాటర్ అసలంకను రూ. 75 లక్షలు అందజేస్తారు’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.వర్షం ముప్పు.. ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది. అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.అయితే, పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
MI vs DC: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్ బెర్త్’ను ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను అభిమానులు క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు.తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్ల మధ్య గత నెలలో జరిగిన పోరులో ముంబైనే విజయం వరించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి పోరాటం కనబరుస్తుందో చూడాలి! అన్ని రంగాల్లో పటిష్టంగా... సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రాకెట్లా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఆల్‌రౌండర్లతో దట్టంగా ఉంది. సీజన్లో 63.75 సగటుతో 510 పరుగులు చేసిన సూర్యకుమార్ జట్టు తరఫున టాప్ స్కోరర్ కాగా... రికెల్టన్ 336, రోహిత్ శర్మ 300, తిలక్ వర్మ 246 పరుగులు చేశారు.గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై... తిరిగి పుంజుకుని సమష్టిగా సత్తాచాటాలని చూస్తోంది. రోహిత్ శర్మతో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. వీరిద్దరూ కలిసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీ బౌలర్లకు చిక్కులు ఖాయమే. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. లీగ్ దశ ముగియగానే రికెల్టన్, జాక్స్, బాష్ జట్టును వీడనున్నారు. బౌలింగ్‌లోనూ ముంబైకి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా పేస్ భారం మోయనుండగా... కరణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా... ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ అవి ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. స్టార్క్ లోటుతో! అక్షర్ పటేల్ సారథ్యంలో ఈ సీజన్ ఆరంభంలో ఆశలు రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆరంభంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గిన క్యాపిటల్స్... ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 61.63 సగటుతో 493 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అభిషేక్ పొరెల్ 295, ట్రిస్టన్ స్టబ్స్ 280, అక్షర్ పటేల్ 263 పరుగులు చేశారు. ఆరంభంలో మెరిపించిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ప్రభావం చూపలేకపోతుండగా... బౌలింగ్‌లో ఆ జట్టు స్టార్క్‌పై అతిగా ఆధారపడుతోంది. చావో రేవో మ్యాచ్‌లో అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. గత మ్యాచ్‌లో చూసుకుంటే వికెట్లు చేతిలో ఉన్నా... ఆశించిన వేగంతో ఆడలేకపోయిన ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో 199 పరుగులు చేసింది.అయితే బౌలింగ్‌లో ఢిల్లీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, విప్రాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే దానిపైనే ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ భవితవ్యం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్వని కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్, చమీరా. -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!?
ఐపీఎల్-2025లో బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆశలను పదిలం చేసుకుంటుంది. నాలుగో స్ధానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి.ఇక ఈ కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడే అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీకి.. రాహుల్ కూడా దూరమైతే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్లో రాహుల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో మెరిశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్, దుష్మంత చమీరా, సెడికుల్లా అటల్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్ కుమార్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరు కూడా..!
జాతీయ జట్టు విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్న ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా), కార్బిన్ బాష్ (సౌతాఫ్రికా), విల్ జాక్స్ (ఇంగ్లండ్) స్థానాలను ముంబై ఇండియన్స్ మరో ముగ్గురితో భర్తీ చేసుకుంది. విల్ జాక్స్‌కు ప్రత్యామ్నాయంగా జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), ర్యాన్ రికెల్టన్కు ప్రత్యామ్నాయంగా రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్‌కు ప్రత్యామ్నాయంగా చరిత్ అసలంకను (శ్రీలంక) జట్టులోకి తీసుకుంది. వీరు ముగ్గురు ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటారు. లీగ్ చివరి మ్యాచ్ వరకు జాక్స్, రికెల్టన్, బాష్ అందుబాటులో ఉంటారు. బెయిర్‌స్టోను ముంబై యాజమాన్యం రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గ్లీసన్‌ను రూ. కోటికి, అసలంకను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం మే 21న జరిగే మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది. ఆ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇదివరకే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ లీగ్ దశలో తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లో జయాపజాలు టాప్-2 బెర్త్‌లను డిసైడ్ చేస్తాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టాప్-2 పోజిషన్స్‌లో ఉండే జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఓ మ్యాచ్ ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఆ అవకాశం ఉండదు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడే జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ముంబై రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్తాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది.అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ముంబైని పంజాబ్ అధిగమించింది.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
‘ఈసారి హార్దిక్ అలా చేయడం లేదు.. అందుకే ముంబై దూసుకెళ్తోంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్ ముంబై సారథిని ప్రశంసించాడు.గతేడాది చేదు అనుభవాలుకాగా గతేడాది ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.ఖేల్ ఖతమే అనుకున్నవేళఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.అంతా హార్దిక్ వెంట ఉన్నారువరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ముంబై జట్టు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.హార్దిక్ ఈసారి అలా చేయడం లేదుహార్దిక్ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.ఒకవేళ కెప్టెన్ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.ధనాధన్‌కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ముంబై వాంఖడేలో రో‘హిట్’ శర్మ స్టాండ్.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)
-
కలలో కూడా ఊహించలేదు.. మాటల్లో వర్ణించలేను: రోహిత్ శర్మ భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.మాటల్లో వర్ణించలేనుప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.వారి త్యాగాలు మరువలేనివిమా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్‌కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5— Mumbai Indians (@mipaltan) May 16, 2025 -
IPL 2025: ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో (బెంగళూరు) ఐపీఎల్ రీస్టార్ అవుతుంది. ఐపీఎల్ పునఃప్రారంభం నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఏయే జట్లకు దక్కే అవకాశం ఉందో అన్న దానిపై ఓ లుక్కేద్దాం.ప్రస్తుతం గుజరాత్, ఆర్సీబీ తలో 16 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలు) ఖాతాలో కలిగి ఉండి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఈ రెండు జట్లు మూడింటిలో తలో మ్యాచ్ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం ప్రధానంగా మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. రేసులో పంజాబ్ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?ఈ సీజన్లో ముంబై మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వీరి టేబుల్ స్థానం మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు జట్లు 22 పాయింట్లతో ముగించే అవకాశాలు ఉన్నాయి.ముంబై తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిస్తే, వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టమవుతాయి. ఒకవేళ ముంబై ఢిల్లీని ఓడిస్తే.. ఆతర్వాత పంజాబ్ కూడా ఢిల్లీని ఓడించాలి. అప్పుడు ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.ఒకవేళ ముంబై పంజాబ్‌ను ఓడించి ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆతర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కూడా పంజాబ్‌ను ఓడిస్తే పంజాబ్ ఇంటికి (పంజాబ్ రాజస్థాన్ చేతిలో కూడా ఓడాలి) ఢిల్లీ (17), ముంబై (16) ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ఒకవేళ ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.కేకేఆర్, లక్నో కూడా రేసులోనే..!కేకేఆర్ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో (కేకేఆర్ 2, లక్నో 3) గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.ఈ మూడు టీమ్‌లు ఔట్ఈ సీజన్లో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి శ్రీలంక కెప్టెన్..!
ఐపీఎల్-2025 రీ షెడ్యూల్ కారణంగా దారుణంగా నష్టపోతున్న ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఆర్ధరంతరంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే చాలా మంది విదేశీ ఆటగాళ్లు జాతీయ విధుల కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నారు.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ సేవలను కోల్పోయే అవకాశముంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులో బాష్, రికెల్టన్ భాగంగా ఉన్నారు. బాష్, రికెల్టన్ ఒకవేళ ఐపీఎల్లో పాల్గోనేందుకు తిరిగి భారత్‌కు వచ్చినా, ప్లే ఆఫ్స్‌కు మాత్రం కచ్చితంగా దూరంగా ఉండనున్నారు.దక్షిణాఫ్రికా క్రికెట్‌తో బీసీసీఐ సంప్రదింపులు జరిపినప్పటికి.. సదరు క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు లీగ్ పూర్తి అయ్యేంతవరకు ఉండేందుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో జాక్స్ సభ్యునిగా ఉన్నాడు. అతడు కూడా భారత్‌కు తిరిగి వచ్చినా ప్లే ఆఫ్స్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు.ముంబై జట్టులోకి శ్రీలంక కెప్టెన్..?ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకపై కన్నేసినట్లు తెలుస్తోంది. తమ జట్టులోకి తీసుకునేందుకు చరిత్ అసలంకాతో ముంబై చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ తమ కథనంలో పేర్కొంది. అసలంకకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. అతడికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో చరిత్‌కు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడితో ఒప్పందం కుదర్చుకునేందుకు ముంబై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్ రీ షెడ్యూల్ కారణంగా ఈ సీజన్లో ఆటగాళ్ల తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు ఈ ఏడాది సీజన్లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ సేన గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు? -
Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే..!
రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2025పైనే పెట్టారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్ అయ్యారు. వారిపై ఐపీఎల్ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఇకపై భారత్ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్ 2025పైనే కేంద్రీకృతమై ఉంది.మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ రీవైజ్డ్ షెడ్యూల్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్ తదుపరి లెగ్ కోసం రోహిత్ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. విరాట్ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్, విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్‌తో (జైపూర్) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సాధిస్తుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేని రోహిత్, విరాట్ తమ జట్లకు ఐపీఎల్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
ఐపీఎల్ రీ స్టార్ట్.. ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్!
ఐపీఎల్-2025 సీజన్ పునఃప్రారంభానికి సమయం అసన్నమవుతోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది.అయితే ఐపీఎల్ తాతాత్కాలికంగా వాయిదా పడడంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో వారు మిగిలిన మ్యాచ్‌లు కోసం తిరిగి భారత్‌కు వస్తారా లేదా అన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది.న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు. వారం పాటు ఈ ధనాధాన్ టీ20 లీగ్ వాయిదా పడడంతో బౌల్ట్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ మళ్లీ రీ స్టార్ట్ కానుండడంతో బౌల్ట్ ఒకట్రెండు రోజుల్లోనే భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉన్న ముంబై.. తమ ప్లే ఆఫ్స్ స్ధానాన్ని పదిలి చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి.ఈ సమయంలో బౌల్ట్ తిరిగి జట్టులో చేరడం ముంబైకి కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో బౌల్ట్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్టార్ పేసర్.. 18 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, మే 26న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు -
Operation Sindoor: ఐపీఎల్-2025లో ఓ మార్పు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ (MI Vs PBKS)జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వేదికను ధర్మశాల (Dharmashala) నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు.సిద్ధంగా ఉన్నాంగుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయం గురించి స్పోర్ట్‌స్టార్‌కు వెల్లడించారు. ‘‘చివరి నిమిషంలో ధర్మశాల నుంచి వేదికను మార్చాల్సి వచ్చినపుడు.. బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామని వారికి సమాచారం ఇచ్చాము’’ అని తెలిపారు.కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పంజాబ్ కింగ్స్‌కు రెండో సొంత మైదానం. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ శ్రేయస్ సేన ఓ మ్యాచ్ ఆడింది. మే 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి 37 పరుగులు తేడాతో గెలిచింది.ఇక ఈ రోజు అంటే మే 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో మే 11న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడికి ప్రయాణించే పరిస్థితి లేదు.వాంఖడేకు మారుస్తారనుకుంటేఈ నేపథ్యంలో వేదికను ముంబైలోని వాంఖడేకు మారుస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏ జట్టుకు హోం అడ్వాంటేజీ ఉండకూడదనే ఉద్దేశంతో వేదికను తటస్థంగా అహ్మదాబాద్‌కు మార్చినట్లు సమాచారం. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు ముంబై గురువారమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. పంజాబ్ ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోనుంది.భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుకాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరులకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. మిసైళ్లతోనూ దాడి చేయగా భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్‌కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!The many colours of IPL 🎨From the eyes of Painter Andy Brown 🧑🎨Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS— IndianPremierLeague (@IPL) May 8, 2025 -
MI Vs PBKS: ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. -
Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును సమం చేశాడు. నిన్న (మే 6) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ఓవర్లో 11 బంతులు వేసిన ఐదో బౌలర్‌గా హార్దిక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హార్దిక్‌కు ముందు సిరాజ్ (2023లో ఆర్సీబీకి ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై), తుషార్ దేశ్‌పాండే (2023లో సీఎస్కేకు ఆడుతూ లక్నోపై), శార్దూల్ ఠాకూర్ (2025లో లక్నోకు ఆడుతూ కేకేఆర్‌పై), సందీప్ శర్మ (2025లో రాజస్థాన్‌కు ఆడుతూ ఢిల్లీపై) ఈ చెత్త ప్రదర్శన చేశారు. శార్దూల్, సందీప్ శర్మ, హార్దిక్ ఇదే సీజన్లో ఈ చెత్త ప్రదర్శన చేయడం విశేషం.కాగా, తీవ్ర ఉత్కంఠ నడుమ నిన్న మధ్య రాత్రి వరకు సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ముంబైని కట్టడి చేశారు. సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ తీశారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయగా.. గిల్ ఒక్కడే మూడు క్యాచ్‌లు పట్టాడు.అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులు డిసైడ్ చేశారు. ఛేదనలో తొలుత సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన గుజరాత్.. మధ్యలో ముంబై బౌలర్లు అనూహ్య రీతిలో పుంజుకోవడంతో తడబాటుకు లోనైంది. ఓ దశలో మ్యాచ్ గుజరాత్ చేతుల్లో నుంచి జారిపోయేలా కనిపించింది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. తెవాతియా, కొయెట్జీ బౌండరీ, సిక్సర్ బాది గెలిపించారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. -
MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
ముంబై: ఐపీఎల్–2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. అనంతరం గుజరాత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్ చెలరేగిపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్ కుదించి డక్‌వర్త్–లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 2; రోహిత్ (సి) ప్రసిధ్ (బి) అర్షద్ 7; జాక్స్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 53; సూర్యకుమార్ (సి) షారుఖ్ (బి) సాయికిషోర్ 35; తిలక్ (సి) గిల్ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్ (బి) సాయికిషోర్ 1; నమన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 7; బాష్ (రనౌట్) 27; చహర్ (నాటౌట్) 8; కరణ్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్: సిరాజ్ 3–0–29–1, అర్షద్ 3–0–18–1, ప్రసిధ్ 4–0–37–1, సాయికిషోర్ 4–0–34–2, రషీద్ ఖాన్ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5; గిల్ (బి) బుమ్రా 43; బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 28; షారుఖ్ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ ఖాన్ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్ (బి) చహర్ 12; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–1, బౌల్ట్ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కరణ్ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్ 4–0–28–2, జాక్స్ 1–0–15–0. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్ పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్ (2010, 2011), క్వింటన్ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్ లీడింగ్ రన్ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.ఈ సీజన్లో సూర్య చేసిన స్కోర్లు..29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)ఈ సీజన్లో టాప్-6 లీడింగ్ రన్ స్కోరర్లు..సూర్యకుమార్ యాదవ్-510విరాట్ కోహ్లి- 505సాయి సుదర్శన్- 504యశస్వి జైస్వాల్- 473జోస్ బట్లర్- 470శుభ్‌మన్ గిల్- 465మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (1), నమన్ ధిర్ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 123/7గా ఉంది. కార్బిన్ బాష్ (4), దీపక్ చాహర్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. శుభ్‌మన్ గిల్ మూడు క్యాచ్‌లు పట్టాడు. -
MI VS GT Live Updates: .. ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం
ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 19 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. చివరి ఓవర్లో లక్ష్యం 15 పరుగులు కాగా వర్షం కారణంగా DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన మ్యాచ్.. లక్ష్యానికి చేరువగా గుజరాత్14 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది.గుజరాత్ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయంవర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/214 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 78 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (30) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/110 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. గిల్ 28, బట్లర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/1గా ఉంది. గిల్ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.2వ ఓవర్- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికల్టెన్కు క్యాచ్ ఇచ్చి ఇన్ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (5) ఔటయ్యాడు. సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబైటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా సాధించలేకపోయేది. ఏడో వికెట్ కోల్పోయిన ముంబై16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (7) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబై13.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (7) ఔటయ్యాడు. కష్టాల్లో ముంబై ఇండియన్స్12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై11.4వ ఓవర్- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్ జాక్స్ (53) ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై10.4వ ఓవర్- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (35) ఔటయ్యాడు.10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/210 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (34), విల్ జాక్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2గా ఉంది. విల్ జాక్స్ 30, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్ లభించాయి. సాయి సుదర్శన్, సిరాజ్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్3.3వ ఓవర్- ముంబై ఇండియన్స్ 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (7) ఔటయ్యాడు. రెండో బంతికే వికెట్ తీసిన సిరాజ్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్ తరఫున వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్ -
MI Vs GT: సమఉజ్జీల సమరం
ముంబై: ఐపీఎల్ 18వ సీజన్లో వరుస విజయాలతో విజృంభిస్తున్న ముంబై ఇండియన్స్ జుట్టు గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఆరంభంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు చేరువైంది. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఉన్న గుజరాత్ కూడా ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీల మధ్య మంగళవారం వాంఖడే వేదికగా కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఆలస్యంగా రేసులోకి వచి్చన ఐదుసార్లు చాంపియన్ ముంబై... గత ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబైకి కొండంత బలం కాగా... రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ 67.86 సగటుతో 475 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్‌తో ముంబై బ్యాటింగ్ బలంగా ఉండగా... బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, కరణ్ శర్మ కీలకం కానున్నారు. ఈ సీజన్లో పాండ్యా బౌలింగ్‌లో 13 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో 157 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సాంట్నర్ అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో కార్బిన్ బాష్ బరిలోకి దిగొచ్చు. మరోవైపు గుజరాత్ కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ 50.40 సగటుతో 504 పరుగులు చేయగా... జోస్ బట్లర్ 78.33 సగటుతో 470, గిల్ 51.67 సగటుతో 465 పరుగులు చేశారు. ఈ సీజన్లో గుజరాత్ జైత్రయాత్రకు ఈ ముగ్గురే ప్రధాన కారణం కాగా... వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో టైటాన్స్‌కు నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. నిషేధం అనంతరం రబడ తిరిగి అందుబాటులోకి రాగా... ఈ మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రసిధ్ కృష్ణ 19 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా... సిరాజ్ 14, సాయి కిషోర్ 12 వికెట్లు తీశారు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్/సాంట్నర్, దీపక్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెపె్టన్), సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కోట్జీ, సాయి కిషోర్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్, ఇషాంత్ శర్మ/రబడ. -
IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
భారీ అంచనాలతో ఐపీఎల్-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (రైజర్స్- 286)పై దంచికొట్టడం మినహా ఈసారి రైజర్స్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనబడలేదు.తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT vs SRH)తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్ బృందం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగా చెలరేగి..ఈ క్రమంలో టైటాన్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి.. రైజర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76).. వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) ధనాధన్ దంచికొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.సన్‌రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరి బౌలింగ్ (షమీ 48, పటేల్ 41)లో టైటాన్స్ 89 పరుగులు పిండుకుంది. మిగతావాళ్లలో కెప్టెన్ కమిన్స్, జీషన్ అన్సారీ ఒక్కో వికెట్ తీయగా.. జయదేవ్ ఉనాద్కట్ మూడు వికెట్ల (3/35)తో రాణించాడు.అభిషేక్ శర్మ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20) మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 13) జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిచ్ క్లాసెన్ (18 బంతుల్లో 23), నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 186 పరుగుల వద్ద నిలిచి.. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే.. కానీఇక ఇప్పటికి ఈ సీజన్లో పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి. తద్వారా మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లలో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.అయితే, ఇంకా దింపుడు కళ్లెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.ఇతర జట్ల పరిస్థితి ఇలాప్రస్తుతం ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (10 మ్యాచ్‌లు, 6 విజయాలు, 13 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (10 మ్యాచ్‌లు, ఐదు విజయాలు, 10 పాయింట్లు) టాప్-5లో ఉన్నాయి.ఇక లక్నో సూపర్ జెయింట్స్ (10 మ్యాచ్‌లు, 5 విజయాలు 10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (10 మ్యాచ్‌లు, 4 విజయాలు,9 పాయింట్లు)లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్ (11 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో ఎనిమిదో స్థానంలో ఉండడగా.. సన్‌రైజర్స్ (10 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో రన్‌రేటు పరంగా వెనుకబడి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్(10 మ్యాచ్‌లు, రెండు విజయాలు, నాలుగు పాయింట్లు)ఆఖర్లో పదో స్థానంలో ఉంది.ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై గెలిచిరాజస్తాన్, చెన్నైలను మినహాయిస్తే సాంకేతికంగా మిగిలిన ఎనిమిది జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ గనుక మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలపై ఘన విజయం సాధిస్తే.. పద్నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు (ప్రస్తుతం- -1.192) కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా.. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్, ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్‌లలో మెజారిటీ శాతం ఓడిపోవాలి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కూడా రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా తదుపరి మ్యాచ్‌లో ఎక్కువగా ఓడిపోవాలి. ఇంతా జరిగినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇంకేదో అద్భుతం జరగాలి. అయితే, తదుపరి ఢిల్లీ (మే 5)తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం ఓడిందా.. ఇక అంతే సంగతులు! టోర్నీ నుంచి అవుట్.. సోషల్ మీడియా మీమర్ల భాషల్లో చెప్పాలంటే చెన్నై, రాజస్తాన్‌లతో పాటు అసోం రైలుకు టికెట్ కన్ఫామ్ చేసుకున్నట్లే!!చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! -
ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్
IPL 2025 Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates:ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్‌ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కోయిట్జీ తలా వికెట్ సాధించారు. ఓటమి దిశగా ఎస్ఆర్హెచ్సన్రైజర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్(23).. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ(3), మెండిస్(0) ఔటయ్యారు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన అభిషేక్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ క్లాసెన్(22), అనికేత్ వర్మ(0) పరుగులతో ఉన్నారు.అభిషేక్ హాఫ్ సెంచరీగుజరాత్తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 14 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(69), క్లాసెన్(16) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన కిషన్.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(49), క్లాసెన్(10) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హెడ్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.చెలరేగిన గుజరాత్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్ అహ్మదాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(64), సుదర్శన్(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, అన్సారీ తలా వికెట్ సాధించారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన గిల్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(19), గిల్(52) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సుదర్శన్.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో గిల్(42), బట్లర్(12) ఉన్నారు.దంచి కొడుతున్న గుజరాత్ ఓపెనర్లు..నరేంద్ర మోదీ మైదానంలో గుజరాత్ ఓపెనర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. క్రీజులో సుదర్శన్(45), శుబ్‌మన్ గిల్(36) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(26), గిల్(10) ఉన్నారు. ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందేఎస్ఆర్హెచ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. గుజరాత్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. కరీమ్ జనత్ స్ధానంలో జట్టులోకి కోయిట్జీ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ -
ముంబైని ఓడించడం అంత ఈజీ కాదు.. టాప్-2లో నిలుస్తుంది: హర్భజన్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్ గ్రూపు స్టేజి పాయింట్ల పట్టికలో ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు."రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రస్తుతం ముంబై ఛాంపియన్ టీమ్‌లా ఆడుతోంది. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో పది మంది ఆటగాళ్లకు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. ఏ జట్టుకైనా హార్దిక్ సేనను ఓడించడం అంత సులువు కాదు. కచ్చితంగా గ్రూపు స్టేజిలో ముంబై టాప్-2లో నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ముంబై గ్రూపు స్టేజిని 18 లేదా 20 పాయింట్లతో ముగుస్తుందని" హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. -
వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో గత మ్యాచ్‌లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్ (RR vs MI)తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ పెవిలియన్ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఇలా ఆరంభంలోనే షాక్ తగిలింది.ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్ మీడియా మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.వైభవ్‌ను ఓదార్చిన రోహిత్మరోవైపు.. వైభవ్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైభవ్ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.తప్పక పాఠాలు నేర్చుకుంటాడుఈ విషయం గురించి కామెంటేటర్ రవిశాస్త్రి లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌లోనే ఇలా డకౌట్ అయ్యాడు. క్రికెట్ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.కాగా ఐపీఎల్-2025 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.ఐపీఎల్-2025: రాజస్తాన్ వర్సెస్ ముంబైవేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్ముంబై స్కోరు: 217/2 (20)రాజస్తాన్ స్కోరు: 117 (16.1)ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ముంబై గెలుపు.చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ 6️⃣ on the trot & now they’re on 🔝A massive 1⃣0⃣0⃣-run win for #MI to sit right where they want to 👊Scorecard ▶ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI | @mipaltan pic.twitter.com/20KEle7S6n— IndianPremierLeague (@IPL) May 1, 2025Deepak Chahar saved lacs of children from getting embarassed in front of their parents tonight pic.twitter.com/fOiMFV4XzZ— Sagar (@sagarcasm) May 1, 2025Rohit Sharma appreciating Vaibhav Suryavanshi after the match win last night.❤️The true leader @ImRo45 🐐 pic.twitter.com/t0iFGnBLOG— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 2, 2025 -
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో ఈ కివీ బౌలర్ 300 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 36వ బౌలర్‌గా, మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా (టిమ్ సౌథీ, ఐష్ సోధి తర్వాత) నిలిచాడు. బౌల్ట్ ఈ ఫార్మాట్లో 257 మ్యాచ్‌లు ఆడి 302 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (జైస్వాల్, నితీశ్ రాణా, జోఫ్రా ఆర్చర్) తీసిన బౌల్ట్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌల్ట్‌తో పాటు కర్ణ్ శర్మ (4-0-23-3), బుమ్రా (4-0-15-2), హార్దిక్ పాండ్యా (1-0-2-1), దీపక్ చాహర్ (2-0-13-1) కూడా సత్తా చాటడంతో ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతగా కాపాడుకోగలిగింది. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రికెల్టన్ (61), రోహిత్ (53), సూర్యకుమార్ (48 నాటౌట్), హార్దిక్ (48 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.భీకర ఫామ్‌లో బౌల్ట్ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బౌల్ట్.. గత ఐదు మ్యాచ్‌లుగా చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు తీసిన బౌల్ట్.. చివరి 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 11 వికెట్లు తీసి ఈ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై వరుస విజయాల బాట పట్టడానికి బౌల్ట్ కూడా ఓ ప్రధాన కారకుడు. బౌల్ట్‌తో పాటు బుమ్రా, చాహర్ ఫామ్‌లోకి రావడంతోనే ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. బౌలర్లకు తోడు బ్యాటర్లు (రోహిత్, రికెల్టన్, స్కై) కూడా చెలరేగుతుండటంతో ముంబై తిరుగులేని విజయాలు సాధిస్తుంది.ముంబై డబుల్ హ్యాట్రిక్.. రాజస్తాన్ ఔట్రాజస్థాన్పై గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ పరాజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది. రాజస్థాన్‌కు ముందు సీఎస్కే కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.టాప్‌లో రషీద్ ఖాన్టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 471 టీ20 మ్యాచ్‌ల్లో 641 వికెట్లు తీశాడు. రషీద్ తర్వాత డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (584) అత్యధిక టీ20 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు చహల్ (377) పేరిట ఉంది. -
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది.ఈ గెలుపులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో చెలరేగి (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), ఆతర్వాత బంతితోనూ రాణించాడు (1-0-2-1). వాస్తవానికి ఈ మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో ఏడు కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగి సత్తా చాటాడు.ఈ సీజన్లో హార్దిక్ మొదటి నుంచి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్ రేట్‌తో 157 పరుగులు చేసి, 13 వికెట్లు తీశాడు.రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ గత సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్ తొలి 5 మ్యాచ్‌ల్లోనూ ముంబై అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండింది. అయితే సీజన్ గడిచే కొద్ది ముంబై ఇండియన్స్ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్ ఆటగాళ్లంతా టచ్‌లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. మూడు వారాలు తిరక్కుండానే తొమ్మిదో స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది.వాస్తవానికి ముంబై ఇండియన్స్‌ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని, ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ఇది మూడో సారి. లీగ్ ఆరంభ సీజన్లో ఈ జట్టు తొలిసారి వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తిరిగి 2017 సీజన్లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది.2017 సీజన్ తరహాలోనే ఆరు వరస విజయాల సెంటిమెంట్ ఈ సీజన్లోనూ కలిసొస్తుందని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు ఆరు టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్కే సంయుక్తంగా ఐదు టైటిళ్లు సాధించాయి.ఈ సీజన్లో ముంబై తదుపరి టార్గెట్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టేబుల్ టాపర్‌గా నిలవడం. ఈ సీజన్లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్, మే 11న పంజాబ్, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది. -
RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం
-
ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఐపీఎల్–2025లో ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. సీజన్లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్: ఐపీఎల్ సీజన్లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ మేనేజ్మెంట్ ‘పింక్ ప్రామిస్’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్’ కిట్ ధరించగా... బ్యాటర్ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్... ఆర్చర్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్ కావడంతో రాయల్స్ పతనం మొదలైంది. బౌల్ట్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్ తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (9) అవుట్ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్ (16), హెట్‌మైర్ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్ జురేల్ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) తీక్షణ 61; రోహిత్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 53; సూర్యకుమార్ (నాటౌట్) 48; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్: ఆర్చర్ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్ 4–0–39–0, పరాగ్ 2–0–12–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బౌల్ట్ 13; వైభవ్ (సి) జాక్స్ (బి) చహర్ 0; నితీశ్ రాణా (సి) తిలక్ (బి) బౌల్ట్ 9; పరాగ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 16; జురేల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 11; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; శుభమ్ దూబే (సి) బౌల్ట్ (బి) పాండ్యా 15; ఆర్చర్ (సి) బుమ్రా (బి) బౌల్ట్ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్ శర్మ 2; కార్తికేయ (సి) చహర్ (బి) కరణ్ శర్మ 2; మధ్వాల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–13–1, బౌల్ట్ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్ 3–0–29–0, హార్దిక్ పాండ్యా 1–0–2–1, కరణ్ శర్మ 4–0–23–3. ఐపీఎల్లో నేడుగుజరాత్ X హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు.అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (13), రియాన్ పరాగ్ (16), ధృవ్ జురెల్ (11), శుభమ్ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. -
IPL 2025, RR VS MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (మే 1) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.2011 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడుతున్న హిట్‌మ్యాన్ ఆ ఫ్రాంచైజీ తరఫున 231 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 6017 పరుగులు చేశాడు.ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. పోలీ ఎంఐ తరఫున 211 మ్యాచ్‌ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 3915 పరుగులు చేశాడు. పోలార్డ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.స్కై ఈ ఫ్రాంచైజీ తరఫున 109 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 3460 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్కై తర్వాతి స్థానాల్లో అంబటి రాయుడు (2635), సచిన్ టెండూల్కర్ (2599) ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), ర్యాన్ రికెల్టన్ (61) ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔటయ్యారు. 15 ఓవర్ల ముగిసే సమయానికి ముంబై స్కోర్ 146/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (10) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. 76 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.6వ ఓవర్- 76 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఏడో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో దృవ్ జురెల్ (11) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు.64 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్7.1వ ఓవర్- 64 పరుగుల వద్ద రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి శుభమ్ దూబే (15) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో రాజస్తాన్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ఐదో బంతికి బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో హెట్‌మైర్ డకౌటయ్యాడు. దీంతో రాజస్థాన్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్4.4వ ఓవర్- 217 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (16) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్3.6వ ఓవర్- 41 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో నితీశ్ రాణా (9) ఔటయ్యాడు. రియానప పరాగ్ (11), జురెల్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 218.. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్1.4వ ఓవర్: 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 18 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అనంతరం యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డకౌటైన బేబీ బాస్గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. తానెదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో విల్ జాక్స్ వైభవ్ క్యాచ్ పట్టాడు. రెచ్చిపోయిన బ్యాటర్లు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు. భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేస్తున్నముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 161/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (25), హార్దిక్ పాండ్యా (16) ధాటిగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఔట్12.4వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన పరాగ్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (53) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్11.5వ ఓవర్- 116 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో రికెల్టన్ (61) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్‌కు (52) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మతీక్షణ బౌలింగ్‌లో బౌండరీ బాది రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 31 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 11.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 113/0గా ఉంది. రోహిత్ 51, రికెల్టన్ 60 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికెల్టన్కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో సిక్సర్ బాది రికెల్టన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రికెల్టన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 90/0గా ఉంది. రికెల్టన్‌తో పాటు రోహిత్ శర్మ (37) కూడా జోరుమీదున్నాడు. ఆచితూచి ఆడుతున్న ముంబై ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ముంబై ఓపెనర్లు రికెల్టన్ (27), రోహిత్ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 45/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ రాయల్స్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్హక్ ఫరూఖీముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. -
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రంకాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్ పుతూర్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.గాయం కారణంగా దూరంఅయితే, ఇటీవల విఘ్నేశ్ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకుంది.ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్ పుతూర్ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.రఘు శర్మ ధర రూ. 30 లక్షలుకాగా ముంబై నెట్ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్ పుతూర్ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్లో పంజాబ్, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్-ఎ క్రికెట్లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్! -
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్‌మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్‌లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్‌మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్‌మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్‌మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్‌కప్ సెంచరీలు- 7 కెప్టెన్‌గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు)కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు -
వారెవ్వా ‘హిట్’మ్యాన్!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నేడు (ఏప్రిల్ 30)లో 38వ వసంతం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన రోహిత్.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగాడు.మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత తన విశ్వరూపం చూపించి.. ‘హిట్‌మ్యాన్’గా అభిమానుల గుండెల్లో, భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. టీ20 ప్రపంచకప్-2024 (T20 WC 2024)తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన సారథిగా ప్రశంసలు అందుకున్న రోహిత్ కెరీర్, మేటి రికార్డులు, వ్యక్తిగత జీవితం, నికర ఆస్తుల విలువ తదితర వివరాలు.. అతడి బర్త్‌డే సందర్భంగా మీకోసం..పేద కుటుంబంలో జన్మించిన రోహిత్రోహిత్ శర్మ 1987, ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ. పూర్ణిమా శర్మ విశాఖపట్నంకు చెందినవారు. ఇక రోహిత్‌కు తమ్ముడు విశాల్ శర్మ ఉన్నాడు.పేద కుటుంబంలో జన్మించిన రోహిత్ శర్మ క్రికెట్ మీద మక్కువతో చిన్ననాటి నుంచే అనేక కష్టాలకోర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్.. ధోని కెప్టెన్సీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. ఏకైక ఆటగాడిగా రికార్డుఆ తర్వాత అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 273లు వన్డేలు, 159 టీ20లు, 67 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 4302, వన్డేల్లో 11168, టీ20లలో 4231 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన క్రికెటర్‌గా కూడా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లలోనూ అత్యధికంగా ఐదు శతకాలు బాదాడు. ఓవరాల్‌గా టీమిండియా తరఫున 47 సెంచరీలు చేశాడు. ఇవేగాక సిక్సర్ల వీరుడు రోహిత్ మరెన్నో ఘనమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐపీఎల్‌లోనూ రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటికి 266 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 6868 పరుగులు సాధించాడు.రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలోఇక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసిన రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న రోహిత్ 2015, డిసెంబరు 13న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సమైరా (2018), కుమారుడు అహాన్ సంతానం (2024).నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లుక్రికెటర్గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన రోహిత్ శర్మ ఇటు ఆటగాడిగా, అటు పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా.. ఐపీఎల్ ద్వారా కోట్లు ఆర్జించాడు. స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం హిట్‌మ్యాన్ నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లు అని తెలుస్తోంది. బీసీసీఐ ఏ+ గ్రేడ్‌లో ఉన్న రోహిత్ ఏడాదికి రూ. 7 కోట్లు వేతనంగా పొందుతున్నాడు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు బోర్డు ద్వారా ఫీజుగా అందుకుంటున్నాడు. ఐపీఎల్లో ముంబై కెప్టెన్‌గా కోట్లాది రూపాయలు ఆర్జించిన రోహిత్ శర్మను.. ఐపీఎల్-2025కి ముందు సదరు ఫ్రాంఛైజీ రూ. 16.3 కోట్లకు రిటైన్ చేసుకుంది.లగ్జరీ ఇల్లు, కార్లురోహిత్ శర్మ ముంబైలో విలాసవంతమైన అపార్టుమెంట్లు ఉన్నాయి. వర్లిలో భార్యాబిడ్డలతో కలిసి హిట్‌మ్యాన్ నివసించే ఇంటి విలువ రూ. 30 కోట్లు అని జిక్యూ ఇండియా అంచనా వేసింది.ఇక రోహిత్ శర్మ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్ (రూ. 4.18 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ (1.5 కోట్లు), మెర్సిడెజ్ జీఎఎల్‌ఎస్ 400 డి(రూ. 1.5 కోట్లు), బీఎండబ్ల్యూ ఎం5 (రూ. 1.79 కోట్లు) , రేంజ్ రోవర్ (రూ. 2.8 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.చదవండి: Kuldeep Slaps Rinku Singh: అతడిని బ్యాన్ చేయండి, టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం -
'ముంబై మంచి రిథమ్‌లో ఉంది.. ప్రతీ జట్టు భయపడాల్సిందే'
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇడియన్స్ మూడో స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుపై టీమిండియా మాజీ ప్లేయర్ పీయాష్ చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతీ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు."ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా వంతు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై ఇండియన్స్ మంచి రిథమ్‌లో ఉంది. ముంబై ఇటువంటి రోల్లో ఉన్నప్పుడు, కచ్చితంగా ఇతర జట్లు వారిని చూసి భయపడాలి. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో మొదటి నుంచి చివరి వరకు అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ర్యాన్ రికెల్టన్ ఈ రోజు మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విల్ జాక్స్ బంతితో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ముంబై సరైన ట్రాక్‌లో ఉందని లక్నో మ్యాచ్ అనంతరం చావ్లా పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా రికార్డు
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తమ జైత్ర యాత్ర కొనసాగుతోంది. హార్దిక్ సేన వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.ముంబై సరికొత్త చరిత్ర..ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో 150 మ్యాచ్‌ల్లో గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 271 మ్యాచ్‌లు ఆడిన ముంబై 150 విజయాలు సాధించింది. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్దానంలో సూపర్ కింగ్స్ (248 మ్యాచ్‌లు) ఉంది. మూడు నాలుగు స్ధానాల్లో కేకేఆర్(134), ఆర్సీబీ(129) కొనసాగుతున్నాయి.చదవండి: నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్ -
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
ఐపీఎల్-2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4.98.21 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా కలిపి కేవలం 110 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కిన పంత్ నుంచి ఇలాంటి ఆట తీరు అస్సలు ఊహించనిది. దీంతో అభిమానులు సైతం అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే, కెప్టెన్‌గా మాత్రం రిషభ్ పంత్ ప్రదర్శన బాగానే ఉంది. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో ఐదింట గెలిచింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఐదో పరాజయం నమోదు చేసింది.ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిదిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రిషభ్ పంత్‌కు అతడి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది.పరిస్థితులు మనకు అనుకూలంగా లేనపుడు మన నైపుణ్యాలపై మనకే సందేహాలు తలెత్తుతాయి. అయితే, అలాంటి భావనలను దరిచేయనీయకూడదు. జట్టు బాగా ఆడుతున్నపుడు.. ఆ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించాలి.ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదుక్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన ఆట. అవును.. ఒక్క ఆటగాడి వల్ల కూడా ప్రభావం ఉంటుంది. మ్యాచ్ దిశ మారిపోతుంది. కానీ ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదనుకుంటా’’ అని పంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.కాగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన పోరులో ముంబై 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోలక్నో ఆటగాళ్లలో ఆయుశ్ బదోని (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ముంబౌ బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో అత్యధికంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసి పంత్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.చదవండి: వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు ఆ పిచ్చి లేదు: సంజనా𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్‌ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ (MI).. ఐపీఎల్-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్‌ను మొదలుపెట్టింది.రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన హార్దిక్ సేన.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.వరుసగా ఐదు విజయాలు ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రెండుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్‌ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.సెంటిమెంట్ ప్రకారం ఈసారి మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు.ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గాకాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్‌పై ప్రేమ.. హార్దిక్‌పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అందుకు అనుగుణంగానే ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ లక్నో👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: లక్నో తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 215/7 (20)👉లక్నో స్కోరు: 161 (20)👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయంఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..👉2008లో ఆరుసార్లు వరుసగా👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్‌గా👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2025లో ఐదుసార్లు వరుసగా..*.చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.బుమ్రా తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జస్ప్రీత్ రికార్డులకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 139 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 174 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ రికార్డు పేరిట ఉండేది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును బుమ్ బుమ్రా బ్రేక్ చేశాడు. అయితే ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ కూడా కలిపితే ముంబై తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. ఈ శ్రీలంక దిగ్గజం రెండు లీగ్‌లు కలిపి ముంబై తరపున 195 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాతి స్దానంలో బుమ్రా(177) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో లక్నో చతకలపడింది. 20 ఓవర్లో 61 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించాడు. -
బుమ్ బుమ్ బుమ్రా.. లక్నోను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరిగాడు. నాలుగు వికెట్లు పడగొట్టి లక్నోను దెబ్బ తీశాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
ఐపీఎల్లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2025లో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఈ ఫీట్ సాధించాడు. సూర్య ఈ మైలు రాయిని కేవలం 2714 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా పేరిట ఉండేది.రైనా 2,881 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌లో రైనాను సూర్య అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సూర్య మూడో స్దానంలో నిలిచాడు. తొలి స్దానంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(2653 బంతులు) ఉండగా.. రెండో స్దానంలో ఏబీ డివిలియర్స్(2658) ఉన్నాడు. అదేవిధంగా సూర్య మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో వరుసగా 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన సూర్య నిలిచాడు. ఉతప్ప ఐపీఎల్లో వరుసగా 10 సార్లు 25 ప్లస్ పరుగులు చేయగా.. సూర్య కూడా సరిగ్గా వరుసగా 10 సార్లు 25 ప్లస్ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 26 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 427 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. -
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్దాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో రికెల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 32 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వర్మ కేవలం 26 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో వర్మను రికెల్టన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం -
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
LSG vs MI Live Updates: ముంబై ఘన విజయంవాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు.అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్లో మూడు వికెట్లుజస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16వ ఓవర్ వేసిన బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.బదోని ఔట్..అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.లక్నో నాలుగో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్..లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.ముంబై ఐదో వికెట్ డౌన్157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5ముంబై నాలుగో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్.. దిగ్వేష్ రతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మలక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు లక్నో టీమ్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ సోషల్‌మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025మయాంక్ రాకతో ఎల్ఎస్జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్‌లతో స్ట్రాంగ్‌గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్‌కు బదులుగా వచ్చిన సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. -
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లుక్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 295విరాట్ కోహ్లి- 285ఎంఎస్ ధోని- 260ఏబీ డివిలియర్స్- 251ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్లో 908 సిక్సర్లు బాదాడు. గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లుక్రిస్ గేల్- 1056కీరన్ పోలార్డ్- 908ఆండ్రీ రసెల్- 737నికోలస్ పూరన్- 630కొలిన్ మున్రో- 557అలెక్స్ హేల్స్- 552రోహిత్ శర్మ- 540గ్లెన్ మ్యాక్స్‌వెల్- 530జోస్ బట్లర్- 528డేవిడ్ మిల్లర్- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్‌లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి. -
ప్రతీకార పోరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి టచ్‌లో ఉంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్‌గా రెండు జట్లు 9 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్ శర్మ, విల్ జాక్స్, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ తరఫున శార్దుల్ ఠాకూర్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అవేశ్ ఖాన్ గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జోరు సాగిస్తేనే... హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ తన విలువ చాటుకుంటున్నాడు. రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి టచ్‌లో ఉండగా... తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్‌పైనే భారం... లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్ ఈ సీజన్లో 200 పైగా స్ట్రయిక్‌రేట్‌తో 377 పరుగులు చేశాడు. మార్క్రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్ 9 మ్యాచ్‌ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. -
IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై
-
IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై
-
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్‌రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్‌రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్. -
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
ఐపీఎల్–2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో మ్యాచ్ మ్యాచ్‌కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదుకున్న క్లాసెన్... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్‌రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు (24) సన్‌రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్ మనోహర్‌ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్‌కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్‌కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్‌వర్మ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్ కాకుండానే... సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్‌సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్‌గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్‌గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్‌గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్‌కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.ఐపీఎల్లో నేడుబెంగళూరు X రాజస్తాన్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. -
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్‌తో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(318) ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అదేవిధంగా మరో ఘనతను బుమ్రా ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(170) రికార్డును బుమ్రా సమం చేశాడు.మరో వికెట్ పడగొడితే మలింగను జస్ప్రీత్ అధిగమిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు వీరే యుజ్వేంద్ర చాహల్ - 373పీయూష్ చావ్లా - 319భువనేశ్వర్ కుమార్ - 318రవిచంద్రన్ అశ్విన్ - 315జస్ప్రీత్ బుమ్రా - 300 -
IPL 2025: ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..
IPL 2025 SRH Vs MI Live updates: ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. ముంబై రెండో వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన రోహిత్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 32 బంతుల్లో 14 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(26) ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. రోహిత్ శర్మ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రోహిత్(52) తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(25), విల్ జాక్స్(7) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.చెలరేగిన క్లాసెన్.. ముంబై టార్గెట్ ఎంతంటే?టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తన ఫైటింగ్ నాక్‌తో ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నాడు.15 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.దూకుడు పెంచిన క్లాసెన్..10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(25), మనోహర్(1) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 13 పరుగులకే 4 వికెట్లుఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(0), కిషన్(1), అభిషేక్ శర్మ(8),నితీష్ రెడ్డి(2) వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్(0) రూపంలో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో హెడ్ పెవిలియన్‌కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.👉ఈ మ్యాచ్‌కు ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఓ నిమిషం మౌనం పాటించారు.ఐపీఎల్-2025లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అశ్వినీ కుమార్ స్దానంలో విఘ్నేష్ పుత్తర్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్ -
ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)
-
ఉప్పల్‌లో సన్‘రైజ్’ అయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్‌లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది. ఈ సీజన్లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్‌లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు. ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్‌పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది. రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్‌తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు. సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుదిజట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.10 సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన ముంబై..ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్‌గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్‌లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్‌కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి
-
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
IPL 2025: సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయంచెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీస్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మరోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది. టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)తొలి వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు. రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ధోని ఔట్18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దూబేఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 118/3గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్‌లో ఉన్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రేఅరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. రషీద్‌కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్‌లోకి వచ్చాడు.ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్/వికెట్‌కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణఇంపాక్ట్ సబ్‌లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ -
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్‌రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31) -
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్‌మ్యాన్.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.గార్డెన్లో తిరిగేందుకు వచ్చారా?‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ‘‘ఆరోజు వైజాగ్‌లో మ్యాచ్. ఓవర్ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్‌కు వచ్చినట్లు గార్డెన్లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.అందుకే నాకు కోపం వచ్చిందికానీ వాళ్లేమో గ్రౌండ్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్ శర్మ జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.106 పరుగుల తేడాతో గెలుపుకాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్‌గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక భారత్‌కు పొట్టి ప్రపంచకప్ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్ క్రికెట్లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన రోహిత్ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్‌లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్‌కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్‌ను నిలువరించారు. తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్‌ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్‌తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్‌లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్లు కోల్పోయి). ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. -
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్‌రైజర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. -
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్‌వెల్ కంటే వేగంగా..!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2) ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్ ఓ ఓవర్లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్ జాక్స్ 2 ఓవర్లలో 12 (ఇషాన్ వికెట్), హార్దిక్ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్ వికెట్). ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్, హెడ్లకు మూడు లైఫ్‌లు లభించాయి. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హెడ్ క్యాచ్ ఔటైనప్పటికీ నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు.1000 పరుగుల క్లబ్లో హెడ్ఈ మ్యాచ్‌లో హెడ్ ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్ కేవలం 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో ఆండ్రీ రసెల్ మాత్రమే హెడ్ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్.. విధ్వంసకర వీరులు క్రిస్ గేల్ (615), మ్యాక్స్‌వెల్ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు.. 545 - ఆండ్రీ రస్సెల్575 - ట్రావిస్ హెడ్*594 - హెన్రిచ్ క్లాసెన్604 - వీరేంద్ర సెహ్వాగ్610 - గ్లెన్ మాక్స్వెల్615 - క్రిస్ గేల్617 - యూసుఫ్ పఠాన్617 - సునీల్ నరైన్ -
IPL 2025: సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్ల నష్టానికి). ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.3వ ఓవర్- 128 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో అన్సారీకి క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (36) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై12.4వ ఓవర్- 121 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (26) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/29 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించిన రికెల్టన్ఎషాన్ మలింగ బౌలింగ్‌లో (6వ ఓవర్) రికెల్టన్ హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించాడు. 5.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 54/1. రికెల్టన్ 21, విల్ జాక్స్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్163 పరుగుల లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 32/1గా ఉంది. రికెల్టన్ (5), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.సత్తా చాటిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సన్రైజర్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. 18.1 ఓవర్ల తర్వాత 136/5అనికేత్ వర్మ (1), కమిన్స్నత్తనడకన సాగుతున్న ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. అభిషేక్ (40), హెడ్ (28), ఇషాన్ (2) ఔట్ కాగా.. నితీశ్ (14), క్లాసెన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 95/3గా ఉంది. మూడో వికెట్ డౌన్.. హెడ్ ఔట్11.1వ ఓవర్- 82 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే రెండు లైఫ్‌లు లభించిన హెడ్ (28) విల్ జాక్స్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్ ఔట్8.4వ ఓవర్- 68 పరుగుల వద్ద సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (2) స్టంపౌటయ్యాడు. హెడ్ (22), నితీశ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. అభిషేక్ ఔట్7.3వ ఓవర్-సన్‌రైజర్స్ 59 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (40) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 65/1గా ఉంది. హెడ్ (20), ఇషాన్ కిషన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 53/0అభిషేక్ 36, ట్రవిస్ హెడ్ 14కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ముంబై బౌలర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొలి నాలుగు ఓవర్లు చాహర్, బౌల్ట్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కేవలం బాదడమే లక్ష్యంగా పెట్టుకుని సఫలం కాలేకపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. అభిషేక్ 20, హెడ్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఏడులో, ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగసన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్ -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్‌కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్‌గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్‌లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి'
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగానే ముంబై ఇండియన్స్ టాప్‌లో నిలవలేకపోయిందని ఆమె అభిఫ్రాయపడింది. ముంబై ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. "ఏ ప్లేయరైనా ఫామ్ లేకపోవడం పెద్ద నేరమేమి కాదు. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా టాప్-4లో కొనసాగలేకపోతుంది. రోహిత్ ఓపెనర్‌గా రాణించడంలో విఫలమవుతున్నాడు.కాబట్టి అతడిని దిగువన బ్యాటింగ్‌కు పంపితే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ముంబై చాలా అప్షన్స్ ఉన్నాయి. రోహిత్ స్ధానంలో విల్ జాక్స్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడు మనందరికి తెలుసు. ఈ ఏడాది సీజన్లో అతడికి మంచి ఆరంభం దక్కలేదు. సహజంగా ఐపీఎల్‌లోనైనా, వరల్డ్‌కప్‌లోనైనా మన స్టార్ బ్యాటర్లు ఫామ్‌లో ఉండాలని కోరుకుంటాము. కొంతమంది వెంటనే తమ ఫామ్‌ను అందుకుని తిరిగి గాడిలో పడతారు. మరి కొంత మంది కాస్త ఆలస్యంగా తమ రిథమ్‌ను అందుకుంటారు. అంతమాత్రన వారు అత్యుత్తమ బ్యాటర్లు కాదని ఆర్ధం కాదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్‌గా -
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ముంబై గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ అని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో హార్దిక్ సేన ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చివరగా ఢిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై గట్టెక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.205 పరుగులు ఓపెనర్ రియాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40) రాణించగా.. తిలక్ వర్మ ( Tilak Varma- 33 బంతుల్లో 59), నమన్ ధీర్ (Naman Dhir- 17 బంతుల్లో 38 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 205 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడినా కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకు పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రమాదకర బ్యాటర్ కరుణ్ నాయర్‌తో పాటు కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆట కట్టించేందుకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పనిచేశాయి.కొత్త బంతితో మ్యాజిక్బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్-2025లో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే.. పదవ ఓవర్ ముగిసిన తర్వాత కొత్త బంతిని తీసుకోవచ్చు. ఈ రూల్‌ను ఢిల్లీతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో రోహిత్ అమలు చేయించాడు. జోరు మీదున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ కర్ణ్ శర్మకు కొత్త బంతిని ఇవ్వాలని డగౌట్ నుంచి సూచించాడు. రోహిత్ ఇచ్చిన ఈ సలహా బాగా వర్కౌట్ అయింది. 14, 16 ఓవర్లలో కర్ణ్ ట్రిస్టస్ స్టబ్స్, కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్లు తీశాడు. ఇక కరుణ్ నాయర్‌ను మిచెల్ శాంట్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి.. ఢిల్లీ ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలిఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. స్పిన్నర్లు.. ముఖ్యంగా కర్ణ్ శర్మను రంగంలోకి దించాలని హెడ్‌కోచ్ మహేళ జయవర్దనేకు చెప్పాడు. కర్ణ్ ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.నిజంగా ఇదొక అద్భుతమైన వ్యూహం. కానీ జయవర్ధనే తొలుత రోహిత్ మాటకు అంగీకరించలేదనిపించింది. కొన్నిసార్లు కోచ్‌లు తమ అహాన్ని పక్కన పెట్టి.. జట్టు ఎలా బాగుపడుతుందనే విషయం మీదే దృష్టి పెట్టాలి.రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ జయవర్ధనేకు అవి నచ్చినట్లు లేదు. ఒకవేళ జయవర్ధనే చెప్పినట్లు విని ఉంటే ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయేది. రోహిత్ కెప్టెన్. దిగ్గజ సారథి.. కెప్టెన్ ఎప్పుడూ కెప్టెన్‌లాగే ఆలోచిస్తాడు. రోహిత్ వ్యూహం వల్లే ముంబై గెలిచింది’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిAgar miss kiye toh ab dekho - 𝐊𝐚𝐫𝐧 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐤𝐚 𝐁𝐡𝐨𝐨𝐥 𝐁𝐡𝐮𝐥𝐚𝐢𝐲𝐚𝐚 🌀#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMIpic.twitter.com/T8KabriAbK— Mumbai Indians (@mipaltan) April 13, 2025 -
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్
ఐపీఎల్-2025 (IPL 2025) ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఓ దశలో సునయాసంగా మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఢిల్లీ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తొలి ఓటమి చవిచూడాల్సింది. అయితే ఢిల్లీ వికెట్లను కుప్పకూల్చడంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. డగౌట్ నుంచే తన మాస్టర్ మైండ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు హిట్‌మ్యాన్.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అప్పటికే రాహుల్, స్టబ్స్ ఉన్నారు. ఇదే సమయంలో బంతి మార్చాలని అంపైర్లకు ముంబై జట్టు అభ్యర్థించింది. వారి అభ్యర్ధను అంగీకరించిన అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. రోహిత్.. హెడ్ కోచ్ జయవర్దనే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడి ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని హార్దిక్‌కు సైగలు చేశాడు. రోహిత్ మాట విన్న పాండ్యా.. కర్ణ్ను 14వ ఓవర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు.అయితే రోహిత్ ఊహించినట్టే ఆ ఓవర్లో ముంబై ఇండియన్స్‌కు ఫలితం దక్కింది. అద్భుతమైన ఫామ్‌లో స్టబ్స్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. బంతి పొడిగా ఉన్నందున, రోహిత్ ప్రణాళిక సరిగ్గా పనిచేసింది. ఆ తర్వాత 16 ఓవర్ వేసిన కర్ణ్..కేఎల్ రాహుల్‌ను సైతం బోల్తా కొట్టించాడు. రాహుల్ వికెట్‌తో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. కాగా డగౌట్లో కూర్చుని మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నంబర్ వన్ కెప్టెన్ ఎలా అయ్యాడో మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(18).. ఫీల్డింగ్‌లో బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలోనే కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. #MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc— Star Sports (@StarSportsIndia) April 13, 2025 -
DC VS MI: కరుణ్ నాయర్‌తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్‌కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్లో, అంతకుముందు ఓవర్లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్‌ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు. -
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము. బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. -
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కరుణ్ పోరాటం వృధా.. సీజన్లో తొలి ఓటమి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్‌తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్ రాహుల్‌ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్‌ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్‌ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు. అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉండినప్పటికీ.. ఆతర్వాత ఒత్తిడికి లోనై ఓటమిని కొని తెచ్చుకుంది. 19వ ఓవర్లో చివరి మూడు బంతులకు ఢిల్లీ వరుసగా మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి పరాజయంపాలైంది. ఓ దశలో ఢిల్లీ 11.3 ఓవర్లలో 135 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి) చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. తద్వారా కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను కూడా ఉతికి ఆరేశాడు. ముంబై విజయంలో వెటరన్ కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) కీలకపాత్ర పోషించారు. సాంట్నర్ అద్భుతమైన టచ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. కర్ణ్ శర్మ.. అభిషేక్ పోరెల్ (33), కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేక్ ఫ్రేజర్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తమ తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17) ఈ మ్యాచ్‌లో రనౌటయ్యాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసి, రెండో స్థానానికి పడిపోయింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఢిల్లీపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసిన ప్రతిసారి గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ముంబై 15 మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ అత్యధిక మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి గెలిచింది. ముంబై, ఢిల్లీ కంటే సీఎస్కే అత్యధిక సార్లు (21) 200 ప్లస్ స్కోర్లకు డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఐదు సార్లు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 19 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 5 సార్లు ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 2 సార్లు ఓటమిపాలైంది. -
DC Vs MI: పరుగుల వేటలో ఢిల్లీ ‘రనౌట్’
వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్ పడింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట తిలక్ వర్మ, సూర్యకుమార్ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్ పొరెల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్ శర్మ, కుల్దీప్, మోహిత్ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ శర్మ 3 వికెట్లు, సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ తడాఖా... గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్ రెండో ఓవర్లో సిక్సర్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్లో రికెల్టన్ 2 ఫోర్లు, రోహిత్ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ (12 బంతుల్లో 18)ను లెగ్‌స్పిన్నర్ విప్రాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్ కోల్పోగా... సూర్యకుమార్ బాధ్యతాయుతంగా ఆడాడు. మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్ కూడా ఔట్ కాగా... తిలక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్ కాగా... తిలక్‌కు నమన్ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్ 26 బంతుల్లో ఈ సీజన్లో రెండో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కదంతొక్కిన కరుణ్.. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్‌సెంచరీ చేయని నాయర్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మెక్‌గుర్క్ (0) ఔట్ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అడుగుపెట్టిన నాయర్... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. స్టార్ పేసర్ బుమ్రా వేసిన ఆరో ఓవర్లో 6, 4, 6తో కరుణ్ 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్లో 6, 4 కొట్టిన నాయర్... కరణ్ శర్మ ఓవర్లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్ ఔట్ కాగా... మరో ఫోర్ కొట్టిన అనంతరం కరుణ్ వెనుదిరిగాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (9), స్టబ్స్ (1) విఫలం కాగా... కేఎల్ రాహుల్ (15), అశుతోష్ శర్మ (17), విప్రాజ్ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 18; రికెల్టన్ (బి) కుల్దీప్ 41; సూర్యకుమార్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 40; తిలక్ (సి) పొరెల్ (బి) ముకేశ్ 59; హార్దిక్ (సి) స్టబ్స్ (బి) విప్రాజ్ 2; నమన్ (నాటౌట్) 38; జాక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్: స్టార్క్ 3–0–43–0; ముకేశ్ 4–0–38–1; విప్రాజ్ నిగమ్ 4–0–41–2; కుల్దీప్ 4–0–23–2; అక్షర్ 2–0–19–0; మోహిత్ 3–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జాక్స్ (బి) దీపక్ చహర్ 0; పొరెల్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 33; కరుణ్ నాయర్ (బి) సాంట్నర్ 89; రాహుల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 15; అక్షర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 9; స్టబ్స్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 1; అశుతోష్ (రనౌట్) 17; విప్రాజ్ నిగమ్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 14; స్టార్క్ (నాటౌట్) 1; కుల్దీప్ (రనౌట్) 1; మోహిత్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–24–1; బౌల్ట్ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్ 4–0–43–2; హార్దిక్ పాండ్యా 2–0–21–0; కరణ్ శర్మ 4–0–36–3. ఐపీఎల్లో నేడులక్నో X చెన్నై వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కరుణ్ నాయర్ మెరుపులు వృథా.. ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో పై 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. రాహుల్‌తో పాటు మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌గా వృథా అయిపోయింది. ముంబై బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది రెండో విజయం కావడం గమనార్హం.తిలక్ హాఫ్ సెంచరీ..బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. -
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు.12 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ల ముందు హిట్‌మ్యాన్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. 0,8,13,17,18 ఇవి వరుసగా రోహిత్ శర్మ చేసిన స్కోర్లు ఇవి. దీంతో మరోసారి విఫలమైన రోహిత్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఆడింది చాలు వెళ్లి రెస్టు తీసుకో రోహిత్ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొంత మంది విరాట్ కోహ్లి అద్బుతంగా ఆడుతుంటే నీకు ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. Rohit Sharma has become a joke . Failed again and again.. But no former indian player will talk about it because all these former players lick Rohit Sharma's feet.Pure liability in cricket. pic.twitter.com/wvIVk8GwRM— Suprvirat (@ishantraj51) April 13, 2025 -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
IPL 2025 MI vs DC Live Updates: ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి.ముంబై ఇండియన్స్ విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన పోరెల్.. కరుణ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.కరుణ్ నాయర్ ఫిప్టీ..ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను నాయర్ అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.క్రీజులో కరుణ్ నాయర్(50), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్..5 ఓవర్లు మగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్(32), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.చెలరేగిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు.ఔటైన సూర్య, హార్దిక్ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(2) విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న తిలక్, సూర్య13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(40), తిలక్ వర్మ(30) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్. ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రికెల్టన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(4), సూర్యకుమార్ యాదవ్(14) ఉన్నారు.ముంబై తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ముంబై..3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), ర్యాన్ రికెల్టన్(22) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డులకు చేరువలో రాహుల్
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తమ జైత్ర యాత్రను కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను పలు అరుదైన రికార్డులను ఊరిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో రాహుల్ మరో మూడు సిక్స్‌లు కొడితే ఐపీఎల్లో 200 సిక్స్‌ల మైలు రాయిని అందుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 197 సిక్స్‌లు బాదాడు. కేఎల్ మరో మూడు సిక్స్‌లు బాదితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి దిగ్గజాల సరసన చేరుతాడు.ఒకే ఒక హాఫ్ సెంచరీ..అదే విధంగా ఈ మ్యాచ్‌లో రాహుల్ మరో 50 రన్స్ చేస్తే ముంబై ఇండియన్స్‌పై వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకే ముంబై ఇండియన్స్‌పై 950 పరుగులు చేశాడు. రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఈ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది.గత మ్యాచ్‌లో ఆర్సీబీపై రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు సీఎస్కేపై హాఫ్ సెంచరీతో మెరిశాడు.ముంబైతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్చదవండి: అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది: శార్దూల్ ఫైర్ -
IPL 2025: బీభత్సం సృష్టించిన గాలి దుమారం.. భయంతో కేకలు పెట్టిన రోహిత్ శర్మ
దేశ రాజధాని ఢిల్లీని నిన్న (ఏప్రిల్ 11) సాయంత్రం గాలి దుమారం వణికించింది. ఇది సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలి దూమారం ప్రభావం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌పై కూడా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ నిమిత్తం ఆ జట్టు నిన్న సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది. Straight out of a 🌪️ movie#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/Tv7j3ILf9v— Mumbai Indians (@mipaltan) April 11, 2025ఈ క్రమంలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఇండియన్స్ బృంద సభ్యులు భయంతో వణికిపోయారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కేకేలు పెడుతూ బృంద సభ్యులను మైదానం నుంచి తిరిగి రమ్మంటూ అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ కేకేలు పెడుతుండగా.. దీపక్ చాహర్, కోచ్‌లు మహేల జయవర్ధనే, లసిత్ మలింగ డగౌట్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు.రోహిత్.. సహచరులను మైదానం వీడి సురక్షితంగా డగౌట్‌కు చేరుకోవాలని కేకేలు పెడుతూనే తన సహజ శైలిలో జోక్‌లు వేశాడు. తనవైపు ఫోకస్ పెట్టిన కెమెరామెన్‌ను "నా ముఖం ఏం చూపిస్తున్నావు. ఆ వీడియో తీసుకో" అంటూ అరిచాడు. గాలి దూమారం ధాటికి స్టేడియంలో వస్తువులు గాల్లో ఎగురుతూ కనిపించాయి.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికి ఢిల్లీలోని వాతావరణం క్లియర్‌గా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు వర్షం నుంచి కాని, గాలి దుమారం నుంచి కాని ఎలాంటి ముప్పు లేదని ప్రకటన విడుదల చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి గుజరాత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో, రాజస్థాన్ వరస స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్, సీఎస్కే చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో లక్నోతో గుజరాత్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. -
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్‌పై ఏడాది నిషేధం
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కార్బిన్ బాష్ (Corbin Bosch)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా పీఎస్ఎల్-2025 (IPL 2025) సీజన్‌కు గానూ పెషావర్ జల్మీ ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్ పేసర్ ముందు నుంచి ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.అలా అదృష్టం వరించింది..అయితే, సహచర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరం కావడంతో.. బాష్‌ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు విలియమ్స్ స్థానంలో బాష్‌ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఐపీఎల్ లేదంటే పీఎస్ఎల్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్‌కే ఓటు వేసిన బాష్.. పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్‌లలో భాగమైన ముంబై ఇండియన్స్ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్‌ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.‘‘ఈ ఆల్‌రౌండర్‌పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ సెలక్షన్‌కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్ఎల్లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాగా ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్లో 30 ఏళ్ల బాష్ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’ -
MI VS RCB: తిలక్ వర్మ ఎపిసోడ్లో అసలు విషయాన్ని బయట పెట్టిన హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. నిన్న హోం గ్రౌండ్ వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే గెలుపు దరి చేరిన సమయంలో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్సీబీ ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 18, 19 ఓవర్లలో ప్రమాదకరంగా కనిపిస్తున్న తిలక్ (భువీ), హార్దిక్‌ను (హాజిల్‌వుడ్) ఔట్ చేశారు. చివరి ఓవర్లో కృనాల్ చెలరేగి (6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో (లక్నో) తిలక్‌ను రిటైర్డ్ ఔట్‌గా వెనక్కు పంపడంపై అసలు విషయాన్ని బయటపెట్టాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ సమయంలో తిలక్‌ను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపడం కేవలం వ్యూహం మాత్రమే కాదని వివరించాడు. గాయం కారణంగా తిలక్ షాట్లు ఆడలేక అసౌకర్యంగా కనిపించాడన్నాడు. అందుకే అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపి సాంట్నర్‌ను బరిలోకి దించామని పేర్కొన్నాడు.కాగా, లక్నోతో మ్యాచ్ ముగిశాక హార్దిక్ తిలక్ గాయం విషయాన్ని చెప్పలేదు. భారీ షాట్లు ఆడే ఆటగాడు కావాలనే ఉద్దేశంతో సాంట్నర్‌ను బరిలోకి దించినట్లు తెలిపాడు. సాంట్నర్‌ను భారీ హిట్టర్‌గా చెప్పుకొచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో అతనికి స్ట్రయిక్ ఇవ్వకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్‌లో ముంబై లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీతో మ్యాచ్ తరహాలోనే ఆ మ్యాచ్‌లోనూ ముంబై విజయతీరాల వరకు చేరి గెలుపు సాధించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికి ముంబై 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి ఈ సీజన్లో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఓటమి ఎరుగని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. -
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్సీబీ చక్కటి బౌలింగ్‌తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్ రజత్ పాటీదార్, విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. సమష్టి ప్రదర్శన... ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాదగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పడిక్కల్ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్ ఓవర్లో 2 సిక్స్‌లతో పాటీదార్ జోరు ప్రదర్శించాడు. హార్దిక్ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్‌స్టోన్ (0)లను అవుట్ చేయగా, బౌల్ట్ ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)... దయాళ్ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్ (17), జాక్స్ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్ దయాళ్, కీపర్ జితేశ్ సమన్వయలోపంతో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత పెవిలియన్ పంపించి దయాళ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్ ఓవర్లో తిలక్ 2 ఫోర్లు, సిక్స్...హాజల్‌వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్‌లో ‘రిటైర్ట్ అవుట్’గా పంపించిన కసి తిలక్ బ్యాటింగ్‌లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్ వికెట్‌తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) బౌల్ట్ 4; కోహ్లి (సి) నమన్ (బి) హార్దిక్ 67; పడిక్కల్ (సి) జాక్స్ (బి) పుతూర్ 37; పాటీదార్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 64; లివింగ్‌స్టోన్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0; జితేశ్ (నాటౌట్) 40; డేవిడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213. బౌలింగ్: బౌల్ట్ 4–0–57–2, చహర్ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–40–0, హార్దిక్ 4–0– 45–2, విఘ్నేశ్ 1–0–10–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) దయాళ్ 17; రికెల్టన్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 17; జాక్స్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; సూర్యకుమార్ (సి) లివింగ్‌స్టోన్ (బి) దయాళ్ 28; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 56; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) హాజల్‌వుడ్ 42; నమన్ ధీర్ (సి) దయాళ్ (బి) కృనాల్ 11; సాంట్నర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 8; దీపక్ చహర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 0; బౌల్ట్ (నాటౌట్) 1; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, యశ్ దయాళ్ 4–0–46–2, హాజల్‌వుడ్ 4–0–37–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 4–0–45–4. -
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. వాఖండే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది.ముంబై బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడినప్పటికి కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్బతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయం సాధించడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.కోహ్లి, పాటిదార్ హాఫ్ సెంచరీలుఈ మ్యాచ్‌లో ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు. -
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పాండ్యా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి, లివింగ్ స్టోన్లను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. లివింగ్ స్టోన్ వికెట్ పాండ్యాకు 200వ టీ20 వికెట్ కావడం గమనార్హం. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో 5000 పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన 12వ ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో పాండ్యా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాళ్లు వీరే..డ్వేన్ బ్రావో - 6970 పరుగులు- 631 వికెట్లుషకీబ్ అల్ హసన్ - 7438 పరుగులు - 492 వికెట్లుఆండ్రీ రస్సెల్ - 9018 పరుగులు - 470 వికెట్లుమహ్మద్ నబీ - 6135 పరుగులు- 369 వికెట్లుసమిత్ పటేల్ - 6673 పరుగులు- 352 వికెట్లుకీరాన్ పొలార్డ్ - 13537 పరుగులు- 326 వికెట్లురవి బొపారా - 9486 పరుగులు- 291 వికెట్లుడేనియల్ క్రిస్టియన్ - 5848 పరుగులు - 281 వికెట్లుమోయిన్ అలీ - 7140 పరుగులు - 375 వికెట్లుషేన్ వాట్సన్ – 8821 పరుగులు- 343 వికెట్లుమహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు- 202 వికెట్లుహార్దిక్ పాండ్యా – 5390 పరుగులు- 200 వికెట్లుచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
Rcb vs MI Live Updates:ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయంవాంఖడే వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ ఔట్..తిలక్ వర్మ(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో కోల్పోయింది. ముంబై విజయానికి 11 బంతుల్లో 28 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిలక్, పాండ్యా16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిలక్ వర్మ(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ముంబై నాలుగో వికెట్ డౌన్‌సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సూర్యకుమార్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 52/25 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్(13), సూర్యకుమార్ యాదవ్(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రికెల్టన్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్‌వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే లివింగ్ స్టోన్ పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న విరాట్, పాటిదార్13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..దేవ్‌దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పడిక్కల్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్.. సాల్ట్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), పడిక్కల్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. హెడ్ కోచ్ రాజీనామా
ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్‌కోచ్ పదవికి ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం చార్లెట్ ఎడ్వర్డ్స్ విడ్కోలు పలికింది. ఎడ్వర్డ్స్ ఇటీవలే ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికైంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని ఎడ్వర్డ్స్ ముగించింది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది."చార్లెట్ కోచింగ్‌లో ముంబై ఇండియన్స్ ఎన్నో అద్బుతమైన విజయాలను సాధించింది. కేవలం మూడు సీజన్లలోనే రెండు టైటిల్స్‌ను అందించిన ఘనత ఆమె సొంతం. ఎంతో యువ క్రికెటర్లకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మాకు రెండు టైటిల్స్‌ను అందించినందుకు ధన్యవాదాలు. ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా మీ సరికొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు" అంటూ ఎంఐ అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చార్లెట్ డబ్ల్యూపీఎల్ తొట్టతొలి సీజన్లోనే ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుంది. మొదటి సీజన్లోనే తన అనుభవంతో ముంబైను ఛాంపియన్స్‌గా చార్లెట్ నిలిపింది. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్-2025 టైటిల్‌ను కూడా చార్లెట్ నేతృత్వంలోనే ముంబై సొంతం చేసుకుంది.చార్లెట్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ఇంగ్లండ్ ఉమెన్స్ క్రికెట్ సూపర్ లీగ్‌లో సదర్ వైపర్స్ జట్టుకు ఎడ్వర్డ్స్ హెడ్‌కోచ్‌గా ఐదు టైటిల్స్‌ను అందించింది. అదేవిధంగా ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్‌ను కూడా ఓ సారి ఛాంపియన్‌గా నిలిపింది. ఇప్పుడు ఇంగ్లండ్ హెడ్ కోచ్ కొత్త పాత్ర స్వీకరించేందుకు ఆమె సిద్దమైంది. జాన్ లూయిస్ స్ధానాన్ని చార్లెట్ భర్తీ చేయనుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు గత కొంతకాలంగా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ప్రపంచకప్-2023 తర్వాత ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఈసీబీ కోచింగ్ బాధ్యతలను చార్లెట్‌కు అప్పగించింది.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
బుమ్రా X బెంగళూరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ... ఈసారి ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చేస్తుంటే... మరోవైపు లీగ్‌లో ఘన చరిత్ర ఉన్న ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ సాగుతోంది. బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలవగా... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యం ముంబైని ఇబ్బంది పెడుతున్నా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో జట్టు బలం రెట్టింపైంది. సోమవారం మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై కోచ్ జయవర్ధనే వెల్లడించడంతో... ఇది బెంగళూరు బ్యాటింగ్‌కు బుమ్రా బౌలింగ్‌కు మధ్య సమరంగా మారిపోయింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు కనబర్చిన ఆర్సీబీ... చివరి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడింది. తిరిగి గెలుపు బాటపట్టాలని బెంగళూరు ఎదురుచూస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముంబై ఇండియన్స్ ప్రధాన బలమైన స్టార్ బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రభావం చూపలేకపోగా... హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిసి ముంబై జట్టు తరఫున ఇప్పటి వరకు కేవలం రెండే అర్ధశతకాలు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ప్రాక్టీస్‌లో గాయం కారణంగా లక్నోతో మ్యాచ్‌లో బరిలోకి దిగని రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. తాజా సీజన్లో 177 పరుగులు చేసిన సూర్యకుమార్ అదే ప్రదర్శన కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా... బ్యాటింగ్‌లో మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది. లక్నోతో పోరులో వికెట్లు చేతిలో ఉన్నా... భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడిన ముంబై... ప్రాక్టీస్‌లో తమ లోపాలపై దృష్టి పెట్టింది. బౌల్ట్, పాండ్యా, అశ్వని కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుతుర్ రూపంలో ముంబైకి మెరుగైన బౌలింగ్ దళమే ఉంది. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ దళం మరింత పటిష్టమైంది. కోహ్లిపైనే భారం... ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లిపైనే బెంగళూరు ఎక్కువగా ఆధార పడుతోంది. సీజన్ ఆరంభ పోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న విరాట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ నుంచి మరింత బాధ్యతాయుత ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. మిడిలార్డర్లో కెపె్టన్ రజత్ పాటీదార్‌తో పాటు దేవదత్ పడిక్కల్ ప్రభావం చూపలేకపోతున్నారు. వీరిద్దరు నిలకడ కనబర్చాల్సిన అవసరముంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ మంచి టచ్‌లో ఉండగా... కృనాల్ పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత సీజన్లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ దళం ఈసారి బలంగా కనిపిస్తోంది. ఆ్రస్టేలియా పేసర్ హాజల్‌వుడ్‌తో పాటు ఐపీఎల్లో అపార అనుభవమున్న భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారాన్ని మోయనున్నారు. లివింగ్‌స్టోన్, రసిక్ సలామ్‌తో కలిసి కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. -
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముందు ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్ అందింది. తొలి నాలుగు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగామనానికి సిద్దమయ్యాడు.ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరిన బుమ్రా, సోమవారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆడే అవకాశముందని జయవర్ధనే తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్న్యూస్మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో అతడు ఆడటం ఖాయమైంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. -
RCB Vs MI: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ముంబై ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. బుమ్రా ఐపీఎల్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి సింహం గర్జించేందుకు సిద్దంగా ఉందని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్‌కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాటి నుంచి ముంబై సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు తీశాడు.బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు (వెన్ను సమస్య). ఫలితంగా అతను భారత్ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమ్యాడు. గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేశాడు. కొన్ని రోజులు అక్కడ రీహ్యాబ్‌లో ఉండిన బుమ్రా.. తాజాగా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. బుమ్రా జట్టులో చేరినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్న బీసీసీఐ మరికొన్ని రోజులు అతన్ని అబ్జర్వేషన్లోనే ఉంచాలని భావిస్తుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సీజన్లో బుమ్రా లేని లోటు ముంబై ఇండియన్స్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. యువ బౌలర్లు విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ సత్తా చాటినా బుమ్రా స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కూడా తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతితో సత్తా చాటినా (4-0-36-5) ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ముంబై వేగంగా పరుగులు సాధించలేక 12 పరుగుల తేడాతో ఓడింది. హర్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ముంబైని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వకుండా హార్దిక్ ఓవరాక్షన్ చేశాడు. స్ట్రయిక్ అట్టిపెట్టుకుని అతనైనా పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు. వరుసగా రెండు డాట్ బాల్స్ చేసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. బుమ్రా రాకతోనైనా ముంబై ఫేట్ మారుతుందేమో చూడాలి. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఆడలేదు. గాయం కారణంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. -
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకుంటే.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలొగ్గింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంత్ సేన చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై నాయకత్వ బృందం తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.విజయానికి ఇరవై నాలుగు పరుగుల దూరంలో ఉన్న సమయంలో బ్యాటర్ తిలక్ వర్మ ( Tilak Varma- 23 బంతుల్లో 25)ను రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించారు. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు జతగా బౌలింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯Only the 4th time a batter has retired out in the IPL!Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025పరుగు తీసేందుకు నిరాకరణఇక ఆఖరి ఓవర్లో ముంబై గెలుపునకు 22 పరుగులు అవసరమైన సమయంలో .. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో హార్దిక్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. దీంతో ముంబై శిబిరంలో జోష్ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు ఈ పేస్ బౌలర్. అయితే, మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా పాండ్యా మాత్రం అందుకు నిరాకరించాడు.ఈ క్రమంలో మూడో బంతికి ముంబై పరుగులేమీ రాబట్టలేకపోగా.. నాలుగో బంతి కూడా డాట్ అయింది. అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారు కాగా.. ఐదో బంతికి హార్దిక్ సింగిల్ తీసి.. సాంట్నర్‌ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి సాంట్నర్ పరుగులేమీ రాబట్టలేదు. ఫలితంగా పన్నెండు పరుగుల తేడాతో ముంబైకి పరాజయం తప్పలేదు. ఆకాశ్ అంబానీ ఆగ్రహంఅయితే, తిలక్ వర్మను కాదని ‘హిట్టింగ్’ కోసమని సాంట్నర్‌ను పంపిన ముంబై వ్యూహం బెడిసికొట్టగా.. సాంట్నర్‌కు స్ట్రైక్ ఇచ్చేందుకు హార్దిక్ నిరాకరించడం జట్టు యజమాని ఆకాశ్ అంబానీకి కోపం తెప్పించింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి హార్దిక్ చేసిన పనికి ఆకాశ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.మరోవైపు.. ఆఖరి ఓవర్ ఐదో బంతికి లక్నో విజయం దాదాపు ఖరారు కాగా.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చప్పట్లు కొడుతూ అతడు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. మరోవైపు ఆకాశ్ మాత్రం తమ సభ్యులతో సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఐపీఎల్-2025:లక్నో వర్సెస్ ముంబైలక్నో స్కోరు: 203/8 (20)ముంబై స్కోరు: 191/5 (20)ఫలితం: 12 పరుగుల తేడాతో ముంబైపై లక్నో గెలుపు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్MI Owner Akash Ambani reaction When Hardik Pandya on 19.3 Balls not takes the Single.#LSGvsMI pic.twitter.com/BCznQ7fc5J— Vikas Yadav (@VikasYadav69014) April 4, 2025 -
LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్‌కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్‌లోకి అదనంగా ఓ ఫీల్డర్‌ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్‌కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్‌బుక్‌లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్‌పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్‌గా విఫలమవుతున్న పంత్‌కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో వచ్చిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానం నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో స్పెషలిస్టు బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపి.. ఆల్‌రౌండర్‌ను రప్పించిన ముంబై నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లక్నో చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ విషయంపై స్పందించాడు.హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం‘‘ఆఖర్లో మాకు హిట్టింగ్ ఆడే ఆటగాడు కావాలని అనుకున్నాం. క్రికెట్లో ఇలాంటివి సహజం. అయితే, ఒక్కోసారి మన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే, వ్యూహాలు పక్కాగా అమలు చేస్తామని అనుకోవడంలో తప్పులేదు.ఒక్కోసారి ఇంకాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో స్మార్ట్‌గా ఉండాలి. బ్యాటింగ్‌లో వివిధ ఆప్షన్లు ప్రయత్నించాలి. మనదైన శైలిలో ఆడుతూనే దూకుడు ప్రదర్శించగలగాలి’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.ఓటమికి కారణం అదేఇక లక్నో చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్న హార్దిక్ పాండ్యా.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. అయితే, తనకు ఏకనా వికెట్ మీద ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఆప్షన్లు దొరకలేదని.. వికెట్లు తీయడం కంటే కూడా తాము డాట్ బాల్స్ వేసేందుకే ఎక్కువగా ప్రయత్నించామని తెలిపాడు. బ్యాటర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపిందని.. తమ పరాజయానికి అదే కారణమని పేర్కొన్నాడు.లక్నో ఓపెనర్లు ధనాధన్‌కాగా ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో లక్నో- ముంబై జట్లు తలపడ్డాయి. సొంత మైదానం ఏకనాలో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), ఐడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53) అదరగొట్టగా.. నికోలస్ పూరన్ (12), కెప్టెన్ రిషభ్ పంత్ (2) పూర్తిగా నిరాశపరిచారు.ఈ క్రమంలో ఆయుశ్ బదోని (19 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27) మెరుపు బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ ఐదు, ఆవేశ్ ఖాన్ రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి లక్నో 203 పరుగులు స్కోరు చేసింది.ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. విఘ్నేశ్ పుతూర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లు విల్ జాక్స్ (5), రియాన్ రికెల్టన్ (10) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.నమన్, సూర్య, హార్దిక్ పోరాటం వృథాఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నమన్ 24 బంతుల్లో 46 రన్స్ చేయగా.. సూర్య 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డ తిలక్ వర్మ 23 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసిన క్రమంలో.. మేనేజ్మెంట్ అతడిని వెనక్కి పిలిపించింది.Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯Only the 4th time a batter has retired out in the IPL!Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025 అప్పటికి ముంబై విజయానికి 24 పరుగులు కావాల్సి ఉండగా.. మిగిలింది కేవలం ఏడు బంతులు మాత్రమే. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 28 నాటౌట్) క్రీజులో ఉండగా.. తిలక్ స్థానంలో సాంట్నర్ వచ్చాడు. అయితే, ఆఖరి ఓవర్‌ను లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసి.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. దీంతో ముంబై 191 పరుగుల వద్ద నిలిచిపోయి.. 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీయగా.. పొదుపుగా బౌలింగ్ చేసి నమన్ వికెట్ తీసిన దిగ్వేశ్ సింగ్ రాఠి (1/21)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ముంబై ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఒక్కటి మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గాJust the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
బుమ్రా... మరికొన్ని రోజుల తర్వాతే...
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్లో కనీసం మరో రెండు మ్యాచ్‌లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్లో ఆడతాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది -
ఇంట గెలిచిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్‌తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్‌తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. పంత్ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్‌తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్‌ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్‌లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్‌వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్‌దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్‌వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్‌దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0 రోహిత్ శర్మ దూరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్‌లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది. ఐపీఎల్లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X రాజస్తాన్‌వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మిగితా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి హార్దిక్ మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్లో ఇది తొలి ఫైవ్ హాల్ వికెట్ కావడం గమానార్హం. ఐపీఎల్లో కాదు టీ20ల్లోనే అతడికి మొదటి ఐదు వికెట్ల హాల్. తద్వారా పలు అరుదైన రికార్డులను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.తొలి కెప్టెన్‌గా..ఐపీఎల్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరికి సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా హార్దిక్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వికెట్ల సాధించిన రెండో కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే రికార్డును పాండ్యా సమం చేశాడు. కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్‌గా 30 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా ఇప్పటివరకు సారథిగా 30 వికెట్లు సాధించాడు.ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు వీరే..5/36- హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/17- JP డుమిని (ఢిల్లీ డేర్‌డేవిల్స్)4/21- షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్)ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే:57 - షేన్ వార్న్30 - హార్దిక్ పాండ్యా30 - అనిల్ కుంబ్లే25 - రవిచంద్రన్ అశ్విన్21 - పాట్ కమ్మిన్స్మార్ష్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యాతో పాటు.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని? -
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సందర్బంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.అదేవిధంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టులోకి రానున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ స్ధానంలో రాజ్ అంగద్ బావా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సీజన్లో రోహిత్ శర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.తుది జట్లుముంబై ఇండియన్స్విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుత్తూర్లక్నో సూపర్ జెయింట్స్ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్) ఆయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్చదవండి: ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా -
ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం..
LSG vs MI Live Updates: ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.ముంబై ఇండియన్స్‌పై లక్నో విజయం..ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు ముంబై స్కోర్:164/4సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 46 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం తిలక్ వర్మ(18), హార్దిక్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 125/313 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(46), తిలక్ వర్మ(12) ఉన్నారు. ముంబై మూడో వికెట్ డౌన్..నమన్ ధీర్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన ధీర్.. దిగ్వేష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.దూకుడుగా ఆడుతున్న ధిర్, సూర్యఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. నమాన్ ధిర్(46), సూర్యకుమార్ యాదవ్(21) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ముంబైకి ఆదిలోనే భారీ షాక్..204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్‌లో విల్ జాక్స్(5) తొలి వికెట్ కోల్పోవగా.. తర్వాత శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్(10) ఔటయ్యారు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.చెలరేగిన లక్నో బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్లక్నో వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.లక్నో నాలుగో వికెట్ డౌన్..ఆయూష్ బదోని రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన బదోని.. అశ్వినీ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో మార్క్రమ్(49), డేవిడ్ మిల్లర్(1) ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.పంత్ మరోసారి ఫెయిల్..రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పంత్ ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్(12) రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రామ్(23) ఉన్నాడు.లక్నో తొలి వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన మార్ష్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్దుమ్ములేపుతున్న మార్ష్..మిచెల్ మార్ష్ దుమ్ములేపుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 69 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(26), మార్క్రమ్(5) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో మోకాలికి గాయమైంది. అతడి స్ధానంలో రాజ్ అంగద్ తుది జట్టులోకి బావా వచ్చాడు.తుది జట్లు లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్ -
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్‌తో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.తమ తొలి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది.ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్‌తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్‌గా తన సంభాషణను కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్‌లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్‌తో అన్న మాటలను మంజ్రేకర్‌కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఘనమైన చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్‌మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు. కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్‌లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదేQ: For how long are you going to watch this reel? 😍A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025 -
అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)
-
MI vs LSG: రోహిత్, పంత్‌కు పరీక్ష!
లక్నో: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. తాజా సీజన్లో చెరో 3 మ్యాచ్‌లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) దక్కించుకున్న లక్నో సారథి పంత్... ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు. గత మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా... ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ‘హిట్‌మ్యాన్’ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి. మరోవైపు ఐపీఎల్లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట లక్నో గెలుపొందింది. మరి స్పిన్‌కు సహకరిస్తున్న లక్నో పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! బుమ్రా లేకపోయినా బలంగానే... ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికి ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడా జాబితాలో మరో రెండు కొత్త పేర్లు చేరేలా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కావడంతో... జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది అనుకుంటే... మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుథుర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా... హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌తో సూర్యకుమార్ కూడా లయ అందుకోగా... రోహిత్ శర్మ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెపె్టన్ హార్దిక్‌తో పాటు బౌల్ట్, అశ్వని, దీపక్ చాహర్, సాంట్నర్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. ఫుల్ ఫామ్‌లో పూరన్, మార్ష్... కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా... లక్నో జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టి20 స్పెషలిస్ట్, విండీస్ స్టార్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకు పడుతుంటే... ఆ్రస్టేలియా బ్యాటర్ మిషెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు రెండేసి హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం... లక్నోకు కలిసి రానుంది. ఆయుశ్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీమ్ రూపంలో ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం. ఎటొచ్చి పంత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.చాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితమైన రిషబ్... ఈ మ్యాచ్‌లోనైనా దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే... బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో... శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి కీలకం కానున్నారు. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోని, మిల్లర్, సమద్, శార్దుల్, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుథుర్, ముజీబ్. 6 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఐదింటిలో లక్నో గెలుపొందగా... ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు కొనసాగనున్న కష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ తమ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే మొదలుపెట్టింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో బుమ్రా లేని లోటు కొట్టిచ్చినట్లు కనిపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ముంబై తొలి రెండు మ్యాచ్‌లు ఓడి.. ఆతర్వాతి మ్యాచ్‌లో గెలిచింది.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం బుమ్రా తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి రావాల్సి ఉండింది. అయితే బుమ్రా రాక మరింత ఆలస్యమవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని బీసీసీఐ వర్గాల సమాచారం. బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి వైద్యులు రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. బుమ్రాపై అతిగా ఒత్తిడి తెస్తే మొదటికే మోసం రావచ్చని వారు భావిస్తున్నారట. ప్రస్తుతం వైద్యులు బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట. ఐపీఎల్ ఎంట్రీకి బుమ్రా కూడా తొందరపడటం లేదని తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో బుమ్రా చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ బుమ్రా తొందరపడి ఐపీఎల్లో ఆడాలనుకుంటే గాయం తీవ్రతరమై దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది. అందుకే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఐపీఎల్-2025లో బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుమ్రా తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడన్న విషయాన్ని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం బుమ్రా మే నెలలోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌లకు పైగా ఆడేసి ఉంటుంది. బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఒకవేళ బుమ్రా మే నెలలో ఎంట్రీ ఇచ్చినా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ బుమ్రా లేకపోయినా తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటితే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు బుమ్రా సేవలను ఆ జట్టు ప్లే ఆఫ్స్‌లో వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ఇండియన్స్‌కు అంత సీన్ లేదనిపిస్తుంది. ఆ జట్టులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తుంది. బౌలింగ్‌లో బౌల్ట్ మినహా ఆ జట్టులో సీనియర్ ఎవరూ లేరు. కొత్తగా వచ్చిన బౌలర్లతో ఆ జట్టు కాలం వెల్లదీస్తుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అశ్వనీ కుమార్ సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ సీజన్ తొలి విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు అంతంతమాత్రంగానే ఉంది. రోహిత్ శర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా, బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే గాయం కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దూరమయ్యాడు. -
MI Vs KKR: భలా బౌల్ట్.. ఏ బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో..!
ఐపీఎల్లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బౌల్ట్ రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఈ రికార్డును బౌల్ట్ మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ మరోసారి తొలి ఓవర్లో వికెట్ తీసి తన తొలి ఓవర్ వికెట్ల సంఖ్యను 30కి (96 మ్యాచ్‌లు) పెంచుకున్నాడు. ఐపీఎల్లో బౌల్ట్ తర్వాత తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్‌కు దక్కుతుంది. ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న భువీ ఐపీఎల్ తొలి ఓవర్లలో 27 వికెట్లు (126 మ్యాచ్‌లు) తీశాడు. ఈ రికార్డుకు సంబంధించి బౌల్ట్, భువీ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ తొలి ఓవర్లో ప్రవీణ్ కుమార్ 15, సందీప్ శర్మ 13, దీపక్ చాహర్ 13 వికెట్లు తీశారు.కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ తొలి ఓవర్లోనే సునీల్ నరైన్‌ను డకౌట్ చేశాడు. తద్వారా కేకేఆర్ పతనానికి నాంది పలికాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం పేసర్ (ముంబై ఇండియన్స్) అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) రాణించడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది (16.2 ఓవర్లలో). కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
IPL 2025: కేకేఆర్ చెత్త రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. కేకేఆర్ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్కే చేతిలో.. పంజాబ్ కేకేఆర్ చేతిలో తలో 21 మ్యాచ్‌లు ఓడిపోయాయి.ఐపీఎల్లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 24 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 21 సీఎస్కే చేతిలోపంజాబ్- 21 కేకేఆర్ చేతిలోసీఎస్కే- 20 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 20 కేకేఆర్ చేతిలోనిన్నటి ఓటమితో కేకేఆర్ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోపంజాబ్-9 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలోఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చెపాక్ స్టేడియంలో సీఎస్కే చేతిలోఢిల్లీ- 8 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలోమ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్‌ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) తలో చేయి వేశారు.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
IPL 2025, MI VS KKR: చరిత్ర పుటల్లో సూర్యకుమార్
భారత టీ20 జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సురేశ్ రైనా తర్వాత టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం స్కై ఈ ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని సూర్య ఇప్పటివరకు టీ20ల్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ, ఐపీఎల్) 8007 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చలామణి అవుతున్న విరాట్ ఖాతాలో 12976 పరుగులు ఉన్నాయి.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లువిరాట్ కోహ్లి- 12976రోహిత్ శర్మ- 11851శిఖర్ ధవన్- 9797సురేశ్ రైనా- 8654సూర్యకుమార్ యాదవ్- 8007మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సూర్య 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేకేఆర్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై సాధించిన తొలి విజయం ఇది. ముంబై గెలుపులో సూర్య తనవంతు పాత్ర పోషించాడు. కేకేఆర్ నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కై తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించాడు. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.అంతకుముందు అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించారు.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు. -
MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకే.. రసెల్ వికెట్ కీలకం: హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్‌ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్‌ను గమనించాము. అతని బౌలింగ్‌లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్‌ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం. -
MI VS KKR: సమిష్టి వైఫల్యం.. రహానే ఆవేదన
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు. రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టాస్‌లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్‌పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్‌ను, పేస్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి. బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్‌లో ఉండటం అవసరం. -
IPL 2025: ముంబై బోణీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పంజాబ్‌కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది. కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా ఘనత వహించిన అశ్వని కుమార్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తడబడుతూనే... కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్‌కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్‌వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్‌కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్‌కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్‌కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పుణ్యమాని కోల్‌కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్‌గా రమణ్‌దీప్ వెనుదిరగడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ విఫలం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్‌దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–46, 2–91. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0. -
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. నాలుగేసిన అశ్వినీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్? -
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ అశ్వినీ కుమార్..?అశ్వనీ కుమార్ పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్‌లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్‌ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు.👉ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు' -
కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
MI vs KKR live Updates And highlights: ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.దూకుడుగా ఆడుతున్న రికెల్టన్10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(45), విల్ జాక్స్(12) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(31), విల్ జాక్స్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/02 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(12), రికెల్టన్(1) ఉన్నారు.116 పరుగులకే 10 వికెట్లు..16.2 ఓవర్లో శాంట్నర్ బౌలింగ్‌లో రమణ్ దీప్ సింగ్ వికెట్ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 117పరుగులు చేయాల్సి ఉంది. 97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్ రాణా ఔట్97 పరుగుల వద్ద కేకేఆర్ తన తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది. హర్షిత్ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్ వేసిన 14వ ఓవర్లో పెవీలియన్ బాట పట్టాడు. 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్ ఔట్88 పరుగుల వద్ద కేకేఆర్ తన ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. రసెల్(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్ వేసిన 13 ఓవర్ లో రసెల్ పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతికి రసెల్ బౌల్డ్ అయ్యాడు.80 పరుగులకే 7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్రింకూ సింగ్(17), మనీష్ పాండే(19)లు వరుసగా పెవిలియన్ చేరారు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్ లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. 11 ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి పాండే పెవిలియన్ చేరాడు.కష్టాల్లో కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రహానే.. అశ్వని కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..క్వింటన్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డికాక్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 26 పరుగులు చేసింది. క్రీజులోకి రఘువన్షి(9), అజింక్య రహానే(12) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్. -
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రా
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్నాడు.ఈ క్రమంలో జస్ప్రీత్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరి టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరమయ్యాడు. అయితే బుమ్రా రీ ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. బుమ్రా ఫిట్‌నెస్‌పై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా తన రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ స్పీడ్ స్టార్ కోలుకుంటాడని ఆశిస్తున్నాము. ఎప్పుడొస్తాడు అనేది మాత్రం చెప్పలేము" అని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్యబృందం బుమ్రాకు ఈ వారంలో ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టును బుమ్రా క్లియర్ చేసినట్లైతే త్వరలోనే ముంబై జట్టులో బుమ్రా చేరే అవకాశముంది. బుమ్రా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో బుమ్రాదే కీలక పాత్ర. ఆ తర్వాత బీజీటీని భారత్ కోల్పోయినప్పటికి బుమ్రా మాత్రం 32 వికెట్లతో లీడిగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడికి 2024 ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.చదవండి: RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!Bumrah has started bowling in NCA. Don't know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025 -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 31) బిగ్ ఫైట్.. ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచేనా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 31) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వారి సొంత మైదానం వాంఖడేలో ఢీకొట్టనుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఎంఐ తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో పరాజయంపాలైంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. రెండు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.హెడ్ టు హెడ్ రికార్డ్స్..కేకేఆర్‌పై ముంబైకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు తలపడిన 34 సందర్భాల్లో 23 సార్లు ముంబై విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది. అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన 6 సందర్భాల్లో మాత్రం కేకేఆర్ 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. చివరిగా వాంఖడేలో తలపడిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్‌నే విజయం వరించింది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్ ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హైప్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది.బ్యాటింగ్‌నే ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్‌ను ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో హార్దిక్ గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటర్‌గా తేలిపోయాడు. నమన్ ధీర్ గత సీజన్లో వచ్చిన హైప్‌ను రీచ్ కాలేదు. యువ ఆటగాడు రాబిన్ మింజ్‌కు అవకాశాలిస్తే రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. బ్యాటర్‌గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బ్యాటర్‌గా సత్తా చాటేందుకు మిచెల్ సాంట్నర్‌కు సరైన అవకాశం లభించలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. బౌల్ట్, సాంట్నర్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. దీపక్ చాహర్ పర్వాలేదనిస్తున్నాడు. ఆంధ్ర కుర్రాడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు. తొలి మ్యాచ్‌లో విజ్ఞేశ్ పుతుర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా రెండో మ్యాచ్‌లో అతన్ని ఆడించలేదు.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కూడా బ్యాటింగే ప్రధాన బలం. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి కాస్త అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటిన సునీల్ నరైన్ అస్వస్థత కారణంగా రెండో మ్యాచ్ ఆడలేదు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన రహానే రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ సెంచరీకి చేరువై ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. డికాక్ ఫామ్‌లోకి రావడం కేకేఆర్‌కు శుభసూచకం. రాయల్స్‌తో మ్యాచ్‌లో నరైన్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మొయిన్ అలీ బంతితో సత్తా చాటాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోతున్నారు. రసెల్, రమన్‌దీప్‌కు సరైన అవకాశాలు రావాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా పర్వాలేదనిపించారు.నేటి మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించడం అంత ఈజీ కాదు. రోహిత్, సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి పట్టపగ్గాలు ఉండవు.తుది జట్లు (అంచనా)..ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజుకేకేఆర్: క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ,అంగ్క్రిష్ రఘువంశీ -
IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్
ఓటమి బాధలో (గుజరాత్ చేతిలో) ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ హార్దిక్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్‌కు ఈ ఫైన్ విధించబడింది. ఈ సీజన్లో హార్దిక్ జట్టు చేసిన మొదటి తప్పిదం కాబట్టి 12 లక్షల జరిమానాతో సరిపుచ్చారు.హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గత సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. ఇందుకు గానూ హార్దిక్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. గత సీజన్ వరకు ఓ జట్టు మూడు సార్లు (ఒకే సీజన్లో) స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధించేవారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ రూల్‌ను ఎత్తి వేశారు. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కారణంగా కెప్టెన్లపై నిషేధం ఉండదు. కేవలం జరిమానాలు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబై సీఎస్కే చేతిలో ఓడింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయింది. తొలుత బౌలింగ్ చేసి గుజరాత్‌ను భారీ స్కోర్ (196/8) చేయనిచ్చిన ఆ జట్టు.. ఆతర్వాత ఛేదనలో (160/6) చేతులెత్తేసింది. గుజరాత్ బౌలర్లు సొంత పిచ్ అడ్వాన్టేజ్ను వినియోగించుకుని ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (4-0-29-2) బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఛేదన కీలక దశలో బంతులు వృధా (17 బంతుల్లో 11) చేసి జట్టు ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ (కెప్టెన్‌గా) చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. రాబిన్ మింజ్‌ను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపిన హార్దిక్ పెద్ద తప్పిదమే చేశాడు. మింజ్ కీలక దశలో బంతులను వృధా చేసి (6 బంతుల్లో 3) చీప్‌గా ఔటయ్యాడు. తుది జట్టు ఎంపికలోనూ హార్దిక్ పెద్ద తప్పులే చేశాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతం చేసిన విజ్ఞేశ్ పుతుర్‌ను, భారీ హిట్టర్.. అందులోనే గత సీజన్లో అహ్మదాబాద్‌లో సెంచరీ చేసిన విల్ జాక్స్‌కు తప్పించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. -
IPL 2025: గుజరాత్ బౌలర్‌పై నోరు పారేసుకున్న హార్దిక్.. వైరల్ వీడియో
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ గొడవ పడ్డారు. ముంబై ఓటమి ఖరారైన దశలో తొలుత సాయి కిషోర్ హార్దిక్‌ను గెలికాడు. డాట్ బాల్ వేసిన ఆనందంలో ముంబై కెప్టెన్ వైపు బిర్రుగా చూశాడు. GAME 🔛Hardik Pandya ⚔ Sai Kishore - teammates then, rivals now! 👀🔥Watch the LIVE action ➡ https://t.co/VU1zRx9cWp #IPLonJioStar 👉 #GTvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, & JioHotstar pic.twitter.com/2p1SMHQdqc— Star Sports (@StarSportsIndia) March 29, 2025ఇందుకు హార్దిక్ కూడా ధీటుగా స్పందించాడు. సాయి కిషోర్‌తో కంటితో యుద్దం చేస్తూనే దుర్భాషలాడాడు. అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ అనంతరం హార్దిక్, సాయి కిషోర్ ఒకరినొకరు హగ్ చేసుకోవడం కొసమెరుపు. హార్దిక్, సాయి కిషోర్ గతంలో కలిసి గుజరాత్‌కు ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్‌తో గొడవపై సాయి కిషోర్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా స్పందించాడు. హార్దిక్ నాకు మంచి మిత్రుడని అన్నాడు. మైదానంలో ఇలాగే ఉండాలి. అక్కడ ఎవరైనా ప్రత్యర్థులే. మేము విషయాలను వ్యక్తిగతంగా తీసుకోము. మేము మంచి పోటీదారులం. ఆట ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ యావరేజ్‌గా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయగా.. హార్దిక్ బౌలింగ్‌లో రాణించి, బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. స్లో వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ (196/8) చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది. -
ముంబైపై గుజరాత్ ఘన విజయం
-
GT VS MI: మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్లో (అహ్మదాబాద్) జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (196/8) చేసిన గుజరాత్.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుకు గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్‌లో వారు ఎక్కువ రిస్క్ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (9), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6), రబాడ (7 నాటౌట్), సాయి కిషోర్ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే గుజరాత్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1) బాగానే బౌలింగ్ చేసినా స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్ ప్లేలోనే ఔట్ చేశాడు. తొలుత రోహిత్‌ను (8) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆతర్వాత మరో ఓపెనర్ రికెల్టన్ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్ తమ ఏస్ పేసర్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్‌గా ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్‌లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్‌లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్‌లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు. -
గుజరాత్ గెలుపు బోణీ
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్‌లో సాయిసుదర్శన్, బౌలింగ్‌లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్‌లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు), తిలక్‌వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కీలక భాగస్వామ్యాలు... గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్‌తో గిల్‌తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్‌కు బట్లర్‌తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది. గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్‌ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్‌ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించడం విశేషం. రాణించిన తిలక్... ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్‌వర్మ, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్‌లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్‌ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్‌మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్‌ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్‌వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2. ఐపీఎల్లో నేడుఢిల్లీ X హైదరాబాద్‌వేదిక: విశాఖపట్నంమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X చెన్నై వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిప్పులు చెరిగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముంబైను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు. -
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ శర్మ.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్.. వరుసగా రెండు బంతుల్లో బౌండరీలు బాది మంచి టచ్‌లో కన్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో ఐదో బంతిని రోహిత్‌కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోహిత్‌ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.Siraj is not effective🤣🤣pic.twitter.com/7cueS6DmvT— Mayank. (@PrimeKohlii) March 29, 2025 -
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్‌కు మంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కలేదు. తన అరంగేట్రంలో సీఎస్కేపై మూడు వికెట్లతో సత్తాచాటినప్పటికి విఘ్నేష్ పుతూర్‌ను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం అందరిని ఆశ్యర్యపరిచింది.అతడి స్ధానంలో స్పిన్నర్‌గా ముజీబ్ ఆర్ రెహ్మాన్‌ను ముంబై మెనెజ్‌మెంట్ ఆడించింది. జట్టులోకి వచ్చిన రెహ్మాన్ తన మార్క్ చూపించలేకపోయాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన ముజీబ్.. 28 పరుగులిచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విఘ్నేష్‌ను ఎందుకు పక్కన పెట్టారాని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొంతమంది ఇదొక చెత్త నిర్ణయమని పోస్టలు పెడుతున్నారు. కాగా సీఎస్కే తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన విఘ్నేష్ తన 4 ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.I'm so furious seeing this playing 11/12 of Mumbai Indians, brainless decision making. Chutiye left both the departments weak by leaving Will Jacks & Vignesh Puthur out. Absolutely pathetic.— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) March 29, 2025ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు -
ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం
IPL 2025 MI vs GT live updates and highlights: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయంఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.ముంబై ఐదో వికెట్ డౌన్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.ముంబై మూడో వికెట్ డౌన్..తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాబిన్ మింజ్ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(37) ఉన్నారు.9 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/29 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), తిలక్ వర్మ(35) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్.. ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై.. రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(18), సూర్యకుమార్(8) ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్.. ముంబై తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.సుదర్శన్ హాఫ్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సమిష్టగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.19 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 186/6గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లో ఆఖరి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సుదర్శన్(63) ఔట్ కాగా.. 19 ఓవర్లో వరుస క్రమంలో రాహుల్ తెవాటియా, రూథర్ ఫర్డ్ ఔటయ్యారు. 19 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్.. షారూఖ్ ఔట్షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షారూఖ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన బట్లర్.. ముజీబ్ ఉర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(49), షారూఖ్ ఖాన్(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(42), బట్లర్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్‌శుబ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్, సుదర్శన్గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయిసుదర్శన్(32), శుబ్‌మన్ గిల్(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(13), సాయిసుదర్శన్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ -
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు కావు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్‌తో నేటి మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఓ అణిముత్యం దొరికాడు. 24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్కేతో మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు. పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్‌మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్‌ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్హెడ్ టు హెడ్ రికార్డులు..ఐపీఎల్లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. గుజరాత్‌కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్‌లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్‌పై గత మ్యాచ్‌లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది. -
మళ్లీ ప్రేమకు సిద్ధం: హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ నుంచి విడిపోయాక మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది. ప్రేమ, మాతృత్వం, కెరీర్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది. గతేడాది జులైలో హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్‌కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్‌గా ఉన్నాను. సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను. నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.హార్దిక్ నుంచి విడిపోయాక గతేడాది చాలా కఠినంగా గడిచిందని నటాసా పేర్కొంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎదుగుదల సాధిస్తామని చెప్పింది. గతేడాది చెడుతో పాటు మంచి అనుభవాలు కూడా ఉన్నాయని అంది. వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణతి చెందుతామని చెప్పుకొచ్చింది.కెరీర్ గురించి మాట్లాడుతూ.. హార్దిక్‌తో పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌కు ఐదేళ్లు దూరంగా ఉన్నాను. తిరిగి కెరీర్‌ను పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. కష్టపడి పని చేస్తూ, నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడే వ్యక్తిని కాబట్టి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏదీ వీలు కాకపోతే మరో కెరీర్‌ను ఎంచుకుంటాను.నటాసా మార్చి 4వ తేదీన తన 33వ పుట్టిన రోజు జరుపుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. అగస్త్యతో చాలా సరదాగా గడిపాను. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాది నాకు కెరీర్‌పరంగా, పర్సనల్‌గా చాలా ప్రత్యేకమైంది.సెర్బియాకు చెందిన నటాసాను హార్దిక్ పాండ్యా 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నటాసాను విడిపోయాక హార్దిక్ క్రికెట్‌తో బిజీ అయిపోయాడు. ఇటీవలే టీమిండియా సభ్యుడిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన హార్దిక్.. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. హార్దిక్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
IPL 2025: దీపక్ చాహర్‌ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజేతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) సీఎస్కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్‌కు దిగిన చాహర్ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్‌లోనూ చాహర్ ఆదిలోనే సీఎస్కేను దెబ్బకొట్టాడు. చాహర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ 2 ఓవర్లలో వికెట్ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చాహర్ ముంబై ఇండియన్స్ తరఫున గ్రాండ్‌గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్ ఓ హాస్యాస్పదమైన మీమ్ షేర్ చేయడం (సోషల్‌మీడియాలో) ద్వారా సెలబ్రేట్ చేసుకుంది. చాహర్ తన పాత జట్టుకు (సీఎస్కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. Malti Chahar's Instagram story. pic.twitter.com/1bfxj4kcU4— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025చాహర్‌ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్‌ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్‌ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్‌ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్‌ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్‌లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్‌మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డును రోహిత్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్ 253 ఇన్నింగ్స్‌ల్లో 18 సార్లు డకౌట్ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్‌ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్‌ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్‌ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు స్టార్ ప్లేయర్
-
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్‌గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్‌లో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్‌గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్‌గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్‌పై ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.స్లో ట్రాక్‌పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్‌ను 18వ ఓవర్లో బౌలింగ్‌కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని సూర్యకుమార్‌ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్‌ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్‌లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్‌ను స్పేర్‌గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్‌కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్‌ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్‌లో జరుగనుంది. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రుతురాజ్, రచిన్ హాఫ్ సెంచరీలు.. ముంబై పై సీఎస్కే విజయం
సీఎస్కే ఘన విజయం..చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్..సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రచిన్ రవీంద్ర(20), రవీంద్ర జడేజా(5) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 125/5సీఎస్కే మూడో వికెట్ డౌన్.. దూబే ఔట్శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దూబే.. విఘ్నేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 100/3.సీఎస్కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్‌రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన రుతురాజ్ విఘ్నేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 79/2.6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(42), రచిన్ రవీంద్ర(20) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 35/1. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(18), రచిన్ రవీంద్ర(14) పరుగులతో ఉన్నారు.రాణించిన సీఎస్కే బౌలర్లు..చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.నూర్ ఆన్ ఫైర్..ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి రాబిన్ మింజ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి తిలక్ వర్మ(31) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 96/6సూర్యకుమార్ ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సూర్యకుమార్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ధోని అద్భుతమైన స్టంపింగ్‌తో మెరిశాడు. 12 ఓవర్లకు ముంబై స్కోర్: 92/4ముంబై మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జాక్స్.. అశ్విన్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 6 ఓవర్లకు ముంబై స్కోర్: 52/3ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రికెల్టన్ ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 30/2రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై స్కోర్: 17/1ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ముంబై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్ -
CSK Vs MI: సీఎస్కేతో మ్యాచ్.. హిట్‌మ్యాన్‌కు జోడీ ఎవరు..?
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 23) రాత్రి (7:30 గంటలకు) రసవత్తర సమరం జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటున్నాయి. క్రికెట్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ను ఎల్ క్లాసికోగా పిలుస్తారు. ఈ మ్యాచ్‌పై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై, సీఎస్కే జట్లు అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు నేటి మ్యాచ్‌తో ఆరో టైటిల్ వేటను ప్రారంభిస్తాయి.నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నిషేధం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. సీఎస్కే విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు.తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కూడా అందుబాటులో లేవు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ వస్తాడు. హిట్‌మ్యాన్‌ను జత ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. విల్ జాక్స్ లేదా ర్యాన్ రికెల్టన్లలో ఎవరో ఒకరు హిట్‌మ్యాన్‌తో పాటు బరిలోకి దిగుతారు. వన్ డౌన్ తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్‌లో నమన్ ధిర్ రావడం ఖరారైంది. నేటి మ్యాచ్‌తో రాబిన్ మింజ్ ఐపీఎల్ అరంగేట్రం చేయవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, కర్ణ శర్మ బరిలో ఉంటారు. పేసర్లుగా దీపక్ చాహర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.సీఎస్కే విషయానికొస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలో నిలిచే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర, ఆతర్వాత దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా సామ్ కర్రన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. ఐపీఎల్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే 17, ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్చెన్నై సూపర్ కింగ్స్..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్. -
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్‌తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్‌కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్‌కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్‌లో కేవలం ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్‌కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్‌మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్‌లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్‌కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్‌కు 10.54 పరుగులు) హైదరాబాద్‌లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్‌తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్‌పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్‌ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్‌కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
సీఎస్కే, ఢిల్లీ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే: డివిలియర్స్
ఐపీఎల్-2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు."ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ -
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది.గతేడాది.. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్‌కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్‌కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్‌రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్‌ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్‌లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్‌తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియన్స్ బౌలర్
సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బాష్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్ఎల్ను అగౌరవపరచాలని కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్‌ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్ ఆఫర్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్ నా కెరీర్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్ఎల్కు రారని వెనక్కు తగ్గింది.కాగా, ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రాకముందు బాష్‌ను పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్ మొదటి నుంచి ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో బాష్‌కు ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఆఫర్‌కు నో చెప్పాడు.వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్‌తో క్లాష్ కాకుండా షెడ్యూల్ తయారు చేసుకునే పీఎస్ఎల్.. ఈసారి ఐపీఎల్‌తో పోటీ పడి ఐపీఎల్ డేట్స్‌లోనే షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పీఎస్ఎల్కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్లో ఆడితే పీఎస్ఎల్కు పోలేరు. ఈ యేడు పీఎస్ఎల్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్‌తో క్లాష్ కావడంతో ఈ సారి పీఎస్ఎల్లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్ ఆటగాళ్లతోనే పాక్ లీగ్ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌కు (సౌతాఫ్రికా టీ20 లీగ్) ఆడాడు. ఈ సీజన్లో (2025) ఎంఐ కేప్‌టౌన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్